Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.8

Wikibooks నుండి

46వ శ్లోకం నుండి 52 వరకు

 
46
తేశుధ్ధైః సప్తభిః సార్ధం భవంత్యేకోనవింశతిః
మయూరచాతకఛ్ఛాగ క్రౌంచకోకిలదర్దురాః
47
గజశ్చసప్తషడ్జాదీన్ క్రమాదుచ్చారయంత్యమీ
చతుర్విధాః స్వరావాదీసంవాదీచవివాద్యపి
48
అనువాదీచవాదీతు ప్రయోగేబహులః స్వరః
శ్రుతయోద్వాదశాష్టౌ వాయయోరంతరగోచరాః
49
మిథః సంవాదినౌతౌస్తోనిగావన్యవివాదినౌ
రిధయోరేవ వాస్యాతాంతేతయోర్వారిధావపి
50
శేషాణామనువాదిత్వం వాదీరాజాఅత్రగీయతే
సంవాదీత్వనుసారిత్వాదస్యామాత్యోఅభిధీయతే

సప్తస్వరములు (7). శుధ్దములు. అవి వికృత భేదములతో కూడి 19 యగును. నెమలి, వానకోయిల, మేక, క్రౌంచ పక్షి, కోకిల, కప్ప, ఏనుగు అరుపులు క్రమముగా స రి గ మ ప ద ని స్వరముల ఉచ్చారణకు పుట్టుకలు. వాది ,సంవాది, అనువాది , వివాది అని స్రములు 4 విధములు . జాతి రాగముల ప్రయోగములో బహుళముగా ప్రయోగింపబడునది వాది స్వరము.

స్వరముల నడుమ వికృత స్వరములు లేదా శ్రుతులు పలుకబడినపుడు పరస్పర సంవాదులని చెప్పబడును. అన్య స్వరములు అనునాదమున విరోధులుగా వినిపించు శ్రుతులు. విరోధి స్వరములు వినబడు రాగములు లేదా అన్య స్వర ప్రయోగ రాగములు వివాదులగును. మిగిలినవి అనువాదులగును. ఈ విభజనలో వాది స్వరములు తలమానికము. సంవాది తదనుసరణము. 51 వివాదీ విపరీతత్వాద్ధీరైరుక్తోరిపూపమః నృపామాత్యానుసారిత్వాదనువాదీతుభ్యత్యవత్ 52 గీర్వాణకులసంభూతాః షడ్జగాంధారమధ్యమాః పంచమః పితృవంశోత్థోరిధావృషికులోద్భవా

వివాది విపరీతమగుట వలన శతృవుగా పండితుల చేత చెప్పబడును. వాది వివాది స్వరములు రాజు మంత్రులుగా అనువాది భృత్యునిగా చెప్పబడును. షడ్జ గాంధార మధ్యమములు దేవతా గణమున పుట్టినవి. పంచమము పితృ గణమున పుట్టినది. ఋషభ దైవతములు ఋుషి వంశ సంజాతములు.


తరువాత పేజీ 3.9