Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము

[మార్చు]

1వ శ్లోకం నుంచి 6 వరకు

 
1
చైతన్యం సర్వభూతానాంవివిత్తంజగదాత్మనా
నాదబ్రహ్మ సదానందమద్వితీయముపాస్మహే

సకల ప్రాణులకు చైతన్య స్వరూపము , ప్రపంచ రూపముగా పరివర్తనము(మార్పు) చెందినది , అద్వితీయమైనది, ఆనందాత్మకమైనది , సర్వలోకప్రసిధ్ధమైనది అయిన నాదబ్రహ్మమును ఉపాసింతును.

2
నాదోపాసనయా దేవా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః
భవంత్యుపాసితానూనం యస్మాదేతేతదాత్మకాః

నాదాత్మకులగుటవలననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉపాసితులగుచున్నారు.

3
ఆత్మావివక్షమాణోయం మనః ప్రేరయతేమనః
దేవస్థం వహ్నిమాహంతి సప్రేరయతిమారుతమ్

ఆత్మ పలుకదలచినపుడు మనసును ప్రేరేపించును.ఆ మనసు దేహమందున్న అగ్నిని ప్రేరేపించును. ఆ అగ్ని వాయువుతో కలిసి శబ్దమును పుట్టించును.

4
బ్రహ్మగ్రంధిస్థితః సోఅథక్రమాదూర్ధ్వపథేచరన్
నాభిహృత్కంఠ మూర్ధాస్యేష్వావిర్భావయతిధ్నిమ్

బ్రహ్మగ్రంధి (నాభి కింద నున్న మూలాధార చక్రము) నుండి వాయువు (గాలి) అగ్ని ప్రేరితమై (అంగుళమాత్రమైన స్వాధిష్టాన జఠరాగ్నితో కలిసి పైవైపుగా పోవుచు నాభి (బొడ్డు), హృదయము (గుండె), కంఠము (గొంతు) మూర్ధము (కొండనాలుక) వక్త్రము (ముఖము). ఈ ప్రదేశములలో ఒత్తిడిని కలగజేసి ధ్వనిని పుట్టించును.

5
నాదో అతిసూక్ష్మః సూక్ష్మశ్చపుష్టోఅపుష్టశ్చకృత్రిమః
ఇతిపంచాభిధాదత్తే పంచ స్థానస్థితక్రమాత్

ఈ 5 స్థానములలో పుట్టిన నాదము క్రమముగా అతిసూక్ష్మము, సూక్ష్మము, పుష్టము, అపుష్టము, కృత్రిమము అను 5 పేర్లతో చెప్పబడుచున్నది.

6
నకారంప్రాణనామానం దకారమనలంవిదుః
జాతః ప్రాణాగ్నిసంయోగాత్తేననాదోఅభిధీయతే

నకారము ప్రాణమని, దకారము అగ్ని స్థానమని పెద్దలు చెప్పుదురు. ప్రాణాగ్ని సంయోగమున పుట్టినది నాదమని చెప్పబడును.

తరువాత పేజీ 3.2