Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ

Wikibooks నుండి
అంకురం, మొగ్గ मुकुल(పు),(న)ముకుల
అంకుశం, ములుగర్ర सृणि/सृणी(స్త్రీ)సృణి /సృణీ
అంకుశము अंकुश(పు).(న) అంకుశ
అంకుశము शृंणि(పు)శృంణి
అంగడి आपण(పు)ఆపణ
అంగడి विपणि/विपणी(స్త్రీ)విపణి / విపణీ
అంగడివీథి पण्यवीथिका(స్త్రీ)పణ్యవీథికా
అంగడివీథి हट्ट(పు)హట్ట
అంగీకారము अभ्युपगम(పు)అభ్యుపగమ
అంతఃపురం, గట్టు, ఒడ్డు अवदरोध(పు)అవదరోధ
అంతఃపురము भोगवास(పు)భోగవాస
అంతఃపురము शुद्धान्त(పు)శుద్ధాన్త
అంతట सर्वत्र(అ)సర్వత్ర
అంతమాత్రము तावत्(అ)తావత్
అంతరాయము,ఎడము विच्छेद(పు)విచ్ఛేద
అందం, అదృష్టం सौभग/सौभाग्य(న)సౌభగ / సౌభాగ్య
అందం,కాంతి शोभन(న)శోభన
అందం,కాంతి शोभा(స్త్రీ)శోభా
అందగత్తె सुंदरी(స్త్రీ)సుందరీ
అందగత్తె सुभ्रू(స్త్రీ)సుభ్రూ
అందగత్తె सुमुखा/सुमुखी(స్త్రీ)సుముఖా / సుముఖీ
అందము सौंदर्य(న)సౌందర్య
అందము,కాంతి,రుచి लावण्य(న)లావణ్య
అందము,ప్రేమచేష్ట लालित्य(న)లాలిత్య
అందము,రసంపేరు शृंगार(పు)శృంగార
అందము,సొగసు रामणीयक(న)రామణీయక
అందమైన चारु(వి)చారు
అందమైన रमणीय(వి)రమణీయ
అందమైన रम्य(వి)రమ్య
అందమైన रामणीयक(వి)రామణీయక
అందమైన रूप्य(వి)రూప్య
అందమైన ललाम(వి)లలామ
అందమైన सुंदर(వి)సుందర
అందమైన सुदर्शन(వి)సుదర్శన
అందమైన, ప్రియమైన,తీయని मंजु/मंजुल(వి)మంజు / మంజుల
అందమైన,అదృష్టంగల सुभग(వి)సుభగ
అందమైన,తీయని,ఇష్టమైన वल्गु(వి)వల్గు
అందమైన,ప్రకాశించు शोभन(వి)శోభన
అందమైన,మనోహరమైన हारि(వి)హారి
అందమైన,మూఢ,తిన్నని मुग्ध(వి)ముగ్ధ
అందమైన,యిష్టమైన मनोज्ञ(వి)మనోజ్ఞ
అందమైన,శుభమైన,అర్హమైన भव्य(వి)భవ్య
అందమైన,సమర్థమైన पेशल(వి)పేశల
అందరిలో చిన్న यविष्ठ(వి)యవిష్ఠ
అందరు చెప్పుకొనుమాట वदन्ती(స్త్రీ)వదన్తీ
అందె नूपुर(పు)నూపుర
అందెలధ్వని सिंजित(న)సింజిత
అకస్మాత్తుగా, అనుకోకుండా एकपदे(అ)ఏకపదే
అకారాద్యక్షరములు वर्णमाला(స్త్రీ)వర్ణమాలా
అక్క अग्रजा(స్త్రీ)అగ్రజా
అక్క కొడుకు, చెల్లెలికొడుకు स्वस्रीय(పు)స్వస్రీయ
అక్క చెల్లెలు स्वसृ(స్త్రీ)స్వసృ
అక్కడ तत्र(అ)తత్ర
అక్షింతలు अक्षत(పు).(న)అక్షత
అగడ్త परिखा(స్త్రీ)పరిఖా
అగ్ని ज्वलन(పు)జ్వలన
అగ్ని रोहिताश्व(పు)రోహితాశ్వ
అగ్ని लोहिताश्व(పు)లోహితాశ్వ
అగ్ని वह्नि(పు)వహ్ని
అగ్ని वैश्वानर(పు)వైశ్వానర
అగ్ని, ఉత్పాతము, తోకచుక్క धूमकेतु(పు)ధూమకేతు
అగ్ని,తేజస్సు बर्हस्(పు)బర్హిస్
అగ్నికణము स्फुलिंग(పు),(న)స్ఫులింగ
అగ్నిలోవ్రేల్చుట,యజ్ఞం हूम(పు)హోమ
అగ్రజుడు,అన్న पूर्वज(పు)పూర్వజ
అట किल(అ)కిల
అడవి अरण्य(న)అరణ్య
అడవి कानन(న)కానన
అడవి विपिन(న)విపిన
అడవి కారుచిచ్చు दव/दाव(పు)దవ/ దావ
అడవి పంది क्रोड(పు)క్రోడ
అడవి మనిషి बर्बर(పు)బర్బర
అడవి, చొరరానిది, ఎరుగరానిది गहन(న)గహన
అడవి,తోట,ఇల్లు,నీరు, वन(న)వన
అడవిలో తిరుగువాడు, మృగము वनचर/वनेचर(పు)వనచర / వనేచర
అడుగుట, ప్రార్ధించుట याचना/याच्ञ(స్త్రీ)యాచనా / యాచ్ఞా
అడుగుట, ప్రేమ, విశ్వాసం, పరిచయం प्रणय(పు)ప్రణయ
అడుగుట,ప్రార్ధించుట याचन(న)యాచన
అడుగువాడు,భిక్షుకి याचक(పు)యాచక
అడుసు,బురద कर्दम(పు)కర్దమ
అడ్డగించుట, బంధించుట संरोधन(న)సంరోధన
అడ్డగించుట,బంధించుట संरोध(పు)సంరోధ
అడ్డముగా तिर्यक्(అ)తిర్యక్
అడ్డముగా,మూలగా साचि(అ)సాచి
అడ్డు विघ्न(పు)విఘ్న
అడ్డు,ఆధారం स्तंभ(పు)స్తంభ
అడ్డు,ఆనకట్ట,ఒడ్డు रोध(పు)రోధ
అడ్డులేని निरर्गळ(వి)నిరర్గళ
అణచబడిన प्रतिहित(వి)ప్రతిహిత
అణచుట,శిక్షించుట निग्रह(పు)నిగ్రహ
అణువు,కణము,కొంచెము लेश(పు)లేశ
అతిదూరమైన पराक(వి)పరాక
అతిధి अतिधि(పు)అతిధి
అతిపెద్ద సంఖ్య परार्ध/परार्ध्य(న)పరార్ధ, పరార్ధ్య
అతిశయము उत्कर्ष(పు)ఉత్కర్ష
అతిశయము निर्भर(న)నిర్భర
అత్తగారు श्वश्रू(స్త్రీ)శ్వశ్రూ
అదరుట, మెరయుట स्फुरण(న)స్ఫురణ
అదరుట,కంపం स्पंद(పు)స్పంద
అదరుట,కంపం स्पंदन(న)స్పందన
అదృష్టంగల,సులక్షణ लक्ष्मण(వి)లక్ష్మణ
అదృష్టము अय(పు)అయ
అదృష్టము भागधेय(న)భాగధేయ
అదే ధర్మము గలిగియుండుట साधर्म्य(న)సాధర్మ్య
అదేవయస్సుగల सवयस्(వి)సవయస్
అద్దము दर्पण(పు)దర్పణ
అద్దము सम्मुखिन्(పు)సమ్ముఖిన్
అద్దము,ఆదర్శము आदरु(పు)ఆదరు
అద్దము,మొగ్గ मकुर(పు)మకుర
అద్దము,మొగ్గ मुकुर(పు)ముకుర
అద్భుతము,బొమ్మ चित्रा(న)చిత్రా
అద్భుతమైన, ఆశ్చర్యకరమైన अद्भुत(వి)అద్భుత
అధమ निकृष्ट(వి)నికృష్ట
అధిక కోపము क्रोध(పు)క్రోధ
అధికము अतिशय(పు)అతిశయ
అధికమైన भूरि(వి)భూరి
అధికారము अधिकार(పు)అధికార
అధ్యయనాధ్యాపనయజనయాజనదానప్రతిగ్రహణ అను ఆరుకర్మలు षट्कर्म(పు)షట్కర్మ
అనన్యమైన,నిరతిశయ ऐकांतिक( )ఐకాంతిక
అనాదరం,అవమానం हेड(పు)హేడ
అనాదరము तिरस्कार(పు)తిరస్కార
అని इति(అ)ఇతి
అనికోనిదైన, ఐచ్ఛిక यादृच्छिक(వి)యాదృచ్ఛిక
అను,ఇట్లు,కోప,అంగీకార నిందార్ధములలో नाम(అ)నామ
అనుకరణ, కపటం, వేషం विडंबना(స్త్రీ)విడంబనా
అనుకరణ,కపటం,వేషం विडंब(పు)విడంబ
అనుకరణ,కపటం,వేషం विडंबन(న)విడంబన
అనుకరించు ,పోలు संवदिन्(వి)సంవదిన్
అనుకూల ప్రశ్నార్ధకములలో कच्चित्(అ)కచ్చిత్
అనుకూలమైన प्राध्वं(అ)ప్రాధ్వం
అనుకూలుడు,సమవర్తనము दक्षिण(పు)దక్షిణ
అనుకోకుండా अकस्मातఅకస్మాత్
అనుకోకుండా यदृच्छा(స్త్రీ)యదృచ్ఛా
అనుచరుడు अनुग(పు)అనుగ
అనుచరుడు अनुचर(పు)అనుచర
అనుతాపము पश्चात्ताप(పు)పశ్చాత్తాప
అనుభవము अनुभव(పు)అనుభవ
అనుభవము, సుఖము, పాముపడగ भोग(పు)భోగ
అనుభవించదగిన भोग्य(వి)భోగ్య
అనుమతి अनुमति(స్త్రీ)అనుమతి
అనుసరించుట अनुवर्तन(న)అనువర్తన
అన్న अग्रज(పు)అగ్రజ
అన్నపుగంజి यवागू(స్త్రీ)యవాగూ
అన్నపుముద్ద कबल(పు)కబల
అన్నము ओदन(న)ఓదన
అన్నింటిలో మంచిగా सुतमां(అ)సుతమాం
అన్నిటిలో మంచి साधिष्ट(వి)సాధిష్ఠ
అన్నియు తెలిసిన सर्वज्ञ(పు)సర్వజ్ఞ
అన్నియు వదలుట सन्न्यास(పు)సన్న్యాస
అన్నివిధముల सर्वथा(అ)సర్వథా
అన్నివిధముల सर्वशः(అ)సర్వశః
అన్నివిధముల,అన్నివైపుల सर्वतः(అ)సర్వతః
అన్నివిధములుగా कतिधा(అ)కతిధా
అన్నివైపుల, పూర్తిగా समन्तं/समन्तात्(అ)సమన్తం / సమన్తాత్
అన్యాపదేశం,నింద वक्रोक्ति(స్త్రీ)వక్రోక్తి
అన్యోన్యము मिथः(అ)మిథః
అన్యోన్యమైన परस्परं(అ)పరస్పరం
అపరకర్మలు, మాసికములు,ఆబ్దికములు और्ध्वदैहिक(న)ఔర్ధ్వదైహిక
అపరాధం,అనిష్టం विप्रिय(న)విప్రియ
అపరాధము,పాపము किल्बिष(న)కిల్బిష
అపరాహ్ణము,మధ్యాహ్నం, తరువాతి కాలము पराह्ण(పు)పరాహ్ణ
అపవాదు किंवदंति(స్త్రీ)కింవదంతి
అపేక్ష,కోరిక आशा(స్త్రీ)ఆశా
అప్పిచ్చినవాడు उत्तमर्ण(పు)ఉత్తమర్ణ
అప్పు ऋण(న)ఋణ
అప్పుడు तदा(అ)తదా
అప్పుపుచ్చుకొన్మవాడు अधमर्ण(పు)అధమర్ణ
అప్రధాన,గౌణ,సూచక लाक्षणिक(వి)లాక్షణిక
అప్సరస अप्सरस्(స్త్రీ)అప్సరస్
అభాగం,పాపం,వినాశం रिष्ट(న)రిష్ట
అభావం,విరహం राहित्य(న)రాహిత్య
అభిగమనము,సైన్యవిన్యాసము पत्ति(స్త్రీ)పత్తి
అభిప్రాయం अभिप्राय(పు)అభిప్రాయ
అభిముఖం अर्वाक्(అ)అర్వాక్
అభిషిక్తుడైన రాజపుత్రుడు युवराज(పు)యువరాజ
అమావాస్య अमा / अमावास्य(స్త్రీ)అమా/అమావాస్య
అమృతం,తేనె,సున్నం सुधा(స్త్రీ)సుధా
అమృతము पीयूष(న)పీయూష
అమ్మబడు వస్తువు पण्य(న)పణ్య
అమ్మమ్మ मातामही(స్త్రీ)మాతామహీ
అమ్ముట,అమ్మకం विक्रय(పు)విక్రయ
అమ్ముల పొది तूण(పు)తూణ
అమ్ములపొది निषंग(పు)నిషంగ
అమ్ములపొది इषुधि(పు)ఇషుధి
అమ్ములపొది शरधि(పు)శరధి
అయితే चेत्(అ)చేత్
అయితే यदि(అ)యది
అయిస్కాంతము लोहकान्त(పు)లోహకాన్త
అయ్యా,ఓయి,ఓ भोस्/भोः(అ)భోస్ / భోః
అరటి कदळी(స్త్రీ)కదళీ
అరటిబోదు,అప్సరసపేరు रंभा(స్త్రీ)రంభా
అరుగు,వేలిముద్ర वेदि/वेदी(స్త్రీ)వేది / వేదీ
అరుచుట,మొరుగుట भषण(న)భషణ
అరుదైన विरल(వి)విరల
అరుపు रुत(న)రుత
అరుపు,కేక विराव(పు)విరావ
అరువది षष्टि(స్త్రీ)షష్టి
అర్ఘ్యము मधुपर्क(పు)మధుపర్క
అర్చించుట, షోడశోపచారములుచేయు समाराधन(న)సమారాధన
అర్జునుడు बीभत्सु(పు)బీభత్సు
అర్ధం,అభిప్రాయంగల, సావధానముగా साकूत(వి)సాకూత
అర్ధముగల, ధనంగల सार्थ/सार्थक(వి)సార్థ / సార్థక
అర్ధములేని,ప్రయోజనం లేని अनर्धक(వి)అనర్ధక
అర్ధములేనిమాట,వాగుడు प्रताप(పు)ప్రతాప
అర్ధరాత్రి अर्धरात्र(పు)అర్ధరాత్ర
అర్ధరాత్రి निशीथ(పు)నిశీథ
అర్ధరాత్రి निशीथिनी(స్త్రీ)నిశీథినీ
అర్హత,తగియుండుట योग्यता(స్త్రీ)యోగ్యతా
అలంకరించుకొనుట, దువ్వుకొనుట प्रसाधन(న)ప్రసాధన
అలంకరించుట,నగ मंडन(న)మండన
అలంకరింపబడిన शृंगारित(వి)శృంగారిత
అలంకారం भूषण(న)భూషణ
అలంకారం भूषा(స్త్రీ)భూషా
అల,చంచల वीचि/वीची(స్త్రీ)వీచి / వీచీ
అలసుడు,మొక్కపోయినవాడు कुंठ(పు)కుంఠ
అలుపు,బడలిక श्रान्ति(స్త్రీ)శ్రాన్తి
అల్పుడు,తెలియనివాడు पामर(పు)పామర
అల్పుడు,నీచుడు नीच(పు)నీచ
అల్పుడు,పామరుడు प्राकृत(పు)ప్రాకృత
అల్లిన జడ,కొప్పు केशपक्ष/केशपाश/केशहस्त(పు)కేశపక్ష,కేశ పాశ, కేశహస్త
అల్లినజుట్టు,జడ सट(న)సట
అల్లినజుట్టు,జడ सटा(స్త్రీ)సటా
అల్లుడు जामातृ(పు)జామాతృ
అవమానం, భవనం, ఆకాశయానం विमान(పు),(న)విమాన
అవమానము अवज्ञा(స్త్రీ)అవజ్ఞా
అవమానము परिभव(పు)పరిభవ
అవయవము अवयव(పు)అవయవ
అవయవము प्रतीक(పు)ప్రతీక
అవయవము, శరీరము अंग(న)అంగ
అవరోధము प्रतिबंध(పు)ప్రతిబంధ
అవసరము,క్రమం पर्याय(పు)పర్యాయ
అవస్థ दशा(స్త్రీ)దశా
అవహేళన, గేలిచేయు अवहेळन(న)
అశోక వృక్షము अशोक(పు)అశోక
అసత్యం मृषावाद(పు)మృషావాద
అసత్యం, అప్రియం, అపరాధ व्यलीक(వి)వ్యలీక
అసత్యము अनृत(న)అనృత
అసత్యము अलीक(న)అలీక
అసత్యమైన,వ్యర్థమైన वितथ(వి)వితథ
అసాధారణ लोकोत्तर(వి)లోకోత్తర
అసూయ,మత్సరం मात्सर्य(న)మాత్సర్య
అసూయా, ఈర్ష్యా, మత్సరం असूया(స్త్రీ)
ఆ (కోపంలో / ఆదరంలో) हं(అ)హం
ఆ విధముగా तथा(అ) తథా
ఆకలి क्षुध्/क्षुधा(స్త్రీ)క్షుధ్, క్షుధా
ఆకలి बुभुक्षा(స్త్రీ)బుభుక్షా
ఆకలి కలిగించునది, ఇష్టమైనది रोचक(న)రోచక
ఆకలిగొన్న बुभुक्षित(వి)బుభుక్షిత
ఆకారం,అందము रूप(న)రూప
ఆకాశం,అంతరిక్షం वियत्(న)వియత్
ఆకాశ గంగ, స్వర్ణ గంగ मंदाकिनी(స్త్రీ)మందాకినీ
ఆకాశము अंतरिक्ष(న)అంతరిక్ష
ఆకాశము आकाश(పు)ఆకాశ
ఆకాశము गगन(న)గగన
ఆకాశము नभस्(న)నభస్
ఆకాశము व्योमन्(న)వ్యోమన్
ఆకాశము,నీరు,పద్మము पुष्कर(న)పుష్కర
ఆకాశము,వస్త్రము अंबर(న)అంబర
ఆకాశము,స్వర్గము नाक(పు)నాక
ఆకు दल(న)దల
ఆకు पर्ण(న)పర్ణ
ఆకు,రెక్క छद(పు)ఛద
ఆకుపచ్చని हरि/हरित(వి)హరి / హరిత
ఆకుపచ్చరాయి मरकत(న)మరకత
ఆకులు మున్నగునవి కదులు శబ్దం मर्मर(పు)మర్మర
ఆకృతి,రూపము आकार(పు)ఆకార
ఆక్రోశము हाहाकार(పు)హాహాకార
ఆగిపోయిన,నిలిచిపోయిన स्तब्ध(వి)స్తబ్ధ
ఆగ్రహం,ఆవేశం,గొడవ रभस(పు)రభస
ఆచరించుట आचरण(న)ఆచరణ
ఆచారం,వృద్ధి,ప్రసిద్ధి रूढि(స్త్రీ)రూఢి
ఆచ్చాదనం,కప్పు संवरण(న)సంవరణ
ఆజ్ఞ निर्देश(పు)నిర్దేశ
ఆజ్ఞ,ఆనతి आज्ञा(స్త్రీ)ఆజ్ఞా
ఆజ్ఞ,రాజ్యం,దండన शिष्टि(స్త్రీ)శిష్టి
ఆజ్ఞ,రాజ్యం,నియమం शासन(న)శాసన
ఆటంకము లేని अनर्गळ(వి)అనర్గళ
ఆట क्रीडा(స్త్రీ)క్రీడా
ఆట खेला(స్త్రీ)ఖేలా
ఆటగాడు, జూదగాడు, దుర్మార్గుడు कितव(పు)కితవ
ఆటవికుడు किरात(పు)కిరాత
ఆటవికుడు,గిరిజనుడు शबर(పు)శబర
ఆటస్తలం विक्रीड(పు)విక్రీడ
ఆడంబరంగల साटोप(వి)సాటోప
ఆడ ఏనుగు,లేగ ఆవు धेनुका(స్త్రీ)ధేనుకా
ఆడ కుక్క शुनी(స్త్రీ)శునీ
ఆడఏనుగు हस्तिनी(స్త్రీ)హస్తినీ
ఆడగుర్రము बडबा(స్త్రీ)బడబా
ఆడతుమ్మెద बंभराली(స్త్రీ)బంభరాలీ
ఆడతుమ్మెద भ्रमरी(స్త్రీ)భ్రమరీ
ఆడనక్క शृगाली/शृगालिका(స్త్రీ)శృగాలీ / శృగాలికా
ఆడబిడ్డ,మగనితోబుట్టినది ननांदृ(స్త్రీ)ననాందృ
ఆడుగుర్రం वामी(స్త్రీ)వామీ
ఆడుగుర్రం,దాసి,వేశ్య वडवा(స్త్రీ)వడవా
ఆడుపాము सर्पिणी(స్త్రీ)సర్పిణీ
ఆడుమేక अजा(స్త్రీ)అజా
ఆదరం,గౌరవె सम्मान(పు)సమ్మాన
ఆదరము లేని अनादर(పు)అనాదర
ఆదుర్దా औत्कंठ्य(న)ఔత్కంఠ్య
ఆదుర్దా उत्कंठा(స్త్రీ)ఉత్కంఠా
ఆదుర్దా గలవాడు उत्क(పు)ఉత్క
ఆదుర్దాగల सोत्क/सोत्कंठ(వి)సోత్క / సోత్కంఠ
ఆధారము आधार(పు)ఆధార
ఆధిక్యము,సంపద भूमन्(పు)భూమన్
ఆనందం,సంతోషం मोद(పు)మోద
ఆపద आपथ्(స్త్రీ)ఆపథ్
ఆపద विपद्/विपदा(స్త్రీ)విపద్ / విపదా
ఆపుట,అంతము विराम(పు)విరామ
ఆబోతు गोपति(పు)గోపతి
ఆముదము చెట్టు एरंड(పు)ఏరండ
ఆయముపట్టు मर्मन(న)మర్మన
ఆయుధము अस्त(న)అస్త
ఆయుధము आयुध(న)ఆయుధ
ఆయుధము शस्त्र(న)శస్త్ర
ఆయుర్ధాయము आयुस्(న)ఆయుస్
ఆరంభము, అవినయం, ఆవేశము संरंभ(పు)సంరంభ
ఆరగల,షడ్విధ षट्क(వి)షట్క
ఆరవ षष्ट(పు),(న)షష్ఠ
ఆరవదినము,తిథి षष्ठी(స్త్రీ)షష్ఠీ
ఆరవభాగం పన్నుగాగొను రాజు षष्ठांशवृत्ति/षष्ठांशभाज्(పు)షష్ఠాంశవృత్తి / షష్ఠాంశభాజ్
ఆరాధనం,సాధనం संराधन(న)సంరాధన
ఆరిటిగుంపు षट्क(న)షట్క
ఆరుగురు తల్లులుగల కుమారస్వామి षड्गुण/षाड्गुण्य(న)షడ్గుణ / షాడ్గుణ్య
ఆరుముఖ్యశరీర భాగములు,శిక్షాది 6 వేదాంగ षडंग(న)షడంగ
ఆరువిధములుగా षड्धा/षोढा(అ)షడ్‌ధా / షోఢా
ఆరుసంఖ్యగలది,విస్తరించుట कर्मन्(న)కర్మన్
ఆరోగ్యం,సుఖం स्वास्थ्य(న)స్వాస్థ్య
ఆరోగ్యం,సుఖం,శుభం वार्त(న)వార్త
ఆరోగ్యము आरोग्य(న)ఆరోగ్య
ఆరోపణ अभियोग(పు)అభియోగ
ఆర్జించుట,పొందుట संपादन(న)సంపాదన
ఆర్తనాదము आक्रंद(పు)ఆక్రంద
ఆలంబన,ఆధారం संस्तंभ(పు)సంస్తంభ
ఆలమంద गोकुल(న)గోకుల
ఆలస్యం विलंब(పు)విలంబ
ఆలస్యము आलस्य(న)ఆలస్య
ఆలుమగలు जंपती(పు).ద్(వి).జంపతీ
ఆలుమగలు जायापति(పు).ద్(వి).జాయాపతి
ఆలుమగలు दंपती(పు).ద్(వి).దంపతీ
ఆలోచన,చింత विचार(పు)విచార
ఆలోచనతో सविमर्शं(అ)సవిమర్శం
ఆలోచించుట मंत्रण(న)మంత్రణ
ఆవలిగట్టు पार(న)పార
ఆవాలు तुंदभ(పు)తుందభ
ఆవాలు सर्षप(పు)సర్షప
ఆవాహనాది పదియారు సేవలు (పెద్దలకు/దేవతలకు षोडशोपचार(పు)షోడశోపచార
ఆవిరి,కన్నీరు बाष्प(పు)బాష్ప
ఆవు,భూమి,జలము,వాక్కు,దిక్కు गो(స్త్రీ)గో
ఆవుపాలు, మున్నగునవి गव्य(న)గవ్య
ఆవుపేడ गोमय(పు),(న)గోమయ
ఆవులింత जृंभ(పు)జృంభ
ఆవులింత जृंभण(న)జృంభణ
ఆశ,దప్పిక तृष्णा(స్త్రీ)తృష్ణా
ఆశపెట్టుట लोभन(న)లోభన
ఆశపెట్టుట विमोहन(న)విమోహన
ఆశలేని नैराश्य(న)నైరాశ్య
ఆశ్చర్యం,గర్వం स्मय(పు)స్మయ
ఆశ్చర్యదుఃఖకారణార్ధములలో हे(అ)హే
ఆశ్చర్యము आश्चर्य(న)ఆశ్చర్య
ఆశ్చర్యము विस्मय(పు)విస్మయ
ఆశ్రమము, ఆలయం, విహారము मठ(పు),(న)మఠ
ఆసక్తమైన व्यग्र(వి)వ్యగ్ర
ఆసక్తమైన,నిమగ్నమైన व्यापृत(వి)వ్యాపృత
ఆసక్తి कुतूहल(న)కుతూహల
ఆసక్తి,ఆదుర్దా,కోరికగల लालस(వి)లాలస
ఆసక్తి,ఇష్టము आसक्ति(స్త్రీ)ఆసక్తి
ఆసక్తి,కృషి व्यासंग(పు)వ్యాసంగ
ఆసక్తి,నమ్మకం श्रद्धा(స్త్రీ)శ్రద్ధా
ఆసక్తిగల तत्पर(వి)తత్పర
ఆసక్తిలేని विमुख(వి)విముఖ
ఆసనము पीठ(న)పీఠ
ఆసనము,వృక్షము विष्टर(పు)విష్టర
ఆహారం సమృద్ధిగాగల सुभिक्ष(న)సుభిక్ష
ఆహారము अन्न(న)అన్న
ఆహారము आहार(పు)ఆహార
ఇంటి పేరిటివాడు,దాయాది ज्ञाति(పు)జ్ఞాతి
ఇంటి ముంగిలి प्रघण(పు)ప్రఘణ
ఇంటి యజమాని गृहपति(పు)గృహపతి
ఇంటికప్పు,సమూహము पटल(న)పటల
ఇంతలో,ఎంతయోవరకు यावत्(అ)యావత్
ఇందువలన,నుండి अतः(అ)అతః
ఇంద్ర సంబంధమైన ऐन्द्र(వి)ఐన్ద్ర
ఇంద్రధనుస్సు इंद्रायुध(న)ఇంద్రాయుధ
ఇంద్రియము हृषीक(న)హృషీక
ఇంద్రుడు श्वेतवाह/श्वेतवाहन(పు)శ్వేతవాహ / శ్వేతవాహన
ఇంద్రుడు मघव/मघवत्(పు)మఘవ / మఘవత్
ఇంద్రుని గజము ऐरावत(పు)ఐరావత
ఇంపైన हृद्य(వి)హృద్య
ఇక్కడ अत्र(అ)అత్ర
ఇక్కడ इह(అ)ఇహ
ఇక్కడనుండి,ఇందువలన इतः(అ)ఇతః
ఇచ్చుట दान(న)దాన
ఇచ్చుట,తెలుపుట प्रतिपादन(న)ప్రతిపాదన
ఇట్లు आयतन(న)ఆయతన
ఇట్లు इत्थम्(అ)ఇత్థమ్
ఇట్లు एवम्(అ)ఏవమ్
ఇతరుడు अन्य(పు)అన్య
ఇతరుల వశమైన पराधीन(వి)పరాధీన
ఇద్దరిలోచిన్నవాడు यवीयस्(వి)యవీయస్
ఇద్దరు उभय(పు).ద్(వి)ఉభయ
ఇనుపపనివాడు लोहकार(పు)లోహకార
ఇనుము अयस्(న)అయస్
ఇనుముతో చేయబడిన आयस(పు)(స్త్రీ)ఆయస
ఇనుముతో చేయబడిన आयसी(స్త్రీ)ఆయసీ
ఇనుమురాగి మున్నగునవి लोह(పు),(న)లోహ
ఇప్పటి,జరుగుతున్న वर्तमान(వి)వర్తమాన
ఇప్పుడు अधुना(అ)అధునా
ఇప్పుడు इदानीम्(అ)ఇదానీమ్
ఇప్పుడు एतर्हि(అ)ఏతర్హి
ఇప్పుడు संप्रति(అ)సంప్రతి
ఇప్పుడు,నేడు अद्य(అ)అద్య
ఇప్పుడు,యుక్తంగా सांप्रतं(అ)సాంప్రతం
ఇరువది विंशति(స్త్రీ)వింశతి
ఇరుసు,ముఖ్యమైన,కస్తూరి नाभि(స్త్రీ)నాభి
ఇల్లు गृह(న)గృహ
ఇల్లు निकेतन(న)నికేతన
ఇల్లు वेश्मन्(న)వేశ్మన్
ఇల్లు,ఆసనం सदन(న)సదన
ఇల్లు,జెండా,చిహ్నం केतन(న)కేతన
ఇల్లు,తావు ओकस्(న)ఓకస్
ఇల్లు,పట్టణము पुर(న)పుర
ఇల్లు,బస निलय(పు)నిలయ
ఇల్లు,బస निवेश(పు)నివేశ
ఇల్లు,వస్త్రము वसन(న)వసన
ఇష్టపడిన,పోలిన सम्मत(వి)సమ్మత
ఇష్టమునుబట్టిన ऐच्छिक(వి)ఐచ్ఛిక
ఇష్టములేకపోవుట वैराग्य(న)వైరాగ్య
ఇష్టమైన,ప్రియమైన प्रिय(వి)ప్రియ
ఇష్టురాలు,భార్య प्रेयसी(స్త్రీ)ప్రేయసీ
ఇసుక वालुका(స్త్రీ)వాలుకా
ఇసుక सिकता(స్త్రీ).సికతా
ఇసుకగల सिकतल(వి)సికతల
ఇసుకతిన్నె पुलिन(న)పులిన
ఇసుకతో నిర్మించిన सैकत(వి)సైకత
ఈగ मक्षिक(పు)మక్షిక
ఈగ,పొగ भंभ(పు)భంభ
ఈర్ష్య,అసహనం मत्सर(పు)మత్సర
ఈలోక సంబంధమైన ऐहिक(వి)ఐహిక
ఉంగరము अंगुळीयक(న)అంగుళీయక
ఉంగరాల జుట్టుగల चूर्णकुंतल(వి)చూర్ణకుంతల
ఉంచటం,గుర్తు न्यास(పు)న్యాస
ఉంచబడిన विन्यस्त(వి)విన్యస్త
ఉంచిన,మంచి,తగిన हित(వి)హిత
ఉండుట, జీవితం, ప్రాణి, ధనం,స్వభావం सत्त्व(పు),(న)సత్త్వ
ఉచిత భావము औचिती(స్త్రీ)ఔచితీ
ఉచిత భావము औचित्य(న)ఔచిత్య
ఉచిత,హిత,సమర్థ क्षम(వి)క్షమ
ఉత్తమ పురుష, సర్వనామ, శబ్దము अस्मद्(త్రి)అస్మద్
ఉత్తమమైన प्रमुख(వి)ప్రముఖ
ఉత్తరం,ధ్యానం समाधान(న)సమాధాన
ఉత్తరీయము प्रावरण(న)ప్రావరణ
ఉత్తరీయము प्रावार(పు)ప్రావార
ఉత్సాహము उत्साह(పు)ఉత్సాహ
ఉదయకాలము, ప్రాతఃకాలము प्रभात(న)ప్రభాత
ఉదార భావము औदार्य(న)ఔదార్య
ఉదారమైన उदार(వి)ఉదార
ఉదాహరణము दृष्टान्त(పు)దృష్టాన్త
ఉద్దేశము आशय(పు)ఆశయ
ఉద్యమము यत्न/यतन(న)యత్న / యతన
ఉద్యోగం/స్ధానం అడుగు पद(న)పద
ఉద్రేకము,రెచ్చిపోవుట उद्रेक(పు)ఉద్రేక
ఉనికి आसना(స్త్రీ)ఆసనా
ఉన్నట్టి भवत्(వి)భవత్
ఉన్నదంతయు सर्वस्व(న)సర్వస్వ
ఉన్నదు,మంచిది सत्(వి)సత్
ఉపనయనాది, సంస్కారములేని బ్రాహ్మణుడు,క్షుద్రుడు व्रात्य(పు)వ్రాత్య
ఉపనిషత్తు उपनिषद्(స్త్రీ)ఉపనిషద్
ఉపనిషత్తు वेदान्त(పు)వేదాన్త
ఉపన్యాసము उपन्यास(పు)ఉపన్యాస
ఉపవాసం, తినకుండుట उपवास(పు)ఉపవాస
ఉపాయం, పనిముట్టు, శెలవుగొనుట, పొందుట साधन(న)సాధన
ఉపాయం,కారణం युक्ति(స్త్రీ)యుక్తి
ఉపాయము, వ్యూహము, శిక్ష, దుడ్డుకోల,ఆజ్ఞ दंड(పు)దండ
ఉప్పు,సముద్రం लवण(న)లవణ
ఉరుము विस्फूर्जथु(పు)విస్ఫూర్జథు
ఉరుము,పెద్ద అరుపు गर्जित(న)గర్జిత
ఉలికిపడిన,భయపడిన सचकित(వి)సచకిత
ఉషః కాలము कल्य(పు)కల్య
ఊడ్చుట,తుడుచుట सम्मार्जन(న)సమ్మార్జన
ఊదుట फूत्कार(పు)ఫూత్కార
ఊపిరితిత్తి జబ్బు श्वासकास(పు)శ్వాసకాస
ఊయల दोला/डोला(స్త్రీ)దోలా/ డోలా
ఊరకనున్న तूष्णिक(వి)తూష్ణీక
ఊరకనే तूष्णं(అ)తూష్ణీం
ఊలు ऊर्ण(న)ఊర్ణ
ఊలు ऊर्णा(స్త్రీ)ఊర్ణా
ఊహ अध्याहार(పు)అధ్యాహార
ఊహ ऊहा(స్త్రీ)ఊహా
ఊహ तर्क(పు)తర్క
ఊహ,కల్పన,ఆలోచన भावन(న)భావన
ఊహ,కల్పన,ఆలోచన भावना(స్త్రీ)భావనా