Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4

Wikibooks నుండి

సాధారణ ప్రకరణము

[మార్చు]

సాధారణముగా సప్త స్వరములు ఏ ఏ స్వరస్ధానములుగా ధ్వనించునో అవి సాధారణములు.

ఉదా: 'స రి గ మ ప ద ని' నాభి స్థానమున మొదలై హృదయము, కంఠము, అంగిలి, నాలుక దంతమూలము, దవడలు, నాసిక ఆయా స్థానములలో పలికించు ధ్వనులను ఒక ప్రామాణికమైన స్థాయిలో ఉచ్చరింపబడే స్వరస్ధానములు. వీటినే శ్రుతులుగా పేర్కొంటారు. ఇవే సాధారణములని చెప్పబడ్డాయి.

 
1
సాధారణంభవేద్ ద్వేధాస్వరజాతివిశేషణాత్
స్వరసాధారణమ్తత్రచతుర్ధాపరికీర్తితమ్

సాధారణములైన స్వరములు స్వరములు, జాతులు అని 2 విధములు.అందులో స్వరసాధారణము మరల 4 విధములు చెప్పబడినది.

2
కాకల్యంతరషడ్జైశ్చమధ్యమేన విశేషణాత్
సాధారణః కాకలీహిభవేత్షడ్జనిషాదయోః

కాకలీసాధారణము (ని2), అంతరసాధారణము (గ2), షడ్జసాధారణము (స2), మధ్యమసాధారణము (మ2) ఇవి 4 విధములు. కాకలీ స్వరము (ని3) షడ్జ నిషాదములకు సమాన స్థితి కలదగును.

3
సాధారణ్యమతస్తస్యయత్తత్సాధారణంవిదుః
అంతరస్యాపిగమయోరేవంసాధారణంమతమ్

ఈ కారణమున కాకలిని సాధారణముగా సంగీతజ్ఞులు చెప్పుదురు. అట్లే గాంధార మధ్యమమునకు సమాన దూరములో నున్న (గ2) సాధారణము.

4
ప్రయోజ్యౌషడ్జముచ్చార్య కాకలీ దైవతౌక్రమాత్
ఏవంమధ్యమముచ్చార్య ప్రయుంజీతాంతరర్షభౌ

షడ్జమును మొదట పలికించి పిదప కాకలి, దైవతములను ప్రయోగింపవలెను. అట్లే మధ్యమము పలికించి తరువాత 'గ రి' ఉచ్చరింపవలెను.

5-6
షడ్జకాకలినౌయద్వోచ్చార్యషడ్జం పునర్ర్వజేత్
తత్పఠాన్యతమంచైవం మధ్యమం చాంతరస్వరమ్

ప్రయుజ్య మధ్యమోగ్రాహ్యస్తత్పరాన్యతమోఅథవా
అల్పప్రయోగః సర్వత్రకాకలీచాంతరః స్వరః

షడ్జమును (స) కాకలిని ఉచ్చరించి (ని) తరువాత ఉచ్చరింపజేయవలెను. అన్యములైన 'రి గ మ ప ద ల'ను విడివిడిగా ఉచ్చరించవలెను. 'మ ను' మొదట 'గ' పలికించి తరువాత పలికించవలెను. అన్యములైన 'ప ద ని స రి' లను విడివిడిగా పలికించవలెను. కాకలీ స్వరము, అంతర స్వరము జాతులు రాగములయందు అల్పముగా ప్రయోగింపబడును.

7
నిషాదోయదిషడ్జస్యశ్రుతిమాద్యంసమాశ్రయేత్
ఋషభస్త్వంతిమాంప్రోక్తంషడ్జంసాధారణంతదా

నిషాద స్వరము (ని) మొదటిదైన షడ్జశ్రుతిని (స) ఆశ్రయించినపుడు, లేదా రిషభము యొక్క (రి) చివరి శ్రుతి ఆశ్రయించినపుడు ఆ షడ్జము సాధారణ షడ్జము.

8
మధ్యమస్యాపిగపయోరేవంసాధారణంమతమ్
సాధారణంమధ్యమస్యమధ్యమగ్రామగంధ్రువమ్

గాంధారము (గ) మొదటి మధ్యమ శ్రుతిని ఆశ్రయించినపుడు లేదా పంచమము (ప) చివరి మధ్యమ శ్రుతిని ఆశ్రయించినపుడు అది మధ్యమ సాధారణము. అది మధ్యమ గ్రామమున మాత్రమే పలుకును. అట్లే షడ్జ సాధారణము షడ్జగ్రామముననే పలుకును.

9
సాధారణేకైశికేతేకేశాగ్రవదణుత్వతః
తేఏవకైశ్చిదుచ్యేతేగ్రామసాధారణేబుధైః
మంద్ర ద్వనులు, సూక్ష్మ ద్వనులగుట వలన ఈ రెండు సాధారణములు కైశికములు. వాటినే గ్రామ సాధారణములుగా (వాడుకలోనున్న శ్రుతులుగా) చెప్పుదురు.

10
ఏకగ్రామోద్భవాస్వేకాంశాసుజాతిషుయద్భవేత్
సమానంగానమార్యాస్తజ్జాతిసాధారణంజగుః

ఒక గ్రామమున అన్ని శ్రుతులు సమానముగా పలికిన అది జాతి సాధారణమని చెప్పుదురు.

11
జాతిసాధారణంకేచిద్రాగానేవప్రచక్షతే
కొందరు జాతులనే రాగములు అని కూడ చెప్పుదురు.

స్వరగతాధ్యాయము-సాధారణ ప్రకరణము సమాప్తం. _______________________________________________________________________________________________________________

ముందు పేజీ తరువాత పేజీ-సాధారణ ప్రకరణము