సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.11
101
సిరాధమనికానాంతులక్షాణి నవవింశతిః సార్ధానిస్యుర్నవశతీ షట్పంచాశద్యుతాతథా
సిరలు, ధమనులు అని చెప్పబడు రక్తనాళముల సంఖ్య 9;లక్షల 9 వందల 56.
102
దశమూలసిరాఓజో వాహిన్యోహృదయాశ్రయాః ద్వ్యంగులంచాంగులదలం యవంయవదలంతథా
పది మూలసిరలు హృదయమునాశ్రయించి ఓజస్సును వహించును.
103
గత్వాద్రుమదలస్యేవ సేవన్యః ప్రతతాదయా భిద్యంతేతాస్తదాసప్తశతాని పరిసంఖ్యయా
తీగలఅల్లిక వలె నాళములు విస్తరించినపుడు అవి సప్తశత ( 700) సంఖ్యకు చేరును.
104
తాసుజిహ్వాస్థితేద్వే ద్వేవాగ్రస జ్ఞానకారణే ఘ్రాణేగంధవహెద్వేద్వే మేషోన్మేష కృతాదృశో
అందు జ్ఞానేంద్రియములకు సంబంధించి రెండు నాలుకకు , రెండు ముుక్కుకు , రెండు కళ్లకు సంబంధించినవి.
105
శ్రోత్రయోః శబ్దవాహిన్యౌతాసుద్వే శార్జిణోదితే ధమన్యోరసవాహిన్యశ్చతుర్వింశతిరీరితాః
శబ్దమును గ్రహించునది శ్రోత్రము. (చెవి). రసవాహినులైన ధమనులు 24.
106
కుల్యాభిరికేదారాస్తాభిర్దేహోఆభివర్ధతే ఏతాః పరతిష్ఠీతానాభ్యాం చక్రనాభావరారివ
నీటికాలువలచేత పొలము పండింపబడినట్లు రసవాహినులచేత దేహము పెంపొందింపబడును. చక్కరు ఇరుసుకు పొదిగిన ఆకుల వలె అవి నాభిమూలమున పొదగబడినవి.
107
ఊర్ధ్వందశదశాధస్తాచ్ఛతస్రస్తిర్యగాయతాః ఊర్ధ్వగా హృదయంప్రాప్తాః ప్రతీయంతేపృధక్తధా
పైకి పది రసవాహినులు , కిందికి పది రసవాహినులు అడ్డముగా నాలుగు వ్యాపించి వున్నవి. పైకి పోయినవి హృదయమును చేరి హృదయము నుండి వేరుగా కనపడుతున్నాయి.
108
వాతంపిత్తంకఫంరక్తం రసంద్వేద్వే విముంచతః శబదంరూపంరసంగంధంద్వేద్వేతత్రావగఛ్ఛతః
రెండు రెండు రసవాహినులు వాతము, పిత్తము , కఫము ,రక్తము రసములకు కర్మేంద్రియములకు , రెండు రెండు చొప్పున శబ్ద స్పర్శరేఖ రస గంధములకు చేరును.
109
ద్వేద్వేచభాషణంఘోషంస్వాపంశోధంచరోదనమ్ కుర్వాతేద్వేనరేశుక్లం స్తన్యంతున్నవతస్త్రియామ్
ఊర్థ్వములైనవి భాషణము , ఘోషము , స్వాపము , బోధము , రోదనము చేయును. అధోముఖములు పురుషుని యందు శుక్లము స్త్రీలయందుస్తన్యమును స్రవింపజేయును.
110
అధోగతాఅపిత్రేథాపృథక్పక్వాశయస్థితాః ప్రవర్తయంతితత్రాద్యా దశవాతాదిపూర్వవత్
అధోముఖములైన రసవాహినులలో మిగిలినవి మూడువిధములై పక్వాశయము నుండి ముందు చెప్పిన విధముగా పది రకములైన వాయువులను ప్రసరింపజేయును.