సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.3
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
పదార్థసంగ్రహ ప్రకరణము
[మార్చు]37వ శ్లోకం నుండి 50 వరకు
37
అధరాగవివేకాఖ్యేఅధ్యాయేవక్ష్యామహేక్రమాత్గ్రామరాగాంశ్చోపరాగాన్రాగానీ భాషావిభాషికాః
తతోఅభ్యంతర భాషాశ్చరాగాంగాణ్యఖిలాన్యపి భాషాంగాణ్యప్యుపాంగానిక్రియాంగాణిచతత్త్వతః
రెండవదైన రాగవివేకాధ్యాయమున వరుసగా గ్రామరాగములు,ఉపరాగములు,భాషలు,విభాషికలు,అంతర్ భాషలు,రాగాంగఉపాంగభాషాంగ,క్రియాంగ రాగముల లక్షణములు ,ప్రయోగములు చెప్పబడును.
39-42
తతఃప్రకీర్ణకాధ్యాయేతృతీయేకథయిష్యతివాగ్గేయకారోగాంధర్వఃస్వరాదిర్గాయనస్తధా
గాయనీగుణదోషాశ్చతయోశ్బ్దభిదాస్తధాగుణదోషాశ్చశబ్దస్యశారీరంతద్గుణాస్తధా
తద్దోషాగమకఃస్థాయాఆలప్తిర్బృందలక్షణమ్తతఃప్రబంధాధ్యాయేతుథాదోగానిజాతయః
ప్రబంధానాంద్విదాసూఢశ్శుధ్ధఛాయాలగస్తథాఆవిక్రమప్రబంధాశ్చసూఢస్థాఆలిసంశ్రయాః
మూడవదైన ప్రకీర్ణకాధ్యాయములో వాగ్గేయకారుడు,గాంధర్వము,గాయకుడు, గాయని శబ్దభేదములు,శబ్దగుణదోషములు,శారీరము,తద్గుణములు,దోషములు, గమకము,స్థాయి,ఆలాపన,బృందలక్షణము చెప్పబడును.
నాలుగవదైన ప్రబంధాధ్యాయములో ధాతువులు,స్వరములు,వాటి అంగములు,మేదిని మొదలగు జాతులు శుధ్ధసూఢము, ఛాయాలగసూఢమువిక్రమ ప్రబంధములు, ఆలిసంశ్రయములు చెప్పబడును.
43
విప్రకీర్ణాస్తతశ్చాయాలగసూఢసమాశ్రితాఃగీతస్థాగుణదోషాశ్చవక్ష్యంతేశార్జఞసూరిణా
విప్రకీర్ణములు,ఛాయాలగ సూఢ సమాశ్రితములు, గీతస్థములైన గుణదోషములు,శార్జ్ఞదేవునిచే చెప్పబడును.
44-50
తాలాధ్యాయేపంచమేతుమార్గతాలాఃకలాస్తధాపాతామార్గాశ్చచత్వారస్తధామార్గకలాష్టకమ్
గురులఘ్వాదిమానంచైకకలత్వాదయోభిదాఃపాదభాగస్తథామాత్రాస్తాలేపాతకలావిధిః
అంగులీయాంచనియమోభేదాయుగ్మాదయస్తధా పరివర్తోలయస్తేషాంయతయోగీతకానిచ
ఛందకాదీనిగీతానితాలాంగానిచయస్తథాగీతాంగానిచవక్ష్యంతేదేశీతాలాశ్చతత్త్వతః
నిశ్శంకశార్జ్ఞదేవేనతాలానాంప్రత్యయోస్తధాషష్ఠేనానావిధంవాద్యంఅధ్యాయేకథయిష్యతి
సప్తమేనర్తనంనానారసభావభావాఃక్రమేణచ
అయిదవదైన తాలాధ్యాయంలో మార్గతాళములు,కళలు, నిశ్శబ్ద సశబ్ద క్రియలు, పాతములు, నాలుగు మార్గములు,
ఎనిమిది మార్గకళలు, గురువు లఘువు భేదములు, పాదభాగములు, మాత్రలు, అంగుళీనియమము, లయలు, వర్తికాలము, యతులు, ప్రాసలు, గీతఛ్ఛందస్సు, తాలాంగములు, గీతాంగములు, దేశితాళములు,చెప్పబడును.
ఆరవ అధ్యాయమున నానావిధములైన వాద్యముల గూర్చి చెప్పబడును.
ఏడవ అధ్యాయమున నర్తనము, నానా విధములైన రసభావములు చెప్పబడును.
ఇది శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరమనే పుస్తకంలోని మొదటి అధ్యాయము. ఈ అధ్యాయము పేరు స్వరగతాధ్యాయము.
ఇందులో కవి దైవస్తుతితో మొదలుపెట్టి తన వంశమును గురించి,తల్లిదండ్రుల గూర్చి, తన రాజాస్థానమును,తన పాండిత్యమును చెప్పి తన కావ్యము, లక్ష్యము, గ్రంధమునకై ఉపయుక్తమైన పూర్వ రచనలు,తన రచనావిధానము, వివరణాపధ్థతి వీటిని గురించి వివరించాడు. పదార్థ సంగ్రహ ప్రకరణమని దీని పేరు.
ఈ 50 శ్లోకాలతో స్వరగతాధ్యాయములోని మొదటి ప్రకరణమైన పదార్థసంగ్రహ ప్రకరణము పూర్తయింది.
| ముందు పేజీ | తరువాత: పిండోత్పత్తి ప్రకరణము |
|---|