సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.7
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
పిండోత్పత్తి ప్రకరణము
[మార్చు]61వ శ్లోకం నుండి 70 వరకు
61
శబ్దోచ్చారణనిః శ్వాసోఛ్ఛా్వాసకాసాదికారణం
చరత్యాస్యేనాసికయోః నాభౌహృదయపంకజే
ప్రాణవాయువు ముక్కు నుండి నాభి రంధ్రము నుండి హృదయమునకు ప్రసరించి శబ్దోచ్చారణ కారణమై చరించును. గాలిని పీల్చి వదలే క్రమంలో మనం వివిధములైన శబ్దములను ఉచ్చరించగలము.
62
అపానస్తుగుదేమేఢ్రేకటీజంఘోదరేషుచ
నాభికందేవజ్క్షణయో రూరుజానునిష్ఠతి
అపానవాయువు గుదము, మేఢ్రము, జఘనము , జంఘలు , ఉదరము , పొత్తికడుపు, ఊరువులు, జానువులయందుండును.
63
అస్యమూత్రపురీషాదివిసర్గః కర్మకీర్తితః
వ్యానోఅక్షిశ్రోత్రగుల్ఫేషుకట్యాం ఘ్రాణేచతిష్ఠతి
అపానమునకు మలమూత్రవిసర్జనము కర్మము. వ్యానవాయువు కళ్లు , చెవులు , మడమలు , జఘనము , ఘ్రాణములయందుండును.
64
ప్రాణాపానధృతిత్యాగ గ్రహణాద్యస్యకర్మచ
సమానోవ్యాపనిఖిలంశరీరం వహ్నినాసహ
ప్రాణాపానధారణము, బహిర్నిసస్ఫరణము, అంతః ప్రవేశము (ఉఛ్వాసము, నిశ్వాసము, పూరకము) అనునవి సమానవాయువు ధర్మములు.
65
ద్విసప్తతి సహస్రేషునాడీరంధ్రేషుసంచరన్
భుక్తపేతరసాన్సమ్యగానయన్ దేహపుష్టీకృత్
సమానవాయువు అగ్నితో కలిసి సకల శరీరమందు వ్యాపించి 72 వేల నాడీరంధ్రములలో సంచరించును. మనము తిన్న ఆహారమును జీర్ణరసములను కొనిపోవుచు దేహమునకు పుష్టి కలిగించును.
66
ఉదానః పాదయోరాస్తే హస్తయారంగసంధిషు
కర్మాస్యదేహయోన్నయనోత్క్రుమణాదిప్రకీర్తితమ్
ఉదానవాయువు పాదములు , హస్తములు , అంగసంధులందు నిండియుండును. దేహము పైకెగురునట్లు చేయుటకు పీల్చిన గాలి వదలుటకు, మరణమునకు ఉపయోగపడును.
67
త్వగాదిధాతూనాశ్రిత్య పంచనాగాదయః స్థితాః
ఉద్గారాదినిమేషాది క్షుతప్రభృతిక్రమాత్
నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము , ధనంజయము అను 5 రకముల వాయువులు త్వక్కు అనగా చర్మమును ఆశ్రయించును. త్రేన్పు, రెప్పపాటు, తుమ్ము, అలసట, దగ్గు అను అసంకల్పిత ప్రతీకార చర్యలను కలిగించును.
68
ఈ జ్ఞాన కర్మేంద్రియములు ప్రకృతిలోని పంచభూతముల నుండి కొన్నిటిని స్వీకరించును. అగ్ని స్వరూపమైన సూర్యుని నుండి కన్ను రూపము, వేడి , పాకము, ప్రకాశము, కోపము, తేజము, బలము, తీక్షణత, శూరత్వము, మేధావిత్వము (తెలివి)అను విషయములను గ్రహించును.
69
అమరషంతైక్ష్ణమూష్మాణ మోజస్తేజశ్చశూరతామ్
మేధావితాం తధాదత్తే జలాత్తు రసనం రసమ్
జలమునుండి జిహ్వ ద్వారా కొన్నిటిని గ్రహించును.
70
శైత్యంస్నేహంద్రవం స్వేదం మూత్రాదిమృస్తతామపి
భూమేర్ఘాణింద్రియం గంధం స్థైర్యం ధైర్యంచగౌరవమ్
జలము నుండి నాలుక ద్వారా రుచి, చల్లదనము, ద్రవము, చెమట, మూత్రము వంటి వాటిని గ్రహించును.
| ముందు పేజీ | తరువాత పేజీ |
|---|