సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.2
7
వ్యవహారేత్వసౌత్రేధా హృదిమంద్రో అభిధీయతే
కంఠేమధ్యోమూర్ధ్నితారోద్విగుణశ్చోత్తరోత్తరః
గానవ్యవహారమున ఈ నాదము మూడు విధములగును. హృదయమున మంద్రమని , కంఠమున మధ్యమమని ,
మూర్ధమున తారమని చెప్పబడుతున్నది. ఇది తరువా తరువాత ద్విగుణమగును.(రెట్టింపు)
8
తస్యద్వావింశతిర్భేదాంః శ్రవణాఛ్ఛ్రుతయోమతాః
హృద్యూర్ధ్వనాడీసంలగ్నా నాడ్యోద్వావింశతిర్మతాః
ఆ నాదమునకు వినికిడిలో భేదముల వలన 22 భేదములు కలవు. హృదయమునండి పైకి వెళ్లు ఇళా , పింగళా నాడులు 22
గా విభజింపబడినవి.
9
తిరశ్చ్యస్తాసుతావత్యః శ్రుతయోమారుతాహతేః
ఉచ్చోచ్చడరతాయుక్తాః ప్రభవంత్యుత్తరోత్తరమ్
ఆ నాడుల్లో గాలి ప్రవహించుట వలన వినబడు శబ్దములు ఉచ్చము ఉచ్చతరముగా అంతకంతకు తీవ్రముగా మారుచున్నవి.
10
ఏవంకంఠేతథాశీర్షే శ్రుతిర్ద్వావింశతిర్మతా
వ్యక్తయేకుర్మహేతాసాం వీణాద్వంద్వే నిదర్శనమ్
ఇలా కంఠమునుండి తల శిరస్సు వరకు వినబడు శ్రుతులలో 22 పండిత సమ్మతములైనవి. వానిని స్పష్టముగా తెలియుటకు
వీణయందు చూడవలెను.
11
ద్వేవీణేసదృశౌకార్యేతథానాదః సమోభవేత్
తయోద్వావింశతిస్తంత్ర్యః ప్రత్యేకంతాసుచాదిమా
రెండు వీణలను తీసుకుని నాదము సమముగా వినబడునట్లు చేయవలెను. ఒక్కొక్క వీణకు 22 శ్రుతులను స్థాపింపవలెను.
అందు ఒకదానిని మంద్రతమము లేదా అతిసూక్ష్మనాదము కలదానిగా చేయవలెను.
12
కార్యామంద్రతమధ్యానా ద్వితీయోప్చధ్వనిర్మనాత్
స్యాన్నిరంతరతా శ్రుత్యోర్మధ్యేధ్వన్యంతరాశ్రుతేః
రెండవవీణకు కొంచెము బిగ్గరగా ధ్వనించునట్లు చేయవలెను. వేరే శబ్దము ధ్వని విపడకుండునట్లు వీణను కంపింపచేసిన
శ్రుతులు క్రమానుగతముగా ఒకదాని వెంబడి ఒకటి వినిపించును.