Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.6

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము

[మార్చు]

33వ శ్లోకం నుంచి 38 వరకు

 
33
దయావతీతధాఆలాపిన్యథప్రోక్తామదంతికా
త్రయస్తే కరుణాభేదా మృదోర్భేద చతుష్టయమ్

34
మందాచ రతికాప్రీతిః క్షితిర్మధ్యాతు షడివిధా
ఛందోవతీరంజీచ మార్జనీ రక్తికాతథా

35
రమ్యాచక్షోభిణీత్యా సామథబ్ూమః స్వరస్థితమ్
తీవ్రాకుముద్వతీ మందాఛ్ఛందోవత్యస్తుషడ్జగాః

36
దయావతీరంజనీ చరక్తికాచర్షభేస్థితాః
రౌద్రీక్రోధాచగాంధారే వజ్రికాఅథప్రసారిణీ

37
ప్రేతిశ్చమార్జనీత్యేతాః శ్రుతయోమధ్యమాశ్రితాః
క్షితీరక్తాచ సందీపన్యాలాపి న్యపిపంచమే

38
మదంతీరోహిణీరమ్యేత్యేతాస్తి స్రస్తుదైవతే
ఉగ్రాచక్షోభిణీతిద్వే నిషాదేవనతః శ్రుతీ

కరుణకు జాతి భేదములు 3: దయావతి, ఆలాపిని, మదంతిక. మృదువుకు 4 భేదములు: మంద, రతిక, ప్రీతి, క్షితి. మధ్యకు 6 భేదములు: చందోవతి, రంజని, మార్జని, రక్తిక, రమ్య, క్షోభిణి.

ఈ శ్రుతి జాతులకు స్వరస్థానములను చెప్పుచున్నాము.

  • షడ్జము(స)కు 4: తీవ్ర, కుముద్వతి, మంద, ఛందోవతి.
  • ఋషభమునకు (రి) 3 శ్రుతులు. దయావతి, రంజని, రక్తిక.
  • గాంధారమునకు (గ) 2. రౌద్రి, క్రోధ.
  • మధ్యమమునకు (మ) జాతులు 4: వజ్రిక, ప్రసారిణి, ప్రీతిమార్జని.
  • పంచమమునకు (ప) జాతులు 4: క్షితి, రక్త, సందీపని, ఆలాపిని.
  • దైవతమునకు (ద)జాతులు 3: మదంతి, రోహిణి, రమ్య.
  • నిషాదమునకు 2 శ్రుతులు: ఉగ్ర, క్షోభిణి.
తేలికగా సంగీతాన్ని అభ్యసింపజేయడానికై ఈ కాలపు శాస్త్రీయ సంగీతంలో వీటిని సంఖ్యాభేదాలతో స రి గ మ ప ద ని స్వరాలుగా పాడటానికి వీలుగా వుంచారు. జాతులను రి1, రి2, రి3, గ1, గ2, మ1, మ2, ద1, ద2, ద3, ని1, ని2 ఇలా వీణలో గుర్తులుంచారు.
కాని పేర్లతో స్వరస్థానాలను గుర్తు పెట్టుకోవడం వలన నవరసాలు వాటిని గొంతులో పలికించే పధ్ధతి, ఏ స్వరాల కలయికలో ఏ రాగం పుడుతుంది? ఏ రసాన్ని పలికించడానికి ఏ రాగాన్ని వాడాలి? వంటి విషయాలను తేలికగా గ్రహించవచ్చు.
ఉదాహరణకి దయావతి కరుణరసానికీ, రంజని శృంగార రసానికీ, క్రోధ కోపాన్ని సూచించడానికి వాడతారు.
_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ