Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/अ

Wikibooks నుండి
(आ)ह्वान(న)(ఆ)హ్వాన పిలుపు,సవాలు
अंकः(పు)అంక ఒడి,గురుతు
अंकुरः(పు)అంకుర మొలక
अंकुश(పు).(న)అంకుశ అంకుశము
अंग(అ)అంగ మరల
अंग(న)అంగ అవయవము,శరీరము
अंगण(న)అంగణ ముంగిలి
अंगना(స్త్రీ)అంగనా స్త్రీ
अंगार(పు).(న)అంగార నిప్పులు
अंगीकार(పు)అంగీకార ఒప్పుకొనుట
अंगुळी/अंगुलि(స్త్రీ)అంగుళీ/అంగులి వ్రేలు
अंगुळीयक(న)అంగుళీయక ఉంగరము
अंगुष्ट(పు)అంగుష్ట బొటనవ్రేలు
अंघ्रि(పు)అంఘ్రి పాదము
अंजः(అ)అంజః బాగుగా
अंजलि(పు)అంజలి దోసిలి
अंड(న)అండ గ్రుడ్డు
अंतःपुर(న)అంతఃపుర స్త్రీలుఉండుచోటు
अंत(పు)అంత చివర,మృత్యువు
अंतर(న)అంతర ఎడము,భేదము
अंतराय(పు)అంతరాయ విఘ్నము
अंतरिक्ष(న)అంతరిక్ష ఆకాశము
अंतरेण(అ)అంతరేణ లేకుండా
अंतर् /अंतरा(అ)అంతర్/అంతరా లేక, మధ్య
अंध(పు)అంధ గుడ్డివాడు
अंधकार(పు)అంధకార చీకటి
अंबर(న)అంబర ఆకాశము,వస్త్రము
अंबा(స్త్రీ)అంబా తల్లి
अंभस्(న)అంభస్ నీరు
अंभोरुह(న)అంభోరుహ తామర
अंश(పు)అంశ భాగము
अंशु(పు)అంశు కిరణము
अंशुक(న)అంశుక వస్త్రము
अंहस्(న)అంహస్ పాపము
अकस्मातఅకస్మాత్ అనుకోకుండా
अक्ष(పు)అక్ష పాచిక
अक्षत(పు).(న)అక్షత అక్షింతలు
अक्षर(న)అక్షర మోక్షము,అకారాది వర్ణములు
अक्षि(న)అక్షి కన్ను
अखंड, अखिल(వి)అఖండ, అఖిల సమస్తమైన
अग(పు)అగ పర్వతము
अगाथ(వి)అగాధ లోతైన
अग्नि(పు)అగ్ని నిప్పు
अग्र(న)అగ్ర కొన
अग्र(వి)అగ్ర శ్రేష్ట,ముందు,ప్రధాన
अग्रज(పు)అగ్రజ అన్న
अग्रजन्मन्(పు)అగ్రజన్మన్ బ్రాహ్మణుడు
अग्रजा(స్త్రీ)అగ్రజా అక్క
अग्रतः(అ)అగ్రతః ముందుగా
अघ(న)అఘ పాపము
अधमर्ण(పు)అధమర్ణ అప్పుపుచ్చుకొన్మవాడు
अचल(పు)అచల పర్వతము
अचला(స్త్రీ)అచలా భూమి
अचिरात(అ)అచిరాత్ శీఘ్రమైగా
अच्छ(వి)అచ్ఛ నిర్మలమైన
अज(పు)అజ బ్రహ్మ,మేక
अजस्रं(అ)అజస్రం నిరంతరము
अजा(స్త్రీ)అజా ఆడుమేక
अजिन(న)అజిన చర్మము
अजिरं(అ)అజిరం త్వరగా
अणु(పు)అణు మిక్కిలిచిన్నది
अतः(అ)అతః ఇందువలన,నుండి
अतिधि(పు)అతిధి అతిధి
अतिरिक्त(వి)అతిరిక్త మించిన,ఎక్కువైన
अतिशय(పు)అతిశయ అధికము
अतीव(అ)అతీవ మిక్కిలి
अथो / अथ(అ)అథో/అథ మంగళ,ఆరంభ
అనంతర
अदस्(త్రి)అదస్ ప్రధమ పురుష, సర్వనామము
अद्धा(అ)అద్ధా ప్రకాశముగా,నిశ్చయముగా
अद्भुत(పు)అద్భుత రసముపేరు,
శృంగారాదులలోనొకటి
अद्भुत(వి)అద్భుత అద్భుతమైన, ఆశ్చర్యకరమైన
अद्य(అ)అద్య ఇప్పుడు,నేడు
अत्र(అ)అత్ర ఇక్కడ
अद्रि(పు)అద్రి పర్వతము
अधम(వి)అధమ నీచమైన
अधर(పు)అధర పెదవి
अधिकार(పు)అధికార అధికారము
अधिष्टान(న)అధిష్ఠాన పట్టణం,ప్రభావము
अधीन(వి)అధీన వశమైన
अधुना(అ)అధునా ఇప్పుడు
अध्यापक(పు)అధ్యాపక గురువు
अध्याहार(పు)అధ్యాహార ఊహ
अध्वग(పు)అధ్వగ బాటసారి
अध्वन्(పు)అధ్వన్ బాట
अध्वर(పు)అధ్వర యజ్ఞము
अनडुह्(పు)అనడుహ్ ఎద్దు
अनर्गळ(వి)అనర్గళ ఆటంకము లేని
अनर्धक(వి)అనర్ధక అర్ధములేని,ప్రయోజనం లేని
अनवद्य(వి)అనవద్య చెప్పదగిన,మచ్చలేని
अनस्(న)అనస్ బండి
अनादर(పు)అనాదర ఆదరము లేని
अनिशम्(అ)అనిశమ్ నిరంతరం
अनुकंपा(స్త్రీ)అనుకంపా దయ
अनुग(పు)అనుగ అనుచరుడు
अनुग्रह(పు)అనుగ్రహ దయ
अनुचर(పు)అనుచర అనుచరుడు
अनुज(పు)అనుజ తమ్ముడు
अनुजा(స్త్రీ)అనుజా చెల్లెలు
अनुजीविन्(పు)అనుజీవిన్ సేవకుడు
अनुताप(పు)అనుతాప పశ్చాత్తాపము
अनुभव(పు)అనుభవ అనుభవము
अनुमति(స్త్రీ)అనుమతి అనుమతి
अनुवर्तन(న)అనువర్తన అనుసరించుట
अनूप(పు).(న)అనూప జలప్రదేశము
अनृत(న)అనృత అసత్యము
अन्न(న)అన్న ఆహారము
अन्य(పు)అన్య ఇతరుడు
अन्यच्च/अन्यत्(అ)అన్యచ్చ/అన్యత్
మరియు(ను)
अन्वय(పు)అన్వయ వంశము
अन्वीक्षण(న)అన్వీక్షణ వెదకుట
अन्वीक्षा(స్త్రీ)అన్వీక్షా వెదకుట
अन्वेषण(స్త్రీ)అన్వేషణా వెదకుట
अपक्रम(పు)అపక్రమ వెనుకకుపోవుట
अपत्य(న)అపత్య సంతానము
अपदिशम(అ)అపదిశమ్ మూల
अपभ्रंश(పు)అపభ్రంశ దుష్టశబ్దము
अपरं(అ)అపరం మరియు
अपर(వి)అపర వెనుకటి,తరువాతి
अपराध(పు)అపరాధ నేరము
अपराह्न(పు)అపరాహ్ణ పగలు,
రెండుగంటలవేళ
अपलाप(పు)అపలాప మోసపుమాట
अपवाद(పు)అపవాద నింద
अपसव्य(న)అపసవ్య కుడివెపు
अपि(అ)అపి కూడ,అయినను,ప్రశ్నార్ధకము
अपूप(పు)అపూప పిండివంట
अप्(స్త్రీ),(నిత్యబహువచనం) అప్ నీరు
अप्य(వి)అప్య నీటి
अप्सरस्(స్త్రీ)అప్సరస్ అప్సరస
अबला(స్త్రీ)అబలా స్త్రీ
अब्ज(పు)అబ్జ శంఖము,చంద్రుడు
अब्धि(పు)అబ్ధి సముద్రము
अभिजन(పు)అభిజన వంశము
अभिज्ञान(న)అభిజ్ఞాన గురుతు
अभिदान(న)అభిదాన పేరు
अभिनव(వి)అభినవ నూతనమైన
अभिप्राय(పు)అభిప్రాయ అభిప్రాయం
अभिभ्या(స్త్రీ)అభిభ్యా పేరు,కాంతి
अभिमान(పు)అభిమాన గర్వము
अभियाति(పు)అభియాతి శత్రువు
अभियोग(పు)అభియోగ ఆరోపణ
अभिलाष(పు)అభిలాష కోరిక
अभिवाद(పు)అభివాద నమస్కారము
अभिवादन(న)అభివాదన నమస్కరించుట
अभीक्ष(అ)అభీక్ష మరలమరల
अभ्युपगम(పు)అభ్యుపగమ అంగీకారము
अभ्र(పు)అభ్ర మేఘము
अम(అ)అమ శీఘ్రము
अमा / अमावास्य(స్త్రీ)అమా/అమావాస్య
అమావాస్య
अमृत(న)అమృత తీయని,అమృతము
अय(పు)అయ అదృష్టము
अयन(న)అయన పోవుట
अयस्(న)అయస్ ఇనుము
अये(అ)అయే సంబోధనార్థము
अत्याहित(న)అత్యాహిత సాహసం,భయం
अर(పు)అర చక్రము,చువ్వ
अरण्य(న)అరణ్య అడవి
अरविंद(న)అరవింద పద్మము
अराति(పు)అరాతి శత్రువు
अरि(పు)అరి శత్రువు
अरिष्ट(న)అరిష్ట సూతికాగృహము, ,అశుభము
अरुण(పు)అరుణ సూర్యుడు,ఎరుపు,అనూరుడు
अरुष(పు)అరుష ఎరుపు
अर्घ्य(త్రి)అర్ఘ్య పూజకు తగినవాడు, యోగ్యుడు
अर्चा(స్త్రీ)అర్చా పూజ,విగ్రహము
अर्चिस्(న)అర్చిస్ ప్రకాశముగ
अर्णव(పు)అర్ణవ సముద్రము
अर्थीन्(పు)అర్థీన్ యాచకుడు
अर्ध(న)అర్ధ సగభాగము,సగము
अर्ध(పు)అర్ధ తునక,భాగము
अर्ध(పు)అర్ధ ధనము,ప్రయోజనము
अर्धरात्र(పు)అర్ధరాత్ర అర్ధరాత్రి
अर्भक् / ग्(పు)అర్భక / గ పిల్లవాడు
अर्वन्(పు)అర్వన్ గుర్రము
अर्वाक्(అ)అర్వాక్ అభిముఖం
अलंकरण(న)అలంకరణ నగ,ముస్తాబు
अलंकार(పు)అలంకార నగ,ముస్తాబు
अलक(పు)అలక ముంగురులు
अलय्(అ)అలయ్ బాలు
अलस(పు)అలస సోమరి
अलीक(న)అలీక అసత్యము
अल्प(వి)అల్ప తక్కువైన,నీచమైన
अवकर(పు)అవకర దుమ్ము
अवकाश(పు)అవకాశ చోటు
अवज्ञा(స్త్రీ)అవజ్ఞా అవమానము
अवदरोध(పు)అవదరోధ అంతఃపురం, గట్టు,
ఒడ్డు
अवद्य(వి)అవద్య నిందితమైన
अवधारण(న)అవధారణ నిశ్చయము,
నిశ్చయించుట
अवधि(పు)అవధి గట్టు
अवयव(పు)అవయవ అవయవము
अवसर(పు)అవసర సమయము
अवसान(న)అవసాన ముగింపు
अवस्(అ)అవస్ బయట
अवस्था(స్త్రీ)అవస్థా స్థితి,దశ
अवहेळन(న)అవహేళన, గేలిచేయు
अशनि(పు)అశని పిడుగు
अशेष(వి)అశేష సమస్తమైన
अशोक(పు)అశోక అశోక వృక్షము
अश्मन(పు)అశ్మన్ రాయి
अश्रु(న)అశ్రు కన్నీరు
अश्लील(న)అశ్లీల బూతు
अश्व(పు)అశ్వ గుర్రము
अश्वारोह(పు)అశ్వారోహ రౌతు
अश्विन्(పు)అశ్విన్ రౌతు
अष्टन्(న)అష్టన్ ఎనిమిది
अष्टमु(వి)అష్టము ఎనిమిదవ
असत्(వి)అసత్ చెడు,లేనిది
असांप्रतम्(అ)అసాంప్రతమ్ తగదు
असि(పు)అసి ఖడ్గము
असुर(పు)అసుర రాక్షసుడు
असूया(స్త్రీ)అసూయా, ఈర్ష్యా, మత్సరం
असृज्(న)అసృజ్ రక్తము
अस्त(న)అస్త ఆయుధము
अस्मद्(త్రి)అస్మద్ ఉత్తమ పురుష,సర్వనామ
శబ్దము
अहंकार(పు)అహంకార గర్వము
अहंकारिन्(పు)అహంకారిన్ గర్వం కలవాడు
अह(అ)అహ కావున,స్పష్టంగా
अहन्(న)అహన్ పగలు
अहि(పు)అహి పాము
अहोरात्र(పు)అహోరాత్ర పగలు,రాత్రి
आ(అ)ఆ స్మరణార్ధములో,జ్ఞాపకం
తెచ్చుకొనుటలో
आकर(పు)ఆకర గని
आकर्ष(పు)ఆకర్ష జూదము మొదలైనవి
आकार(పు)ఆకార ఆకృతి,రూపము
आकाश(పు)ఆకాశ ఆకాశము
आकीर्ण(న)ఆకీర్ణ వెదజల్లబడిన
आकुल(పు)ఆకుల బాధపడినవాడు
आक्रंद(పు)ఆక్రంద ఆర్తనాదము
आक्षेप(పు)ఆక్షేప నింద,అభ్యంతరం
आख्या(స్త్రీ)ఆఖ్యా పేరు
आख्यात(వి)ఆఖ్యాత చెప్పబడిన
आख्यायिका(స్త్రీ)ఆఖ్యాయికా చరిత్రము
आगस्(న)ఆగస్ పాపము
आचमन(న)ఆచమన త్రాగుట
आचरण(న)ఆచరణ ఆచరించుట
आचार्य(పు)ఆచార్య గురువు
आच्छादन(న)ఆచ్ఛాదన కప్పు,వస్త్రము
आजि(పు).(న)ఆజి యుద్ధము
आज्ञा(స్త్రీ)ఆజ్ఞా ఆజ్ఞ,ఆనతి
आज्य(న)ఆజ్య కరిగిన నేయి
आढ्य(పు)ఆఢ్య ధనికుడు
आढ्य(వి)ఆఢ్య సంపన్నమైన
आतंक(పు)ఆతంక రోగము,తాపము
आततायिन्(పు)ఆతతాయిన్ హంతకుడు,
అత్యాచారము చేయువాడు
आतप(పు)ఆతప ఎండ
आत्मज(పు)ఆత్మజ పుత్రుడు
आत्मजा(స్త్రీ)ఆత్మజా పుత్రిక
आत्मन्(పు)ఆత్మన్ తాను
आदरु(పు)ఆదరు అద్దము,ఆదర్శము
आदि(పు)ఆది మొదలు,ఆరంభము
आदित्य(పు)ఆదిత్య దేవుడు,సూర్యుడు
आद्य(వి)ఆద్య మొదటి,ప్రథమ
आधार(పు)ఆధార ఆధారము
आधि(పు)ఆధి మనోవ్యాధి
आनंद(పు)ఆనంద సంతోషము
आनन(న)ఆనన ముఖము
आपण(పు)ఆపణ అంగడి
आपथ्(స్త్రీ)ఆపథ్ ఆపద
आपुच्छन(న)ఆపుచ్ఛన పలుకరించు,
సెలవుతీసుకొను
आप्त(పు)ఆప్త నమ్మదగినవాడు
आप्त(వి)ఆప్త నమ్మపొందదగిన
आप्लव/आप्लाव(పు)ఆప్లవ/ఆప్లావ స్నానము
आभरण(న)ఆభరణ నగ
आभाषण(న)ఆభాషణ మంచిమాట
आमय(పు)ఆమయ రోగము
आमिष(న)ఆమిష మాంసము
आमोद(పు)ఆమోద సంతోషము
आम्(అ)ఆమ్ స్వీకారము,సరే,ఒప్పుకొను
आम्र(పు)ఆమ్ర మామిడి
आयत(న)ఆయత దీర్ఘము
आयतन(న)ఆయతన ఇట్లు
आयत्त(వి)ఆయత్త సిద్ధపడిన
आयस(పు)(స్త్రీ)ఆయస ఇనుముతో చేయబడిన
आयसी(స్త్రీ)ఆయసీ ఇనుముతో చేయబడిన
आयाम(పు)ఆయామ నిడుపు
आयुध(న)ఆయుధ ఆయుధము
आयुस्(న)ఆయుస్ ఆయుర్ధాయము
आरंभ(పు)ఆరంభ ప్రయత్నము
आरंभण(న)ఆరంభణ మొదలుపెట్టుట
आरव(పు)ఆరవ ధ్వని,శబ్దము
आरात्(అ)ఆరాత్ దగ్గర,దూరం
आराधन(న)ఆరాధన పూజ,సాధన
आराधना(స్త్రీ)ఆరాధనా పూజ,సాధన
आराव(పు)ఆరావ శబ్దము,ధ్వని
आरोग्य(న)ఆరోగ్య ఆరోగ్యము
आरोहण(న)ఆరోహణ ఎక్కుట,సోపానం
आर्तध्र(వి)ఆర్ధ్ర తడిసిన
आर्ति(స్త్రీ)ఆర్తి పీడ,బాధ
आर्य(పు)ఆర్య స్వామి
आलवाल(న)ఆలవాల పాదు
आलस्य(న)ఆలస్య ఆలస్యము
आलि(స్త్రీ)ఆలి సఖి
आलोक(పు)ఆలోక కాంతి,దృష్టి
आवर्त(పు)ఆవర్త సుడి
आविः(అ)ఆవిః ప్రకటితము
आवृत(వి)ఆవృత చుట్టబడిన
आशय(పు)ఆశయ ఉద్దేశము
आशा(స్త్రీ)ఆశా అపేక్ష,కోరిక
आशा(స్త్రీ)ఆశా దిక్కు
आशिस्(స్త్రీ)ఆశిస్ హితం,ఆశీర్వాదం
आशु(అ)ఆశు శీఘ్రము
आशुग(పు)ఆశుగ బాణము
आश्चर्य(న)ఆశ్చర్య ఆశ్చర్యము
आश्रम(పు)ఆశ్రమ బ్రహ్మచర్యాదులు,
మునులుండుతావు
आश्रय(పు)ఆశ్రయ తావు
आश्रव(పు)ఆశ్రవ మాటయిచ్చుట
आश्रुत(న)ఆశ్రుత మాటయిచ్చుట
आश्वयुज(స్త్రీ)(పు)ఆశ్వయుజ మాసం పేరు
आषाढ(పు)ఆషాఢ మాసంపేరు
आसक्त(పు)ఆసక్త తత్పరుడు
आसक्त(వి)ఆసక్త తత్పరమైన
आसक्ति(స్త్రీ)ఆసక్తి ఆసక్తి,ఇష్టము
आसन(న)ఆసన పీట,కూర్చొనుట
आसना(స్త్రీ)ఆసనా ఉనికి
आसन्न(వి)ఆసన్న దగ్గరగానున్న
आसव(పు)ఆసవ మద్యము
आसार(పు)ఆసార జల్లు
आस्थान(న)ఆస్థాన సభ
आस्पद(న)ఆస్పద తావు
आस्यम्(న)ఆస్యమ్ ముఖము
आहत(వు)ఆహత ముద్తింపబడిన,గుణింపబడిన
आहव(పు)ఆహవ యుద్ధము
आहार(పు)ఆహార ఆహారము
आहाव(పు)ఆహావ నీటితొట్టి
आहो / आहोस्वत्(అ)ఆహో/ఆహోస్వత్
సంశయము,చర్చ,అడుగుట
आह्निक(న)ఆహ్నిక దైనికము,పగటి
आह्लाद(పు)ఆహ్లాద సంతోషము
आह्वाय(పు)ఆహ్వాయ పేరు
आह्वाय(స్త్రీ)ఆహ్వాయ పేరు
आह्वायक(పు)ఆహ్వాయక సందేశహరుడు
इंद्रायुध(న)ఇంద్రాయుధ ఇంద్రధనుస్సు
इंद्रिय(న)ఇంద్రియ జ్ఞాన కర్మేంద్రియములు
इंद्रियार्ध(పు)ఇంద్రియార్ధ శబ్ద స్పర్శరూప రస
గంధములు
इंधन(న)ఇంధన కట్టెలు,సమిధలు
इक्षु(పు)ఇక్షు చెరకు
इच्छा(స్త్రీ)ఇచ్ఛా కోరిక
इतः(అ)ఇతః ఇక్కడనుండి,ఇందువలన
इतर(వి)ఇతర వేరైన
इति(అ)ఇతి అని
इतिहास(పు)ఇతిహాస చరిత్ర
इत्थम्(అ)ఇత్థమ్ ఇట్లు
इदम्(త్రి)ఇదమ్ ప్రథమ పురుష ,సర్వనామ
శబ్దము
इदानीम्(అ)ఇదానీమ్ ఇప్పుడు
इद्ध(అ)ఇద్థా స్పుటముగా
इन्दिरा(స్త్రీ)ఇన్దిరా లక్ష్మి
इन्दु(పు)ఇన్దు చంద్రుడు
इन्द्र(పు)ఇన్ద్ర దేవేంద్రుడు,ప్రభువు
इव(అ)ఇవ వలె
इषु(పు)ఇషు బాణము
इषुधि(పు)ఇషుధి అమ్ములపొది
इष्टि(స్త్రీ)ఇష్టి యాగము
इह(అ)ఇహ ఇక్కడ
ईक्षण(న)ఈక్షణ చూపు,చూచుట
ईड्य(వి)ఈడ్య పొగడదగిన
ईति(స్త్రీ)ఈతి ప్రవాసము,అతివృష్టి మొ..
బాధలు
ईश(పు)ఈశ ప్రభువు,శివుడు
ईशान(పు)ఈశాన ప్రభువు,శివుడు
ईश्वर(పు)ఈశ్వర ప్రభువు,శివుడు
ईषत्(అ)ఈషత్ కొంచెము
ईहा(స్త్రీ)ఈహా కోరిక
ईहामृग(పు)ఈహామృగ తోడేలు