సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.3
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
పిండోత్పత్తి ప్రకరణము
[మార్చు]21వ శ్లోకం నుండి 30వరకు
21
తాభ్యోనంజాతమన్నతత్ పురుషైశ్శుక్లతాంగతమ్
శుధ్ధార్తవాయాయోషాయానిషేక్తంస్మరమందిరే
వనస్పతుల వలన అన్నము పుట్టును. పురుషునిచే భుజింపబడిన అన్నము శుక్లముగా మారును. స్ర్రీలలో శోణితమగును.
22
సహార్తధేనశుధ్ధంచేత్ గర్భాశయగతంభవేత్
జీవకర్మప్రేరితంతత్గర్భమారభతేతదా
శుక్లము,శోణితము కలిసి అండముగా రూపొంది గర్భాశయమును చేరును. జీవక్రియ ప్రేరితమై ఆ అండము
గర్భారంభ దశను పొందును.
23
ద్రవత్వం ప్రథమేమాసికలలాఖ్యం ప్రజాయతే
ద్వితీయేతుఘనఃపిండఃపేశీషద్ఘనమర్బుదమ్
మొదటినెలలో ద్రవరూపములో ఉన్న అండము రెండవమాసములో ఘనమై స్త్రీ పురుష రూపములు దాల్చును.
24
పుంస్త్రీనపుంసకానాంస్యుః ప్రాగవస్థాః క్రమాదిమాః
తృతీయేత్వంకురాః పంచకరాంఘ్రి శిరసోమతాః
మూడవమాసమున ఆ పిండమునకు హస్తములు,పాదములు,శిరస్సు కలుగుటకై అయిదు మొలకలేర్పడును.
25
అంగప్రత్యంగభాగాశ్చసూక్ష్మాస్స్యుర్యుగపతత్తధా
విహాయశ్మశ్రుదంతాదీన్జన్మానంతరసంభవాన్
మొలకల అనంతరము అంగ ప్రత్యంగిరాదేవి విభాగములతో స్త్రీ పురుష భేదములు ఏర్పడును.
26
ఏషాప్రకృతిరన్యాతువికృతిస్సమ్మతాసతామ్
చతుర్థేవ్యక్తతాతేషాంభావానామపిజాయతే
నాలుగవ నెలలో అంగ ప్రత్యంగ భావము , భావవ్యక్తి కలుగును.ఇది ప్రకృతి సహజము. కానిది వికృతి యగును.
27
పుంసాంశౌర్యాదయోభావా భీరుత్వాద్యాస్తుదయోపీతాం
నపుంసకానాంసంకీర్ణాభవంతీతిప్రచక్షతే
పురుషులకు శౌర్యానికి భావములు, స్త్రీలకు భీరుత్వాది భావములు, నపుంసకులకు సంకీర్ణ భావములు కలుగును.
28
మాతృజంచాస్యహృదయంవిషయానభికాంక్షతి
అతోమోతుర్మనోభీష్టంకుర్యాద్గర్భసమృధ్ధయే
గర్భస్థశిశువు తన తల్లి శరీరము ద్వారా ఆహారమును మనసు ద్వారా కోరికలను తీర్చుకొనును.
29
తాంచద్విద్హృదయాంనారీమాహుర్దౌహృద్దౌహృదినంబుధాః
ఆదానాద్దోహదానాంస్యుర్గర్భస్యవ్యంగతాదయః
అందువలననే స్త్రీని ద్విహృది అనగా రెండు హృదయములు కలది అని చెప్పుదురు. ఆహారము సరిగా తీసుకొనక మనసులో బాధపడే స్త్రీలకు పుట్టే బిడ్డలు వికలాంగులగుదురు.
30
మాతుర్యద్విషయాలాభస్తదార్తోజాయతేసుతః
గర్భస్స్యాదర్థవాన్ భోగదోహదాద్రాజదర్శనే
గర్భముతోనున్న తల్లికి రాజదర్శనాభిలాష కలిగిన పుట్టబోవు శిశువు అర్థవంతుడు, భోగవంతుడు అగును.
| ముందు పేజీ | తరువాత పేజీ |
|---|