సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ
స్వరూపం
ప్రారంభ శ్లోకం | 1.పదార్థసంగ్రహ... | 2.పిండోత్పత్తి... | 3.నాద స్థాన ... | 4.సాధారణ... | 5.గ్రామ... |6.వర్ణాలంకార... |7.జాతి... |8.గీతము |
---|
శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరము: సంస్కృత శ్లోకాల వివరణ
[మార్చు]శార్జ్ఞదేవుడు 14 వ శతాబ్దానికి చెందిన కవి సంగీతజ్ఞుడు. పండితుడు. ఈయన సారంగదేవుడని కూడా పిలువబడ్డాడు.
ఆయన తన కాలపు సంగీత రచనలన్నిటినీ మధించి అమృతతుల్యమైన సంగీత శాస్త్రపు లక్షణాలను ప్రామాణికంగా తన "సంగీత రత్నాకరము" అను గ్రంథములో శాస్త్రబద్ధంగా వివరించాడు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ గ్రంథం ప్రామాణికత తగ్గలేదు. కాని భాష సంస్కృతం కావడం వలన అనువదించిన భాష కూడా శిష్టగ్రాంధికం కావడం వలన ఈ శ్లోకాలకు సరళమైన వివరణ అవసరమయింది.
- సంగీత రత్నాకరము సంస్కృత గ్రంధకర్త: శార్జ్ఞదేవుడు.
- తెలుగు అనువాదం: గంధం శ్రీరామమూర్తిగారు
గ్రంధకర్త విషయాన్ని 8 ప్రకరణాలుగా విభజించారు.[1]
- పదార్థ సంగ్రహ ప్రకరణము: విషయాన్ని లేదా మూలాన్ని ఎక్కడనుంచి గ్రహించారో చెప్పారు.
- పిండోత్పత్తి ప్రకరణము: మానవ శరీరంలో పిండం పుట్టుక నుంచి జ్ఞానేంద్రియాల్లో శబ్దము చెవి పుట్టుక వానికి అనుసంధాన నాడులు, శరీరంలోని 6 గ్రంధులు ఏ గ్రంధి వద్ద ఏ స్వరం పుడుతుందో వివరణ యోగశాస్త్రానుసారంగా వివరించారు.
- నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము: సంగీత పారిభాషిక పదాలు వాటి వివరణ చేయబడింది.
- సాధారణ ప్రకరణము భాష , ఉచ్చారణ పద్ధతులు
- గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము: స్వరరచన , రాగవిభజన చెప్పబడింది.
- వర్ణాలంకార ప్రకరణము
- జాతి ప్రకరణము
- గీతము
విషయ సూచిక
[మార్చు]- పదార్థసంగ్రహ ప్రకరణము (3 పేజీలు)
- పిండోత్పత్తి ప్రకరణము (17 పేజీలు)
- నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము (9 పేజీలు)
- సాధారణ ప్రకరణము (1 పేజీ )
- గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము
- వర్ణాలంకార ప్రకరణము
- జాతి ప్రకరణము
- గీతము
మూలాలు
[మార్చు]- ↑ పసల సూర్యచంద్రరావు. ముందుమాట. సంగీత రత్నాకరము, స్వరాగతాధ్యయము. అనువాదము: గంధం శ్రీరామమూర్తి. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ, 1966.