Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.15

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పిండోత్పత్తి ప్రకరణము

[మార్చు]

141వ శ్లోకం నుండి 150 వరకు

  
141
చతుర్థ షష్ఠ దశమైర్దవైర్గీతానశ్యతి
విశుధ్ధేరష్టమాదీని దలాన్యష్టౌత్రితానితు

4వ, 6వ, 10వ దళములలో గీతాదులు నశించును. విశుధ్ధి చక్రమునాశ్రయించియుననప్పుడు ఈ దళములు గీతాదిసిధ్ధి కలిగించును.

142
దద్యుద్గీతాదిసంసిధ్దిం షోడశంతద్వినాశనమ్
దశమైకాదశే పత్రే లలనాయాంతు సిధ్ధిదే

షోడశదళమున (16 వ దళమున) ప్రవేశించిన జీవులకు గీతముల వలన ప్రయోజనముండదు. లలనాచక్రమున 10, 11వ చక్రములలో ప్రవేశించిన జీవుడు సిద్ధిని పొందును
.
143
నాశకంప్రథమంతుర్యం పంచమంచదలంవిదుః
బ్రహ్మరంధ్రస్థితోజీవః సుధయాసంప్లుతోయథా

1, 4, 5 దళములు గీతాదినాశకములు. ఆ జీవులు సంగీత ప్రయోజనమును పొందలేరు. బ్రహ్మరంధ్రమున ప్రవేశించిన జీవుడు సంతుష్టడై తృప్తితో నిండి పాండిత్యముతో కూడిన రచనాకార్యమును సాధింపగలడు.

144
తుష్టోగీతాదికార్యాణి సప్రకర్షాణిసాధయేత్
ఏషాంశేషేషుపత్రేషు చక్రేష్వన్యేషుచస్థితః

ఈ అనాహత, విశుధ్ధి, లలనాఖ్య చక్రములు కాక మిగిలిన చక్రముల దళములందు మణిపూరకాది చక్రముల యందు ప్రవేశించిన జీవులు గీతాదిసిధ్ధి పొందజాలరు. (సంగీతమును అభ్యసింపలేరు).

145
జీవోగీతాదిసంసిధ్ధింనకదా చిదాప్నుయాత్
ఆధారాద్య్వంగులాద్దూర్ద్యయం మేహనాదంగులాదధః

మూలాధార చక్రమునకు రెండంగుళముల పైన మేహనమునకు రెండంగుళములు కింద బంగారుకాంతి కల అంగుళము స్థలమును రేహమధ్యము అందురు.

146
ఏకాంగులందేహమధ్యం తప్తజాంబూనదప్రభమ్
తత్రాస్తేగ్నిశిబాతన్వీ చక్రాత్తస్మాన్నవాంగులే

ఒక అంగుళం పరిమాణమున్న ఆ స్థలమందు అగ్నిశిఖ కలదు.

147
దేహస్యకందోఅస్త్యుత్సేధాయా మాభ్యాంచతురంగులః
బ్రహ్మగ్రంధిరితిప్రోక్తం తస్యనామపురాతనైః

పొడవు, వెడల్పు సమానమై 4 అంగుళముల పర్యంతమైన ఆ దేహకందము చక్రమునకు 9 అంగుళముల పైనుండును.

148
తన్మధ్యేనాభిచక్రంతు ద్వాదశారమవస్థితమ్
లూతేవతంతుజాలస్థా తత్రజీవోభ్రమత్యయమ్

దాని మధ్యలో 12 దళముల చక్రమున్నది. గూటిలో చిక్కుకున్న సాలీడు వలె జీవుడు ఆ నరముల , తంతువుల నడుమ చిక్కుకొని తిరుగుచుండును.

149
సుషుమ్నయా బ్రహ్మరంధ్రమారోహత్యవరోహతి
జీవః ప్రాణసమారూఢో రజ్జ్వాంకోహ్లాటుకోయధా

వివిధ బంధనముల మధ్య చిక్కిన నర్తకుని వలె సుషమ్నా నాడి నుండి బ్రహ్మ రంధ్రమునకు ఎక్కుచు దిగుచుండును .

150
సుషమ్నాంపరితోనాడ్యః కందాద్యాకందాద్యాబ్రహ్మరంధతః
కందీకృత్యస్థితాః కందం శాఖాభిస్తన్వతేతనుమ్

సుషమ్నానాడిని చుట్టుకొని కందాదులైన నాడులు బ్రహ్మరంధ్రమును కలుపుచు తమ శాఖలతో శరీరమును పెంపొందించును.

_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ