వాడుకరి:Murthy1983
నూతన విద్యా విధానం - 2020 కూడా పాఠ్యాంశాల రూపకల్పనలో దృష్టిలో వుంచుకోవాలి. మన జ్ఞానం గణితం, భాషాశాస్త్రం, సాహిత్యం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం, యోగ, వాస్తు, వైద్యం, వ్యవసాయం, ఇంజనీరింగ్, క్రీడలకు మాత్రమే కాదు, పాలన, రాజకీయాలు, వనరుల సంరక్షణ లాంటి విస్తృత రంగాలకు కూడా విస్తరించాల్సింది.
గిరిజనుల వ్యవసాయ పద్ధతులు, వారి అటవీ సంరక్షణ, ప్రకృతిసేద్యం, వైద్యం తదితరాలపై ప్రత్యేక కోర్సులు ఉండాలి. పాఠశాల విద్య పొడవునా “భారతీయ జ్ఞానవ్యవస్థ”పై ఒక కోర్సు అందుబాటులో ఉండాలి. మన సంప్రదాయపు ఆటలు తదితరాలపై పోటీలు నిర్వహించాలి. భారతదేశపు ప్రాచీన, ఆధునిక విజయాలను వివిధ రంగాల్లో పిల్లలకు ప్రేరణ కలిగించేలా వీడియోల రూపంలో అందించాలి. సాంస్కృతిక ప్రాధాన్యత గల వివిధ రాష్ట్రాల ప్రాంతాలకు పర్యటనలు చేపట్టాలి.
4.28 “ఏది సరైందో దాన్ని చేయడం” పిల్లలకు నేర్పాలి. జీవితంలోని ప్రతి సందర్భంలో ఇది ఉపయోగపడాలి. జీవితంలో నైతిక విలువల ప్రాధాన్యతను మన విద్యార్థులు గుర్తించాలి. మన సంప్రదాయ విలువల్ని, రాజ్యాంగ విలువల్ని, మానవ విలువల్ని (సేవ, అహింస, స్వచ్ఛత, సత్యం, నిష్కామకర్మ, శాంతి, త్యాగం, సహనం, వైవిధ్యం, బహుళత్వం, సత్ప్రవర్తన, స్త్రీ-పురుష సమానత్వం, పెద్దల్ని గౌరవించడం, నేపథ్యాలతో సంబంధం లేకుండా ఎదుటివారి శక్తి సామర్థ్యాలను అంగీకరించడం, పర్యావరణ ప్రేమ, సహకారం, సానుభూతి, ఓపిక, మన్నింపు, ప్రేమ, దేశభక్తి, ప్రజాస్వామిక దృక్పథం, నిజాయితీ, బాధ్యత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం) పిల్లల్లో అభివృద్ధి చేయాలి.**
మన విద్యార్థులు పంచతంత్రం, హితోపదేశం, జాతక కథలు లాంటి భారతీయ సాంప్రదాయక కథల నుంచి ప్రేరణ పొందాలి. వాటిని చదివి అవి అంతర్జాతీయ సాహిత్యానికి ఎంత దోహదపడ్డాయో తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్య భాగాలను కూడా పిల్లలు చదవాలి.
ప్రాథమిక ఆరోగ్యం, వైద్యం, రోగ నిరోధకత్వం, పౌష్టికాహారం, పరిశుభ్రత, విపత్తు నిర్వహణ, ప్రాథమిక చికిత్సలాంటివి మన పాఠ్య ప్రణాళికల్లో చేర్చాలి. మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే నష్టాలను కూడా పిల్లలు తెలుసుకోవాలి