Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.2

Wikibooks నుండి

ప్రథమాదిస్వరారంభాదేకైకాసప్తధాభవేత్

తాసూచ్చార్యాంత్యస్వరాస్తాన్ పూర్వానుచ్చారయేత్ క్రమాత్

తేక్రమాస్తేషుసంఖ్యాస్యాద్ద్వానవత్యాశతత్రయమ్

యక్షరక్షోనారదాబ్జభవనాగాశ్విపాశినః

షడ్జగ్రామేమూర్ఛనానామేతాః స్యురేవతాః క్రమాత్

బ్రహ్మేంద్రవాయుగంధర్వసిధ్దద్రుహిణభావనః

స్యురిమామధ్యమగ్రామమూర్ఛనాదేవతాః క్రమాత్

తాసామన్యానినామానినారదోమునికబ్రవీత్

సరిగమపదని షడ్జగ్రామమున స్వరములు 7 . అవి క్రమముగా తరువాతి స్వరములతో కలిసి

7 మూర్ఛనలగును. సరిగమపదని , రిగమపదనిస , గమపదనిసరి, మపదనిసరిగ, పదనిసరిగమ, దనిసరిగమప, నిసరిగమపద. తరువాతి స్వరమును ఉచ్చరించి క్రమముగా 7 స్వరములు ఉచ్చరింపవలెను. మొత్తము మూర్ఛనల సంఖ్య 392. యక్షులు, రక్షసులు , నారదుడు,బ్రహ్మదేవుడు, నాగులు, అశ్వనీ దేవతలు , వరుణుడు క్రమముగా షడ్జగ్రామమందలి మూర్ఛనలకు అధిదేతలు.

బ్రహ్మ , దేవేంద్రుడు, వాయువు, గంధర్వులు , సిద్ధులు , బ్రహ్మ , సూర్యుడు - వీరు క్రమముగా మధ్యమ గ్రామమునకు అధిదేవతలు. నారద ముని ఈ మధ్యమ గ్రామ మూర్ఛనలనే వేరే పేర్లతో చెప్పాడు.

23-26

మూర్ఛనోత్తరపర్ణాఆద్యాషడ్జగ్రామేఅభిరుద్గతా

అశ్వక్రాంతాచ సౌవీరీహృష్యకాత్తోరాయచా

రజనీతిసమాఖ్యాతాఋషీణాం సప్తమూర్ఛనాః

ఆప్యాయనీవిశ్వకృతా చంద్రాహేమాకపర్దినీ

మైత్రీచాంద్రమసీపిత్ర్యామధ్యమే మూర్ఛనాఇమాః

నందావిశాలాసుముఖీ చిత్రాచిత్రవతీసుఖా

ఆలాపాచేతిగాంధారగ్రామేస్యుః సప్తమూర్ఛనాః

తాశ్చస్వర్గేప్రయోక్తవ్యా విశేషాత్తేననోదితః

షడ్జగ్రామమున 7 మూర్ఛనలు. ఉత్తరవర్ణ, అభిరుద్గత , అశ్వక్రాంత , సౌవీరి , హృష్యక , ఉత్తరాయత , రజని అనునవి క్రమముగా వాటి పేర్లు.

మధ్యమ గ్రామమందలి మూర్ఛనలు అట్లే 7 . ఆప్యాయని , విశ్వకృత , చంద్ర , హేమ , కపర్దిని , మైత్రి , చాంద్రమపి , పిత్ర్య వీటి పేర్లు.

ఈ విధముగానే గాంధార గ్రామమందలి మూర్ఛనలకు కూడ 7 పేర్లు చెప్పబడినవి. అవి నంద , విశాల , సుముఖి , చిత్ర , చిత్రావతి , సుఖ , ఆలాప . ఈ మూర్ఛనలు స్వర్గమునకు

సంబంధించినవి . కనుక వీని లక్షణములు ప్రత్యేకించి చెప్పుటలేదు.

27

తానాః స్యుః మూర్ఛనాః శుధ్ధాః షాడవౌడవీతికృతాః

షడ్జగాః సప్తహినాశ్చేత్క్రమాత్ సరిపసప్తమైః

శుధ్ధములైన మూర్ఛనలు షాడవములు ( 6 స్వరములు కలవి ) , ఔడవములు ( 5 స్వరములు కలవి ) గా చేయబడినపుడు అవి తానములని పిలువబడును.షడ్జగ్రామములు

షడ్జహీనములుగా( స స్వరము లేనివిగా ) చేయబడి మరల 7 మూర్ఛనలగును. అవి సప్తతానములు . అట్లే రిషభము ( రి ) , పంచమము ( ప ) , నిషాదము ( ని ) హీనములైనపుడు కూడ ప్రత్యేకమగు తానములని చెప్పబడును. ఇవి మొత్తము 28.( 4#7)

28

తదాష్టవింశతిస్తానా మధ్యమే సరిగోజ్ఘితాః

సప్తక్రమాద్యదాతానాః స్యుస్తదాత్వేకవింశతిః

మధ్యమ గ్రామమందు కూడ షడ్జ , ఋషభ , గాంధార హీనములైనపుడు ప్రత్యేకమైన సప్తతానములగును. అవి మొత్తము 21.

29

ఏతేచైకోనపంచాశదుభయేషాడవామతాః

సపాఖ్యాంద్విశ్రుతిభ్యాం చరిపాభ్యాం సప్తవర్జితాః

షడ్జ మధ్యమ గ్రామములు రెండూ కలిపి షాడవములైన తానములు ( 6 స్వరములు కలిగిన మూర్ఛనలు )

49. ఈ తానములే ఔడవములైనపుడు ( 5 స్వరములు కలిగినపుడు లేదా షడ్జ ( స ) పంచమములు ( ప )

రెండు విడువబడినపుడు అవి ఔడవ సప్తతానములగును.