వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ప-ఫ
స్వరూపం
| పంకా, విసనకర్ర | fan |
| పంటి చిగుళ్లవాపు | inflammation of the gums |
| పంటిచిగురు | gum of jaw |
| పండ్లచిగుళ్ళనొప్పి | ulitis |
| పండ్లు;దంతములు | teeth |
| పంపిణీ, పంపకం | distribution |
| పక్కటెముక , పర్శుక | rib |
| పక్కతోవకుతప్పించు | shunt |
| పక్కలోమూత్రవిసర్జన | enuresis |
| పక్వ , ప్రౌడ | mature |
| పక్షవాతం | hemiplegia |
| పక్షవాతం | palsy |
| పక్షవాతరోగి , పక్షవాతసంబందమైన | paralytic |
| పక్షవాయువు , పక్షవాతము | paralysis |
| పగటి | diurnal |
| పగటికలలు కనడం | day dreaming |
| పగలటం | rupture |
| పగులు, విదారం | fissure |
| పగుళ్లు, బీట | crevice |
| పచ్చకామెర్లు, (పసుపు) | icterus |
| పచ్చసొన | egg yolk |
| పచ్చసొన | yolk |
| పటం | chart |
| పటుత్వం లేకుండా వేలాడేపాదం | foot drop |
| పట్టి , పాలాస్త్రీ | plaster |
| పట్టీ | band |
| పట్టు, గ్రహణశక్తి | grasp |
| పట్టువిడవని | persistent |
| పడక అమర్చటం | bed making |
| పడక ఒరిపిడిపుండు | bed sore |
| పడిశం | coryza |
| పత్తితోచేసిశుభ్రపరచడానికిఉపయోగించేది | swab |
| పత్రం , దుప్పటి | sheet |
| పథ్యవానములు, ఆహార విధులు | dietetics |
| పదార్ధం | matter |
| పదార్ధం , ద్రవ్యం , వస్తువు | substance |
| పద్దమ్మవారు , మశూచికము | small pox |
| పద్ధతి | method |
| పద్ధతి | technique |
| పద్ధతి , వ్యవస్థ , తంత్రం | system |
| పధకం , ప్రణాళిక | scheme |
| పధ్యం, ఆహార పదార్ధం | diet |
| పనస | ozaema |
| పనిచేసేపద్ధతి | mechanism |
| పనిపూర్తిచేయడానికిచేర్చిన | supplemental |
| పన్ను | tooth |
| పన్నునొప్పి | tooth ache |
| పయోరియా , పంటిచిగుళ్లనుంచిచీముకారటం | piorrhoea |
| పరపీడనకాముకత | sadism |
| పరలింగవేషధారణ | transvestism |
| పరశుకాపృష్ఠకశేరుక సంధి | joint costo vertebral |
| పరసామాన్యము | genus genaralissimum |
| పరస్పరం , విలోమం | reciprocal |
| పరస్పరకోర సంధి | joint schindylesis |
| పరస్పరమార్పు, ఇచ్చి పుచ్చుకొనటం | interchange |
| పరాన్నజీవి | parasite |
| పరాన్నజీవులైనక్రిమికాటకాలు | vermin |
| పరాన్నిజీవశాస్త్రం | parasitology |
| పరారుణ | infra red |
| పరికరం | appliance |
| పరికరం, పనిముట్టు | instrument |
| పరిక్ష్యం స్థితి సం. | circumstantial evidence |
| పరిచర్య , పరిధీయ | peripheral |
| పరిణత , పరిపక్వత , యుక్తవయస్సు | maturation |
| పరిణామవాదానుగుణ నిర్వచనము | genetic form of definition |
| పరిధి , చుట్టుకొలత | girth |
| పరిమాణం | measure |
| పరిమాణం | quantity |
| పరిమాణం, శక్తి | capacity |
| పరిమితి | limitation |
| పరిమితి చేయు | limiting |
| పరిమితి, హద్దు, సీమ | limit |
| పరిలింగము | pereblem |
| పరివర్తనావస్థ | transitional |
| పరివర్తి | variable |
| పరివర్తి జ్వరము; ఆవర్తక సన్నిపాత జ్వరము | fever relapsing |
| పరిష్కారం, విసర్జన | disposal |
| పరిసరస్పర్శము | value valvate |
| పరీక్ష | check up |
| పరీక్ష | examination |
| పరీక్ష | test |
| పరీక్ష , అన్వేషణ | investigation |
| పరీక్షకపదార్ధాలు | reagent |
| పరీక్షణ | survey |
| పరుపు | mattress |
| పరోక్ష | indirect |
| పర్పుర , చర్మంపైచిన్నగాయాలు | purpura |
| పర్యవేక్షకుడు | supervisor |
| పలచనిబిళ్ల | wafer |
| పలాదము | palladium |
| పలాయనం, తప్పించుకొనటం | escape |
| పలువరుస, దంతవిన్యాసం | dental formula |
| పళ్లుతోమేకుంచె | tooth brush |
| పళ్లుమొలవటం | teething |
| పళ్లుమొలవటం, దంతనిర్మాణము | dentition |
| పళ్లెం , బిళ్ల | plate |
| పశుసం. | bovine |
| పశ్చిమ , పర | posterior |
| పశ్చిమ కపాల చూడావలయ సంధి | joint occipito- atlantal |
| పశ్చిమ కపాల దంతచూడాసంధి | joint occipito-axial |
| పశ్చిమ కపాలదంత చూడాసంధి | joint phalangeal |
| పశ్చిమమహాఖాతము | fossa posterior |
| పసిపాప | baby |
| పసిరికలు(కామెరలు), కామిలారోగము, పాండురోగము | jaundiee |
| పాకశాస్త్రము | gastrology |
| పాతినశవాన్ని తిరిగి పైకితీయడం, శవోత్ఖేననం | exhumation |
| పాత్ర | receptacle |
| పాదం | foot |
| పాదంలోఒకఎముక | talus |
| పాదకూర్చాన్తరీయ సంధి | joint temporo mansibular |
| పాదతల సంధి | joint metatarsal |
| పాదముద్రలు | foot print |
| పాదాధారం | foot rest |
| పాదాలు | feet |
| పానీయం | beverage |
| పారగమ్యత , ప్రవేశంఇవ్వటం | permeability |
| పారవశ్యం | ecstasy |
| పార్కిన్సన్వ్యాధి | parkinsonism |
| పార్శ్వ | lateral |
| పార్శ్వకాభ్యంతరమజ్జాంతంతువు | nerve inter-costal |
| పాలకేంద్రం | dairy |
| పాలచక్కెర | galactose |
| పాలచక్కెర | lactose |
| పాలదంతాలు | milk teeth |
| పాలిపోవటం | pallor |
| పాలిప్ | polyp |
| పాలు | milk |
| పాలువిరిగిననీళ్లు | whey |
| పింగాణి వంటి పదార్థము, దంతిక, పంటిపై | enamel of teeth |
| పిండం | embryo |
| పిండ సంబంధమైన | foetal |
| పిండతిత్తి | embryo-sac |
| పిండము, భ్రూణము, గర్భములోని శిశువు | fetus |
| పిండికట్టు | slab plaster |
| పిచ్చి , వెర్రి , మతిభ్రమణం | lunacy |
| పిచ్చి, వెఱ్ఱి, ఉన్మాదము | insanity |
| పిచ్చివాండ్రవైద్యశాల | asylum lunatic |
| పిచ్చివాడు | lunatic |
| పిత్తం | bile |
| పిత్తజ్వరము; అమాశీయవికార జ్వరము | fever bilious |
| పిత్తలవణం | bile salt |
| పిత్తలవణం | salt |
| పిత్తవర్ణం | bile pigment |
| పిత్తాశయం, చేమకట్టు | gall bladder |
| పిత్తాశయంలో రాయి | gall stone |
| పిత్తాశ్మరి, పైత్యకృచ్ఛము , పిత్తాశయమునందు | calculus biliary |
| పినుజ(ఒకరకమైనపురుగు) | tick |
| పిరుదుకు చెందిన | gluteal |
| పిర్ర, పిరుదు | buttock |
| పిర్రలు | natas |
| పిల్లలనుకననిస్త్రీ | nullipara |
| పీకటం, తీయటం | extraction |
| పీఠభూమి | plateau |
| పీఠాంతరీయమజ్జాపక్ష్మము | nerve fibre inter-central |
| పీడకల | nightmare |
| పీడనం | pressure |
| పీడనంవృద్ధిచేయు | pressor |
| పీయూషగ్రంధి | pituatary gland |
| పుండు , వ్రణం | sore |
| పుక్కిలింత | gargle |
| పుటిక | follicle |
| పుటుక్కుమనటం | snap |
| పుట్ట కురుపు కలిగించునది | carcinogen |
| పుట్టకురుపు, కేన్సరు | cancer |
| పుట్టినమాసంలోపల | neonatal |
| పుట్టుకతో వచ్చిన | inborn |
| పుట్టుమచ్చ | mole |
| పుట్టుమచ్చ | naevus |
| పునఃపోషణ పద్ధతి | feed back mechanism |
| పునఃసంయోగం | reunion |
| పునరారోగ్యప్రాప్తి | recovery |
| పునరావాసం | rehabilitation |
| పునరుత్పత్తి | regeneration |
| పునర్నిర్మాణశస్త్రచికిత్స | reconstructive surgery |
| పునర్యవ్వనం | rejuvenation |
| పునశ్శోషణ | reabsorption |
| పునాది , ఆధారం | foundation |
| పుప్ఫుసకణధాతువు | tissue inter lobular |
| పురుగు | mite |
| పురుగులతో బాధపడు | infestation |
| పురుషత్వం | masculinity |
| పుర్రె , కపాలం | skull |
| పుర్రెపైభాగం , కపాలం | skull- cap |
| పులిపిరికాయ | papilloma |
| పులియబెట్టే చర్య | fermentation |
| పులిసేటట్లు చేసే వస్తువు | ferment |
| పులుపు | sour |
| పువ్వారులు , మత్స్యశ్వాసేంద్రియములు | gills |
| పుష్పసంపర్కము , పరాగసంపర్కము | pollination |
| పూత | smear |
| పూతిక | sepsis |
| పూయ ప్రమేహజన్య నేత్రదాహము | genorrhoeal opthalmia |
| పూయ ప్రమేహజన్య సంధివాతము | genorrhoeal rheumatism |
| పూయవ్రణము;పుండు;సపూయక్షతము;కురుపు;విద్రధి | ulcer |
| పూర్తిచేయు | complete |
| పూర్వగామి | precursor |
| పృష్టియమజ్జాతంతువు | nerve dorsal |
| పృష్ఠమజ్జారజ్జు, కశేరునాడి | cord , spinal |
| పెంకితనం | tantrum- temper |
| పెదవి | labium |
| పెద్ద మెదడు | cerebrum |
| పెద్దకపాలముగల | mega-cephalus |
| పెద్దచెంచా | table spoon |
| పెద్దతల | megacephaly |
| పెద్దప్రేగు , బృహదంత్రము | intestine large |
| పెనామాజ్వరము | fever panama |
| పెరుగు వంటి | curdy |
| పెళుసుదనం, భంగురత | fragility |
| పెళ్లికాని , ఏక , ఒంటరి | single |
| పెళ్ళ, పెచ్చు | flake |
| పేగు | bowel |
| పేగు | colon |
| పేగు , ఆంత్రం | intestine |
| పేగుశోధ , అంతర్శోధ | enteritis |
| పేను | louse |
| పేర్లజాబితా | panel |
| పేలుడు | explosion |
| పేలుపట్టటం | pediculosis |
| పైకిమాత్రం | lotion |
| పైకెత్తటం | elevation |
| పైతొక్క | stripe |
| పైత్యకారియైన | choleric |
| పైత్యవాహిక | gall-duet |
| పైదవడ | maxilla |
| పైరెప్పవాల్పు | ptosis |
| పొక్కు | pusstule |
| పొక్కునట్టిలి(మందులు) | caustics |
| పొగతాగటం | smoking |
| పొగమంచు | fog |
| పొగవేయటం | fumigation |
| పొట్ట | dimple |
| పొట్టకోసి బిడ్డను తీయు | cesarean |
| పొడవగుకాలివ్రేళ్ళుగల | macrodactly |
| పొడవు | length |
| పొడవు చేయటం | elongation |
| పొడిగానూరటం | trituration |
| పొదగటం | incubation |
| పొయ్యి , ఆవం | oven |
| పొర | lamina |
| పొర | layer |
| పొర | membrane |
| పొర , అంతస్థు | stratum |
| పొర , త్వచం | integument |
| పొరతో చుట్టబడిన | encapsulated |
| పొరలువున్న | laminated |
| పొసగమి , అసంగతి | incompatability |
| పోగు చేయటం | collecting |
| పోతనము | iron |
| పోయిచూచు , సందర్శించు | visit |
| పోషకగ్రంధి(మెదడులోనిది) | pituitory body |
| పోషకపదార్ధం | nutrient |
| పోషకలోపం | under feeding |
| పోషకాహారం | nutriment |
| పోషణ | nourishment |
| పోషణ , పోషణవిజ్ఞానం | nutrition |
| పోషణ , విజ్ఞాననిపుణుడు | nutritionist |
| పోషణ, ఆహార సంబంధి | alimentary |
| పోషణదోషం | dystrophy |
| పోషిణికాఖాతము | fossa pituitary |
| పౌడరు | talc |
| ప్రకటన , సూచన | notice |
| ప్రకృతిసిద్ధమైన , స్వాభావికమైన | natural |
| ప్రకోపం | paroxysm |
| ప్రకోపశక్తి | irritability |
| ప్రకోష్ఠాన్తరీయ సంధి | joint reciprocal reception (saddle joint) |
| ప్రక్కభుజము , పార్శ్వము | side |
| ప్రక్రియ , విధానం | procedure |
| ప్రక్రియీకరణ | processing |
| ప్రచ్ఛన్న | latent |
| ప్రచ్ఛన్నమైన | insidious |
| ప్రచ్ఛన్నమైన , అణగి ఉన్న | dormant |
| ప్రజననశక్తి , సంతానోత్పత్తి చేయగలగటం | fertility |
| ప్రజారోగ్యచట్టం | public health act |
| ప్రణాళిక | plan |
| ప్రణోత్పత్తి | ulceration |
| ప్రతరసంధి | joint athrodia |
| ప్రతికూల ప్రక్రియ | allergy |
| ప్రతిచర్య | reaction |
| ప్రతిచర్య , ప్రతికూలక్రియ | counter action |
| ప్రతిధ్వని , అనునాదం | resonance |
| ప్రతిబింబం, రూపం | image |
| ప్రతిరోహణ | transplantation |
| ప్రతిసారశక్తి, ప్రతిసారణశక్తి | forces of repulsion |
| ప్రతీకారచర్య | reflex action |
| ప్రత్యక్ష | direct |
| ప్రత్యామ్నాయంగ | vicarious |
| ప్రత్యామ్లం | antacid |
| ప్రత్యావహనం | regurgitation |
| ప్రత్యుత్పత్తి | reproduction |
| ప్రదర్శనం | demonstration |
| ప్రధమ చికిత్స | first aid |
| ప్రధమగర్భం , తొలిచూలు | primigravida |
| ప్రధాన | cardinal |
| ప్రపంచఆరోగ్యసంస్థ | W.H.O. |
| ప్రబలం | accentuation |
| ప్రబలమైన, ఆధిక్యమైన | dominant |
| ప్రబలీకరణం | fortification |
| ప్రభావం, పరిణామం | effect |
| ప్రభావసీమ , దేహాళి | threshold |
| ప్రభాసిని , చర్మము పైపొర , పైతోలు , బహిశ్చర్మము | epidermis |
| ప్రమాణం , ఒట్టు | oath |
| ప్రమాదం | accident |
| ప్రమాదం వలన రక్తస్రావం | accidental bleeding |
| ప్రమాదవశాత్తు | accidental |
| ప్రయోగశాల | laboratory |
| ప్రయోగాత్మకమైన | experimental |
| ప్రలాపక సన్నిపాత జ్వరము, ఆంత్ర సన్నిపాత జ్వరము | fever typhoid |
| ప్రవర్తన | behaviour |
| ప్రవర్తనపూర్వం | predisposing |
| ప్రవాహం | flow |
| ప్రవాహం | stream |
| ప్రవృత్తి , స్వభావం | instinct |
| ప్రవేశం | entry |
| ప్రవేశద్వారం , నిర్వాహక | portal |
| ప్రవేశపెట్టటం | insertion |
| ప్రశాంతకం | tranquiliser |
| ప్రసరణ | circulation |
| ప్రసరించటం విస్తరించటం, పొడిగించటం | extension |
| ప్రసవం | parturition |
| ప్రసవం , కాన్పు | labour |
| ప్రసవం, కాన్పు | delivery |
| ప్రసవ పూర్వ | ante partum |
| ప్రసవ పూర్వసంరక్షణ | antenatal care |
| ప్రసవకాల | perinatal |
| ప్రసవప్రేరణ | induction of labour |
| ప్రసవసంబంధమైన | obstetric |
| ప్రసవసూచకస్రావం | show |
| ప్రసవానంతర | post natal |
| ప్రసవానంతరసంరక్షణ | postnatal care |
| ప్రసవానంతరస్రావం | lochia |
| ప్రసవోత్తర రక్తస్రావము | haemorrhage , post partum |
| ప్రసారం, వ్యాప్తి | dissemination |
| ప్రసూతి , ప్రసవకాలం | puerperium |
| ప్రసూతి , మాతృత్వం | maternity |
| ప్రసూతి పూర్వ | antenatal |
| ప్రసూతికాశాస్త్రము;గర్భవిమోచనవిద్య;మంత్రసానివిద్య | midwifery |
| ప్రసూతిపూర్వం | prenatal |
| ప్రసూతివాతం , గుర్రపువాతం | eclampsia |
| ప్రసూతివైద్యం | midwifery |
| ప్రసూతివైద్యశాల | maternity hospital |
| ప్రసూతివైద్యుడు | obstetrician |
| ప్రాంతం | region |
| ప్రాణంతో పుట్టటం | live birth |
| ప్రాణవాయువు , ఆమ్లజని | oxygen |
| ప్రాణాధారావయములు | vital organs |
| ప్రాణివర్ణనము | zoography |
| ప్రాథమిక | primary |
| ప్రాధమికఆరోగ్యకేంద్రం | primary healthy centre |
| ప్రామాణీకరణం | standardization |
| ప్రేగులు, ప్రేవులు, అంత్రములు | intestines |
| ప్రేరక | motor |
| ప్రేరణ | induction |
| ప్రేరణాంశదాయకమజ్జాతంతుగోళకము | nerve cell distributing |
| ప్రేరేపణ , తాకుడు | impulse |
| ప్రొస్టేట్ , పౌరష | prostate |
| ప్లాస్మా | plasma |
| ప్లీహం | spleen |
| ప్లీహపెరుగుదల | spleenomegaly |
| ప్లీహోచ్చదన | spleenectomy |
| ప్లూరసీ , శ్వాసకోశవేష్టనశోఫ , దాహము | pleurisy |
| ప్లేగుటీకా | inoculation plague |
| ప్లేగువ్యాధి | plague |
| ఫలం | yield |
| ఫలచక్కెర | fructose |
| ఫిరంగిరోగము;కొరకుసవాయివ్యాధి;ఉపదంశరోగము | syphilis |
| ఫైబ్రాయిడ్ , గర్భాశయంలో పుట్టె ఒకరకం కంతి | fibroid |