Jump to content

రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/అ-ఆ

Wikibooks నుండి
అంకగణితము arithmetic
అంకిత విద్యుద్దర్శిని calibrated electroscope
అంగత్రాణ ఫలకము armour plate
అంగరాగాలు లేదా కాస్మెటిక్లు cosmetics
అంగారక్షార వాయువు, బొగ్గు పులుసు గాలి carbonic acid gas
అంతరపరివర్తన మూలకాలు inner transition elements
అంతరాళ తరంగము space wave
అంతరాళ రాసాయనిక శాస్త్రము stereo (spatial) chemistry
అంతరాళము space
అంధ యుగము dark age
అంబరు, సీమ గుగ్గిలము, తృణస్ఫటికము, కర్పూర పూస (పచ్చనిది) amber
అంశమాపనము titration
అకర్బన ద్రవ్యము inorganic matter
అకర్బన యౌగికము morganic compound
అకర్బన రాసాయనిక శాస్త్రము inorganic chemistry
అకర్బనామ్లము, ఖనిజామ్లము inorganic acid
అక్షికటకము eyepiece
అగిసె నూనె linseed oil
అగ్గిపుల్లల తయారీ match sticks preparations
అగ్ని fire
అగ్నిమాపక సాధనం, అగ్నినిర్వాపకము fire extinguisher
అఘ్రాణించుటకు ఘాటు వాసన గల లవణములు, అమ్మోనియా కర్భనితము smelling salts
అణు అయతనము molecular volume
అణు కిరణము molecular ray
అణు క్షేత్రము molecular field
అణు పునర్విన్యాసము molecular rearrangement
అణు భావము molecular concept
అణు భావము- నవీన భౌతికశాస్త్రము molecular concept - modern physics
అణు భ్రమణము molecular rotation
అణు రచన molecular structure
అణు వర్ణమాల molecular spectrum
అణు విస్తరణ molecular dispersion
అణు సంకేతం, అణు సాంకేతికము molecular formula
అణు సాంకేతికం-దాని ప్రాముఖ్యం molecular formula-significance
అణు సాదృశ్యం isomerism
అణుఅయస్కాంత వాదము molecular theory of magnetism
అణుక్వథనాంకోన్నతి molecular elevation of boiling point
అణుతల శక్తి molar surface energy
అణుభార నిర్ణయం-బాష్పసాంద్రత పద్ధతి determination of molecular weight-vapour density method
అణుభార నిర్ణయము determination of molecular weight
అణుభారం, అణుభారము molecular weight
అణుభావము - అణు భారభావము molecular concept - concept of molecular weight
అణువులు molecles
అణ్వస్త్రములు atomic missiles
అతాపకప్రక్రియ adiabatic process
అతి సంతృప్త ద్రావణం super saturated solution
అతివేగ చర్యలు fast reactions
అతిసూక్ష్మ దర్శని ultra microscope
అద్రావ్యత non-solubility
అధాతువు non-metal
అధిచూషణ adsorption
అధితాపక్రమ కార్బనీకరణము high temperature carbonisation
అధోముఖ స్థాన చలనం downward displacement
అనంత విలయన స్థితి infinite dilution
అనంతము infinity
అనరుద్ధ తరంగములు damped waves
అనార్ధ ఐస్ dry ice
అనిశ్చియతాసూత్రము priciple of uncertainty
అనునదన వాదము theory of resonance
అనున్యూత ధర్మములు(లక్షణము) colligative properties
అనుభావిక ఫార్ములా, ప్రాయోగికాణుసాంకేతికము empirical formula
అనుయోజనము coupling
అనుయోజ్యములు coupling agents
అనురాగము, స్నేహాకర్షణము, రాసాయనికాకర్షణము affinity
అనువర్తనాలు applications
అన్నభేది iron, sulphate
అన్వేషణ వాత ప్లవము, రేడియో సాండే radio sonde
అపురూప ధాతువులు rare metals
అపురూప మృత్తులు rare earths
అపురూప వాయువులు, జడ వాయువులు rare gases
అప్పోసింగ్పొటెన్షియల్, ప్రతి ఘటించు విద్యుచ్ఛక్మ opposing potential
అభినతి వర్తులము dip-circle
అభ్రకము mica
అమము శ్లేష్మము, చీమిడి, మొ...పదార్దము mucus
అమాల్గమేషన్, పారదీకరణము amalgamation
అమాల్గమ్, రసమిశ్రము amagum
అమిశ్రణీయద్రవం immiscible liquids
అమృత ద్రావకము electuary
అమెరిసియమ్ amercium
అమైలమ్(గంజి) amylum (starch)
అమోనియమ్ ammonium
అమోనియమ్ ఆసిటేట్ ammonium acetate
అమోనియమ్ఆక్సలేట్ ammonium oxalate
అమోనియమ్నైట్రేట్ ammonium nitrate
అమోనియమ్సైనేట్ ammonium cyanate
అమోనియమ్హైడ్రాక్సైడ్ ammonium hydroxide
అమోనియా అణు నిర్మాణం structure of ammonia molecule
అమోనియా అయాన్ నిర్మాణం structure of ammonium ion
అమోనియా తయారీ ammonia preparation
అమోనియా రసాయన ధర్మాలు ammonia chemical properties
అమోనియా సల్ఫేట్ ఎరువు ammonium sulphate fertilizer
అమోనియాఫాస్పేట్ ammonium phosphate
అమ్మోనియా తింత్రిణితము ammonium tartarate
అమ్మోనియా, నవాసారము ammonia
అమ్మోనియాకర్బనితము,స్మెల్లింగుసాల్టు ammonium carbonate
అమ్మోనియాహరిదము ammonium chloride
అయనీకరణ మందిరము ionisation chamber
అయనీకరణ సమతాస్థితి స్థిరాంకం అయనీకరణ స్థిరాంకం ionization equilibrium constant or ionization constant
అయనీభవనోష్ణత heat of ionization
అయన్ ion
అయన్ ప్రవాహము ionic current
అయన్ సిద్ధాంతము ion theory
అయన్లు-అయనీకరణము ions-ionisation
అయస్కాంత ఉద్దారవాదము theory of effluvia
అయస్కాంత ధ్రువము magnetic pole
అయస్కాంత ప్రరోచనము magnetic induction
అయస్కాంత బిభ్రమిష magnetic moment
అయస్కాంత శక్తి magnetic energy
అయస్కాంతఅక్షము magnetic axis
అయస్కాంతత్వము magnetism
అయస్కాంతపు కర్పరము magnetic shell
అయస్కాంతము magnet
అయస్కాంతవాదము magnetic theory
అయస్కాంతీకరణ క్షేత్రము magnetised field
అయానిక వ్యాసార్ధం ionic radius
అయానిక సమతాస్థితి - ద్రావణీయత లబ్ధం ion equilibrium solubility product
అయానిక సమ్మేళనాల ధర్మాలు properties of ionic compounds
అయాన్ మార్పిడి లేదా వినియమ విధానం-శుద్ధజలం తయారీ ion exchange method -preparation of pure water
అయిడిమెట్రి iodimetry
అయిడీన్ iodine
అయిడైడ్ iodide
అయోనియా ionia
అయోనైజేషన్ పొటెన్శియల్ లేదా అయోనైజేషన్ శక్తి అయనీకరణ పొటెన్శియల్ లేదా అనీకరణ శక్తి ionization potential or ionization energy
అరోరా ఆస్ట్రాలిస్ aurora australis
అరోరా బారియాలిస్ aurora borealis
అర్గ్ erg
అర్థ ప్రవేశ్య త్వచము semi permeable membrane
అర్థతల సంఘటన hemihedrism
అర్బిటాల్ క్వాంటమ్ సంఖ్య orbital quantum number
అలిజరిన్ alizarin
అల్పోష్ణతా జనకములు low heat produces
అల్యూమినా alumina
అల్యూమినియము aluminium
అల్యూమినియము అయన్ aluminium ion
అల్యూమినియము ఫాస్ఫేట్ aluminium phosphate
అల్యూమినియము వర్గము aluminium group
అల్యూమినియము సల్ఫేట్ aluminium sulphate
అల్యూమినియము హైడ్రాక్సైడ్ aluminium hydroxide
అవస్థ, స్థితి phase
అవస్థా కోణము phase angle
అవస్థా తరంగములు phase waves
అవస్థా వ్యత్యాసము phase difference
అవస్థానియమము phase law
అవిచ్ఛన్న వర్ణమాల continuous spectrum
అశితామ్లము, acetic acid
అసంజకలు(జంకలు) adhesives
అసంతృప్త unsaturated
అసంతృప్త యౌగికములు compounds
అసంతృప్త హైడ్రోకార్బన్ hydrocarbon
అసాధరణ వర్ణవిశ్లేషణము anomalous dispersion
అసిటోన్ acetone
అసౌష్టవ కార్బన్ పరమాణువు asymmetric carbon atom
అస్పంద స్థానములు nodes
అస్ఫాటిక non-crystalline
అస్ఫాటిక ద్రవ్యము non-crystalline matter
ఆంగ్లిసైట్ anglesite
ఆంగ్స్ట్రమ్యూనిట్(A), ఏంగ్స్ట్రామ్యూనిట్ angstrom unit
ఆంటిమోని క్లోరైడ్ antimony chloride
ఆంటిమోని పెంటాక్సైడ్ antomony pentoxide
ఆంటిమోని, నీలాంజనము antimony
ఆంటిమోనిక్టార్ట్రేట్ antimonic tartrate
ఆంటీకేతోడ్ anti cathode
ఆంటీపైరిన్ antipyrine
ఆంటీపొడీజ్, ప్రతి ధ్రువములు antipodes
ఆంతర పూరణము internal compensation
ఆంతసైనైడ్ antha cynide
ఆంత్రక్వినోన్ anthro quinone
ఆంత్రసీన్ anthracene
ఆంత్రసైట్ anthracite
ఆంత్రసైనిన్లు anthro cyanines
ఆంపియర్ ampere
ఆంపియర్నియమము ampere rule
ఆంపియర్యూనిట్ ampere unit
ఆంప్లిట్యూడ్, కంపనవిస్తారము amplitude
ఆంశిక స్ఫటికీకరణము crystallisation, fractional
ఆంశిక స్వేదనము fractional distillation
ఆంశికప్రేషము partial pressure
ఆకారస్థితి స్థాపక బలము form elasticity
ఆకాశ తరంగము sky wave
ఆక్టేన్ octane
ఆక్రిలిక్ఆసిడ్ acrylic acid
ఆక్సిజన్వ్యుత్పన్నములు oxygen derivatives
ఆక్సీకరణం-క్షయీకరణం oxidation reduction
ఆక్సీకరణము oxidation
ఆక్సీజన్ చక్రం oxygen cycle
ఆక్సీజన్ముఖ్యరసాయనధర్మాలు oxygen important chemcial properties
ఆక్సీ-హైడ్రోజన్ oxy-hydrogen
ఆగమన విజ్ఞాన పద్ధతి inductive scientific method
ఆగ్జాలిక్ ఆసిడ్ acid oxalic
ఆఘాత స్వరములు beat notes
ఆఘాతము beat
ఆజో గణము azo radical
ఆజో బెన్జీన్ azobenzene
ఆజోరైట్ azurite
ఆజోల్ azole
ఆటంబాంబు atom bomb
ఆటిబ్రిన్ atebrin
ఆటోకెటాలిసిస్, స్వతఃప్రేరితము auto catalysis
ఆట్రోపీన్ atropine
ఆడిసన్ఫలితము edison effect
ఆత్మపరాగ సంపర్కము pollination self
ఆదార యౌగికము dispersing compound
ఆధార ద్రవ్యము substrate
ఆధార ద్రవ్యము, యానక ద్రవ్యము dispersing medium
ఆనిలీన్ aniline
ఆనిలీన్వ్యుత్పన్నములు aniline derivaties
ఆఫ్బౌసూత్రం auf-bau principle
ఆమ్మీటర్ ammeter
ఆమ్మోనియాగంధకితము ammonium sulphide
ఆమ్ల ఆక్సైడ్లు acidic oxides
ఆమ్ల ఎమైడ్ acid amide
ఆమ్లజని లవణములు oxy-salts
ఆమ్లజనిదములు oxides
ఆమ్లము acid
ఆమ్లాలు-అరిహినియస్ నిర్వచనం acids-arrhenius definition
ఆమ్లాలు-క్షారాలు లౌరి-బ్రాన్స్టడ్నిర్వచనం acids-bases- definition
ఆయతనము volume
ఆయములు ions
ఆయోకరణము ionization
ఆరకడిక్ ఆసిడ్ arachidic acid
ఆరిల్గణము aryl radical
ఆరొమాటిక్ ఆజోయౌగికములు aromatic azo compounds
ఆరొమాటిక్డైఆజోయౌగికములు aromatic diazocompounds
ఆరోరా, సుమేరు జ్యోతి aurora
ఆర్కిమీడీస్ సూత్రము principle of archimedes
ఆర్క్లాంప్, చాపదీపము arc lamp
ఆర్గానోమెటాలిక్కాంపౌండ్స్, ధాతు కార్బన్యౌగికములు organo-metallic compounds
ఆర్గాన్ argon
ఆర్థ్రత humidity
ఆర్నోల్డ్ద్రావణము arnold solution
ఆర్బిటాల్ల సంకురీకరణం hybridization of orbitals
ఆర్బిటాళ్ళ ఆకారాలు shapes of orbitals
ఆర్బిటాళ్ళ శక్తిక్రమం energy sequence of orbitals
ఆర్మేచర్, కవచము armature
ఆర్సీన్ arsine
ఆర్సెనిక్, పాషాణము arsenic
ఆర్సెనిక్పెంటాక్సైడ్ arsenic pentoxide
ఆర్సెనిక్బ్లూమ్ arsenic bloom
ఆర్సెనిక్వర్గము arsenic group
ఆర్సెనిక్సల్ఫైడ్ arsenic sulphide
ఆర్సెనీయస్ arseneous
ఆర్సెనైడ్ arsenide
ఆలనైట్ allanite
ఆలిఫాటి క్లేదా వివృత శృంఖల యౌగికములు open chain compounds
ఆలిఫాటిక్, తైలాత్మక aliphatic
ఆల్కలాయిడ్ alkaloid
ఆల్కహాలిక్పొటాష్ alcoholic potash
ఆల్కహాలు పారిశ్రామిక తయారి alcohol manufacture
ఆల్కహాల్ మద్యసారము alcohol
ఆల్కహాల్ వల్ల దుష్ప్రభావాలు ill effects of alchol
ఆల్కిమియా alchemia
ఆల్కిల్ ఎమీన్ alkyl amine
ఆల్కిల్అయిడైడ్ alkyl iodide
ఆల్కిల్ఐసోసైనైడ్ alkyl isocyanide
ఆల్కిల్గణము alkyl radical
ఆల్కిల్హేలైడ్ alkyl halide
ఆల్కేన్లు, ఆల్కీన్లు alkanes
ఆల్కైన్లు alkynes
ఆల్టర్నేటింగ్కరెంట్,ఆవర్తివిద్యుత్ప్రవాహము alternating current
ఆల్డిహైడ్లు aldehydes
ఆల్డిహైడ్లు, కీటోన్లు aldehydes, ketones
ఆల్ఫా alpha (a)
ఆల్ఫాకణము alpha (a) particle
ఆల్బా alba
ఆవర్తక్రమ పట్టిక periodic table
ఆవర్తక్రమము periodic order
ఆవర్తన నియమము principle of periodicity
ఆవర్తన పట్టిక periodic table
ఆవర్తములు periods
ఆవాగాడ్రో సంఖ్య avogadro number
ఆవిరి పై వండటం cooking with steam
ఆవేశము-ద్రవ్యరాశి నిష్పత్తి charge-mass ratio
ఆసిటిక్ ఎమైడ్ acetic amide
ఆసిటిలీన్ acetylene
ఆసిటిల్యూరియా acetyl urea
ఆసిడ్ ఆక్సైడ్ acid oxide
ఆసిడ్ ఆన్హైడ్రైడ్ acid anhydride
ఆసిలేటరీ ఎలక్ట్రిక్డిస్చార్జి, కంపన విద్యుదుత్సర్గము oscillatory electric discharge
ఆసిలోగ్రాఫ్ oscillograph
ఆస్పిరిన్ aspirin
ఆస్బెస్టాస్ asbestos
ఆస్మియమ్ osmium
ఆస్మోసిస్, ద్రవాభిసరణము osmosis
ఆహార పదార్ధాల కాలోరి ఫిక్విలువలు calorific values of foods
ఆహారం food
ఆహారం, లోహ లవణాలు food and mineral salts