Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.8

Wikibooks నుండి

80-82

అగ్నిచిద్ ద్వాదశాహశ్చోపాంశుః సోమాభిదస్తకః అశ్వప్రతిగ్రహో బర్హిరథాభ్యుదయ సంజ్ఞకు ఋషభేణవిహీనానామితి నామానిమన్వతే సర్వస్వదక్షిణోదీక్షా సోమాఖ్యః సమిదాహ్వయః స్వాహాకారస్తనూనపాత్తతో గోదోహనోమతః ఇతిగాంధారహీనానాం క్రమాత్సంజ్ఞాః ప్రదక్షతే ఇతి మధ్యమగ్రామికైక వింశతిషాడవతానినామాని

అగ్నిచిత్తు, ద్వాదశాహము , ఉపాంశువు, సోమము , అశ్వప్రతిగ్రహము, బర్హి, అభ్యుదయము, అను 7 రిషభహీన తానముల పేర్లు. సర్వస్వదక్షిణము, దీక్ష, సోమము , సమిత్తు , స్వాహాకారము , తనూనపాత్తు , గోదోహనము అను 7 గాంధార హీన తానముల పేర్లు.

83 ఇడాపురుషమేధశ్చశ్యేనో వజ్రఇషుస్తతః అంగిరాః కంకఇత్యేతాః నపహీనాభిధాః క్రమాన్ని

ఇడ పురుషమేధము , శ్యేనము , వజ్రము , ఇషువు , అంగిరసు , కంకము అను 7 పంచమ హీనములైన తానముల పేర్లు.

84-86

జ్యోతిష్టోమస్తతోదర్శోనాంద్యాఖ్యః పౌర్ణమాసకః అశ్వప్రతిగ్రహోరాత్రిః సౌభరః సప్తమః స్మృతః ఏతానిషాదగాంధారహీనానామభిధాః క్రమాత్ సౌభాగ్యకృచ్చకారీరీశాంతికృత్పుష్టికృత్తథా వైనతేయోచ్చాటనేచవశీకరణ సంజ్ఞకః పంచమర్షభహీనానాం తానానామభిధాఇమాః

జ్యోతిష్టోమము ,దర్శము , నాంది , పౌర్ణమాసకము , అశ్వప్రతిగ్రహము , రాత్రి , సౌరభము అను 7 నిషాదగాంధార హీన తానముల పేర్లు. సౌభాగకృత్తు , కారీరి , శాంతికృత్తు , పుష్టీకృత్తు , వైనతేయము , ఉచ్చాటనము , వశీకరణము అను 7 తానములు పంచమ రిషభ హీనములు (ఔడవములు )

( స్వరములు 7 . అవి ఆరోహణమున అనగా ఒక దాని కంటె ఒకటి పైకి పాడునపుడు 7 , కిందికి పాడునపుడు 7 అగును . షాడవములు అనగా 6 స్వరములతో పాడుట . 7 స్వరముల వరుసలో ఒక్కొక్క స్ర స్థానమును విడిచి పాడినపుడు ప్రత్యేక తానములు లేదా రాగములు ఏర్పడును. )

87-88

ఇతిషాడ్జగ్రామికైక వింశత్యౌడువతాననామాని త్రైలోక్యమోహనోవీరః కందర్పబలశాతనః శంఖచూడోగజఛ్ఛాయో రౌద్రాఖ్యోవిష్ణుక్రమః తానానాం రిధహీనానాం నామాన్యేతాన్యనుక్రమాత్

త్రైలోక్యమోహనము , వీరము , కందర్పబలశాతనము , శంఖచూడము , గజఛ్ఛాయము , రౌద్రాఖ్యము , విష్ణుచక్రము అను 7 రిషభ దైవత హీనములైన తానముల పేర్లు.

89-90

భైరవః కామదాఖ్యశ్చావబృథోఅషకపాలకః స్విష్టకృఛ్చవషట్కారోమోక్షదః సప్తమోమతః సంజ్ఞానిషాదగాంధార హీనానామితిసంమతాః ఇతిమాధ్యమ గ్రామిక చతుర్ధ ఔడవతాననామాని యద్యజ్ఞనామాయస్తానస్తస్య తత్ఫలమిష్ట్యతే

భైరవము , కామదము , అవబృధము , అష్టకపాలకము , స్విష్టకృత్తు , వషట్కారము , మోక్షదము అను 7 నిషాద గాంధార హీన తానముల పేర్లు. ఇవి మధ్యమ గ్రామ తానములు.ఏ తానమునకు ఏ పేరు కలదో ఆ తానమునకు ఆ ఫలము కలుగును. 91 గాంధర్వేమూర్ఛనాస్తానాః శ్రేయసేశ్రుతిచోదితాః గానేస్థానస్యలాభేనతే కూటాశ్చోపయోగినః

గానము చేయునపుడు వినుటకు ఇంపైన స్వర స్థానములతో కూడిన మూర్ఛనలు లేదా ఆరోహణ అవరోహణలు కలిసిన తానములు శుభమును శ్రేయస్సును కలిగించును. స్వర స్థానములందలి మార్పునకు కూటతానములు ఉపయోగించును.