Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.5

Wikibooks నుండి

షడ్జాదేః శుధ్ధ మధ్యాహ్నం భేదకంమపంచమంవినా

చతుః సర్వేక్రమద్వంద్వేఅష్టా చత్వారింశదీరితాః

మధ్యమ గ్రామమున 4 వ మూర్ఛనయగు శుధ్ధ మధ్యమ సాంతర గాంధారములు అభేదములు. పంచమము వినా 4 వస్వరమున 48 భేదములు పునరుక్తములగును.

51-54

తానాస్త్రిస్వరయోస్త్వేతే ద్వాదశద్విస్వరేద్వయమ్

ఏకఏకస్వరస్తే త్రిషష్టిరేత్తరమంద్రకైః

పునరుక్తామతాస్తానైర్న్యాదిమార్గీక్రమాః పునః

పంచస్వరాయేచత్వారస్తత్తానానాం చతుఃశతీ

ఆశీత్యభ్యధికాచాతుః స్వరీషణ్ణవతిర్భవేత్

ద్వాదశత్రిస్వరద్వంద్వేచత్వారోద్విస్వరద్వంద్వే

ఏకఏకస్వరస్తానస్తేషాం పంచశతీత్వియమ్

త్రినవత్యాయుతా తానైరఖిన్నారజనీగతైః

త్రిస్వరములు ( మూడు స్వరములు కలవి ) 2 క్రమములు. ఈ తానములు 12 భేదములు. అవి పునరుక్తములు repeatedly pronounced . ద్విస్వరము 1 భేదము కలిగినది అదియును పునరుక్తమగును. ఏక్ స్వరము అదియును పునరుక్తమగును. ఇట్లు శుధ్ధ మధ్య భేదములు 60 ఉత్తర మంద్ర సంబంధి కూటతానములచే పునరుక్తములైనవి.

మధ్యమ గ్రామమున నిషాదముతో మొదలయే 5 వ మూర్ఛన మార్గియందు 5 స్వరములు కలిగిన 4 క్రమములు కలవు. వాటి భేదములు 450 . 4 స్వరములు ఉన్న క్రమముల సంఖ్య

96. మూడు స్వరములు కల క్రమముల సంఖ్య 12 2 స్వరములు గల క్రమముల సంఖ్య 4 .

ఒక స్వరము కలిగినది ఒకటే. ఇలా రజనీ అనే పేరు గల తానములలో 593 కలవు. ఇవి కూడా పునరుక్తులే.

55

దైవతాదేస్తుపౌరవ్యాశ్చత్వారః షట్స్వరాః క్రమాత్

తత్తానానాంతుసాశీతిః శతాష్టావింశతిర్మతా

మధ్యమ గ్రామమున 6 వ మూర్ఛన దైవతముతో కలిసి 6 స్వరములును 4 భేదములగును.

ప్రతి క్రమమున 720 అగును. 4 క్రమములకు కలిసి 880 భేదములు పునరుక్తములు.

56

ఔడువానాంచతుర్ణాం ప్రాగుక్తాసంఖ్యాచతుః స్వరౌ

త్రిస్వరౌద్వస్వరావేకస్వరః ప్రాగుక్తసంఖ్యకాః

ఈ క్రమముల సంఖ్య ఇంతకు ముందు చెప్పబడినట్లుగానే ఔడవములు , చతుస్వరములు,

త్రిస్వరములు , ద్విస్వరములు , ఏక స్వరము.

57

పంచవింశతిసంయుక్తా చతుస్ర్త్రింశఛ్ఛతీత్వియమ్

తానానాం సదృశాకారాస్యాత్తానైరేత్తరాయతైః

ఇట్లు మధ్యమ గ్రామమున మొత్తము సంఖ్య 34420 . సదృశాకారములు ( ఒకే స్వరస్థానములు కలవి ) పునరుక్తములగును.

58-59

ఇత్యేకాశీతిసంయుక్తం సహస్రాణాం చతుష్టయమ్

తానానాంపునరుక్తానాం పూర్ణాపూర్ణైః సహక్రమైః

అపనీయేతచేదేషా కూటతానమితిర్భవేత్

లక్షత్రయం సప్తదశసహస్రాణి శతానిచ

ఇలా పునరుక్తములైన తానముల సంఖ్య మొత్తము పూర్ణా పూర్ణ క్రమము అనగా సంపూర్ణములు షాడవములు ఔడవములు కలిపి 4081. అగును. ఈ పునరుక్తములను కూడ కలుపుకొని కూటతానముల సంఖ్య 370927.