Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.4

Wikibooks నుండి

40

ఉక్తాః శుధ్ధాదిభేదేన నిగయుక్తాశ్చతుర్విధాః

తయోరేకైకహీనాస్తుద్వేధామూలక్రమామతాః

షడ్జ మధ్యమ గ్రామములు రెండు కలిసి 14 మూర్ఛనలు. అవి చివరి స్వరము వర్జముగా పాడినపుడు షాడవములు ( 6 స్వరములు కలవి ) అగును. అప్పడు నిషాద గాంధార యుక్తముగా ( ని గ ) శుధ్ధములు , కాకలీకలితములు , సాంతరములు , ఆ రెంటిని కూడినవి

అని 4 విధములగును. వానిలో ఒక్కొక్క స్వరము మాత్రమే పాడినపుడు ఆ క్రమములు 2 విధములగును. నిషాద హీనములైనవి ని లేనివి శుధ్ధములు , సాంతరములు. గాంధార హీనములు అనగా గ లేనివి శుధ్ధములు , కాకలీకలితములు.

41

షడ్జాద్యౌ మధ్యమాద్యౌచ చత్వారం స్యుర్విధాద్విధా

చతుర్థాఅన్యేదశేత్యష్టాచత్వారింశదమీ క్రమాః

షడ్జ గ్రామమున ఆద్యములైన ఔత్తరమంద్రము , శుధ్ధ మధ్యమము మధ్యమ గ్రామమున ఆద్యమైన సౌవీరక్రమము , మత్సరీకృత క్రమము కలిపి 4 ప్రత్యేకమగు 2 విధములగుచున్నవి.

42

సవింశతిః సప్తశతీప్రాగుక్తాగుణితాక్రమైః

చతుస్త్రింశతస్సహస్రాణి షష్ట్యాపంచశతానిచ

ఇతరములు 10 భేదములు . శుధ్ధములు , సాంతరములు , కాకలీకలితములు , తద్ద్వయోపేతములని 4 విధములైన భేదములతో కలిసి ఈ క్రమములు మొత్తము 48.

ప్రతి క్రమందలి మూర్ఛనలను కలుపుకొని మొత్తము 720 అగును. అవి 48 చేత గుణింపబడి

34520 అగును. క్రమములతో సహితముగా కూటతానులైన షాడవముల సంఖ్య ఇంత మాత్రమే.

43

ఇతిషాడవసంఖ్యాస్యాదథ పంచస్వరాన్ బ్రువే

గాద్యౌధాద్యౌనిషాద్యౌచ చతుర్భేదాః షడేడువాః

షాడవములైన తానములు పూర్తయిన తరువాత ఔడవములు . అనగా 5 స్వరములతో పాడునవి. షడ్జగ్రమమందు షడ్జము , మధ్యమ గ్రామమందు మధ్యమము నిత్యములగును.(common ).దైవతాద్యములు 2 నిషాదాద్యములు 2 అక్కడికి 5 స్వరములగును. అవి నిషాద గాంధారములతో కూడుట వలన 4 విధములగును.

44-47

అష్టావన్యేద్విధేత్యేవం చత్వారింశదిమేక్రమాః

సవింశతేశశతేతైశ్చగుణితేఅష్టౌశతానితు

చత్వారిచసహస్రాణి సంఖ్యాపంచస్వరేష్వితి

చతుఃస్వరేషున్యాద్యౌద్వౌ చతుర్థాద్వాదశపరే

క్రమాద్విధేతిద్వాత్రింశచ్చతుర్వింశతి తాడితా

శతానిసప్తాష్టషష్ట్యాస్యాచ్చతుః సర్వసంమితిః

త్రిస్వరేషుతుమాద్యేద్వావభేదౌ ద్వాదశాపరే

ద్విధాషడ్వింశతిరితిక్రమాస్తే షడ్భిరాహతా

మిగిలిన 8 మూర్ఛనలు కలిసి 2 విధములగును. ఈ విధముగా గుణించిన పిదప ఔడవముల సంఖ్య 40 అగును. ఆ 40 క్రమములు 120 చే గుణింపబడగా ఔడవములున్ని 4800 అగును.

చతుస్వరములయందు నిషాదాద్యములు 2 . అవి 4 భేదములతో వున్నవి. అన్యములైన 12 మళ్లీ 2 భేదములతో మొత్తము. క్రమములు 32 అగును. 32 ను 24 చేత గుణించిన చతుస్వరముల సంఖ్య. 756. త్రిస్వరములందును షడ్జ మధ్యమములు మారవు. ఇతరములైన 12 మాత్రము 2 భేదములు కలిగియుండును. కావున 26 అగును. అవి 6 చే గుణింపబడి 156 అగును.

48-49

షట్పంచాశచ్ఛతంచ స్యుర్ద్విస్వరేషుపునర్విధా

రిగధన్యాదయోఅష్టౌస్యుః శుధ్ధాస్తదితరేక్రమాః

ద్వావింశతిస్తేతు చతుశ్చత్వారింశద్ద్వితాడితా

ఏకస్వరాస్త్వభేదత్వాన్మౌలా ఏవచతుర్దశ

ద్విస్వరములందు రిషభముతో మొదలగు స్వరములు 2 భేదములు గాంధారముతో మొదలగు భేదములు 2 దైవతముతో మొదలగునవి 2 భేదములు , నిషాదముతో మొదలగునవి 2 భేదములు మొత్తము 8 . నిషాద గాంధారములతో కలియుట వలన 2 భేదములగును.

మిగిలిన శుధ్ధ క్రమములు 6 . రెండు భేదములతో గుణింపబడి 24 అగును. ఏక స్వరములకు

భేదములు లేవు కనుక అవి 14 గే.

50

షడ్జాదేః శుధ్ధ మధ్యాహ్నం భేదకంమపంచమంవినా

చతుః సర్వేక్రమద్వంద్వేఅష్టా చత్వారింశదీరితాః

మధ్యమ గ్రామమున 4 వ మూర్ఛనయగు శుధ్ధ మధ్యమ సాంతర గాంధారములు అభేదములు. పంచమము వినా 4 వస్వరమున 48 భేదములు పునరుక్తములగును.