రాగి జావ
స్వరూపం
రాగి జావ (Ragi Java)
[మార్చు]పరిచయం
[మార్చు]రాగి జావ ఒక ఆరోగ్యకరమైన, సాంప్రదాయ ఆహారం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది, ముఖ్యంగా ఉదయం త్రాగే పానీయంగా.ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది మరియు వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగిస్తుంది.
కావలసిన పదార్థాలు
[మార్చు]- రాగి పిండి – 2 టేబుల్ స్పూన్లు
- నీరు – 2 గ్లాసులు
- ఉప్పు – రుచికి తగినంత
- పాలు – అవసరమైతే
- వెల్లుల్లి (ఐచ్ఛికం)
- పెరుగు (ఐచ్ఛికం)
తయారీ విధానం
[మార్చు]- ఒక గ్లాసు నీటిలో రాగి పిండిని కలిపి పాకం లాగా చేయాలి.
- మిగిలిన నీటిని వేడి చేసి, దాంట్లో ఈ మిశ్రమాన్ని పోయాలి.
- మంచి మరిగిన తర్వాత ఉప్పు,పాలు కలపాలి.
- ఆవశ్యకతను బట్టి పెరుగు తో కలిపి కూడా త్రాగవచ్చు.
ప్రత్యేక సూచన
[మార్చు]ఈ రాగి జావను మామిడి కాయ పచ్చడి తో కలిసి కూడా తినవచ్చు.ఇది రుచి మరియు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.