సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.16
151
తాశ్చభూరితరాస్తాసుముఖ్యాః ప్రోక్తాశ్చతుర్దశ
సుషుమ్నేడాపింగలాచ కుహూరథసరస్వతీ
అందు 14 నాడులు ముఖ్యమైనవి. ముఖ్యతమములు 3 .
152
గాంధారీహస్తి జిహ్వాచవారుణీచయశస్వినీ
విశ్వోదరాశంచినీచతతః పూషాపయస్వినీ
153
అలంబుసేతితత్రాద్యాస్తిస్రో ముఖ్యతమామతాః
సుషుమ్నాతిసృషుశ్రేష్ఠా వైష్ణవీముక్తిమార్గగా
సుషమ్న, ఇడ , పింగళ , కుహువు , సరస్వతి , గాంధారి , హస్తి , జిహ్వ , వారుణి , యశస్విని , విశ్వోదర , శంచిని , పూష
పయస్విని , అలంబుస అని వాటి పేర్లు.
154
కందమధ్యేస్థితా తస్యా ఇడాసవ్యేఅధాదక్షిణే
పింగలేడా పింగలయో శ్చరతశ్చంద్రభాస్కరౌ
బ్రహ్మగ్రంధి మధ్యభాగముననుండును. దాని ఎడమవైపు ఇడానాడి , కుడివైపు పింగళానాడి వుండును. ఇడాపింగళా నాడులయందు చంద్రుడు , సూర్యుడు చరించుచుందురు.
155
క్రమాత్కాలగతేర్హేతూ సుషమ్నాకాలశోషిణీ
సరస్వతీకుహూశ్చాస్తే సుషమ్నాయాస్తుపార్శ్వయోః
క్రమముగా ఈ రెండు నాడులు కాలగమనమును కలిగించును. సుషుమ్నానాడి మృత్యువును తెలియజేయును.సరస్వతీ కుహువులు సుషమ్నానాడికి ప్రక్కన వుండును.
156
ఇడాయాః పృష్ఠపూర్వస్థేగాంధారీహస్తిజిహ్వికే
క్రత్పూషాయశస్విన్యౌ పింగలాపృష్టపార్శ్వయాన్
ఇడానాడికి వెనుక ముందుల క్రమముగా గాంధార హస్తి జిహ్వికలు , పింగళానాడికి వెనుక ముందుల పూషా యశస్వినులు
వుండును.
157
విశ్వోదరామధ్య దేశే సాత్కుహూహస్తిజిహ్వయోః
మధ్యేకుహూయశ్వన్యోర్వారుణీ సంస్థితామతా
158
పూషాసరస్వతీ మధ్యమధిశేతేపయస్వినీ
గాంధారికాసరస్వత్యోర్మద్వేవసతిసంఖినీ
పూషాసరస్వతుల నడుమ పయస్విని వుండును. గాంధారికా సరస్వతుల నడుమ శంఖిని వుండును.
159
అలంబుసాకందమధ్యేతత్రేడాపింగళేక్రమాత్
నవ్యదక్షిణనాసాంతం కుహూరామేహనంపురః
కందమధ్యమున అలంబుస వుండును. ఇడ పింగళలు క్రమముగా ఎడమ , కుడి ముక్కు వరకు వ్యాపించును.
160
సరస్వత్యూర్థ్వమాజిహ్వం గాంధార్వాపృష్ఠతస్థితా
ఆవేమనేత్రమాసవ్యపాందాంగృష్ఠంతుసంస్థితా
కుహువు మోహన్ పర్యంతము పురోభాగమున సరస్వతి మీదుగా జిహ్వ పర్యంతము , గాంధారి పృష్ఠభాగ పర్యంతము నుండును.