సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2..9
వచనాదానగమన విసర్గరతయఃక్రమాత్ క్రియాస్తేషాం మనోబుధ్ధిరిత్యంతః కరణద్వయమ్ వాక్కు, ( మాట )రెండు విధములు . నోటినుండి శబ్దం వెలువడుతుంది. నాలిక ద్వారా పలుకబడే శబ్దం మాట అవుతుంది. నోటినుండి మాట బయటికి రావడం కర్మేంద్రియాల వలన జరుగుతుంది. దాని వెనుక ఊహ మనసు లేదా బుద్ధి వలన జరుగుతుంది. 52 సుఖందుఃఖంచ విషయౌవిజ్ఞేయౌ మనసు క్రియా స్మృతి భ్రాంతి వికల్పాద్యాధియో అధ్యవనతిర్మతా సుఖము ,దుఃఖము , జ్ఞాపకం,భ్రమపడటం , విరక్తి ఇటువంటి భావనలు మనసు నుండి పుట్టినవి. వాని గూర్చిన ఆలోచన ఆలోచనలలోని మార్పు అధ్యయనం బుధ్ధి వలన జరుగుతాయి. 53 బ్రహ్మయోనీనింద్రియాణి భౌతికాన్యపరేజగుః సత్త్వాఖ్యమంతఃకరణం గుణభేదాత్త్రిధామతమ్ శరీరమును బ్రహ్మ సృష్టించాడని వేదాంతుల మతం. పంచభూతాల సృష్టి అని భౌతికవాదుల మతం. ఆత్మ మాత్రం గుణభేదముల వలన మనసు, బుధ్ధి , ఆత్మ అని మూడు రకాలుగా పిలువబడుతుంది. 54 సత్త్వంరజస్తమఇతిగుణాః సత్త్వాత్తుసాత్త్వికాత్ ఆస్తిక్యశుధ్ధధర్మైక రుచిప్రభృతయోమతాః సత్త్వము , రజస్సు లేదా అహంకారము , తమస్సు లేదా అజ్ఞానము అని మనసు యొక్క గుణములు మూడు విధములు. విద్య వలన అజ్ఞానమనే తమస్సును పోగొట్టుకొనవలెను. అహంకారమును పోగొట్టుకొని విద్యను సముపార్జించిన సాత్త్వికాంతఃకరణము కలుగును. సాత్త్వికత వలన నిర్మల మైన మనసు , ధర్మ ప్రవృత్తి కలుగును. 55 సత్త్వాత్తురాజసాద్భావాః కామక్రోధమదాదయః నిద్రాలస్యప్రమాదార్తి వంచనాద్యాస్తుతామసాః అహంకారము నిండిన మనసులో కామము ( కోరిక ) , క్రోధము ( కోపము ) , మదము ( గర్వము ) , మాత్సర్యము ( అసూయ ) మొదలగు భావములు కలుగును. అజ్ఞానము వలన నిద్ర , అలసట , బాధ , వంచన మోసపోవుట లేదా మోసము చేయుట మొదలగు గుణములు కలుగును. 56 ప్రసన్నేంద్రియతా ఆరోగ్యానలస్యాద్యాస్తుతామసాః దేహో భూతాత్మకస్తస్మాదాదత్తే తద్గుణానిమాన్ ప్రసన్నేంద్రియత్వము అంటే ఇంద్రియలోలత్వము లేకుండుట. ఇంద్రియాలకు కట్టుబడి పని చేయకపోవటం. ఆరోగ్యము , ఆలస్యము లేక పని చేయుట ఇవి సత్త్వ గుణము కలిగిన మనసు వలన సంభవములు. పంచభూతాత్మకమైన దేహము ఆత్మ గుణములను స్వీకరించి ఆ ప్రకారముగా ప్రవర్తించును. 57 శబ్దం శ్రోత్రంసుషిరతాంధైవిక్త్యం సూష్మబోధ్దృతామ్ బలంచగగనాద్వాయోః స్పర్శంచస్పర్శనేంద్రియమ్ దేహము పంచభూతములనుండి వివిధములైన జ్ఞానములను గ్రహించును. ఆకాశము నుండి శబ్దమును, చెవి నుండి వినికిడి శక్తిని , కంటి వలన వివిధ వస్తువులను గుర్తించు శక్తిని , గాలి నుండి శ్వాసను , శ్వాస నుండి బలమును గ్రహించును. 58 ఉత్క్షేపణమవక్షేపాకుంచనే గమనం తథా ప్రసారణమితీమాని పంచకర్మాణి రూక్షతామ్ ఉత్క్షేపణమనగా పైకి విసరడం. అవక్షేపణమంటే కిందికి లాగడం . ఆధారమును గ్రహించుట ( భూమిని వదలకుండా ) గమనము (నడక ) ,స్థిరత్వము , కదలిక ఈ లక్షణములన్నింటిని స్పర్శ ద్వారా త్వగింద్రియమనే జ్ఞానేంద్రియము ద్వారా దేహము గ్రహించుచున్నది. 59 ప్రాణాపానౌతథావ్యానసమానోదానసంజ్ఞికానీ నాగంకూర్మంచకృకరం దేవదత్తంధనంజయమ్ ప్రాణము, అపానము, వ్యానము, సమానము,ఉదానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనంజయము అని వాయువులు పది విధములు. శ్వాస ద్వారా ఈ వాయువులను ముక్కు గ్రహిస్తుంది. 60 దశేతివాయువికృతీస్తథాగృహ్ణాతి లాఘవమ్ తేషాంముఖ్యతమః ప్రాణానాభికందాదధః స్థితః పది రకములైన వాయువుల్లో ప్రాణవాయువు ముఖ్యమైనది. అది శ్వాస వలె ముక్కు రంధ్రముల ద్వారా గ్రహించబడుతుంది.