Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.4

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము

[మార్చు]

18వ శ్లోకం నుంచి 22 వరకు

 
18
స్వోపాంత్యతంత్రీమానేయాస్తస్యాం సప్తస్వరాబుధైః
ధ్రువవీణాస్వరేభ్యోఅస్యాంచలాయాంతేస్వరాస్తధా

19
ఏకశ్రుత్యపకృష్టాఃస్యురేవమన్యాపిసారణా
శ్రుతిద్వయలయాదస్యాం చలవీణాగతేగనీ

20
ధ్రువవీణోపయోగగతయో రిధయోర్విశతఃక్రమాత్
తృతీయస్యాం సారణాయాం విశతఃసపయోరిధౌ

21
నిగమేషుచతుర్ధ్యాంతు విశంతిసమపాఃక్రమాత్
శ్రుతిద్వానింశతావేవం సారణానాం చతుష్టయాత్

22
ధ్రువాశ్రుతిషులీనాయామి యత్తా జ్ఞాయతే స్ఫుటమ్
ఆతఃపరంతురక్తిఘ్నిం నకార్యమపకర్షణమ్

  • చరవీణ యందు చివరి మూడు తీగలు వదలి మిగిలిన తీగలందు సప్త స్వరములను పలికించవచ్చును.చల వీణను ధ్రువవీణను కలిపి వాయించునపుడు ఆ స్వరముల శ్రుతులు అనునాదము (resound) పుట్టించును.
  • చలవీణ రెండవతీగ మీటినపుడు గాంధార నిషాద స్వరములు ధ్రువవీణయందలి ఋషభ దైవతములందు జొచ్చును. మూడవ సారణయందు షడ్జ పంచమములలో ఋషభ దైవతములు ప్రవేశించును. నాలుగవ సారణయందు నిషాద గాంధార మధ్యమముల యందు షడ్జ మధ్యమ పంచమములు చొచ్చును.
  • ఇట్లు నాలుగు సారణములు (తీగలు) నుండి 22 శ్రుతులు ధ్రువవీణ శ్రుతులలో లీనమై కాగా శ్రుతులు 22 మాత్రమే అని నిరూపింపబడినవి. ఇంతకు మించిన ప్రయోగము రక్తిని చెరచును.
ఈ పుస్తకం 14 వ శతాబ్ది కాలపు సంగీత ప్రయోగాలను చెపుతుంది. 18 వ శతాబ్దిలో తంజావూరు రఘునాథనాయకుడు వీణకు మెట్లను ఏర్పరచి ఇప్పటి వీణ స్వరూపాన్ని నిర్వచించారని చెపుతారు. కాని శ్రుతులు లేదా ధ్వనుల ప్రామాణికత మారలేదు. విశ్వవ్యాప్తంగా అన్ని భాషల దేశాల సంగీతంలోనూ 22 శ్రుతులు మాత్రమే చెప్పబడ్డాయి. "శ్రుతి" అనగా చెవికి ఇంపైన ధ్వని.
_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ