సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2..13
91
వలయాని కపాలానిరుచకాస్తరుణానిచ నలకానీతితాన్యాహేః పంచధాఅస్థేనిసూరయః
తదజ్ఞులు ( తెలిసినవారు ) ఈ ఎముకలపోగులను 5 విధములను చెప్పుదురు. అవి వలయములు , కపాలము , రుచకములు, తరుణములు , నలకములు.
92
త్రీణ్యేవాస్థిశతాన్యత్ర ధన్వంతరిభాషత ద్వేశతేతత్వస్థిసంధీనాం స్యాతామత్రదళోత్తరే
ధన్వంతరి ( వైద్యుడు ) చెప్పిన ప్రకారము శరీరమున అస్థులు ( ఎముకలు ) 300 మాత్రమే. అందు అస్థిసంధుల సంఖ్య 110(joints).
93
కోరకాః ప్రతరాస్తున్నాః సేవన్యః స్యురులూఖలాః సాముద్రామండలాః శంఖావర్తావాయసతుండకాః
అస్థిసంధులు ( joints ) 8 విధములు. కోరకములు, ప్రతరములు, తున్నములు, సేవకులు, ఉలూఖలములు, సాముద్రములు, మండలములు, శంఖావర్తములు , వాయసతుండకములు.
94
ఇత్యష్టధానముద్దిష్టా మునీంద్రైరష్టసంధయః పేశీస్నాయుసిరాసంధి సహస్రద్వితీయామతమ్
మునీంద్రులచే ఇవి 8 విధములుగా చెప్పబడినవి. ధమనులు, సిరలు వంటి రక్తనాళములు , కండరములు కలిసి రెండు వేలుగా చెప్పబడినవి.
95
నవస్నాయు శతానిస్యుశ్చతుర్ధాస్నాయవోమతాః ప్రతానవత్యః సుషేరాః కండరాః పృధులాస్తధా
అందు నరములు 900. మళ్లీ ఆ నరాలు 4 విధాలుగా విభజింపబడినాయి. స్నాయువులు, ప్రతానవతులు, సుషిరములు , కండరములు.
96
బంధనైర్బహుభిర్బధ్ధా భూరిభారక్షమాభవేత్ నౌరంభసి యథాస్నాయు శతభిధ్ధాతనుస్తథా
తాళ్లతోకట్టబడిన నావ నీళ్లలో మునిగి బరువు మోయడానికి సమర్థమవుతుంది. అలాగే స్నాయువులు లేదా నరాలతో చుట్టబడిన శరీరంకూడా బరువును మోయడానికి సిద్ధమవుతుంది.
97
పంచపేశీశతాన్యాహుః శరీరస్థానిసూరయః అధికావింశతిః స్త్రీణాంతత్రస్యుః స్తనయోర్దశ
శరీరము మొత్తమున 100 నరములు నిండియుండును. స్త్రీలయందు ఇంకా 25 ఎక్కువగా వుంటాయి.
98
యౌవనేతాః ప్రవర్థంతే దశయోనౌతుత్రచ ద్వే అంతః ప్రసృతేబాహ్యేద్వేతిస్రోగర్భమార్గణః
స్త్రీలలో ఎక్కువగా వుండే పది నరాలు స్తనాలలోనూ , పది యోనిమార్గంలోనూ యవ్వనంలో ఏర్పడతాయి. మిగిలినవి రెండు లోపలి భాగములకు రెండు బయటి భాగములకు , మూడు గర్భాశయమునకు బలాన్ని కలిగిస్తాయి.
99
శంఖనాభ్యాకృతిర్యో నిస్త్రావర్తాఅత్రతృతీయకే ఆవర్తేగర్భాశయాఅస్తి పిత్తపక్వాశయాంతరే
మూడు సుళ్లు కలిగిన యోని శంఖనాభి ఆకారంలో వుంటుంది. ఈ యోని మూడవ వలయంలో పిత్తాశయము ( గాల్ బ్లాడర్) , జీర్ణాశయము మధ్యలో గర్భాశయము వుంటుంది.
100
రోహితాభిధమత్స్యస్య సదృశీతత్రపేశికా శుక్లార్తవ ప్రవేశిన్యస్తిస్రః ప్రఛ్చాదికామతా
గర్భాశయము మధ్యలో గర్భశయ్య కలదు. ఆగర్భాశయము మధ్య చేప వలె తేలుచుండును. శుక్లము , శోణితము ప్రవేశించు ద్వారములుగా మూడు పేశికలుండును.