Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.3

Wikibooks నుండి

13వ శ్లోకం నుంచి 17 వరకు

అధరాధరతీవ్రాసాస్తజ్ఞోనాదఃశ్రుతిర్మతః
వీణాద్వయోస్వరాః స్థాప్యాస్తత్రషడ్జశ్చతుశ్రుతిః

స్థాప్యస్తంత్ర్యాం తురీయాయామృషభస్త్రిశ్రుతిస్తతః
పంచమీతస్మ్రతీయయాం గాంధారోద్విశ్రుతిస్తతః

అష్టమీతోద్వితీయాయాం మధ్యమోఅథచతుశ్రుతిః
దశమీతశ్చతుర్ధ్యాం స్యాత్పంచమోఅథచతుఃశ్రుతిః

చతుర్దశీతస్తుర్యాయాం దైవతస్త్రిశ్రుతిస్తతః
అష్టాదశ్యాస్త్రతీయాయాం నిషాదోద్విశ్రుతిస్తత

ఏకవింశ్యాద్వితీయాయాంవీణైకాఅత్రధ్రువాభవేత్ః
చలవీణాద్వితీయాతు తస్యాంతంత్రీస్తుసారయేత్

స్వరాలు క్రమంగా అవరోహణలో క్రింద క్రిందగా తీవ్రమవుతాయి. వాని వలన పుట్టిన శ్రుతి లేదా ధ్వని నాదమనబడును. వీణాద్వయమున స్వరములు స్థాపింపదగినవి అందు షడ్జము చతుశ్రుతియగు షడ్జము. తీగయందు స్థాపింపవలెను. అనంతరము మూడు శ్రుతులు గల ఋషభము. పంచము నుండి మూడు (అనగా 5, 6, 7) స్థానముల నిలుపవలెను. రెండు శ్రుతులు గల గాంధారము 8 వ స్థానమున 9 వ స్థానమున నిల్పదగు. పిమ్మట4 శ్రుతులు కల మధ్యమము 11, 12, 13 స్థానముల నిలుపదగును. పిదప 4 శ్రుతులు కల పంచమము 14, 15, 16, 17 స్థానములలో నిలపవలెను. తరువాత రెండు శ్రుతులు గల విషాదము 21, 22 సథానములు. ఇందొకటి ధ్రువ వీణ . రెండవది అచల వీణ. దానియందు తీగలు సారింపవలెను.