Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.9

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పిండోత్పత్తి ప్రకరణము

[మార్చు]

81వ శ్లోకం నుండి 90 వరకు

81

రక్తశ్లేష్మామపిత్తానాం పక్వస్యమరుతస్తధా
మూత్రస్యచాశ్రయస్సప్తక్రమాదాశయ సంజ్ఞకాః

రక్తము (ధమనులు, సిరలు), శ్లేష్మము (శ్వాసకోశము), ఆమ్లము (ప్రేవులు), పిత్తము (పిత్తాశయము) (గాల్ బ్లాడర్) ఈ వాయువుల వలన పక్వమైన మూత్రమునకు (మూత్రాశయము). ఈ 7 ఆశయములు లేదా నివాసములు అని చెప్పబడును.

82

గర్భాశయోఅష్టమః స్త్రీణాం పిత్తపక్వాశయాంతరే
ప్రసన్నాభ్యాంకఫాసృగ్భ్యాం హృదయం పంకజాకృతి

స్త్రీలలో పిత్తాశయము, పక్వాశయము నడుమ 8 వదైన గర్భాశయముండును.శ్లేష్మము, రక్తమునకు నడుమ పద్మము ఆకారములో హృదయముండును. దాని రంధ్రముల ద్వారా రక్తము క్రిందికి ప్రవహించును.

83

సుషీరంస్యాదధోవక్త్రం యకృత్ఫ్లీహాంతరస్థితం
ఏతఛ్చచేతనస్థానం తదస్మింస్తమసావృతే

ఈ హృదయమే చేతనమునకు స్థానము. చేతనము అనాదియగు అవిద్యచే కప్పబడియుండును. హృదయపద్మము ముడుచుకుని జీవాత్మ నిద్రించియుండును.

84

నిమీలతి స్వపిత్యాత్మాజాగర్తివికసత్యపి
ద్వేధాస్వప్నసుషుప్తిభ్యాం స్వాపోబాహ్యేంద్రియాణిచేత్

హృదయపద్మము వికసించినపుడు జీవుడు మేల్కాంచును. నిద్ర కల లేదా స్వప్నము , సుషుప్తి లేదా గాఢనిద్ర అని రెండు విధములు.

85

లీయంతేహృదిజాగర్తిచిత్తం స్వప్నస్తదోచ్యతే
మనశ్చేల్లీయతేప్రాణేసుషుప్తిఃస్యాత్తదాత్మనః

ఇంద్రియములన్ని హృదయమున లీనమైనపుడు కూడా మనసు మేల్కొనియుండును. దానిని స్వప్నమందురు. మనసు కూడా ప్రాణమున లీనమైనపుడు సుషుప్తి (గాఢనిద్ర). అపుడాత్మ నిద్రించును.

86

స్వయపీతః పరాత్మానం స్వపిత్యాత్మేత్యతోమతః
శ్రవణేనయనే నాసేవదనంగుదశేఫసీ

చెవులు, కన్నులు,ముక్కు రంధ్రములు, నోరు , గుదమేఢ్రములు ఈ నవరంధ్రములు బాహ్యమలమును మోయును.

87

బహిర్మలవహానిస్యుః నవస్రోతాంసిదేహినామ్
స్త్రీణాంత్రీణ్యధికానిస్యుః స్తనయోర్ధ్వేభగేఅసృజః

ఈ బాహ్యరంధ్రములు కాక స్త్రీలకు భగాంతర్భాగమున స్తనములు, శోణిత ద్వారము అను మూడు ద్వారములు అధికముగా కలవు.

88

అస్థిస్నాయుసిరామాం సస్థానిజాలానిషోడశ
షట్ కూర్చాఃకరయోరంఘ్యో కంధరాయాంచమేఘనే

అస్థి, స్నాయువు, సిరలు, మాంసము మొదలైన పేర్లతో మొత్తము పదహారు కలవు.ఇవి చేతులు, కాళ్లు, మెడ మొదలైన భాగములలో వుండును.

89

పార్శ్వయోః పృష్ఠవంశస్య చతస్రోమాంసరజ్జవః
సీవన్యః పంచశిరసిద్వేజిహ్వాలింగయోర్మతే

వెన్నెముక పక్క భాగములలో 4 మాంస కణజాలములుండును. తలలో 5 నాలిక లింగ భాగములలో 2 కణజాలములుండును.

90

చతుర్దశాష్టాదశవాసమ్మతా అస్థిరాశయః
అస్థ్నాంశరీరేసంధ్యాస్యాతీషష్టియుస్తంశతత్రయమ్

అస్థిరాశులు (ఎముకల పోగులు) 16 కానీ 18 కానీ ఉంటాయని చెపుతారు. కాని శరీరంలో మొత్తం ఎముకలు 360

_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ