సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.9
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము
[మార్చు]53వ శ్లోకం నుండి 59 వరకు
53
నిషాదోఅసురవంశోత్థో బ్రాహ్మణాః సమపంచమాః
రిధౌతుక్షత్రియోజ్ఞేయౌవైశ్యజాతీనిగౌమతౌ
54
శూద్రావంతరకాకల్యౌస్వరేవర్ణాస్త్విమేక్రమాత్
పద్మాభః పింజరః స్వర్ణవర్ణః కుందప్రభో అసితః
55
పీతః కర్బురఇత్యేషాం జన్మభూమీరథబ్రువే
జంబూశాక కుశక్రౌంచ శాల్మలీశ్వేతనామసు
56
ద్వీపేషుపుష్కరేచై తేజతాః షడ్జాదయః క్రమాత్
వహ్నిర్వేధాః శశాంకశ్చలక్ష్మీకాంతశ్చనారదః
57
ఋషయోదదృశుః పంచషడ్జాదీంస్తుంబురురధనీ
సహస్రాంసురితిప్రోక్తాః గ్రమాత్షడ్జాదిదేవతాః
58
క్రమాదనుష్టుబ్ గాయత్రీ త్రిష్టుప్చబృహతీతతః
పంక్తిరుష్టిక్చ జగతీత్యాహుశ్ఛందాంసిసాదిషు
- నిషాదము (ని) అసుర వంశ సంభూతము. రాక్షస గణమునకు సంబంధించినది.
- 'స' 'ప' స్వరములు శుధ్ధములు. వికృతులు లేనివి. అందువలన బ్రాహ్మణులు.
- 'రి' 'ద' స్వరములు క్షత్రియులుగా తెలియవలెను. రెండవ వర్గము.
- నిషాద గాంధారములు (ని, గ) వైశ్యజాతివి.
- అంతర కాకలీ వికృతి భేదములు శూద్రజాతివి. ఇది క్రమముగా వర్ణములగును. షడ్జము (స) రక్త వర్ణము (ఎరుపు). రిషభము (రి) ఈషత్పీతవర్ణము (కొంచెము పసుపు). గాంధారము (గ) స్వర్ణవర్ణము. బంగరు రంగు. మధ్యమము (మ) తెలుపు. పంచమము (ప) కృష్ణవర్ణము. నీలము. దైవతము (ద) పీతవర్ణము. నిండు పసుపు. నిషాదము (ని) విచిత్రవర్ణము. కలగలుపు రంగు.
- వీని జన్మభూములు అనగా ఈ స్వరస్థానములు ఎక్కువగా (ఉచ్చారణ భేదములు) పలుకు చోట్లు. షడ్జాది స్వరములకు క్రమముగా జంబూద్వీపము, శాకద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాల్మద్వీపము, శ్వేతద్వీపము, పుష్కర ద్వీపము జన్మభూములు.
అగ్ని బ్రహ్మ చంద్రుడు విష్ణువు నారదుడు అను ఋషులు షడ్జాది పంచ స్వరములు 'స' నుంచి 'ప' వరకు 'స, రి, గ, మ, ప', స్వరములను కనుగొనిరి. తుంబురుడు దైవత నిషాదములు (ద,ని)లను కనుగొనెను. అనుష్టుప్పు, గాయత్రి, త్రిష్టుప్పు, బృహతి, పంక్తి, ఉష్ణీక్కు, జగతి ఇవి ఛందస్సులుగా చెప్పబడినవి.
59
సరీవీరేఅద్భుతే రౌద్రేధో భీభత్సే భయానకే
కార్యౌగనీతుకదణౌహాస్య శృంగారయోర్మపౌషడ్జ
రిషభములు (స,రి) వీరము, అద్భుతము, రౌద్రము రసములందు; దైవతము (ద) భీభత్స, భయానక రసములందు; గాంధార నిషాదములు (గ, ని) కరుణ రసమునందు; మధ్యమ పంచమములు (మ, ప) హాస్య శృంగార రసములందు కూర్పనగును.
_______________________________________________________________________________________________________________
| ముందు పేజీ | తరువాత-సాధారణ ప్రకరణము |
|---|