Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6

Wikibooks నుండి

శ్లోకం 1 నుంచి 10 వరకు స్వరగతాధ్యాయము - వర్ణాలంకారప్రకరణము 1

గానక్రియోచ్యతేవర్ణఃసచతుర్ధానిరూపణః

స్థాయ్యారోహ్యవరోహీచసంచారీత్యథలక్షణమ్

గానక్రయ ( ధాతువుని చెప్పబడే సంగీత స్వరరచన ) వర్ణమని చెప్పబడును. ఆ వర్ణము 4 విభాగములు చేయబడినది. మొదటిదైన స్థాయి లక్షణము చెప్పబడును.

2

స్థిత్వాస్థిత్వాప్రయోగఃస్యాదేకస్యైవస్వరస్యయః

స్థాయీవర్ణఃసవిజ్ఞేయఃపరావన్వర్థనామకౌ

ప్రయోగమున ఒక్కొక్క స్వరమును విడివిడిగా పాడినపుడు అది స్థాయి వర్ణమగును.

ఉదా : సా. రీ. గా. మా.

ఆరోహణము : స్వరములను క్రమముగా ఒకదానికొకటి పైస్థాయిలో స్వరములను పాడుట.

ఉదా: సా. రీ. గా. మా. పా. దా. నీ. సా.

అవరోహణము : ఆరోహించిన సప్త స్వరములను ఒకదానికొకటి కింది స్థాయిలో పాడుట.

ఉదా: సా. నీ. దా. పా. మా. గా. రీ. సా.

3

ఏతత్సంమిశ్రణాద్వర్ణః సంచారీపరికీర్తితః

విశిష్టంవర్ణసందర్భమలంకారంప్రచక్షతే

ఈ మూడిటి సమీకరణమే అనగా మూడు కలసిన ప్రయోగము సంచారి అని చెప్పబడును.

ఉదా : మొదటి సరళీస్వరము

సరిగమపదనిస

సనిదపమగరిస

4

తస్యభేదాస్తుబహవస్తత్రస్థాయిగతాన్ బ్రువే

యేషామాద్యంతయోరేకఃస్వరస్తేస్థాయివర్ణగాః

ఈ అలంకార భేదములు సప్తస్వరములకు కలవు. కాని ప్రయోగములో వున్నవి షడ్జములు మాత్రమే. అనగా కింది స్థాయి స తో ప్రారంభమై పైస్థాయి స తో అంతమయ్యేవి.ఏ అలంకారమునకు మొదట చివర ఒకే స్వరముండునో అవి స్థాయి వర్ణ అలంకారములు.

5

ప్రసన్నాదిఃప్రసన్నాంతఃప్రసన్నాద్యంతసంజ్ఞకః

తతఃప్రసన్నమధ్యఃస్యా్పంచమఃక్రమరేచితః

స్థాయి వర్ణమునందలి అలంకారములు 7 .

1 ప్రసన్నాది

2 ప్రసన్నాంతము

3 ప్రసన్నాద్యంతసంజ్ఞకము

4 ప్రసన్నమధ్యము

5 క్రమరేచితము

6 ప్రస్తారము

7 ప్రసాదము

6

ప్రస్తారోఅథప్రసాదఃస్యాత్సప్తైతేస్థాయినిస్థితాః

మంద్రఃప్రకరణేఅత్రస్యాన్మూర్ఛనాప్రథమఃస్వరః

మూర్ఛనా ప్రథమ స్వరము మంద్రముగా చెప్పబడినది.

మంద్ర స్థాయి నాభి స్థానము నుండి పుట్టునది. స ప స లలో మొదటి స . అది మంద్రముగానే ప్రారంభమవుతుంది. అంటే స ప స ల శ్రుతిని నాభి స్థానమునుంచే మొదలు పెట్టాలి.

7-8

నఏవద్వగుణస్తారఃపూర్వఃపూర్వోఅథవాభవేత్

మంద్రఃపరస్తతస్తారఃప్రసన్నోమృదురుచ్యతే

మంద్రస్తారస్తుదీప్తఃస్యాన్మంద్రోబిందుశిరాభవేత్

ఊర్ధ్వరేఖాశిరస్తారోలిపౌత్రిర్వచనాత్ల్పుతః

మూర్ఛనలో మంద్రస్థాయిలో మొదట పలికిన స స్వరమే రెట్టింపు ధ్వనితో చివర తారమని

చెప్పబడుచున్నది. పూర్వస్థానము మంద్రము. పరస్థానము తారము. మంద్రమునకే ప్రసన్నము,

మృదువు అను పేర్లు కలవు. తారమునకు దీప్తము అను పేరు కలదు. స్వరలిపి రాసేటప్పుడు

మంద్రమునకు గుర్తుగా స కు కింద చుక్క పెట్టబడుతుంది. తారమునకు గుర్తుగా స కు పైన

చుక్క పెడతారు. ప్లుతము 3 సార్లు పాడవలసినది.

9

మంద్రద్వయాత్పరేతారేప్రసన్నాదిరుదాహృతః

తద్వైలోమ్యేప్రసన్నాంతఃప్రసన్నద్వయమధ్యగే

మంద్రస్థాయి స ను పాడి తరువాత వెంటనే తారస్థాయి స ను పాడిన ప్రసన్నాది అలంకారము.

అనగా కింది స తరువాత ప పాడకుండా పై స పాడినప్పుడు.

స ప స , కాకుండా స స .

దానికి విలోమంగా మొదట తారస్థాయి స పాడి వెంటనే మంద్ర స్థాయి స పాడినపుడు ప్రసన్నాంతము.

స ప స కాకుండా స స .

10

దీప్తేప్రసన్నాద్యందస్స్యాత్తారయోర్మధ్యగేపునః

మంద్రేప్రసన్నమధ్యాఖ్యమలంకారంవిదోవిదుః

తారస్థాయి షడ్జము మొదట పాడి తరువాత రెండు మంద్రములు పాడిన తరువాత తిరిగి తారస్థాయి షడ్జము పాడిన అది ప్రసన్నమధ్యము.

స స స స .

మంద్రము పాడి పిదప 2 తారములు మధ్యలో పాడి తిరిగి మంద్రము పాడిన అది ప్రసన్నాద్యంత అలంకారము.

స స స స

                         తరువాతి పేజీ 6.1-1