సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.15
141
చతుర్థ షష్ఠ దశమైర్దవైర్గీతానశ్యతి విశుధ్ధేరష్టమాదీని దలాన్యష్టౌత్రితానితు
4 వ , 6 వ , 10 వ దళములలో గీతాదులు నశించును. విశుధ్ధి చక్రమునాశ్రయించియుననప్పుడు ఈ దళములు గీతాదిసిధ్ధి కలిగించును.
142
దద్యుద్గీతాదిసంసిధ్దిం షోడశంతద్వినాశనమ్ దశమైకాదశే పత్రే లలనాయాంతు సిధ్ధిదే
షోడశదళమున ( 16 వ దళమున ) ప్రవేశించిన జీవులకు గీతముల వలన ప్రయోజనముండదు. లలనాచక్రమున 10 11 వ చక్రములలో ప్రవేశించిన జీవుడు సిద్ధిని పొందును . 143
నాశకంప్రథమంతుర్యం పంచమంచదలంవిదుః బ్రహ్మరంధ్రస్థితోజీవః సుధయాసంప్లుతోయథా
1 , 4 , 5 దళములు గీతాదినాశకములు. ఆ జీవులు సంగీత ప్రయోజనమును పొందలేరు. బ్రహ్మరంధ్రమున ప్రవేశించిన జీవుడు సంతుష్టడై తృప్తితో నిండి పాండిత్యముతో కూడిన రచనాకార్యమును సాధింపగలడు.
144
తుష్టోగీతాదికార్యాణి సప్రకర్షాణిసాధయేత్ ఏషాంశేషేషుపత్రేషు చక్రేష్వన్యేషుచస్థితః
ఈ అనాహత , విశుధ్ధి , లలనాఖ్య చక్రములు కాక మిగిలిన చక్రముల దళములందు మణిపూరకాది చక్రముల యందు ప్రవేశించిన జీవులు గీతాదిసిధ్ధి పొందజాలరు . ( సంగీతమును అభ్యసింపలేరు ) .
145
జీవోగీతాదిసంసిధ్ధింనకదా చిదాప్నుయాత్ ఆధారాద్య్వంగులాద్దూర్ద్యయం మేహనాదంగులాదధః
మూలాధార చక్రమునకు రెండంగుళముల పైన మేహనమునకు రెండంగుళములు కింద బంగారుకాంతి కల అంగుళము స్థలమును రేహమధ్యము అందురు.
146
ఏకాంగులందేహమధ్యం తప్తజాంబూనదప్రభమ్ తత్రాస్తేగ్నిశిబాతన్వీ చక్రాత్తస్మాన్నవాంగులే
ఒక అంగుళం పరిమాణమున్న ఆ స్థలమందు అగ్నిశిఖ కలదు.
147
దేహస్యకందోఅస్త్యుత్సేధాయా మాభ్యాంచతురంగులః బ్రహ్మగ్రంధిరితిప్రోక్తం తస్యనామపురాతనైః
పొడవు , వెడల్పు సమానమై 4 అంగుళముల పర్యంతమైన ఆ దేహకందము చక్రమునకు 9 అంగుళముల పైనుండును.
148
తన్మధ్యేనాభిచక్రంతు ద్వాదశారమవస్థితమ్ లూతేవతంతుజాలస్థా తత్రజీవోభ్రమత్యయమ్
దాని మధ్యలో 12 దళముల చక్రమున్నది. గూటిలో చిక్కుకున్న సాలీడు వలె జీవుడు ఆ నరముల , తంతువుల నడుమ చిక్కుకొని తిరుగుచుండును.
149
సుషుమ్నయా బ్రహ్మరంధ్రమారోహత్యవరోహతి జీవః ప్రాణసమారూఢో రజ్జ్వాంకోహ్లాటుకోయధా
వివిధ బంధనముల మధ్య చిక్కిన నర్తకుని వలె సుషమ్నా నాడి నుండి బ్రహ్మ రంధ్రమునకు ఎక్కుచు దిగుచుండును .
150
సుషమ్నాంపరితోనాడ్యః కందాద్యాకందాద్యాబ్రహ్మరంధతః కందీకృత్యస్థితాః కందం శాఖాభిస్తన్వతేతనుమ్
సుషమ్నానాడిని చుట్టుకొని కందాదులైన నాడులు బ్రహ్మరంధ్రమును కలుపుచు తమ శాఖలతో శరీరమును పెంపొందించును.