వంటపుస్తకం: గులాబ్ జామూన్
స్వరూపం
వర్గం :శాకాహారం
కావలసిన పదార్థాలు
[మార్చు]- గులాబ్ జామూన్ ప్యాకెట్:1
- పంచదార: అరకేజి
- యాలకుల పొడి: ఒక స్పూన్
- నూనె: తగినంత
తయారుచేసే విధానం
[మార్చు]ముందుగా గులాబ్ జామూన్ ప్యాకెట్ కట్ చేసి పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు లేదా పాలు పోసి కలపాలి.ఆ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. పక్కనే మరో స్టవ్ కూడా వెలిగించి వేరే గిన్నెలో పంచదార,కొద్దిగా నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి.ఆ పాకంలో యాలకుల పొడి కలుపుకోవాలి.తరువాత కలిపిన పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి అలా వేగిన ఉండల్ని తీసి పాకంలో వేయాలి. పది నిమిషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జామూన్లు తినడానికి రెడీగా ఉంటాయి.