Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.8

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పిండోత్పత్తి ప్రకరణము

[మార్చు]

71వ శ్లోకం నుండి 80 వరకు

71
శ్మశ్రుకేశనఖం దంతానస్థాద్యన్యఛ్ఛకర్కశమ్
వాతాదిధాతుప్రకృతిర్వ్యోమాది ప్రకృతిస్తథా

భూమి నుండి ముక్కు ద్వారా వాసన , స్థిరత్వము , ధీరత్వము , గౌరవము , మీసము , గడ్డము , జుట్టు , పళ్లు ( దంతాలు )
గోళ్లు మిగిలిన కఠిన పదార్థములను గ్రహించును.

72
సప్తథాసాత్త్వికోయశ్చ బ్రహ్మేంద్రయమవిగ్రహః
వరుణాశ్చాదకౌబేరఆర్షోగంధర్వవిగ్రహః

సాత్త్విక స్వభావము కలిగిన దేహము ఏడు రకములు. బ్రహ్మ, ఇంద్ర , యమ,వరుణ , కుబేర , ఆరుషి, గంధర్వులు.

73
రాజసఃషడ్విధోయశ్చపైశాచోరాక్షసస్తథా
అసురశ్శాకునఃసర్పః ప్రేత దేహస్తధాపరః

రాజస దేహము ఆరు రకములు. పైశాచము , రాక్షసము , ఆసురము , శాకునము , సార్పము , ప్రేతము

74
తామసస్త్రివిదోయశ్చ పశుమత్స్యాంఘ్రిపాకృతిః
తేషాంలక్ష్మాణినబ్రూమో గ్రంధవిస్తరకాతరాః

తామసదేహము పశు మత్స్య , వృక్షాకృతిలోనుండును. గ్రంథ విస్తర భీతిచే మిగిలిన లక్షణములు చెప్పబడలేదు.

75
పిండస్యాహుః షడంగాని లిరిక్స్ పాదౌకరౌతధా
మధ్యంచేత్యధవక్ష్యంతే ప్రత్యంగాన్యఖిలాన్యపి

పిండమునకు శిరస్సు , పాదములు , కరములు , మధ్యము అని ఆరంగములు మొదట చెప్పబడును.
అనంతరము సకలములైన అంగములు చెప్పబడును.

76
త్వచస్సప్తకలా స్సప్తస్నాయుశ్లేష్మజరాయుభిః
ఛన్నాః కోశాగ్నిభిః పక్వాస్తాధాతూనంతరాంతరా

పిండము సప్తత్వక్కులు , సప్తకలలు , సూక్ష్మసిరలు , శ్లేష్మము మావి చేకప్పబడి కోశాగ్నిచే పచింపబడియుండును.

77
ధాతువులే సీమలుగా గలిగి ధాతువులను భుజించుచు మాంసము , రక్తము , సిరలు , ధమనులు ఏర్పరచుకొని
పిండము పెరుగును.

78
స్నాయుస్రోతాం సిరోహంతి పంపే పంకే పంకజకందవత్
అసుజ్ఞ్మేదఃశ్లేష్మశకృత్పిత్తశుక్లధరాః పరాః

పంకము ( బురదలో ) తామర దుంప మొలచినట్లు ఆ మాంసమున సిరలు ధమనులు , స్నాయుస్రోతస్సులు ,
ఇతరములైన త్త్వక్కలలు , రక్తము , మేదము , శ్లేష్మము , పిత్తము , శుక్లము ఏర్పడును.

79
త్వగసృజ్మంసమేదోఅస్థిమజ్జ శుక్లానిధాతవః
సప్తస్యున్తత్రచోక్తాత్వగ్రక్తం జాఠరవహ్నినా

శరీరమందలి ధాతువులు 7. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు (మెదడు), మజ్జ లేదా మూలుగ, అస్థి (ఎముక), శుక్లము.

80
పక్వాద్భవేదన్నరసాదేవం రక్తాదిభిః పరే
స్వ స్వ శోకాగ్నినాపక్క్వై ర్జన్యంతేధాతవక్రమాత్

జఠరాగ్ని వలన పక్వమైన అన్నరసము నుండి రక్తము పుట్టును. అట్లే తమతమ శోకాగ్నుల నుండి ఇతరధాతువులు
క్రమముగా పుట్టును.

_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజీ