సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2..8
అధ్యాస్తేసంకుచద్ణాత్రోగర్భందక్షిణపార్వ్శసః వామపార్శ్వస్థితానారీక్లీబయధ్యస్థితంమతమ్ మగ శిశువు కుడి ప్రక్కకు , ఆడశిశువు ఎడమ ప్రక్కకు తిరిగి యుండు ననుట శాస్త్ర సమ్మతము. 42 క్రియతేఅధశ్శిరాఃసూతిమారుతైఃప్రబలైస్తతః నిస్సార్యతేరుజద్గాత్రోయంత్రఛ్ఛిద్రేనబాలకః తరువాత ప్రసూతి వాయువు బలపడగానే తలక్రిందులుగా చేయబడి పీడితదేహుడై బాలకుడు యోనిరంధ్రమునుండి వెలుపలికి తోయబడును. 43 జాతమాత్రస్యతసాధ్యప్రవృత్తిః స్తనగోచరా ప్రాగ్జన్మబోధసంస్కారాదితి జీవస్యనిత్యతా పుట్టిన శిశువుకు జన్మసంస్కారము వలననే తల్లిని గుర్తించుట, చనుబాలు గ్రోలుట మొదలగు ప్రక్రియలు అసంకల్పితముగ కలుగును. కావుననే జీవుడు నిత్యుడని చెప్పబడును. 44 భావాస్ఫ్యుఃషడ్విధాస్తస్యమాతృజాఃపితృజాస్తథా రసజాఆత్మజాఃసత్త్వసంభవాస్సాత్మజాస్తథా జీవునకు పుటకతో సహజముగా ఆరు రకములైన భావములుండును.తల్లి గుణములు,తండ్రిగుణములు,రసజములు అనగా హృదయసంబంధములు, ఆత్మజములు అనగా బుధ్దికి సంబంధించినవి ( తెలివితేటలు ), సత్వజములు( బలపరాక్రమములు),సాత్మ్యజములు ( సహజసిద్ధమైన బలహీనతలు ). 45 మృదవఃశోణితంమేదోమజ్జాప్లీహాయకృత్ గుదమ్ హృన్నాభీత్యేవమాద్యాస్తు భావామాతృభవామతాః హృదయము,మృదుత్వము,రక్తము, మేధ,మజ్జ,కాలేయము,ప్లీహము,నాభి ఈ భావములు మాతృసంభవములు. తల్లినుండి సంక్రమించును. 46 శ్మశ్రువులు అనగా మీసములు, గడ్డము, రోమములు లేదా వెంట్రుకలు , స్నాయువు , సిరలు ధమనులు అనే రక్తనాళములు నాడులు, గోళ్లు, పళ్లు లేదా దంతములు, శుక్లము ఇవి పితృసంభవములు. తండ్రి నుండి సంక్రమించును. 47 శరీరోపచయోవర్ణోవృధ్ధిః సుప్తిర్బలంస్థితిః అలోలుపత్వముత్సాహ ఇత్యాధిన్ రసజాన్విదుః దేహపుష్టి, రంగు, పెరుగుదల,నిద్ర,బలము, లొంగని పట్టుదల, ఉత్సాహము ఈ లక్షణములు భావములు, రసభవములు అనగా భావములకు, మనసుకు సంబంధించినవి. 48 ఇఛ్ఛాద్వేషఃసుఖందుఃఖధర్మాధర్మౌచభావనా ప్రయత్నో జ్ఞానమాయుశ్చేంద్రియాణీత్యాత్మజామతాః రాగద్వేషములు, సుఖదుఃఖములు,ధర్మాధర్మములు ప్రయత్నపూర్వకమైన జ్ఞానముగా ఆయువు, ఇంద్రియములకు సంబంధించినవిగా చెప్పబడును. 49 జ్ఞానేంద్రియాణిశ్రవణంస్పర్శనందర్శనంతధా రసనంఘ్రాణిమిత్యాహుః పంచతేషాండుగోచరాః జ్ఞానేంద్రియములైన కన్ను ముక్కు చెవి నాలుక స్పర్శ ఇవి సహజసిధ్ధములు లేదా ప్రకృతి సిధ్దములు పుట్టుకతో వచ్చినవి. ఆత్మగతములు. 50 శబ్దస్పర్శస్తధారూపం రసోగంధఇతిక్రమాత్ వాక్కర్ంఘ్రిగుదోపస్థానాహుః కర్మేంద్రియాణితం వాక్పాణిపాదయూపసథములు కర్మేంద్రియములు శారీరకమైనవి. శరీరమునకు సంబంధించినవి.