Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.12

Wikibooks నుండి

 
111

అన్నంభుక్తంమన్యౌద్వేవతో అంబుసమాశ్రయాత్
తోయంమూత్రంబలం ద్వేద్వేనారీణామార్తవంత్విమే

రెండు ధమనులు నీటితోకలిసిన భుజించిన అన్నరసమును వహించును. రెండు నీటితో కలిసిన వీర్యమును ప్రవహింపజేయును.స్త్రీలలో ఋతుస్రావమును కలిగించును.

112

విముంచతోద్వేస్రోతాం సిధ్యేస్థూలాంత్రాన్వితేశకృత్
స్వేదంసమర్పయం త్యష్టౌతిరశ్చ్యౌబహుధామతాః

రెండు ధమనులు స్రోతస్సులను విడుచును. రెండు పెద్దప్రేవులలోనికి పోయి మలమును విడుచును. ఎనిమిది చెమటను కలిగించును. అడ్డముగా పోవు ధమనులు బహువిధములైన కర్మలు చేయును.

113

రోమకూపేషుసంత్యాసాం ముఖానిస్వేదముస్తయే
ప్రవేశయంతిచాభ్యంగలేపాది ప్రభవాన్రసాన్

చమటను బయటకు పంపుటకై వీని కొసలు లేదా ముఖములు రోమకూపములు చర్మము పైని వెండ్రుకల మొదళ్లలో వుండును.స్నానము, పైపూత వలన కలిగిన రసములు వీని వలననే లోపల ప్రవేశించును.

114

జీవస్థానానిమర్మాణిశతం సప్తోత్తరం విదుః
సార్ధకోటి్రయం రామ్ణాంశ్మశ్రుకేశాస్త్రిలక్షకాః

జీవస్థానమర్మములు 107. రోమములు 3 కోట్ల 50 లక్షలు. మీసము , గడ్డము , జుట్టు వెంట్రుకలు మూడు లక్షల పరిమాణము కలవి.

115

స్రోతః సిరాశ్మశ్రుకేశైఃసహరోమ్ణాంతుకోటయః
చతుః పంచాశదాఖ్యాతాః సప్తషష్ట్యాచసార్ధయా

మర్మస్థానము, తల , మీసము , గడ్డము అన్నిటితో కలిపి రోమములు 54 కోట్ల 67 లక్షల 50000.

116

లక్షణాంసంహితామానం జాలాదేరధునోచ్యతే
దశాంజలిజలజ్ఞేయం రసస్యాంజలయోనవ

117

రక్తస్యాప్టౌపురీషస్యసప్తస్యుఃశ్లేష్మణస్తుష
పిత్తస్యపంచచత్వారోమూత్రస్యాం జలయస్త్రయః

118

వసాయామేదసోద్వౌతుమజ్జ ఏకోఅంజలిర్మతః
అర్ధాంజలిః శిరోమజ్జాశ్లేష్మసారోబలంతథా

119
ఇతిప్రత్యంగ సంక్షేపోవిస్తరస్తివిహతత్త్వతః
అస్మద్విరచితేఅద్యాత్మవివేకేవీక్ష్యతాంబుధై

ఇపుడు రక్తనాళములలో జలము వలె ప్రవహించు రసముల పరిమాణము చెప్పబడును. నీరు 10 దోసిళ్లు, రసము ( జీర్ణరసములు ) 9 దోసిళ్లు , రక్తము 8 దోసిళ్లు . మూత్రము నాలుగు దోసిళ్లు , మలము 7 దోసిళ్లు , శ్లేష్మము 6 దోసిళ్లు , పిత్తము 5 దోసిళ్లు వస 3 దోసిళ్లు , మేధస్సు 2 దోసిళ్లు మజ్జ 1 దోసిలి వీర్యము 1/2 దోసిలి పరిమితి కలిగియుండును. ఇట్లే ప్రతీ అంగమునకు సంగ్రహముగా చెప్పబడును.

120
గుదలింగాంతరే చక్రమాధారాఖ్యాం చతుర్దలమ్
ప్రథమః సహస్తద్వదానందో వీరపూర్వకః

గుదము, లింగము మధ్య ఆధారమని పేరు గల చక్రము నాలుగు దళముల చక్రమున్నది. అందు మొదటిదైన పరమానందము ఫలమగును. దీనిని విస్తారముగా మాచేత రచియింపబడిన అద్యాత్మ వివేకమున గమనింతురుగాక!

తరువాత పేజీ 2.13