Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.1

Wikibooks నుండి

11

మధ్యమేస్యాత్తు సౌవీరీహరిణాశ్వాతతఃపరమ్

స్యాత్కలోపనతాశుధ్ధమధ్యామార్గీచపౌరవీ

మధ్యమ గ్రామంలో సౌవీరి , హరిణాశ్వ , కలోపనత , శుధ్ధమధ్య , మార్గి , పౌరవి , హృష్యక అను పేర్లు గల

7 మూర్ఛనలు కలవు. ఈ రెండు గ్రామముల లక్షణములు చెప్పబడినవి.

12 - 14

హృష్యకేత్యథతాసాంతులక్షణంప్రతిపాద్యతే

మధ్యస్థానస్థషడ్జేనమూర్ఛనాఆరభ్యతే అగ్రిమా

అధస్తనైర్నిషాదాద్యైః షడన్యామూర్ఛనాః క్రమాత్

మధ్యమధ్యమమారభ్యసౌవీరీమూర్ఛనాభవేత్

షడన్యాస్తదధోఅధః స్థస్వరానారభ్యతుక్రమాత్

షడ్జస్థానస్థితైర్నాద్యైరజన్యాద్యాః పరేవిదుః

మధ్యస్ధానములోని షడ్జగ్రామముతో మొదటి మూర్ఛన ప్రారంభమగును. ( మగరిసనిదప ). తరువాతి స్వరములైన నిషాదము ( ని ) మొదలైన స్వరములతో ఇతరములైన మూర్ఛనలు తెలుపబడును.

మధ్య భాగమున మొదటి మూర్ఛన సౌవీరి. మిగిలినవి క్రమముగా తరువాతి మూర్ఛనల పేర్లు.

షడ్జగ్రామమున ( స తో మొదలయిన మూర్ఛనలు ) క్రమముగా నిషాదము ( ని ) మొదలైన అక్షరములతో

మూర్ఛనల పేర్లుండును.

15

హరిణాశ్వాదికా గాద్యైర్మధ్యమస్థానసంస్థితైః

షడ్జాదీన్మధ్యమాదీంశ్చతదూర్ధ్వంసారయేత్క్రమాత్

మధ్మస్థానమున నున్న గాంధారముతో ( గ3 ) మొదలైన మూర్ఛన హరిణాశ్వ . క్రమముగా మిగిలిన మూర్ఛనల పేర్లుండును. షడ్జము మొదలయిన వానిని మధ్యమము కంటె ఊర్థ్వభాగమున అంటే పై స్థాయిలో తారస్థాయికి పలికించవలెను.

16

చతుర్ధాతాః పృధక్ శుధ్ధాః కాకలీకవితాస్తధా

సాంతరాస్తద్ద్వయోపేతాః షట్పంచాశదీరితాః

శుధ్ధములైన మూర్ఛనలు 4 విధములు. అవి కాకలీసహితములు ( ని తో కలిసినవి ) అంతరసహితములు ( గ తో కలిసినవి ) అయి మొత్తము మూర్ఛనలు 56 అని

చెప్పబడును. ( గానకళాబోధిని లో దీనికి సంబందించిన పట్టిక ఇవ్వబడింది )

17

శ్రుతిద్వయంచేత్ షడ్జస్యనిషాదఃసంశ్రయేత్తదా

సకాకలీమధ్యమస్య గాంధారస్త్వంతరః స్వరః

షడ్జస్వరము రెండవ శ్రుతిని నిషాదమాశ్రయించినపుడు అది కాకలి యగును. ( ని3 )

మధ్యమము రెండవ శ్రుతిని గాంధారమాశ్రయించినపుడు అది అంతరస్వరమగును. ( గ3 )

18

యస్యాంయావతిధౌషడ్జమధ్యమౌ గ్రామయోః క్రమాత్

మూర్ఛనాతావతిధ్యేవసా నిశ్శంకేనకీర్తితా

ఈ రెండు గ్రామములలో ఏ మూర్ఛనయందు షడ్జ మధ్యమములు ( స మ ) స్వరములు

ఎన్ని సార్లు ప్రయోగింపబడునో ఆ అంకెను బట్టి ఆ మూర్ఛన ఆ స్వరము యొక్క గ్రామముగా

చెప్పబడునని గ్రంధకర్త శార్జ్ఞదేవుని మతము.

19-22