Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.4

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పిండోత్పత్తి ప్రకరణము

[మార్చు]

31వ శ్లోకం నుండి 40వరకు

31
అలంకారేషులలితోధర్మిష్ఠస్తాపసాశ్రమే
దేవతాదర్శనేభక్తోహింస్రోభుజగదర్శనే

అలంకారములపై కోరిక ఉన్న సుందరుడు, పెద్దలు గురువులను దర్శించు కోరికగలిగిన ధర్మపరుడు, దేవతలను చూడాలనే కోరిక వలన భక్తుడు, పామును చూడవలెనని కోరిక కలిగిన పగ కసి కోపము కలిగిన శిశువు పుట్టును.

32
గోధాశనేతునిద్రాలుర్బలీగోమాంసభక్షణే
మహిషేశుకరక్తాక్షంలోమశంసూయతేసుతమ్

గోధుమల భోజనము వలన నిద్రపోవువాడు,గోమాంసభక్షణము వలన బలవంతుడు,గేదె మాంసము తినుట వలన ఎర్రని కన్నులు, జుట్టు కలవాడగును.

33
ప్రబుధ్ధం పంచమేచిత్తంమాంసశోణితపుష్టతా
షష్ఠేఅస్థిస్థాయునఖరకేశరోమవివిక్తతా

అయిదవ మాసమున మానసికమైన ఎదుగుదల,రక్తపుష్టి కలుగును.ఆరవమాసమున అస్థులు, సూక్ష్మసిరలు, రక్తనాళమగోర్లు, వెంట్రుకలు కలుగును.

34
బలవర్ణౌపచితౌ సప్తమేత్వంగపూర్ణతా
పాల్యంతరితహస్తాభ్యాంశ్రోత్రరంధ్రేపిధాయసః

ఏడవమాసమున అవయవపుష్టి చెవులు వాని రంధ్రములు ఏర్పడును.

35
ఉద్విగ్నోగర్భసంవాదాస్తేగర్భాశయాన్వితః
స్మరన్పూర్వానుభూతాఃసనానాజాతీశ్చయాతనా

అప్పుడా శిశువు మాయచే కప్పబడియుండి గర్భవాస నరకముననుభవించును

36
మోక్షోపాయమభిధ్యాయన్ వర్తతే అభ్యాసతత్పరః
అష్టమేత్వక్సృతీస్యాతా మోజశ్చేతఛ్ఛహృద్భవమ్

మోక్షమును పొంది ఆ నరకమునుండి బయటపడు మార్గమును వెదకుచుండును.ఎనిమిదవ మాసములో చర్మము
స్మృతి కలుగును.

37
శుధ్ధమాపేతరక్తంచనిమిత్తం జీవితేమతమ్
పునరంబాపునర్గద్భంచంచలంతత్ప్రభావతి

మనసు నుండి పుట్టిన ఆ బలమైన కోరిక జీవితేఛ్ఛను కలిగించి తల్లికి విసుగును కలిగించి పరుగులు పెట్టుచుండును.

38
అతోజాతోఅష్టమేమాసేన జీవత్యోజసోజ్ఘితః
కించిత్కాలమవస్థానం సంస్కారాత్ఖండితాంగవత

ఎనిమిదవ మాసమున పుట్టిన శిశువు జీవితేఛ్చ కలిగియండదు కనుక ఖండితాంగములో కొంత తడవుండి పిదప మరణించును.

39
సమయః ప్రసవస్యస్యాన్మాసేఘనవమాదిషు
మాతూరసావహాంనాడీయనుబద్ధాపరాభిదా

నవమ మాసము తరువాత ప్రసవ సమయమగును. తల్లి రసాన్ని నుంచి శిశువు పరయను నాడి ద్వారా ఆహారమును గ్రహించును.

40
నాభిస్థ నాడీగర్భస్యమాత్రాహార రసావహా
కృతాంజలిర్లలాటేఅసౌమాతృపృష్ఠమభిస్థితః

నుదిటిన నమస్కరించునట్లు చేతులుంచుకొని తల్లికి వెనుకభాగమునకు తలతిప్పి ముడుచుకొని యుండును.

_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ