సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2..5
11
తేజీవానాత్మనోభిన్నాభిన్నంవానాత్మనోజగత్ శక్త్యాసృజన్నభిన్నోసౌసువర్ణంకుండలాదివ
జీవులాత్మ కంటె భిన్నులు కారు. అట్లే జగత్తును సూక్ష్మశరీరము కంటె భిన్నము కాదు.ఆత్మయే భగవత్ శక్తితో ప్రపంచమునుసృష్టించును.
12
సృజత్యవిద్యయేత్యన్యే యధారజ్జుర్భుజంగమమ్ ఆత్మనఃపూర్వమాకాశస్తతో వాయుస్తతోనిలః
ఆత్మ తన శక్తిచేత జగమంతటిని సృష్టించెను. అజ్ఞానము చేత తాడుగా కనిపించినది విజ్ఞానము పొందిన పిదప సర్పమగునని వేదాంతులు చెప్పుదురు. ఇది ఆత్మ చేత కలుగు మాయ.
13
అనలాజ్జలమేతస్మాత్పృధివీసమజాయత మహాభూతాన్యమూన్యేషావిరాజోబ్రహ్మణస్తనుః
ఆత్మ నుండి తొలుత ఆకాశము పుట్టెను.ఆకాశము నుండివాయువు, వాయువు నుండి అగ్ని , అగ్ని నుండి జలము,జలము నుండి భూమి పుట్టెను. ఇవి పంచభూతములు. విరాట్బ్రహ్మ తనువు పంచభూతాత్మకము. ఈ జగమంతయు పంచభూతముల నుండి పుట్టినదే.
14
బ్రహ్మబ్రహ్మాణమసృజత్తస్మైవేదాన్ ప్రదాయచ భౌతికంవేదశబ్దేభ్యఃసర్జయామానతేనతత్
ఆ విరాట్బ్రహ్మమే చతుర్ముఖబ్రహ్మ స్వరూపమును సృష్టించి వేదస్వరూపమిచ్చి, వేదశబ్దములవలన అక్షర జగత్తును సృష్టించెను.
15
తధాజ్ఞయాసృజత్బ్రహ్మామనసైవప్రజాపతీన్ తేభ్యస్తురైతసీసృష్టీఃశరీరాణాంనిరూప్యతే ఆ పరమాత్ముని ఆజ్ఞచేతనే మానసిక సృష్టిగా దక్షాది ప్రజాపతులను,రేతోవికారరూపముగ శరీరసృష్టిని కలిగించెను.
16
స్వేదోద్భేదజఠాయ్వండహేతుభేదాచ్చతుర్విధమ్ దేహంయూకాదినఃస్వేదాదుద్భేదాత్తులతాదినః
ఈ సృష్టి నాలుగు విధములైన రసముల కలయికచేత జరిగినది. స్వేదము ( చమట ), విసర్జనము (యూరిన్ & మోషన్ )జఠరరసము(ఆహారాన్ని జీర్ణం చేసేది,) , అండము (గుడ్డు) . చమట నుండి క్రిమికీటకాదులు, విసర్జన రసముల నుండి మొక్కలు , జఠరరసము వలన మనుషులు,అండము వలన పక్షులు సృష్టింపబడ్డారు.
17
జఠాయుర్మానుషాదీనామండాత్తువిహగాదినః తత్రనాదోపయోగిత్వాన్మానుషందేహముచ్యతే
నాదము పుట్టించునది అవడం వలన మానవదేహము పుట్టుకను గూర్చి చెప్పబడుచున్నది.
18
క్షేత్రజ్ఞస్థితఆకాశేఆకాశాద్వాయుమాగతః వాయోర్ధూమంతతశ్చాభ్రమభ్రాన్మేఘేఃపతిష్ఠతే
ఆకాశమున ఆత్మ ఉండును. ఆకాశమునకు వాయువు చేరును.వాయువు నుండి పొగ పుట్టును. ఆ పొగతో కూడిన గాలి మేఘమగును.మేఘశకలము వర్షించును.
19
ఆహుత్యాప్యాయితోగ్రస్తరసోగ్రీష్మేచభానుభిః భానుర్మేఘనరసంనిధత్తేతంబలాహకః
ఆవాహనము వలన సూర్యుడు తృప్తి పొంది గ్రీష్మకాలమునందు మేఘరసమునందించును.
20
యదావర్షతివర్షేణసహజీవస్తదాభువః వనస్పత్యోషధీజాతాఃసంక్రామత్యతిలక్షితః
మేఘమునుండి పుట్టిన జలము వలన భూమి నుండి వనస్పతులు పుట్టును. ఆ వనస్పతుల నుండి జీవుడు పుట్టును.