Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.17

Wikibooks నుండి

161
హస్తిజిహ్వాసర్వగాతుహరుణ్యధయశస్వినీ
అంగుష్ఠార్దక్షిణాంఘ్రిస్థాదేహేవిశ్వోదరాఖి లే
హస్తి జిహ్వ ఎడమకంటి నుండి ఎడమ కాలి వరకు వుండును. యశస్విని బొటనవేలినుంచి పాదమంతటా వ్యాపించును.
162
శంఖినీసవ్యకర్ణాంతం పూషాత్వాయామ్యనేత్రతః
పయస్వినీతులితతా దక్షిణశ్రవణావళి
విశ్వోదర దేహమంతా వ్యాపించి వుండును. శంఖిని కుడి చెవి వరకు , పూష కుడి కంటి వరకు , పయస్విని ఎడమ చెవి వరకు వుండును.
163
అలంబుసాపాయు మూలమపష్టభ్యవ్యవస్థితా
ఏవంవిధేతుదేహేఅస్మిన్ మలసంచయసంవృతే
అలంబుస గుదమూలమునవలంబించి యుండును. మిగిలిన నాడులు మలసమూహముతో నిండి యుండును.
164
ప్రసాదయరితిధీమంతో భుక్తింముక్తిముపాయతః
తత్రస్యాత్సగుణాద్ధ్యానాత్ భుక్తిర్ముక్తేస్తునాద్గుణాత్
ధీమంతులు ఈ దేహముతోనే ఉపాయమునవలంబించి భుక్తి ముక్తులను సాధించుకొందురు. సగుణోపాసన వలన భుక్తి
నిర్గుణోపాసన వలన ముక్తి లభించును.
165
ధ్యానమేకాగ్ర చిత్తైకసాధ్యంనసుకరంనృణామ్
తస్మాదత్రసుఖోపాయం శ్రీమన్నాదమనాహతమ్
ఏకాగ్రచిత్తముతో సాధన చేసిన కాని ద్యానము సులభము కాదు. అందువలన అనాహతమును ఉపాసించి సంగీత సాహిత్య
మిళితమైన నాదోపాసన సుఖోపాయము.మునుల చేత అంగీకరింపబడినది.
166
గురూపదిష్టేనమార్గేణమున యస్సముపాసతే
సోపిరక్తివిహీనత్వాన్న మనోరంజకోనృణాం
అనాహత నాదమైనను రక్తి లేనిది . మనోరంజకము కాదు.
167
తస్మాదాహతనాదస్య శ్రుత్యాదిద్వారతోఖిలమ్
గేయంవితన్వతోలోకరంజనమ్ భవభంజనమ్
ఉత్పత్తిమభిధాస్యా మస్తధాశ్రుత్యాదిహేతుతామ్

అందుచేత సామాన్య జనులకు ప్రమోదము కలిగించుటకై శ్రుతి స్వర గ్రామ మూర్ఛనల ద్వారా నాదమును విస్తరించి సంగీతముగా జేసిన లోకరంజనము , భవభంజనము అగునని చెప్పుదురు.

పిండోత్పత్తి ప్రకరణము సమాప్తం.