తెలుగు-తెలుగు నిఘంటువు/హ
స్వరూపం
| హంగామ | v,n | హడావిడి, గందరగోళం; ఆర్భాటం; |
| హంగు | n | ఒనరు, ఆనుకూల్యం, డాబు, దర్పం, అట్టహాసం, కార్యసిద్ధి కోసం వెనుక నుంచి చేసే ప్రయత్నం |
| హంత | n | చంపేవాడు; హింసించేవాడు, తొలగించే వాడు, ధ్వంసం చేసేవాడు, దొంగ, దుష్టురాలు, మాయ, మోసం, మోసగత్తె |
| హంస | n | అంచ; శ్వేతగరుత్తు, మానసౌకసం, సత్వతేజ, పాలూనీరూ వేరుచేసే పులుగు, తెలిపిట్ట, పరమాత్మ, యోగివిశేషం, తెల్లగుర్రం, శరీరవాయు విశేషం, మంత్రభేదం, మాత్సర్యం, దున్నపోతు, తీర్థం, శాఖోత్పత్తి జరిగే చెట్టుభాగం, ఒక చెట్టు, హాస్యరసం, నవ్వు |
| హంసపాదం | n | రాతలో తప్పుఉండే చోట ఉండే హంస పాద ఆకారపు గుర్తు , హంసపాదు,సిందూరం, పాదరసం |
| హంసయానం | n | అంచనడకలాంటి నడక; అంచలుగా లాగబడే వాహనం |
| హక్కులు | n | బాధ్యతలు, అధికారం, ఆస్తి మొదలైనవాటి మీద స్వామ్యం |
| హట్టభూమి | n | అంగడిభూమి,సంత; |
| హఠం | n | పట్టుదల, మొండితనం,మారాం; బలాత్కారం, నాచు, తూటికూర, యోగవిశేషం, దౌర్జన్యం, పీడనం, అత్యావశ్యకత, శత్రువు వెనుక సురుగుట, ఆకస్మికలాభం |
| హఠాత్తుగా | అవ్య ఉన్నట్టుండి , తటుక్కున, అకస్మాత్తుగా | |
| హడలిపోవు | n | మిక్రి భయపడు; చంపడం;కొట్టడం, బాధింపబడినది, నష్టమైనది, కొల్లగొట్టబడినది, నిరాశపొందినది, అడ్డగింప బడినది, దీనమైనది |
| హడావుడి | n | తొందరపాటు,కంగారు; |
| హతం (బుగ) జేయడం | v | చచ్చేట్టుగా చేయడం, నశింపచేయడం |
| హతాశుడు | n | ఆశ కోల్పోయినవాడు కోరికతీరనివాడు, జాలిలేనివాడు విషణుడు, శక్తి హీనుడు, దయారహితుడు, వ్యర్ధుడు, నీచుడు |
| హతి | n | దెబ్బ, నష్టం, అపజయం, లోపం,చంపడం |
| హతుడు | n | చంపబడినవాడు,కొట్టబడినవాడు, నిరాశ చెందిన వాడు, అడ్డగింపబడిన వాడు, పూర్తిగా ధ్వంసం చేయబడినవాడు, దీనుడు |
| హత్తు | n | హృదయం, రొమ్ము, ఆత్మ, అంతసారం |
| హత్తు | v | చేరు, సమీపించు, కలుగు, అంటు, లగ్నమగు, నాటుకొను, ఉండు, కలియు, అనుకూలించు, పొందు |
| హత్తుకొను | v | నాటుకొను, లగ్నమగు, నెలకొను, నాటుకొను, కూడు,చేరు |
| హత్య | n | చంపడం, వధ, వధవల్ల కలిగిన పాపం |
| హద్దు | దే అవధి, మేర, ఆజ్ఞ | |
| హననం | n | చంపడం, కొట్టడం, బాధించడం, గుణించడం, డోలు వాయించే కర్ర, ఒకరకమైన క్రిమి |
| హనుమంతుడు | n | ఆంజనేయుడు హనువు (వెలిగౌడ) కలవాడు హనుమానుడు, వాయునందనుడు, వాయుపుత్రుడు, అను మంత్రిగాడు, అనుమడు, పవనతనయుడు, మారుతి, మారుతాత్మజుడు, గాడ్పుచూలి |
| హమాం బాపతు | n | మొత్తం, అమాంబాపతు |
| హమేషా | అవ్య ఎల్లప్పుడు,అవశ్యంగా, | |
| హయం | n | గుర్రం, అశ్వం, సప్తసంఖ్య, చమరమృగం,ధనూరాశి |
| హయగ్రీవుడు | n | విష్ణువు అవతారం; ఒక రాక్షసుడు, గుర్రపు కంఠంగల విష్ణువు అవతారం |
| హయాం | n | కాలం, ఏలుబడి, పాలనకాలం; |
| హరించు | v | అపహరించు,దొంగిలించు; నశించు, హరియించు |
| హరి | n | విష్ణువు 1 భక్తుల హృదయాలను ఆకర్షించేవాడువిష్ణువు 2 చీకటిని హరించేవాడు సూర్యుడు, చంద్రుడు 3 గజాదులను హరించేది సింహం నౌనా, ఇంద్రుడు, సూర్యుడు, యముడు, సింహం, గుర్రం, కోతి, పాము, వాయువు, కిరణం, కప్ప, యుద్ధం, అగ్ని, శివుడు, నీరు, చిలుక, పచ్చనిది, బంగారు వర్ణం కలది, దొంగ, మంచి ముత్తెం, కడిమిచెట్టు, హరిగంధం, కుంకుమపూవు, అగరు, చందనం, శివుడు, బ్రహ్మ, నరుడు, కోయిల, నెమలి, భర్తృహరి, సింహరాశి, |
| హరిచందనం | n | పసుపు పచ్చనిరంగుగల గంధం, 1 దేవేంద్రుని సంతోషపెట్టేది ఒక దేవవృక్షం 2 కపిల వర్ణంగల చందనం 3 మామిడి పండు వాసనా, పసుపువన్నే గల చందనం, పచ్చటి శ్రీగంధం, రక్త చందనం, ఒక కల్పవృక్షం,వెన్నెల కుంకుమ |
| హరిణం | n | జింక, లేడి, తెలుపురంగు, బాతు, కిరణాలుకలది, ఎరుపుతో కలిసిన తెలుపువన్నెగలది |
| హరిణాక్షి | n | లేడికన్నులవంటి కన్నులుగలది, స్త్రీ; |
| హరిదాసు | n | విష్ణు భక్తుడువిష్ణువునకు దాసుడు |
| హరిద్రం | n | పసుపువేళ్ళపొడి, పసుపు హరిద్వర్ణం (పచ్చటిరంగు) కలది, చందనవృక్షం, పచ్చనిరసం, నాగకేసర పుష్పచూర్ణం |
| హరిద్వారం | n | ఒక ప్రసిద్ద క్షేత్రం; |
| హరిప్రియ | n | లక్ష్మివ్యు, 1 విష్ణువునకు ప్రియరాలు లక్ష్మి 2 బలరామునికి ఇష్టమైనది కల్లు, భూమి, తులసి, కల్లు, ఏకాదశి, |
| హరివాణం | n | తట్ట, చిన్నపళ్ళెరం, కంచం |
| హరివిల్లు | మివి ఇంద్రధనుస్సు | |
| హరిహరి | అవ్య అయ్యో, అక్కటా, పాపపరిహారసూచకం; | |
| హరిహరుడు | n | శివకేశవులిద్దరు కలిసినదేవుడు |
| హరీమను | సంక్రి చచ్చిపోవు; | |
| హరుడు | n | శివుడు 1 ప్రళయ కాలంలో సర్వాన్ని హరించేవాడు2 భక్తుల పీడను హరించేవాడు |
| హరులు | n | గుర్రాలు; |
| హరువు | n | చక్కదనం, సౌందర్యం,, హరు, విలాసం, విధం, మేలిపని,తగినపని, ఏర్పాటు, మనోజ్ఞత, నాణెం |
| హర్డిల్స్ | n | అడ్డంకి, అవరోధం; |
| హర్త | n | హరించే వాడు,లయకారుడైనహరుడు, గ్రహించే వాడు, దొంగ, సూర్యుడు, శివుడు |
| హర్తాళ్ | n | సమ్మె, అవాంఛనీయ సంఘటనకు నిరసనగా చేసే ఆందోళన, నిరసనగాపని నిలిపేయడం, దుకాణాలు మూసేయడం; |
| హర్మ్యం | n | ప్రాసాదం, మేడ మనస్సును హరించేది, ధనికునిమేడ, పొయ్యి, పాపాత్ములు నివసించే నరకలోకం, |
| హర్యక్షం | n | సింహం కపిలవర్ణంగల కన్నులు కలది |
| హర్యక్షుడు | n | కుబేరుడు; |
| హర్షం | n | సంతోషం, ఆనందం, పులికించడం, ఒక సంచారీ భావం, కామోద్రేకం, గాఢాభిలాష |
| హర్షధ్వానాలు | n | సంతోషంతో చప్పట్లు కొట్టడం; |
| హర్షించు | v, n | సంతోషపడు; హలం, నాగలి,ఆయుధం, భూమిని కొలిచే మానం, అంగవైకల్యం, ఆటంకం |
| హలాయుధుడు | n | బలరాముడు;మడక దున్నేవాడు హలం ఆయుధంగా కలవాడు |
| హల్లు | n | కకారం మొదలుగా ఉన్న వ్యంజనాలు; |
| హవణించు | v | అలంకరించు, తాల్చు, చక్కబరచు, ఉంచు; పొందు, తిరస్కరించు, రచించు,విజృంభించు |
| హవనం | n | హోమం, సుక్కు, స్రువం, ఆహ్వానం, అగ్ని, హోమకుండం |
| హవల్దారు | n | సిపాయిల పటాలానికి నాయకుడు; |
| హవిస్సు | n | అగ్నిలో వేల్చే అన్నం,నేయి వంటివి 2 అగ్నిహోత్రంలో వేల్చడానికి ఇవురబెట్టిన అన్నం, నేయి |
| హవేలీ | n | నగరు, రాజుకుచెందింది |
| హవ్యం | n | హోమద్రవ్యం, దేవతలకు ఈయ దగిన అన్నం, హోమం చేయదగినది, నేయి,యజ్ఞాల్లో దేవతల కర్పించేది |
| హవ్యకవ్యాలు | n | దేవతలకు, పితృదేవతలకు అర్పించే హోమద్రవ్యాలు |
| హవ్యవాహనుడు | n | అగ్ని హవ్యాన్ని మోసుకొని పోయేవాడు |
| హసనం | n | నవ్వు;రూ |
| హసించు | v | నవ్వు, హాసంచేయు; పరిహసించు; |
| హసితం | n | నవ్వేది, వికసించింది, నవ్వు, వేళాకోళం, మన్మథుని విల్లు, |
| హస్తం | n | చేయి, పరోక్షభాగస్వామ్యం/ ప్రేరణ, చేవ్రాలు, తొండం, సాయం, తార్కాణ, నేర్పు, గుంపు, మూర, హస్త చెట్టు, |
| హస్తగతం | n | చేజిక్కినది, పొందబడినది, వశమైనది |
| హస్తపకుడు | n | మావటివాడు,ఒరికాడు, హస్తిపుడు |
| హస్తలాఘవం | n | చేతినేర్పు; గారడీ; కనుకట్టు విద్య |
| హస్తి | n | ఏనుగు, హస్తంకలవాడువ్యు , హస్తం కలది |
| హస్తినాపురం | n | కురురాజధాని యైన ఒక పట్టణం; |
| హాజరు | n | ఉప స్థితి, ఉనికి ఉండటం, వెళ్ళడం |
| హాటకగర్భుడు | n | బ్రహ్మ గర్భంలో హాటకం (బంగారం)కలవాడు |
| హాని | n | కీడు, విడువడం, తక్కువకావడం, నష్టం, లోపం, గతి |
| హాబీ | n | అభిరుచి, అభిరుచిగల విషయం; |
| హామీ | n | వాగ్దానం; |
| హాయి | n | సుఖం; సంతోషం; |
| హారం | n | దండ, గొలుసు, 180 పేటల ముత్యాలపేరు, పుష్పమాలిక, భిన్నాంకాలలో లవం కిందిది, యుద్ధం, హార సంబంధమైనది, హరించేది |
| హారతి | n | నీరాజనం, ఆరతి; హారన్, (మోటారు) వాహనాల్లో ధ్వనిచేసే పరికరం |
| హార్టువీకనెస్ | n | గుండె బలహీనత; |
| హార్దం | n | ప్రేమ, దయ; ఉద్దేశం హృదయానికి సంబంధించినది |
| హార్బరు | n | ఓడరేవు; |
| హాలాహలం | సం,వి ఒక విషం;, హలాహలం, సముద్రమథన సమయంలో పుట్టిన భయంకరమైన విషం, రక్తముచ్చిక, బ్రహ్మ నలికండ్లపాము, బల్లి | |
| హాలికుడు | n | కర్షకుడు, రైతు;రూ, హలికుడు, నాగలితో పోరాడేవాడు |
| హాలు | n | చావడి, శాల; |
| హాలుడు | n | బలరాముడు;శాతవాహన వంశపు రాజులలో ఒకడు |
| హావం | n | భ్రూనేత్రాది అవయవాల చేష్టలచే (సంభోగేచ్చ కొద్దిగా) సూచింపబడే మనోవికాసం |
| హాసం | n | నవ్వు, ఆనందం, హాస్యరసస్థాయి భావం, పరిహాసం, వికసించడం, గర్వం |
| హాస్టళ్లు | n | వసతిగృహాలు; |
| హాస్పిటల్ | n | వైద్యశాల; |
| హాస్యం | n | నవ్వు, నవ్వదగినది, నవరసాల్లో ఒకటి,సంతోషం, వేళాకోళం, ఆక్షేపం |
| హాస్యాస్పదం | n | హాస్యానికి చోటు; |
| హాస్యోక్తులు | n | నవ్వుపుట్టించే మాటలు; |
| హాహాకారాలు | n | బిగ్గరగా శోకించడాలు, దుఃఖం, బిగ్గరగా శోకించడం, రణగొణధ్వని |
| హిందోలం | n | ఒకరాగం, 8 పురుషరాగాల్లో ఒకటి,ఉయ్యెల |
| హింస | నంవి ఎదుటి వాడిని బాధించటం, పీడ , హింసన, | |
| హింసించు | v | బాధించు, చంపు, కొట్టు |
| హితం | n | మేలు, వెనుకటికి మేలు చేసేది, పోయినదీ, భరింప బడినది, ఇష్టం, శీఘం, ధరింపబడినది, పొందబడినది, ఉపయోగకరమైనది, ప్రేమగలది, లాభం, క్షేమం |
| హితవరి | n | మేలు చేసేవాడు, మేలు చేసేది, ఇతవరి |
| హితవు | n | ఇష్టం, ప్రీతి, ఇతవు, మేలు కలిగించేది, సఖ్యం, మేలుకలిగించేమాట |
| హితార్థకలితున్ | n | మేలుతో కూడినవాడు, మేలుచేసేవాడు |
| హితుడు | n | మిత్రుడు; ఆపుడు; |
| హితోపదేశం | n | మంచిని బోధించడం; |
| హిమం | n | మంచు తాపాన్ని పోగొట్టేది సౌనా , చల్లనిది, చందనం, చలికాలం, మంచుకొండ, ముత్యం, వెన్న, రాత్రి, |
| హిమకరుడు | n | చంద్రుడు మిహికాకరుడు |
| హిమగిరి | n | మంచుకొండ,హిమాలయపర్వతం |
| హిమాంబువు | n | మంచునీరు; పన్నీరు చల్లటినీరు |
| హిమాంశువు | n | చంద్రుడు; కర్పూరం,వ్యు మిహికాకరుడు |
| హిమాద్రి | n | హిమాలయపర్వతం; |
| హిమాని | n | మంచు, సమూహం; |
| హిమాలయపర్వతం | నంవి హిమవత్పర్వతం, మంచుగలకొండ హిమవంతం, అద్రిరాజం, చలిమల, వలిమల, వలిదిబ్బ, శీతనగం, ముక్కంటి మాను | |
| హిరణ్యం | n | బంగారం పోయేది, ధనం, వెండి, మాడ, గవ్వ, రొక్కం, ఆస్తి, భాగ్యం, ఉమ్మెత్తచెట్టు |
| హిరణ్యగర్భుడు | n | బ్రహ్మ 1 గర్భంలో హిరణ్యం కలవాడు 2 హిరణ్య (బంగారు) మయమైనవాడు,విష్ణువు, సూక్ష్మశరీరంలోని ఆత్మ |
| హీనం | n | లోపం, అల్పం, నీచం,విడువ బడినది, రహితం, శిథిలమైనది, తక్కువైనది, నింద్యం, దోషంతో కూడిన వ్యవకలనం |
| హీనగుణం | n | చెడ్డ అలవాటు; |
| హీనయానం | n | బౌద్ధమతశాఖ |
| హీనుడు | n | తెలివిలేనివాడు; హీనులు అయిదు రకాలుగా ఉంటారు 1 అన్యవాది 2 క్రియాద్వేషి 3 అనుప స్థాయి 4నిరుత్తరుడు 5 ఆహూత ప్రపలాయి |
| హీరం | n | వజ్రం, పాము, కంఠహారం, సింహం, పిడుగు |
| హీరాంగం | n | వజ్రాయుధం;వు , వజ్రమయమైన అంగం కలది |
| హీహీ | పంఅవ్య సంతోషాదులనుతెల్పేది; | |
| హుంకరించు | v | హుం' అని ధ్వనిచేయు హుంకారంచేయు; |
| హుంకారం | నంవి హుమ్మని ధ్వనించడం, అడవి పంది మురురం,ధనుష్టంకారం | |
| హుండీ | n | మొక్కుబళ్ళకోసం ధనాదులను వేసే పాత్ర విశేషం, సొమ్మివ్వడానికి ఆజ్ఞాపత్రిక, మొక్కుబళ్ళకోసం ధనాదులను వేసే పాత్రవిశేషం |
| హుందాగా | n | వి,n గౌరవంగా, గంభీరంగా, ఆజ్ఞ, ఉత్తరువు; |
| హుక్కా | పొగతాగే పొడవాటిగొట్టం; | |
| హుజూరు | n | సముఖం, సన్నిధి; |
| హుటాహుటి | n | గమనవేగం;అతిత్వరితం |
| హుతభుక్ | n | అగ్ని, హుతం (హోమద్రవ్యం)ను భుజించేవాడు, చిత్రమూల వృక్షం, కృత్తిక, వేల్పు, సంఖ్య |
| హుతాశనుడు | n | అగ్ని హుతం అశనం(భోజనం)గా గలవాడు |
| హుమ్మను | v | హుంకరించు, హుం అనే ధ్వనిచేయు; |
| హుళక్కి | n | అభావాన్ని తెలుపుతుంది,నాస్త్యర్థకం; |
| హుషారు | n | జాగరూకత, జాగ్రత్త, సంతోషం, ఉత్సాహం |
| హూణం | n | నలగడం, హూనం, దేశవిశేషం, ఒక విధమైన బంగారు నాణెం, |
| హూణుడు | n | ఆంగ్లేయుడు, విదేశీయుడు, అనాగరకుడు,పర్షియాదేశంలోని ఒకజాతి జనుడు |
| హృదయం | n | మనస్సు,గుండెకాయ; , హరింపబడేది, ఎద, ఎడ, ఎడ్డ, డెందం, మది, ఎడద, ఉల్లం, చిత్తం, చేతం, స్వాంతం, మానసం, ఇచ్ఛ, తలపు, రొమ్ము, ఆత్మ, బుద్ది, సారం, రహస్యం, ప్రేమ, వేదం, తత్వం, అభిప్రాయం |
| హృదయంగమం | n | మనోహరం, మాట, మనస్సుకింపైనది, అందమైనది, సమ్మతమైనది, ప్రియమైనది, అర్హం, ఉచితభాషణం |
| హృదయ విదారకం | n | గుండెను చీల్చేది; |
| హృదయ స్పందనం | n | గుండె కొట్టు కోవడం; |
| హృదయవేదన | n | మనస్సులోని బాధ |
| హృదయాంతరాళం | n | మనస్సుమధ్య; |
| హృదయేశ్వరుడు | n | మనస్సుకు ప్రభువు, భర్త; |
| హృది | n | మనస్సు, ఎద; |
| హృద్యం | n | మనోహరం, |
| హృషీకేశుడు | n | విష్ణువు; (హృషీక+ ఈశుడు), హృషీకాల (ఇంద్రియాల)కు ప్రభువు,విష్ణువు, కృష్ణుడు |
| హృష్ట హృదయుడు | n | సంతోషించిన హృదయం కలవాడు; |
| హెచ్చరించు | v | పురికొలుపు,ప్రోత్సహించు, అవధానాన్ని తెలుపు |
| హెచ్చరిక | n | అవధానం, జాగరూకత;, ఎచ్చరిక, ప్రభువుల అవధానంకోసం వేత్ర ధరులు ఉపయోగించేమాట హెచ్చు , విమించు, అధికమగు;, ఎచ్చు, ఉద్రేకించు, విజృంభించు, ఆధిక్యం, గొప్పదనం |
| హెడ్మాస్టారు | n | ప్రధానో పాధ్యాయుడు |
| హేతి | n | దెబ్బ, గాయం, ఆయుధం, బాణం, సూర్యకిరణం, వెలుతురు, మంట,పనిముట్టు, లేత మొలక, |
| హేతుదృష్టి | n | భగవంతుని అస్తిత్వ విషయాన్ని సందేహించే స్వభావం; |
| హేతువాదం | n | భగవంతుని అస్తిత్వాన్ని సందేహిస్తూ చేసేవాదం; వివాదం, కపటం |
| హేతువు | n | కారణం, మొదలు, తలపు, గురు, సాధనం, ఫలం, ప్రమాణం, ప్రేరకుడు, వెల, ఒక అర్థాలంకారం, పోలిక, నియమం, ఉద్దేశం, హేతు వాదం, విధం |
| హేమం | n | బంగారం లోహాంతరాన్ని కూడి వృద్ధి పొందేది, ఉమ్మెత్త, మంచు, నల్లగుర్రం, గుర్రం, వైశ్వదేవం, దేవయజ్ఞం, నాగకేసరం, జలం, శీతకాలం |
| హేమంతం | n | హేమంత ఋతువు,వ్యు , మార్గశీర్ష పుష్యమాసాలతో కూడిన ఋతువు |
| హేమ | n | అందగత్తె; భూమి |
| హేమాంగం సంపత్తి | n | సంపద, సమృద్ధి, భాగ్యాతిశయం, జయం, తగిన స్థితి, పూర్తి, సిద్ది, సమగ్రత |
| హేమాద్రి | n | సుమేరు పర్వతం, మేరుపర్వతం, బంగారు కొండ, చతుర్వర్గ చింతామణికర్త |
| హేమాహేమీలు | n | గొప్పవారు,పూజ్యులు; |
| హేయం | n | విడువదగినది; |
| హేరంబుడు | n | గణేశుడు,వినాయకుడు, 1 రుద్రుని సమీపంలో ఉండేవాడు 2 భక్తులను వృద్ధిలోకి తెచ్చేవాడు 3 కార్యంచే గర్వించి హే' అని అరచేవాడు, ప్రగల్భవచనుడైన నాయకుడు |
| హేర్ | n | వెండ్రుకలు; |
| హేల | n | లాసం (భూనేత్రాది వికారాలచే స్పష్టంగా తెలియ దగిన మనోవికారం, నదీ విశేషం, సంతోషం, తిరస్కారం, వెన్నెల, సౌలభ్యం, ఏలపాట, (భూనేత్రాది వికారాలచే చక్కగా తెలియదగ్గ మనోవికారం |
| హేలనం | n | అనుమానించడం; వి లాసంగా వినోదించడం |
| హేలావతి | n | లాసం కలది, స్త్రీ; |
| హేషం | n | గుర్రపు సకిలింపు; |
| హేషించు | n | సకిలించు; |
| హేషితం | n | గుర్రపు సకిలింపు; |
| హైకోర్టు | n | ఉన్నత న్యాయస్థానం; |
| హైజంప్ | n | ఎత్తుగా ఎగరడం, ఒక క్రీడ |
| హైమం | n | చల్లనిది, నగ 1 హిమం (మంచు) వల్ల కలిగిన జలాదికం 2 హేమం (బంగారం) వల్ల కలిగిన నగ |
| హైమవతి | n | పార్వతి, హిమవంతుని కుమార్తె , గంగ, రేణకం అనే గంధద్రవ్యం, ద్రాక్షచెట్టు, కరకచెట్టు, |
| హైయంగవం | n | అప్పుడు తీసిన ఆవువెన్న |
| హైరానా | v,n | ఎటుతోచని; తొందరపడిన |
| హైలెస్స | n | నావను నడిపేటప్పుడు శ్రమ తెలియకుండా వాడే ఊతపదం |
| హోం | n | గృహం, రాష్ట్రం, దేశం; |
| హోంవర్కు | n | ఇంటిపని; |
| హోటల్ | ఇం పూటకూళ్ళ ఇల్లు,(డబ్బిచ్చి తినే తాగేచోటు) | |
| హోత | n | యజ్ఞంచేసేవాడు; |
| హోదా | n | పదవి, ఉద్యోగం; |
| హోమం | యజ్ఞం, మంత్రపూర్వకంగా నెయ్యి వంటి పదార్థాలు కుండంలో వేయడం హోమమ్మొనర్చిన సోమయాజి; | |
| హోమం | n | యజ్ఞం;నా , దేవయజ్ఞం, హవిస్సు, వైశ్వదేవం |
| హోమధేనువు | n | హవిస్సుకోసం పాలిచ్చే గోవు |
| హోయలు | n | లాసం, సొగసు, వేడుక |
| హోర | n | రాశి అంశం, అహోరాత్రం, శాస్త్రవిశేషం, రాశ్యర్థం, గంటకాలం, లగ్నభేదం, రేఖాభేదం, జన్మపత్రిక, చిహ్నం, |
| హోరాహోరీ | v | విణ అవిరామంగా,ఎడతెగక; |
| హోలి | n | కాముని పండుగ, తగుల బెట్టడానికి పోగుచేసే గడ్డికంప, హోలిక, |
| హోళి, హోళిపండుగ | మివి కామునిపండుగవ్యు , ఫాల్గుణమాసంలో చేసే కామప్రీతికరమైన వసంతోత్సవం; | |
| హ్యాండీక్రాఫ్ట్ | n | చేతిపనులు, శిల్పాలు |
| హ్రదం | n | ఏటినడుమ లోతుగల చోటు, మడుగు, లోతుగల నీటి పల్లం, లోతైన రంధ్రం, చప్పుడు, వెలుగు; |
| హ్రస్వం | n | చిన్నది, పొట్టిది, కురుచ, పొట్టి, స్వల్పం, దీర్ఘంలేని అక్షరం, లేతవయసుది అప్రధానం, పొట్టి అచ్చు, ఒక రసాయన ద్రవ్యం ప్రోదిని, వజ్రాయుధం ఎక్కువ ధ్వని చేసేది, మెరపు, ఏరు, అందుగుచెట్టు ప్రీ, సిగ్గు; వినయం |
| హ్లాదుడు | n | ప్రహ్లాదుడు భగవంతుని దర్శనంచే సంతోషించేవాడు, హిరణ్యకశిపుని కుమారుడు, హరిభక్తుడు |