Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.1

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పదార్థసంగ్రహ ప్రకరణము

[మార్చు]

2వ శ్లోకం నుండి 10 వరకు

మొదటి శ్లోకం ప్రారంభ శ్లోకం

 2
అస్తి స్వస్తిగృహంవంశః శ్రీమత్కాశ్మీరసంభవః
ఋష్యేర్వృషగణాజ్ఞాతఃకీర్తిక్ష్మాళితదిజ్ముఖః

శ్రీమంతమయిన కాశ్మీర దేశమున వృషుడనే మహర్షి వలన పుట్టిన ఒక వంశము కలదు.

3
యజ్వభిర్ధర్మధీధుర్కైర్వేదసాగరపారగైః
యోద్విజేంద్రైరలంచక్రేబ్రహ్మభిర్భూగతైరివ

ఆ వంశము వేదము నేర్చినవారు,ధర్మపరులు,యజ్ఞములు చేయువారు అయిన బ్రాహ్మణులచే నిండినది.

4
తత్రాభూద్భాస్కర ప్రఖ్యా భాస్కరస్తేజసాంనిధిః
అలంకర్తుందక్షిణాశాంయశ్చక్రే దక్షిణాయనమ్.

ఆ వంశమందు తేజోరాశివలె భాస్కర నామధేయుడు పుట్టెను.అతడు దక్షిణమునకు ప్రయాణించెను.(South india)

5
తస్యాభూత్తనయః ప్రభూతవినయః శ్రీ సోఢలః ప్రౌఢధీః
యేనశ్రీకరణప్రవృధ్ధవిభవంభూవల్లభమ్ భిల్లమమ్
ఆరాధ్యాఖిల లోకశోకశమనీ కీర్తిస్సమాసాదితా
జైత్రే జైత్రపదంన్యధాయి మహతీ శ్రీ సింఘణే శ్రీరపి

ఆ భాస్కరుని తనయుడు శ్రీ సోఢలుడు. అతడు మొదట భిల్లముని కొలువులోనూ,తదుపరి శ్రీ సింఘణభూపతి కొలువులోనూ ఉన్నాడు.

6
ఏకఃక్ష్మావలయేక్షితీశ్వరమిలన్మౌళీంద్ర నీలావలి
ప్రోదంచద్ద్యుతి చిత్రితాంఘినికరశ్రేణిర్నృపాలాగ్రణీ
శ్రీమత్సింఘణదేవఏవవిజయీయస్యప్రతాపానలో
విశ్వవ్యాప్యపిదందహీతిహృదయాన్యేవద్విషాముధ్ధురః

ఈ భూమండలమంతటికీ సింఘణదేవుడు చక్రవర్తి. సామంతుల కిరీటములందున్న రత్నములకాంతి ఆ చక్రవర్తి పాదముల చెంత రంగులీనుచున్నది. ఆయన ప్రతాపాగ్ని విశ్వమంతా వ్యాపించి శతృవుల గుండెలను మండించును.

7
తంప్రసాద్యసుధీధుర్యోగుణితంగుణరాగిణం
గుణగ్రామేణయోవిప్రానుపకారైరతీతృపతీ

ఆ సింఘణ ప్రభువు గుణలాలసుడు. శ్రీ సోఢలుడు అతనిని తన గుణగణాలతో మెప్పించాడు.

8
దదౌనకింనకింజజ్ఞౌనదదౌకాంచనపదమ్
కంధర్మంవిదధౌనైషనబభౌకైర్గుణైరయమ్

అతడు దానకర్ణుడు.యాజ్ఞికుడు.ధనవంతుడు మరియు సుగుణవంతుడు.( అతని చేతులు దానముల చేత,యజ్ఞ సమిధలతోను నిండగా,అతడు గుణ సింహాసనమును,మరియు కాంచన సింహాసనమును అధిష్టించెను.

9
తస్మాద్ధుగ్ధాంబుదేజాతఃశార్జ్ఞదేవఃసుధాకరః
ఉపర్యుపరిసర్వాన్యఃసదౌదార్యస్ఫురత్కరః

పాలకడలి నుండి జాబిలి పుట్టినట్లుగా ఆ వంశమున శార్జ్ఞదేవుడు పుట్టెను.వంశవర్ధనుడయ్యెను.

10
కృతగురుపదసేవఃప్రీణితాశేషదేవఃకలితసకలశాస్త్రఃపూజితాశేషపాత్రః
జగతివితతకీర్తిర్మన్మధాదారమూర్తిఃప్రచురతరవివేకఃశార్జ్ఞదేవోఅమేయకః

శార్జ్ఞదేవుడు దైవభక్తి ,గురుభక్తి కలవాడు.సకలశాస్త్రపారంగతునిగా కీర్తి గడించినవాడు. మన్మధాకారుడు. వివేకవంతుడు.

_________________________________________________________________________________________________________________

ముందు పేజీ తరువాత పేజి