Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.5

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము

[మార్చు]

23వ శ్లోకం నుంచి 32 వరకు

 
23
శ్రుతిభ్యః స్యుః స్వరాః షడ్జర్షభగాంధారమధ్యమాః
పంచమోదైవతశ్చాధ నిషాదఇతిసప్తతే

ఈ రకంగా 22 శ్రుతుల నుంచి షడ్జము (s)ఋషభము (r) గాంధారము (గ) మధ్యమము (మ) పంచమము (ప) దైవతము (ద) నిషాదము (ని) అని 7 స్వరములు పుట్టినవి.

24
తేషాం సంజ్ఞాః సరిగమపదనీత్యపరామతాః
శ్రుత్యనంతరభావీయః స్నిగ్ధోఅనురణనాత్మకః

ఆ స్వరములకు సరిగమపదని అను ప్రధమాక్షరములు నామాంతరములుగా (వేరే పేర్లుగా) సమ్మతములైనవి. శ్రుతి వెనుకనే అనురణనాత్మకమైన ధ్వని స్వరమని చెప్పబడును. శ్రోతల చిత్తములను స్వయముగా రంజింపచేయునది స్వరమని చెప్పబడును.

25- 26
స్వతోరంజయతిశ్రోతృచిత్తం సస్వరఉచ్యతే
ననుశ్రుతిశ్చతుర్థ్యాదిరస్త్వేవం స్వరకారణమ్

త్ర్యాదీనాం తత్రపూర్వాసాం శ్రుతీనాం హేతుతాకథమ్
బ్రూమస్తుర్యాతృతీయాదిః శ్రుతిని పూర్వాభికాంక్షయా

4వ శ్రుతి నుండి ఈ విధముగ స్వరకారణమైన 3 నుండి పూర్వశ్రుతులెట్లు? అను ప్రశ్న కలుగును. అంతకు ముందున్న తీగలను మీటుట వలన శ్రుతి నిర్ధారింపబడపచున్నది. కావున తీగలన్నీ స్వరకారణములగుచున్నవి.

27
నిర్ధార్యతేఅత్రః శ్రుతయఃపూర్వాఅప్యత్రహేతవః
దీప్తానియతాచకరుణామృదుర్మధ్యేతిజాయతః

దీప్తము, ఆయత, కరుణ, మృదు, మధ్య అని శ్రుతులకు 5 జాతులు కలవు.

28- 32
శ్రుతీనాంపంచతాసాం చస్వరేష్వవంవ్యవసిథితిః
దీప్తా ఆడతా మృదుర్మధ్యా షడ్జేస్యాదృషభేపునః

సంస్థితాకరుణామధ్యమృదుర్గాంధారకే పునః
దీప్తాఆయతే మధ్యమే తేమృదుర్మధ్యేచసంస్థితే

మృదుర్మధ్యాఆయతాఆఖ్యాచకరుణాపంచమేస్థితా
కరుణాచాయతా మధ్యా దైవతేసప్తమేపునః

దీప్తామధ్యేతి తాసాంచజాతీనాం బ్రూమహేభిదాః
తీవ్రారౌద్రీవజ్రికోగ్రేత్యుక్తా దీప్తి చతుర్విధా

కుముద్వత్యాయతాయాస్యాః క్రోథాచాథప్రసారిణీ
సందీపనీరోహిణీచభేదాః పంచేతికీర్తితాః

  • స్వరముల వ్యవస్థ ఈ విధముగా వుండును.
  • షడ్జస్వరమునకు 4 భేదములు. దీప్త, ఆయత, మృదు, మధ్య.
  • ఋషభమునకు 3 భేదములు. కరుణ, మధ్య, మృదు.
  • గాంధారమునకు 2 జాతులు. దీప్త, ఆయత.
  • మధ్యమమునకు 2 మధ్య, మృదు.
  • పంచమమునకు 4 జాతులు. మృదువు,మధ్య,ఆయత,కరుణ.
  • దైవతమునకు 3 కరుణ, ఆయత, మధ్య.
  • నిషాదమునకు 2. దీప్త, మధ్య. ఆయా జాతుల భేదములు చెప్పబడినవి. తీవ్ర, రౌద్రి, వజ్రిక, ఉగ్ర అని దీప్త అను జాతి 4 విధములు. కుముద్వతి, క్రోధ, ప్రసారిణి, సందీపని, రోహిణి అని ఆయతమునకు 5 భేదములు.
ఇప్పటి సంగీతంలో ఈ విధమైన పేర్లను వాడటం లేదు. సప్త స్వరాలు స రి గ మ ప ద ని అని అక్షర సంజ్ఞలతో చెప్పబడతాయి. సైన్స్ లో వాడినట్లు రి1 , రి2, రి3 గ1 ఇలా అంకెలతోనే సూచిస్తున్నారు. తీవ్ర, క్రోధ, కరుణ, కుముద్వతి ధ్వని భేదాలు గొంతులో నవ రసాలను పలికించడానికి వాడే భేదాలుగా చెప్పబడ్డాయి
_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ