సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.13
121వ శ్లోకం నుండి 130 వరకు
121
యోగానందశ్చతతస్ర్యాదైశానాది దలేఫలం అస్తికుండలినీ బ్రహ్మశక్తిరాధారపంకజే
ఆధారకమలముననున్న బ్రహ్మశక్తి. షట్చక్రములను దాటి క్రమముగా పరమానందము , సహజానందము , వీరానందము,యోగానందమై ఫలించును.
122
ఆబ్రహ్మరంధ్రమృజుతాంనీ తేయమమృతపదా స్వాధిష్టానేలింగమూలే షట్పత్రంచక్రమస్యచ
ఇది బ్రహ్మరంధ్రమున ఋజుత్వమును పొంది లింగమూలమునుండి స్వాధిష్టాన హృదయపద్మములు దాటి ఆజ్ఞాచక్రమున వివేకమును శుద్ధిని పొంది అమృతప్రదాయినియై షట్పదల చక్రముననుండును.
123
పూర్వాదిషుదలేష్వాహుః ఫలాన్యేతాన్యనుక్రమాత్ ప్రశ్రయః కృూరతాగర్వనాశోమూరచాతతఃపరమ్
షట్చక్రములలో పూర్వ చక్రమైన మూలాధారమందు పరమానందము దాని వెనుక క్రమముగా క్రౌర్యము, గర్వనాశము , మూర్ఛ,అవజ్ఞ( మత్తు) అవిశ్వాసము ఫలములగును.
124
అవజ్ఞాస్యాదవిశ్వాసః కామశక్తేరిదరిగృహం నాభౌదశదలంచక్రం మణిపూర్ సంజ్ఞితమ్
నాభియందు మణిపూరకమను పేరుగల చక్రము కామశక్తికి నెలవు. ఇది 10 దళముల చక్రము.
125
సుషుప్తిరత్రతృష్ణాస్యాదవిశ్వాసః దీర్ష్యాపిశునతాతథా లజ్జాభయంఘృణామోహః కషాయోదవిషాదితా
దీనివలన వీరానందము తరువాత సుషుప్తి ( నిద్ర ) , తృష్ణ ( కోరిక ) , ఈర్ష్య , పిశునత్వము( అసూయ , ద్వేషము ) భయము , లోభము , మోహము , చపలచిత్తము , కలుషచిత్తము దుఃఖము ఫలములగును.
126
క్రమాత్పూర్వాది పత్రేతుస్యాద్భానుభవనంచత్ హృదయేఅనాహతంచక్రంశివస్యప్రణవాకృతేః
హృదయమున అనాహతమను పేరుగల 12 దళముల చక్రముండును. అది ప్రణవాకృతిన శివస్వరూపమైయుండును.
127
పూజాస్థానం తదిఛ్ఛంతిదవైర్ద్వాదశభిర్యుతమ్ లౌల్యప్రణాశః ప్రకటోవితర్కో అప్యనుపితా
ప్రణవాకృతి యనగా ఓంకారరూపము . ఓంకార్ రూపమైన హృదయమును శివుని పూజాస్థానమని చెప్పుదురు.
128
ఆశాప్రకాశ్చింతాచ సమీహాసమతాతతః ,క్రమేణందభవైకల్యం వివేకోఅహంకృతిస్తథా
అకాల్యము ( ఆలస్యము ) , ప్రకటము ( ఆర్భాటము ) , వితర్కము( వితండవాదము), అనుతాపము (అలసట ), ఆశ చింత సమీహ, సమత , దంభము ( దర్పము ) , వికలత్వము , అవివేకము , అహంకారము క్రమముగా ఫలములగును.
129
ఫలానేత్యానిపూర్వాదిచలస్థస్యాత్మనోజగుః కంఠేఅస్థిభారతాస్థానం విశుధ్ధిః షోడశఛ్ఛదమ్
కంఠమున విశుధ్ధి అను 16 దళముల చక్రమున్నది. అది సరస్వతీనిలయము .
130
తత్రప్రణవ ఉద్గీధో హెంఫట్ వషడథస్వధా స్వాహానమోమృతం సప్తస్వరాః షడ్జాదయోవిషమ్
ప్రణవమనగా ఓంకారము. ఉఛ్వాసము, నిశ్వాసము , పూరకము మూడు క్రియలు కలిసినప్పుడు ఓంకార శబ్దము ఉత్పన్నమగును. ఆ ఓంకారము నుండి సప్తస్వరములు పుట్టినవి. విశుధ్ధి చక్రమందలి 16 దళములలో అకారాది వర్ణమాలయందలి అక్షరములు పుట్టినవని వేదములందు చెప్పబడినది.