Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.14

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పిండోత్పత్తి ప్రకరణము

[మార్చు]

131వ శ్లోకం నుండి 140 వరకు

  
131
ఇతిపూర్వాదిపత్రస్థే ఫలాన్యాత్మనిషోడశ
లలనాఖ్యంఘంటికాయాం చక్రంద్వాదశపత్రకమ్

జిహ్వమూలమున (నాలిక చివరి భాగమున) లలన అను పేరుగల 12 దళముల చక్రమున్నది.

132
మదోమానస్తతః స్నేహః శోకః ఖేదశ్చలుబ్దతా
అరతిస్సంభ్రమశ్చోర్మిః శ్రధ్ధాతోషోపరోధితా

మదము, మానము, స్నేహము, శోకము, ఖేదము, లోభము, ఆర్తి, ఆశ్చర్యము, ఓరిమి, శ్రధ్ధ, సంతోషము, దయ. ఈ 12 గుణములు, భావములు షోడశదళమందు ఉచ్చరింపబడును.

133
ఫలానిలలనాచక్రేస్యుః పూర్వాదిదలేష్వతి
భ్రూమధ్యేత్రిదలం చక్రమాజ్ఞాసంజ్ఞంఫలానితు

భ్రూమధ్యమున (కనుబొమల నడుమ) ఆజాఞాచక్రమను పేరు కల 3 దళముల చక్రము కలదు. ఈ మూడు దళములకు సత్వరజస్తమోగుణములు ఫలములగును.

134
ఆవిర్భావాః సత్త్వరజస్తమసాంక్రమతోమతాః
తతోప్యస్తిమనశ్చక్రం షడ్దలంతత్ఫలానితు

తరువాత 6 దళములు కలిగిన మనశ్చక్రమున్నది. సత్వ రజ స్తమో గుణముల వెంట క్రమానుగతమగును.

135
స్వప్నోరసోపభోగశ్చఘ్రాణం రూపోలంభనమ్
స్పర్శనంశబ్దబోధశ్చ పూర్వాదిషుదవేష్వపి

మనశ్చక్రమునకు స్వప్నము (కల) , రసోపభోగము (రుచులు తెలిసికొనుట) , గంధజ్ఞానము (వాసనలను తెలిసికొనుట), దర్శనము (చూపు), స్పర్శ జ్ఞానము , శబ్దబోధ (వినికిడి శక్తి) ఈ దళమునకు ఫలములు.

136
తతోఅపిషోడశదలం సోమచక్రమితీరితమ్
దవేషుషోడశ స్వస్యకలాః షోడశసంస్థితాః

దాని పైన 16 దళములు కల సోమచక్రమున్నది. 16 దళములందు 16 కళలను కలిగియుండును (ప్రయోగము - షోడళకళాప్రపూర్ణుడు).

137
కృపాక్షమార్జవంధైర్యం వైరాగ్యంధృతిసమ్మదౌ
హాస్యం రోమాంచనిచయోధ్యానాశ్రుస్థిరతాతతః

138
గాంభీర్యముద్యమోఛ్ఛత్వం ఔదార్యేకాగ్రతేక్రమాత్
ఫలానుద్యంతి జీవస్యపూర్వాదిదలగామినః

కృప, క్షమ, ఋజుత్వము, ధైర్యము, విరక్తి, ధారణ, హర్షము, హాస్యము, రోమాంచము, ధ్యానాశ్రువు, స్థిరత, గంభీరత, ఉద్యమము, నిర్మలత్వము, ఔదార్యము, ఏకాగ్రత ఇవి ఆ 16 కళలు.

139
చక్రంసహస్రపత్రంతు బ్రహ్మరంధ్రే సుధాధరమ్
తత్సుధారసధారాభి రభివర్ధయతే తనుమ్

కపాలమున బ్రహ్మరంధ్రము కలదు. అచట అమృతము కలిగిన సహస్ర దళ్ కమలము కలదు. ఆ చక్రము అమృతధారలచే దేహమును పెంపొందించును.

140
అనాహతతవేపూర్వేష్టమే చైకాదశే తథా
ద్వాదశేచస్థితోజీవో గతాదేస్సిధ్దిమృఛ్చతి

అనాహత చక్రము మెదటి, 8వ, 11వ, 12వ దళములలో వున్న జీవుడు గీత నృత్య వాద్య సిద్ధిని పొందును.

_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ