సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.14
131 ఇతిపూర్వాదిపత్రస్థే ఫలాన్యాత్మనిషోడశ లలనాఖ్యంఘంటికాయాం చక్రంద్వాదశపత్రకమ్
జిహ్వమూలమున ( నాలిక చివరి భాగమున ) లలన అను పేరుగల 12 దళముల చక్రమున్నది.
132
మదోమానస్తతః స్నేహః శోకః ఖేదశ్చలుబ్దతా అరతిస్సంభ్రమశ్చోర్మిః శ్రధ్ధాతోషోపరోధితా
మదము, మానము , స్నేహము , శోకము , ఖేదము , లోభము , ఆర్తి , ఆశ్చర్యము , ఓరిమి , శ్రధ్ధ , సంతోషము , దయ ఈ 12 గుణములు , భావములు షోడశదళమందు ఉచ్చరింపబడును.
133
ఫలానిలలనాచక్రేస్యుః పూర్వాదిదలేష్వతి భ్రూమధ్యేత్రిదలం చక్రమాజ్ఞాసంజ్ఞంఫలానితు
భ్రూమధ్యమున ( కనుబొమల నడుమ ) ఆజాఞాచక్రమను పేరు కల 3 దళముల చక్రము కలదు. ఈ మూడు దళములకు సత్వరజస్తమోగుణములు ఫలములగును.
134
ఆవిర్భావాః సత్త్వరజస్తమసాంక్రమతోమతాః తతోప్యస్తిమనశ్చక్రం షడ్దలంతత్ఫలానితు
తరువాత 6 దళములు కలిగిన మనశ్చక్రమున్నది. సత్వ రజ స్తమో గుణముల వెంట క్రమానుగతమగును.
135
స్వప్నోరసోపభోగశ్చఘ్రాణం రూపోలంభనమ్ స్పర్శనంశబ్దబోధశ్చ పూర్వాదిషుదవేష్వపి
మనశ్చక్రమునకు స్వప్నము ( కల ) , రసోపభోగము ( రుచులు తెలిసికొనుట ) , గంధజ్ఞానము ( వాసనలను తెలిసికొనుట ) దర్శనము ( చూపు ) , స్పర్శ జ్ఞానము , శబ్దబోధ ( వినికిడి శక్తి ) ఈ దళమునకు ఫలములు.
136
తతోఅపిషోడశదలం సోమచక్రమితీరితమ్ దవేషుషోడశ స్వస్యకలాః షోడశసంస్థితాః
దాని పైన 16 దళములు కల సోమచక్రమున్నది. 16 దళములందు 16 కళలను కలిగియుండును ( ప్రయోగము - షోడళకళాప్రపూర్ణుడు ) .
137
కృపాక్షమార్జవంధైర్యం వైరాగ్యంధృతిసమ్మదౌ హాస్యం రోమాంచనిచయోధ్యానాశ్రుస్థిరతాతతః
138
గాంభీర్యముద్యమోఛ్ఛత్వం ఔదార్యేకాగ్రతేక్రమాత్ ఫలానుద్యంతి జీవస్యపూర్వాదిదలగామినః
కృప , క్షమ , ఋజుత్వము , ధైర్యము , విరక్తి , ధారణ , హర్షము , హాస్యము , రోమాంచము , ధ్యానాశ్రువు , స్థిరత, గంభీరత , ఉద్యమము , నిర్మలత్వము , ఔదార్యము , ఏకాగ్రత ఇవి ఆ 16 కళలు.
139
చక్రంసహస్రపత్రంతు బ్రహ్మరంధ్రే సుధాధరమ్ తత్సుధారసధారాభి రభివర్ధయతే తనుమ్
కపాలమున బ్రహ్మరంధ్రము కలదు. అచట అమృతము కలిగిన సహస్ర దళ్ కమలము కలదు. ఆ చక్రము అమృతధారలచే దేహమును పెంపొందించును.
140
అనాహతతవేపూర్వేష్టమే చైకాదశే తథా ద్వాదశేచస్థితోజీవో గతాదేస్సిధ్దిమృఛ్చతి
అనాహత చక్రము మెదటి , 8 దవ , 11 వ , 12 వ దళములలో వున్న జీవుడు గీత నృత్య వాద్య సిద్ధిని పొందును.