త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)
స్వరూపం
త్రిభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు-హింది)ని పెద్ది సాంబశివరావు గారు రచించారు. ఇది 2017లో ప్రచురింపబడింది.
తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలకు, బాగా కనిపిస్తున్నది. అందుకు మూడు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ త్రిభాషా నిఘంటువును ప్రచురిస్తున్నాము.