Jump to content

పెద్ది సాంబశివరావు నిఘంటువులు

Wikibooks నుండి

పెద్ది సాంబశివరావు నిఘంటువులు పెద్ది సాంబశివరావు సమకాలీన తెలుగు సమాజంలో ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడు. వైద్య ఆరోగ్య సేవలో , సామాజిక చైతన్యం, సాహిత్య సృష్టి, నిఘంటు నిర్మాణం, సాంకేతిక విజ్ఞానం – ఈ ఐదింటినీ సమన్వయపరిచి జీవితం గడిపిన అరుదైన మేధావిగా ఆయనను చెప్పుకోవచ్చు. తాను పొందిన జ్ఞానాన్ని, అనుభవాన్ని వ్యక్తిగత లాభానికి కాకుండా సమాజహితానికి అంకితం చేసిన వ్యక్తి ఆయన.

1943 జూలై 1వ తేదీన జన్మించిన సాంబశివరావు , ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి B.A. (ఆంత్రోపాలజీ), నాగార్జున విశ్వవిద్యాలయం నుండి M.A. (సోషియాలజీ) పూర్తిచేశారు. కేవలం ఆరోగ్య కార్యకర్త చేసు రచయిత. తెలుగులో ఆయన రచించిన ప్రముఖ జీవిత చరిత్రలు:


  • ఫాదర్ డామియన్
  • బాబా ఆమ్టే ల్
  • డా. హాన్సెన్
  • లారీ బ్రిలియంట్
  • T.A. ఎడిసన్
  • మేడమ్ క్యూర
  • ఫ్లోరెన్స్ నైటింగేల్ & హెలెన్ కెల్లర్


అలాగే కవిత్వం, ప్రచార గేయాల, బుర్రకథలు వంటి జానపద రూపాల ద్వారా ఆరోగ్యం సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లార. అనేక పత్రికలలో ఆరోగ్యంపై వ్యాసాలు రాసి ప్రజలకు అవగాహన కల్పించారు. నిఘంటు నిర్మాణం – జీవిత లక్ష్యంగా మారిన కృషి విజయవాడ విక్రమ్ పబ్లిషర్స్ వారు ప్రచురించిన శంకరనారాయణ ఆంగ్లం–ఆంగ్లం–తెలుగు నిఘంటువును నూతన సాంకేతికతతో 1200 పేజీలకు నవీకరించటం ఆయన జీవితంలో మలుపు. ఇది ప్రస్తుతం ఏడవ ఎడిషన్‌లో ఉంది.బొద్దు పాఠ్యం ఆ తరువాత ఆయన నిఘంటు నిర్మాణ సాంకేతికతను స్వయంగా నేర్చుకొని, యూనికోడ్ తెలుగు మీద పట్టుదల పెంచుకున్నారు. ఆరు నెలల అన్వేషణ అనంతరం డా. గారపాటి ఉమామహేశ్వరరావు గారి సహాయంతో యూనికోడ్ నేర్చుకొని, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో దాదాపు 50 నిఘంటువులను రూపొందించారు.బొద్దు పాఠ్యం ఈ ఘనతకు భారతo బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ (2017) గుర్తింపు లభించింది.

నిఘంటు నిర్మాణంలో విశిష్ట కృషి

[మార్చు]

పెద్ద సాంబశివరావు గారు భాషా సేవలో భాగంగా అనేక భాషల్లో, అనేక విభాగాల్లో విస్తృత నిఘంటు నిర్మాణ కృషి చేశారు. ఆయన రూపొందించిన నిఘంటువులలో సుమారు 3,42,874 పదాలు ఉన్నాయి. ఈ నిఘంటువులు త్రిభాషా, ద్విభాషా, విషయ నిఘంటువులు మరియు వర్గీకృత పదసంపదగా విస్తరించి ఉన్నాయి.నిఘంటు నిర్మాణంలో విశిష్ట కృషి చేసినవారు = సి. పి. బ్రౌన్ తెలుగు భాషకు సంబంధించి నిఘంటు నిర్మాణంలో సి. పి. బ్రౌన్ గారు అపారమైన సేవలు అందించారు

త్రిభాష నిఘంటువులు

[మార్చు]

త్రిభాష నిఘంటువులు = తెలుగు–సంస్కృత–ఇంగ్లీషు నిఘంటువులు అంటే మూడు భాషలలో అర్థాలను అందించే నిఘంటువులను త్రిభాష నిఘంటువులు అంటారు.

  1. త్రిభాషా నిఘంటువు (తెలుగు–ఇంగ్లీషు–హిందీ) – 8,000 పదాలు
  2. త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు _హిందీ ) – 8,000 పదాలు
  3. త్రిభాషా నిఘంటువు (హిందీ -తెలుగు-ఇంగ్లీషు) – 8,000 పదాలు

ద్విభాషా నిఘంటువులు

[మార్చు]

ద్విభాషా నిఘంటువులు = రెండు భాషల నిఘంటువులు అంటే ఒక భాష పదానికి మరో భాషలో అర్థాన్ని తెలిపే నిఘంటువులను ద్విభాషా నిఘంటువులు అంటారు.

  1. ఫొనెటిక్ నిఘంటువు (అ-హ) – 22,000 పదాలు
  2. ఫొనెటిక్ నిఘంటువు (ఇంగ్లీషు ) – 22,000 పదాలు
  3. తెలుగు-ఇంగ్లీషు (ఉచ్చారణ) నిఘంటువు – 21,000 పదాలు
  4. ఇంగ్లీషు–తెలుగు ఉచ్చారణ నిఘంటువు – 21,000 పదాలు
  5. తెలుగు-హింది (ఉచ్చరణ) నిఘంటువు – 18,000 పదాలు
  6. హిందీ -తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు – 18,000 పదాలు
  7. తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (భాషా భాగాలు) – 15,000 పదాలు
  8. ఇంగ్లీషు–తెలుగు నిఘంటువు (భాషా భాగాలు) – 15,000 పదాలు
  9. తెలుగు-ఉర్దూ నిఘంటువు – 9,800 పదాలు
  10. ఉర్దూ–తెలుగు నిఘంటువు – 9,800 పదాలు
  11. తెలుగు–ఇంగ్లీషు నిఘంటువు – 8,000 పదాలు
  12. ఇంగ్లీషు–తెలుగు నిఘంటువు – 8,000 పదాలు
  13. తెలుగు–హిందీ నిఘంటువు – 8,000 పదాలు
  14. హిందీ–తెలుగు నిఘంటువు – 8,000 పదాలు
  15. ఇంగ్లీషు–హిందీ నిఘంటువు – 8,000 పదాలు
  16. తెలుగు–సంస్కృతం నిఘంటువు – 4,900 పదాలు
  17. సంస్కృతం-తెలుగు నిఘంటువు – 4,900 పదాలు
  18. తెలుగు-తెలుగు నిఘంటువు – 9,600 పదాలు

విషయ నిఘంటువులు

[మార్చు]

విషయ నిఘంటువులు = ఒక నిర్దిష్ట విషయానికి సంబంధించిన పదాల అర్థాలను వివరించే నిఘంటువులు ఉదాహరణకు: విజ్ఞాన శాస్త్ర నిఘంటువు, వైద్య నిఘంటువు, న్యాయ నిఘంటువు మొదలైనవి.

  1. కళలు–చిత్రలేఖనం నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) – 1,000 పదాలు
  2. గణిత శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్) – 1,400 పదాలు
  3. జీవశాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) – 3,800 పదాలు
  4. పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) – 8,100 పదాలు
  5. భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్) – 2,500 పదాలు
  6. రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) – 1,700 పదాలు
  7. సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) – 2,800 పదాలు
  8. వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు) – 3,100 పదాలు

పై అంశాలన్నింటికీ ఇంగ్లీషు–తెలుగు రూపంలోనూ నిఘంటువులు రూపొందించబడినవి.

  1. కళలు–చిత్రలేఖనం నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 1,000 పదాలు
  2. గణిత శాస్త్ర నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 1,400 పదాలు
  3. జీవశాస్త్ర నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 3,800 పదాలు
  4. పరిపాలనా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 8,100 పదాలు
  5. భౌతికశాస్త్ర నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 2,500 పదాలు
  6. రసాయనశాస్త్ర నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 1,700 పదాలు
  7. సామాజికశాస్త్ర నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 2,800 పదాలు
  8. వైద్య నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) – 3,100 పదాలు

వర్గీకృత పదసంపద

[మార్చు]

వర్గీకృత పదసంపద = విషయాల వారీగా లేదా వర్గాల వారీగా విభజించి సేకరించిన పదసంపద అంటే ఒక భాషలోని పదాలను అక్షర క్రమంలో కాకుండా, భావం, విషయం లేదా వర్గం ఆధారంగా గుంపులుగా ఏర్పాటు చేసిన పదసంపదను వర్గీకృత పదసంపద అంటారు. విశేషణాలు, క్రియావిశేషణాలు, నామవాచకాలు, విరుద్ధార్థ పదాలు, వృత్తులు, సంబంధాలు, శరీర భాగాలు, మొక్కలు, వాతావరణం, వ్యవసాయం, పరిశ్రమలు, సాహిత్యం, నిర్వహణ, వైద్య, మానసిక శాస్త్రం తదితర 40కుపైగా విభాగాల్లో పదసంపదను క్రమబద్ధంగా రూపొందించారు.

ఉదాహరణకు –

  • నామవాచకాల పదసంపద: 11,900 పదాలు
  • పరిశ్రమల పదసంపద: 6,700 పదాలు
  • వ్యవసాయ పదసంపద: 3,100 పదాలు
  • విరుద్ధార్థ పదాలు: 1,900 పదాలు
  • క్రియలు: 1,277 పదాలు
  1. విశేషణం పదజాలం – 1,000 పదాలు
  2. క్రియావిశేషణ పదజాలం – 671 పదాలు
  3. వ్యవసాయం పదజాలం – 3,100 పదాలు
  4. నిర్మాణ సామగ్రి పదజాలం – 199 పదాలు
  5. వ్యాపార పదాలు పదజాలం – 227 పదాలు
  6. దుస్తులు పదజాలం – 217 పదాలు
  7. సౌందర్య సాధనాలు పదజాలం – 709 పదాలు
  8. దంతవైద్యం పదజాలం – 122 పదాలు
  9. వ్యాధులు పదజాలం – 240 పదాలు
  10. గృహోపకరణాలు పదజాలం – 188 పదాలు
  11. శక్తి పదజాలం – 156 పదాలు
  12. ఫర్నిచర్ పదజాలం – 112 పదాలు
  13. చరిత్ర పదజాలం – 929 పదాలు
  14. పారిశ్రామిక పదజాలం – 6,700 పదాలు
  15. వంటగది వస్తువులు పదజాలం – 1,100 పదాలు
  16. సాహిత్యం పదజాలం – 571 పదాలు
  17. ప్రధాన ప్రపంచ – 135 పదాలు
  18. నిర్వహణ పదజాలం – 2,800 పదాలు
  19. కొలతలు పదజాలం – 113 పదాలు
  20. డబ్బు పదజాలం – 163 పదాలు
  21. ప్రతికూల పదజాలం – 200 పదాలు
  22. నామవాచకాలు పదజాలం – 11,900 పదాలు
  23. వృత్తులు పదజాలం – 258 పదాలు
  24. వ్యతిరేక పదాలు పదజాలం – 1,900 పదాలు
  25. శరీర భాగాలు పదజాలం – 413 పదాలు
  26. ప్రదేశాలు పదజాలం – 295 పదాలు
  27. మొక్కలు పదజాలం – 388 పదాలు
  28. సానుకూల పదజాలం – 646 పదాలు
  29. వృత్తుల పదజాలం – 258 పదాలు
  30. మనస్తత్వశాస్త్రం పదజాలం – 500 పదాలు
  31. రెగ్యులర్ క్రియలు పదజాలం – 530 పదాలు
  32. సంబంధాలు పదజాలం – 205 పదాలు
  33. గదులు పదజాలం – 105 పదాలు
  34. పాఠశాల పదజాలం – 117 పదాలు
  35. కుట్టుపని పదజాలం – 84 పదాలు
  36. సమయం పదజాలం – 129 పదాలు
  37. వాహనాలు పదజాలం – 70 పదాలు
  38. క్రియలు పదజాలం – 1,277 పదాలు
  39. సద్గుణాలు పదజాలం – 130 పదాలు
  40. వాతావరణ పదజాలం – 287 పదాలు

భాషా సేవలో అపూర్వ ఘనత

[మార్చు]

ఈ నిఘంటు నిర్మాణ కృషి ద్వారా పెద్ది సాంబశివరావు గారు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, సాధారణ పాఠకులకు విశ్వసనీయమైన భాషా ఆధారాన్ని అందించారు. భాషను సాంకేతికతతో అనుసంధానించి, ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ప్రయత్నం తెలుగు భాషా వికాసంలో ఆయన స్థిరమైన ముద్రగా నిలిచింది.