సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
పిండోత్పత్తి ప్రకరణము
[మార్చు]1వ శ్లోకం నుండి 10 వరకు
1
గీతంనాదాత్మకంవాద్యంనాదవ్యక్తాప్రకాశతే
తద్ద్వయానుగతంనృత్యంనాదాధీనమతస్త్రయమ్
గీతము నాదాత్మకమైనది. వాద్యము వీణ,వేణువు,మొదలైన వాటి నాదము వలన తెలియును.ఆ వాద్య,గీతములను అనుసరించి నృత్తముండును. గీత వాద్య నృత్తములు మూడు కలిసి నాదవశములైయుండును.
2
నాదేనవ్యజ్యతేవర్ణఃపదం వర్ణాత్పదాద్వచః
వచోవ్యవహారోఅయంనాదాధీనమతోజగత్
నాదమునందు అకారాది వర్ణములన్ని వ్యక్తమగును. వర్ణములు(అక్షరములు)వలన పదములు, పదముల వలన వాక్యములు
వాక్యముల వలన శబ్ద సంబంధమైన వ్యవహారమంతయు జరుగును.
3
ఆహతోనాహతశ్చేతిద్విధానాదోనిగద్యతే
సోయంప్రకాశతేపిండేతస్మాత్పిండోఅభిధీయతే
జగమంతయు నాదాధీనము.నాదము ఆహతమని,అనాహతమని రెండు విధములు. నాదము పిండము(శరీరము)వలన ప్రకటమగును. అందువలన మొదట నాదము లేదా శబ్దము శరీరమున పుట్టు స్థానములు , దానికి ముందుగా శరీరము లేదా కాయము పుట్టుక పిండోత్పత్తి ప్రకరణమున వివరింపబడును.
4
అస్తిబ్రహ్మచిదానందంస్వయంజ్యోతిర్నిరంజనమ్
ఈశ్వరంలింగమిత్యుక్తమద్వితీయమజంవిభుమ్
బ్రహ్మ స్వరూపముగా ప్రకాశించుచు ఈశ్వర లింగ స్వరూపమై స్వయంభువైనది ఈ బ్రహ్మానంద స్వరూపము. అదే ఓం కారము.
5
నిర్వికారంనిరాకారంసర్వేశ్వరమనశ్వరమ్
సర్వశక్తిచసర్వజ్ఞంతదంశాజీవసంజ్ఞికాః
ఆ ఓంకారమే సర్వ శక్తిమంతమైన, సర్వజ్ఞము అయినది. పరబ్రహ్మ స్వరూపము. జీవులందరు ఆ పరబ్రహ్మ స్వరూపమునకు
అంశలై ఆ ఓంకారమును ప్రకటించుచు ప్రస్తుతించుచున్నారు.
6
అనాద్యవిద్యోపహతాయధాగ్నేర్విస్ఫులింగకాః
దార్వాద్యుపాధిసంభిన్నాస్తేకర్మభిరనాదభిః
ఈ జ్ఞానము తెలియని వారు ఉపాధి కల్పించు విద్యలయందు నిమగ్నులై బ్రహ్మానందమును గూర్చి తెలియలేని అజ్ఞానులై
ప్రవర్తింతురు.
7
సుఖదుఃఖప్రదైఃపుణ్యపాపరూపైర్నియంత్రితాః
తత్తజాతియుతందేహమాయుర్భోగంచకర్మజమ్
సుఖదుఃఖములు, పాపపుణ్యములు,కర్మములు, భోగములు మొదలైన దేహ సంబంధమైన వ్యవహారములలో మునుగియుండును
8
ప్రతిజన్మప్రపద్యంతేతేషామర్త్యపరంపునః
సూక్ష్మలింగశరీరంతదామోక్షాదక్షయంమతమ్
స్థూలశరీరము సుఖదుఃఖములను, జన్మములను పొందుచుండగా,సూక్ష్మశరీరము మాత్రము మోక్షమును పొందుటకు అర్హమైయున్నది.
9
సూక్ష్మభూతేంద్రియప్రాణావస్థాత్యకమిదంజగత్
జీవీనాముపభోగాయజగమేత్సృజత్యజః
పరమాత్ముడు జీవుల ఉపయోగమునకై ఈ జగత్తును సృష్టించెను. కాని సూక్ష్మశరీరమునందును పంచభూతములు,తన్మాత్రలు అంతఃకరణములతో కూడిన జగత్తు కలదు. ఈ జగత్తు పరమాత్మకై సృష్టింపబడినది.
10
సఆత్మాపరమాత్మాచవిశ్రాంత్యైసంహరత్యధ
తదేత్సృష్టిసంహారంప్రవాహానాదిసమ్మతమ్
ఆ పరమాత్మ తన ఆనందమునకై ఈ సృష్టిని చేసి తన విశ్రాంతికై ఉపసంహారమును చేయును.
| ముందు పేజీ | తరువాత పేజీ |
|---|