సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
గ్రామమూర్ఛనాక్రమతాన ప్రకరణము
[మార్చు]1వ శ్లోకం నుంచి 10వరకు
1
గ్రామః స్వరసమూహః స్యాన్మూర్ఛనాఆదేసమాశ్రయః
తౌద్వౌధరాతలేతత్రస్యాత్షడ్జగ్రామ ఆదిమః
ఆరోహణము, అవరోహణము కలిసి మూర్ఛన అనబడును. మూర్ఛనలకు ఆశ్రయమైన స్వరసమూహము గ్రామమగును. ఆ గ్రామములు ప్రస్తుతము ప్రచారములో వున్నవి రెండు: షడ్జగ్రామము. మధ్యమగ్రామము.
2
ద్రితీయోమధ్యమగ్రామస్తయోర్లక్షణముచ్యతే
షడ్జగ్రామః పంచమేస్వచతుర్ధశ్రుతిసంస్థితే
షడ్జగ్రామము మొదటిది. మధ్యమ గ్రామము రెండవది. రెండింటి లక్షణములు చెప్పబడును. పంచమ స్వరము (ప) స్వచతుర్ధశ్రుతియందున్నప్పుడు (శుధ్ధమధ్యమము) షడ్జగ్రామమగును.
3
స్వోపాంత్యశ్రుతిసంస్థేఅస్మిన్ మధ్యమగ్రామఇష్యతే
యద్వాధస్త్రిశ్రుతిః షడ్జేమధ్యమేతు చతుఃశ్రుతిః
తన కడపటిదాని సమీపమున నుండు తృతీయ శ్రుతియందు పంచమ స్వరమున్నప్పుడు మధ్యమ గ్రామమగును. దైవతము (ద) త్రిశ్రుతిలోను (ద 3) మధ్యమము చతుశ్రుతి యందు (మ4) వున్నప్పుడు మధ్యమ గ్రామమగును.
4-5
రిమయోః శ్రుతిమేకైకాం గాంధారశ్చేత్సమాశ్రితః
పశ్రుతింధోనిషాదస్తుధ శ్రుతిని సశ్రుతింశ్రితః
గాంధారమాచష్ట తదాతం నారదోమునిః
ప్రవర్తతేస్వర్గలోకే గ్రామోసౌనమహీతలే
ఋషభము (రి) మధ్యమము (మ) ల శ్రుతిని గాంధారము (గ) ఆశ్రయించినపుడు , పంచమశ్రుతిని (ప) దైవతము (ద) ఆశ్రయించినపుడు , నిషాదము (ని) దైవతమును (ద)
ఆశ్రయించినపుడు దానిని గాంధార గ్రామమని నారదముని చెప్పెను. ఇది భూతలమున వర్తించదు. ప్రస్తుత కాలపు సంగీతమునందు ప్రచారములో లేదని అర్థము.
6
షడ్జః ప్రధానమాద్యత్వాదమాత్యాధిక్యస్తథా
గ్రామేస్యాదవిలోపిత్వాన్మధ్యమస్తు పురః సరః
షడ్జగ్రామము మొదటిది. సంవాది స్వరముల బాహుళ్యమును బట్టి షడ్జగ్రామము ప్రధానమైనది. లోపించునది కాకపోవుట వలన మధ్యమగ్రామము కూడ అగ్రగణ్యమైనది.
7
ఏతత్కులప్రసూతత్వాద్గంధారోఅగ్రణీర్దివి
క్రమాద్గ్రామత్రయే దేవాబ్రహ్మవిష్ణుమహేశ్వరాః
మొదట పుట్టుట మరియు ప్రాచుర్యము పొందుట వలన గాంధారగ్రామము అగ్రగణ్యమైనది. ఈ మూడు గ్రామములకు క్రమముగా బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు అధిదేవతలు.
8
హేమంతగ్రీష్మావర్షాసుగాతవ్యాస్తేయధాక్రమమ్
పూర్ణాహ్వకాలేమధ్యాహేఅభ్యుదయార్ధినిః
క్రమముగా ఈ రాగములు మూడు హేమంత గ్రీష్మ వర్షా కాలములలో పాడదగినవి. అభ్యాసము సాధన చేయువారిచే పూర్ణాహ్వ (పొద్దున) మధ్యందిన (మధ్యాహ్న) అపర్ణాహ్వ (సాయంత్రము) కాలములలో చేయదగినవి.
9
క్రమాత్స్వురాణాంసప్తానామారోహశ్చావరోహణమ్
మూర్ఛనేత్యుచ్యతేగ్రామద్వయేతాః సప్తసప్తచ
ఆరోహణ (సరిగమపదని) అవరోహణ (సనిదపమగరి) యందు క్రమముగా ఏడు స్వరములు వచ్చుట మూర్ఛన అని చెప్పబడును. రెండు గ్రామములలో (షడ్జగ్రామము, మధ్యమ గ్రామము) ఒక్కొక్క దానికి 7 మూర్ఛనలుండును.
10
షడ్జేతూత్తరమంద్రాదౌరజనీచోత్తరాయతా
శుధ్ధషడ్జామత్సరీకృదశ్వక్రాంతాఅభిరుద్గతా
షడ్జగ్రామములో మొదట ఉత్తరమంద్ర, రజని, ఉత్తరాయత, శుధ్ధషడ్జ, మత్సరీకృతీ, అశ్వక్రాంత, అభిరుద్గత అను పేర్లు గల మూర్ఛనలు కలవు.
_______________________________________________________________________________________________________________
| ముందు పేజీ | తరువాత పేజీ |
|---|