Jump to content

తెలుగు-తెలుగు నిఘంటువు/స

Wikibooks నుండి
సంకటి n వండిన రాగి పిండి వంటిచిక్కని కాచిన అంబలితోవ, పిష్టవిశేషం
సంకర్షణుడు n బలరాముడు;వ్వు శత్రువులను, ప్రళయంలోజనులను సంహరించేవాడు
సంకలనం n సమ కూర్చడం,చేర్చడం, కలపడం,సంకలన, సంకలం, పోగుచేయడం, సంబంధం, సంముట్టనం, కూడ బెట్టడం, సమకూర్చడం
సంకలిత n కూడిన
సంకల్పం n ఆలోచన, తలంపు, భావన, మనోనిశ్చయం, లక్ష్యం, అభిప్రాయం , కోరిక, భావన, మనస్సు, ప్రతిజ్ఞ, ఫలనిరీక్షణం
సంకాశం n సమానమైనది, పోలినది సంకీర్ణం
సంకీర్ణ సమయం n కఠిన సమయం ,, విధాల సమయం
సంకీర్తనం n దేవతా గుణాలను గానం చేయడం, స్తోత్రం చేయడం, భగవన్నామం పలుమారు ఉచ్చరించడం
సంకు n శంఖం, శంఖవలయం,అంచు; ప్రకృశంఖం
సంకుచిత n ముడుచుకొన్నది,తగ్గినది
సంకుల సమరం n విస్తరించిన యుద్దం, ఒకరితో ఒకరు ఒరుసుకునే యుద్ధం
సంకేతం n గుర్తు, చిహ్నం, సన్న, పేరు, ఒడబాటు, సంజ్ఞ, ముందుగా మాట్లాడుకొని నిష్కర్ష చేసుకున్న స్థలం, ఏర్పాటు
సంకోచం n ముడుచుకోవడం, కుంకుమ పువ్వు, సంక్షేపం, ముకుళ భావం, చేపబంధం, బిడియం, సంశయం
సంకోచించు v వెనుదీయు, జంకు, సంకుచితం చేయు, అనుమానించు
సంక్తివం n సంగ్రహం,సంక్షేపింపబడినది
సంక్రందనుడు n ఇంద్రుడు ,శత్రు వును అక్రందనం (మొర)పెట్టించేవాడు
సంక్రమించు v ప్రాప్తించు,ప్రవేశించు, కలయు, దాటు, కలసివచ్చు, చెందు
సంక్రాంతి n మకర సంక్రమణం ,సూర్యుడు మేషాది రాసులలో ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడం;, కలయిక, ఒక అంశం నుంచి మరొక అంశానికి పోవడం, ఇతరులకిచ్చి వేయడం, ప్రతిబింబం, చిత్రం, బోధనా శక్తి
సంక్లిష్టం n కష్టంతో కూడినది, గాయపడినది, నలగకొట్ట బడినది, కాంతి చేడినది
సంక్షేమం n మంచి, మేలు, శుభం
సంక్షోభం నంవినంచలనం,కలవరపాటు, కంప, వ్యత్యస్తం కావడం, గర్వం
సంఖ్యాపురాణం n లెక్కకలపడం
సంఖ్యావాచకం n సంఖ్యను తెలిపేది, సంఖ్యను తెలిపే పదం
సంగం n మైత్రి, కలయిక;
సంగడీడు n స్నేహితుడు, చెలికాడు
సంగతి n విషయం, సహవాసం;++విధం, సంసర్గం, ఔచిత్యం, దర్శనం, దైవికంగా తటస్థించడం, జ్ఞానం, విశేష జ్ఞానం కోసం ప్రశ్నించడం
సంగమం n సంయోగం, కలియడం; సమీపించడం, కూడిక, చేరిక, అనురాగం, పోట్లాట, సాంగత్యం, నదులు కలిసే చోటు, స్నేహితుల గుంపు
సంగరం n యుద్ధం, బుద్ది, విషం, అంగీకారం, ప్రతిజ్ఞ, ఆపద
సంగాతకాడు n చెలికాడు, మిత్రుడు సంగీతం
సంగ్రహం n సంక్షిప్తం
సంగ్రహం n స్వీకరించడం, పట్టుకోవడం, సంగ్రహం చేయడం,రక్షించడం, కలయిక
సంగ్రామం n యుద్ధం
సంఘం n ప్రాణిసమూహం, గుమి, గుంపు, సన్నిహిత సంబంధం, సమాజం
సంఘజీవి n కలిసి జీవించేవాడు; కూలివాడు
సంఘటన n సంయోగం, కూర్పు
సంఘసంస్కర్త సంవిణసంఘాన్ని సంస్కరించినవాడు
సంచకరువు n బయానా, అడ్వాన్సు;, సంచకర్వు, సంచకరు, సంచేకరం, సంచే కరువు, సంచకారం,క్రయ, విక్రయా దులకు పూర్వం బేరం స్థిరత్వానికై ఇచ్చే ధనం
సంచయం కూడబెట్టడం, నిలువ చేయడం, రాశి, మొత్తం సముదాయంపేరు, కూడబెట్టడం
సంచలనం n కదలిక, క్షోభం, వడకు, కలవరపాటు
సంచలనాత్మక n కదలికతో కూడిన
సంచారం n గమనం, తిరగడం, ఒక చోటనుంచి మరో చోటికి మారడం, దారి, కష్టప్రయాణం, కష్టం, పురికొల్పడం, సహాయం చేయడం, తోవచూపడం, పాము పడగమీది మణి, సూర్యుడొక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించడం
సంచార వైద్యశాల నంవితిరిగే ఆసుపత్రి
సంచి n గుడ్డలు వంటి వాటితో కుట్టిన తిత్తి, సంచీ, గోతం; అసిమి గోనె, గోణి, జోలె, పట్టా
సంజ n సంధ్యాకాలం; ప్రకృసంధ్య
సంజయుడు n ధృతరాష్ట్రుని ఆంతరంగిక భృత్యుడు;వివసంజయుడు వ్యాసమహర్షి వరం వల్ల యుద్ధసమాచారాలన్నింటినీ గ్రహించి జాత్యంధుడైన ధృత రాష్ట్రునికి తెలుపుతూ ఉండేవాడు కురు పాండవులకు సంధి చేయడానికి ఇతడు రాయబారం జరిపాడు
సంజాయిషీ హింవిసమాధానం
సంజీవని n చచ్చినవారిని బతికించే ఒక ఓషధి, సంజీవకరణి, బతికించడం, ఆహారం, కాళిదాస కావ్యత్రయానికి మల్లినాధుడు వ్రాసిన వ్యాఖ్య పేరు
సంజ్ఞ n హస్త చాలనాదులచేత అర్థాన్ని సూచించడం, చైతన్యం, బుద్ది, జ్ఞానం, సన్న, పేరు,
సంత ప్రదీప్తమై ఉండేదో అనిపించక మానదు సంతకం
సంత n అంగడి, చెంత, నిర్ణయింప బడ్డ రోజున ఉంచే అంగళ్ళ వరుస, వేద పాఠం, సమీప ప్రదేశం, అపవాదం, అంగడి
సంతతం సంక్రివిణఎల్లప్పుడు, వ్యాపింపచేయబడినది, ఎడ తెగనిది, శాశ్వతమైనది, అధికమైనది
సంతతి n సంతానం, అపత్యం
సంతప్తుడు n ఎక్కువ బాధపడిన వాడు
సంతరించుకొను v చక్కబరచుకొను, సంపాదించుకొను
సంతర్పణ n తృప్తి, తృప్తిపరచడం;రూసంతర్పణం, విందు, ఆమెత (విందు), ఉల్లాస పరచడం, ఒక భక్ష్య విశేషం
సంతసం n సంతోషం, ఆనందం,
సంతానం n అపత్యం, సంతతి, ఒక కల్పవృక్షం, లెస్సగా కోరికలను తీర్చేది, బిడ్డ, కులం, పౌత్ర పారంపర్యం
సంతాపం n చనువుతో ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం; వ్యు
సంతాపం n బాధ
సంతాపిత n బాధింపబడినది,ఎక్కువ తపింప చేయబడినది
సంతు n సంతానం, వంశం,సమూహం
సంతుష్టుడు n ఎక్కువ తృప్తి పొందిన వాడు; హృష్ణుడు, మత్తుడు, తృప్తుడు, ప్రహ్లాన్నుడు, ప్రముదితుడు, ప్రీతుడు
సంతోషం n ఆనందం; ముదం, ప్రీతి, ప్రమదం, హర్షం, ప్రమోదం, ఆమోదం, సమ్మదం; సుఖం, హాళి, కౌతుకం, ఎలమి, వేడుక, నెమ్మి, సంతసం, ఇంపు, సొంపు, అలరు
సందర్బం n సమయం, కావ్యం,ప్రస్తావం, పూలు గుచ్చడం, మాట నేర్పు
సందర్శనం n చూడటం, నిదానించి చూడడం, పరస్పర విలోకనం, దృష్టి, ఆలోచనం, విశదపరచడం, కలియడం
సంది అవ్యనుంచి, సందు, రెండు వస్తువుల నడిమి భాగం, దండచేయి, సంధి, సంధి విగ్రహాది షడ్గుణాల్లో మొదటిది, మంచం
సందిగ్ధం n సందేహం కలది, నిశ్చయం లేనిది, చక్కగా పూయ బడినది, తప్పుగా గ్రహింపబడినది, సందేహింప బడినది, స్పష్టంగా లేనిది, అపాయకరమైనది, విషం పూసినది
సందిట n భుజానికి మోచేతికి నడిమి భాగాన, కౌగిట
సందియం n సంశయం సందీవ
సందుక n చిన్న పెట్టెరూసందుకా సందే
సందేశం n సమాచారం, వార్త, వాచికం, ఆజ్ఞ
సందేహం n సంశయం, అపాయం, ఒక అర్థాలంకారం
సందేహం ఉన్న సవురు n అందం,సౌరు; , కాంతి, నిగ్గు, విధం సవ్యం
సందోహం n సమూహం, పాలు పితకడం
సంద్రం n సముద్రం, జలనిధి
సంధానం n కూర్చడం; కూడటం, శ్రద్ద, అతుకు, కంచు బాణాన్ని వింటి వారిలో కూర్చడం, మళ్ళీ కూడేటట్లు చేసేది, పులికడుగు,
సంధించు v కూర్చు, చేర్చు, కూడు, ఎదుర్కొను, కలుపు, రోగం అతిశయించి దోషించు
సంధి n కలయిక, కూడిక, సందు, సొరంగం, విభాగం, అతుకు, రాజీ, ముఖాది (ముఖ, ప్రతిముఖ వంటి), సన్నిపాతజ్వరం, కీలు, టంకం, ఎడం, దేవుని ఈనాం, ఒక చెట్టు
సంధ్య n సాయంకాలం, ప్రభాతం; సూర్యోదయానికి మూడు గడియల వరకు గల కాలం ప్రాతస్సంధ్య, సూర్యాస్తమయానికి పూర్వం మూడు గడియల కాలం సాయం సంధ్య, పగటి ప్రమాణంలో మధ్యభాగం మాధ్యాహ్నిక సంధ్య, అహో రాత్రాలచే సంధింపబడినది;
సంధ్యావందనం n సంధ్యాకాలంలో ఆచరింపదగిన వైదిక కర్మం ,త్రి సంధ్యలలో చేసే దైవప్రార్థనం
సంపంగి n చంపకం;రూసం పెంగ, సంపగి, సంపంగే, సంపంగియ, సంపగియ, సంపెగ; కాంచనం, చాంపేయం, పుష్పేందువు, ప్రియ, సందేశం, శుభగం, సురభి, స్థిర పుష్పం,
సంపద n ఐశ్వర్యం,సంపత్తు; సిరి, లచ్చి, కలిమి, విభూతి, భూతి, శ్రీ, లక్ష్మి, భగం, పడతి, అభివృద్ధి, గుణోత్కర్షం, సౌఖ్యం, కోరిక, అదృష్టం, నెరవేరడం, విస్తారం, లాభం, ధనం
సంపన్నులు n సంపద కలవారు
సంపరాయం n యుద్ధం,సంపరాయకం; వ్యు
సంపర్కం n సంబంధం, సాహచర్యం,కలయిక, స్పర్శ, సంఘం, కూడిన మొత్తం
సంపాతం n చక్కని పాటు, కలిసి పడటం, నమ్మర్దం, ఎదుర్కోవడం, దిగడం, వాలడం, చలనం, గమనం, నివేదన శేషం, పంపడం
సంపాదకీయం n సంపాదకుడు రచించింది పత్రిక గురించి లేదా ఒక విషయాన్ని గురించి సంపాదకవర్గం రచించింది
సంపాదకుడు n గడించేవాడు, సమాచారాన్ని, వ్యాసాదులను సంపాదించే ప్రధాన వ్యక్తి, నెరవేర్చేవాడు
సంపాదించు v గడించు, ఆర్టించు, కలిగించు, సిద్ధంచేయు
సంపుటం n గ్రంథం, సంచిక, బరణి, పుస్తకం, భూగోళం, తాడు, చిప్పపాందాను, ఒక సంయుత హస్తం, మిగులు, చుంబన భేదం తిర్యక్కరణబంధ విశేషం, ఎర్రగోరింట చెట్టు
సంపుటి n కవితలు వంటి ఒక చో చేర్చిన గ్రంథం
సంపూజ్యంబు n గౌరవం, స్తుతి
సంపూర్ణం n నిండినది, సమగ్రం, సంగీత విశేషం, ఆకాశం సంప్రతి
సంప్రతించు v సలహా అడుగు;రూ సంప్రదించు, సరిచూచు
సంప్రదాయం n ఆచారం, గురు పరంపర చేతా, వంశక్రమం చేతా వచ్చిన వాడుక, వంశాచారం, గురుపారంపర్యం, ప్రత్యేక మత బోధన విధానం, రూఢమైన వ్యవహారం
సంప్రదాయీకరణం n (రాసే భాషలో) 1 వాడుకకు ఒక నమూనా ఏర్పరచడం, 2 సంప్రదాయంగా మార్చడంశైలీకరణం
సంప్రదింపులు n చర్చలు, సలహాలు
సంప్రాప్తించు v కలుగు, లభించు
సంప్రీతి n అనురాగం, ప్రేమానుబంధం, స్నేహ పూర్వక మై అంగీకారం, ఆహ్లాదం
సంప్రోక్షణం v నీరు చల్లడం ,పరిశుద్ధికోసం నీళ్ళు వంటి చల్లడం, విగ్రహాదులకు జీవప్రతిష్ఠ చేయడం, అభిషేకించడం, శుద్ధి చేయడం, సంబంధం
సంబరం n సంతోషం,సంబ్రం, జాతర, సేవ, సివం, జీతం, బత్తెం, ఒక జాతి జింక, చేప, సేతువు, జలం, ఒక కొండ, వేగిరపాటు, నిగ్రహం
సంబారు n ఉపస్కరం, ఉప్పు కారం వంటివి,సంబారం
సంబాళించడం v ఆదరించడం, నియంత్రించడం
సంబుద్ధి n పిలవడం, పరిపూర్ణజ్ఞానం, పూర్ణచైతన్యం, సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం, గుణవాచకం
సంబోధన n పిలుపు, ఆహ్వానం;రూ సంబోధనం, వివరణం, సంబుద్ది
సంభరితం n నిండినది, నింపబడినది
సంభవం n పుట్టుక, కారణం, కూడిక, కూర్పు, ఆధేయం, మూల కారణం, సాధ్యత, సామరస్యం, యోగ్యత, ఆనుకూల్యం,
సంభవించు v కలుగు, పుట్టు
సంభారం n వస్తుజాలం, సామగ్రి, చక్కగా భరించడం, సేకరించడం, చక్కగా ధరించడం, సమూహం, సర్వ పూర్ణత్వం, సంపద, సమృద్ది, అంశం
సంభావన n సమ్మానం, భావించడం;రూసంభావనం, తలపు, ప్రసిద్ధి, సాధ్యత, అర్హత, సామర్థ్యం, సందేహం, అనురాగం, పొందడం, పేరు, అలంకార విశేషం
సంభావించు v సమ్మానించు, గౌరవించు, తలచు, స్తుతించు,ఆదరించు, మన్నించు, ఓదార్చు
సంభాషణ n సల్లాపం,సంభాష,సంభాషణం, సంభాషం, అభివందనం, పలుకరింపు, ఒడంబడిక, సంకేతపదం, యుద్ధనాదం
సంభాషించు v మాటలాడు
సంభ్రమం n ఆతురత, వేగిరపాటు, తత్తరపాటు, ఆదరం, తప్పు, తెలియమి, భీతి, అల్లరి, భ్రాంతి, ఉత్సాహం
సంభ్రమం n తొట్రుపాటు, తొందరకలది, కలవరపడినది దేవిబాగు, నిగ్గుగలది, విధం, నిగ్గు, ఆరోగ్యం, పైరు
సంయమం n నిగ్రహం, వ్రతాదులకు అంగమై తొలిదినాన చేయదగిన ఆచారం, హింసాదులనుంచి విరమించడం, ధ్యానధారణ సమాధులనే యోగ సంబంధమైన తుది మూడవస్థలు, హింసాదుల నుంచి విరమించడం, తపోభ్యాసం, సుఖదుఃఖాది అనుభవం, ప్రయత్నం, వ్రతాంగంగా పూర్వదినాన చేయదగిన నియమం
సంయమనం n నిరోధం, ఇంద్రియనిగ్రహం, లోపలికి గ్రహించడం,బంధనం, చతుశ్నాలం
సంయమీంద్రుడు n (సంయమి + ఇంద్రుడు) మునీశ్వరుడు, యతీశ్వరుడు, సన్న్యాసి
సంయుక్తం సంవిణ, చక్కగా కూడినది, మిశ్రమమైనది, అనుసరింపబడినది, సంపన్నం
సంయోజనం n చక్కగా కూర్చడం,కలపడం
సంరంభం n అతిశయం, గర్వం, ఆరంభం, సంక్షోభం, కోపం, ఉద్రేకం, ద్వేషం, శత్రుత్వంవహించడం, తీవ్ర స్థితి
సంరంభాలు n ఆర్బాటాలు
సంరక్షకుడు n కాపాడేవాడు
సంరక్షించు v కాపాడు
సంవత్సరం n ఏడాది సంవత్సరాది
సంవదించు v సమాలోచించు, సంప్రదించు, సమ్మతించు, సంభాషించు, సరిపోలు, మోగించు, ప్రకటించు
సంవర్ధనం నంవిపోషించడం, నిండువృద్ధి
సంవాదం n పరస్పర సంభాషణం, చర్చ, సమాచారాలు ఒకరికొకరు తెలుసుకోవడం, వార్త, సమ్మతి, సామ్యం, కలిసికోవడం, అభియోగం, కప్పడం, తక్కువ కావడం, రక్షించడం, ఏర్పరచడం, ఆటంకం
సంవిధానం n నిర్వహణం, పద్ధతి,కథా విషయాలను క్రమంగా ఏర్పరచడం, ఏర్పాటు, ఆచరణం,వి
సంవురణ n రాపిడి, స్పర్థ;రూ సంఘర్షణం, పిండిచేయడం, ఒక దానికొకటి తాకడం, అసూయ, జారడం
సంవేదన n అనుభవం;రూ సంవేదనం, సంవేదం, జ్ఞానం, సుఖదుఃఖాది అనుభవం
సంశయం n సందేహం, నిశ్చయం లేమి; అనుమానం, అంతకం, త్రుటి, శంక, ద్వాపరం, యుతకం, సందియం, ఊహ, అపాయం, సంభావ్యత n సందేహించు
సంశయితంబు n సందేహింపదగింది, అనిశ్చిత మైనది, సందేహింపబడినది, సందేహాస్పద మైనది, అపాయం కలది
సంశోధించు v పరిశీలించు, విచారమొనర్చు
సంసర్గం n సహవాసం, పొందు, కలపడం, స్పర్శం, చనవు, సన్నిహిత సంబంధం కలిగి ఉండడం, గ్రహాల కూడిక
సంసారం n కాపురం, ప్రపంచ జీవయాత్ర, పద్దతి, ప్రపంచజీవ యాత్ర, జనన మరణ ప్రవాహం, ప్రపంచ సంబంధమైన భ్రాంతి, గార్హస్థ్యం
సంసారచక్రం n జనన మరణాల పరంపర
సంసారి n గృహస్థు, ప్రపంచసంబంధమైనది, ప్రాణి, జీవాత్మ
సంసిద్ధం n స్వభావసిద్ధం,సిద్ధపడడం, పూర్తిగా నెరవేరినది,నేర్పుగలది, ఆమోదింపబడినది సంసిద్దుడు
సంసృతి n సంసారం, ప్రవాహం, లోకయాత్ర సంసేవ
సంస్కరణ n సిద్దం చేయడం, చక్కజేయడం, శవదహనం చేయడం,సంస్కరణం
సంస్కర్త n సంస్కరించేవాడు, బాగుచేసేవాడు, సిద్ధం చేసేవాడు, వండే వాడు
సంస్కారం n చక్కబరచడం, చక్క చేయడం, పూర్వం అనుభవించింది తలపునకు రావడం, చదువు, సంకల్పం, వంట, ఉపనయనం, కర్మ, శృంగారించడం
సంస్కారి n సంస్కారం కలవాడు
సంస్కృతం n గీర్వాణభాష శుద్ధమైన భాష
సంస్కృతి n సంస్కారం, నాగరికత
సంస్తుతించు సంక్రీస్తోత్రం చేయు, పొగడు
సంస్తుతి n స్తోత్రం, పొగడ్త
సంస్థ n సభ, ఉనికి, నాశం, మేర, గుంపు, సమూహం, స్థితి, వృత్తి, ముగింపు, సత్ర్పవర్తనం, పోలిక, కనబడటం, మరణం, ఆకృతి, పని, ఒప్పందం
సంస్థానం n ఆస్థానం, నివాసస్థలం, సన్నివేశం, రాజ్యం, మృత్యువు, చతుష్పదం, గుంపు, ఆకృతి, ఉనికి, గురుతు, తావు, మంచిస్థితి
సంస్థితం n స్థితి, రూపం సంహరణం
సంహారం n నాశం, ప్రళయం, సంహరణం, చంపడం, నాశం చేయడం, యుగాంతం, వెనుకకు లాగడం, గుంపు, నేర్పు, ముగింపు సంహిత
సకల n సమస్త
సకల ప్రపంచం పక పకలాడాలన్నదే సకలార్థ సాధనం n అన్ని ప్రయోజనా లకు ఉపకరణం
సకాలం n యుక్తకాలమందైనది
సకినలమంచం దేమోగే మంచం
సకియ n చెలికత్తె, స్త్రీ,సకి, సఖి
సకిలించు v హేషించు, (గుర్రం) ధ్వని చేయు
సకుటుంబం n కుటుంబంతో కూడినది
సక్రమంగా n సరిగ్గా, క్రమం తప్పక, క్రమంతో
సఖుడు n చెలికాడు, మిత్రుడు
సఖ్యత n చెలిమి, స్నేహం
సగం n అర్థభాగం, అర,సవం,సాము సగమగు
సగటు n సామాన్యం , సరాసరి, చదరంగంలోని శకటం
సగరనందనం n సగరుని ఉద్యానవనం
సగర్వంగా n గర్వంతో కూడా
సగ్గుబియ్యం n సాబుదానా, ఒకవిధమైన కృత్రిమ ధాన్యం
సచివుడు n సహాయుడు, మంత్రి, స్నేహితుడు, సస్యవిశేషం, శిరో గృహం, ఆతం, గంటే, సూతికాగృహం, పూల బుట్ట, తోడు
సచ్చిరిత(త్ర) n మంచి నడతకలది న చ్చాత్రులు
సచ్చీలం (సత్+శీలం) n మంచి నడవడి, మంచి స్వభావం
సజావు n సక్రమం, సవ్యం
సజీవ దహనం n ప్రాణంతో తగులబెట్టడం
సజీవ నిదర్శనాలు n బ జీవంతో కూడిన నిదర్శనాలు
సజ్జనులు మంచి మనుష్యులు
సటీకం n వ్యాఖ్యానంతో కూడినది
సడలించు v విప్పు, వదుల్చు, తీయు, తెరచు, ఊడగొట్టు, తప్పించు, తొలగించు, కలచు, తీసివేయు
సడలు v జారు, శ్రథమగు; రూ
సడి n నింద, జాడ
సడ్డకుడు దేతోడి అల్లుడు
సడ్డకుడు n తోడి అల్లుడు సణుగు
సణుగు n యస్పుట వాక్కు, బాధ సతతం
సతమతం n పనిలో మునిగి ఉండి తీరిక / పోవడం, సదమదం, నలగినది
సతి n సద్గుణాలు గల స్త్రీ, పతివ్రత, దక్షుని కూతురు, యోగిని, సౌరాష్ట్ర మృత్తిక, భార్య, దానం, నాశం
సతీత్వం n సదుణాలు కలిగి ఉండటం, పతివ్రతా లక్షణం
సతీత్వం n సద్గుణాలు కలిగి ఉండటం, పతివ్రతా లక్షణం
సతీరత్నం n స్త్రీలలో శ్రేష్ఠమైనది
సతీరత్సం n స్త్రీలలో శ్రేష్ఠమైనది
సతీర్ణుడు n సహాధ్యాయి
సతీర్థుడు n సహాధ్యాయి సత్కరించు
సతీవియోగం n భార్య ఎడబాటు
సతీసహగమనం n చనిపోయిన భర్తతోపాటు భార్య కూడా చనిపోవడం
సత్కరించు v సన్మానించు, పూజించు
సత్కర్మం n మంచిపని, వేదవిహితమైన యాగాది కార్యం, ఉత్తరక్రియ, ప్రాయశ్చిత్తం,ఆదరం
సత్కవులు n మంచికవులు
సత్కారం n సన్మానం చేయడం, గౌరవించడం, పూజించడం, గౌరవం, శ్రద్ద, భోజనం, పర్వం
సత్కారం n సన్మానం చేయడం, గౌరవించడం, పూజించడం, గౌరవం, శ్రద్ధ, భోజనం, పర్వం
సత్కార్యాలు n మంచిపనులు
సత్తా n సత్తువ, శక్తి,సత్త, ఉనికి, యాథార్థ్యం, ద్రవ్యగుణ క్రియలలోని జాతి, మంచితనం
సత్తు n మెత్తని లోహం, తగరం; సీస(క)ం, కుష్టకం, నాగం, బీజం, రోగేష్టం, నక్షత్రం, పూజ్యం, ఉన్నది, సాధువు, శ్రేష్ఠం,
సత్తు n మెత్తని లోహం, తగరం; సీస(క)ం, కుష్ఠకం, నాగం, బీజం, రోగేష్టం, నక్షత్రం, పూజ్యం, ఉన్నది, సాధువు, శ్రేష్టం,
సత్తువ n బలం, లావు
సత్పలితాలు n మంచి ఫలితాలు, మంచి ప్రయోజనాలు
సత్పురుషుడు మంచివాడు (మంచిమనిషి
సత్పురుషుడు n మంచివాడు (మంచిమనిషి)
సత్ప్రవర్తన n మంచి నడవడి
సత్ఫలితాలు n మంచి ఫలితాలు,మంచి ప్రయోజనాలు
సత్యం n నిజం, యథార్థం; నిక్కువం, నిక్కం, తథ్యం, ఋతం, నిలువరం, యథాతథం, కృతయుగం, ఒట్టు, నిజమైనది, నిష్కాపట్యం, మంచితనం,
సత్యం n నిజం, యధార్థం ,సత్పురుషులలో పుట్టేది నిక్కువం, నిక్కం, తథ్యం, ఋతం, నిలువరం, యథాతథం, కృతయుగం, ఒక లోహం, ఒట్టు, నిజమైనది, నిష్కాపట్యం, మంచితనం, నీరు, పరబ్రహ్మ
సత్యకాలం n నిజాయితీ ఉన్న పాతకాలం, కృతయుగకాలం లాంటి కాలం
సత్యనిష్ఠ n నిజం ఉనికి, సత్యం పై
సత్యభామ n శ్రీకృష్ణుని భార్య; సత్యభామ సత్రాజిత్తు కూతురు
సత్యభామ n శ్రీకృష్ణుని భార్య;సత్యభామ సత్రాజిత్తు కూతురు
సత్యయుక్తిన్ n శక్తితో కూడినది
సత్యవర్తి n రుజువర్తనుడు,సత్యంగా చరించేవాడు
సత్యవర్తి n రుజువర్తనుడు,సత్యంగా చరించేవాడు నిత్య సత్యవర్తిని, సదాచారమూర్తి
సత్యవాక్కు n నిజం చెప్పేవాడు ,నిజమైన వాక్కుగలవాడు, ఋషి
సత్యవాక్కు n నిజం చెప్పేవాడు ,నిజమైన వాక్కుగలవాడు, ఋషి కాకి
సత్యవాది n నిజం పలికేవాడు,కాపట్యం లేనివాడు
సత్యవాది n నిజం పలికేవాడు,్యం లేనివాడు
సత్యసంధత n నిజమైన ప్రతిజ్ఞ కలిగి ఉండడం, సత్యం మాట్లాడటం
సత్యసంధత n నిజమైన ప్రతిజ్ఞ కలిగిఉండడం, సత్యం మాట్లాడటం నిజమైన ప్రతిజ్ఞకలవాడు, శ్రీరాముడు, నిజం పలకడమే నియమంగా పెట్టుకునే వాడు, భరతుడు, జనమేజయుడు, హరిశ్చంద్రుడు
సత్యసంధుడు n నిజమైన ప్రతిజ్ఞకల వాడు, శ్రీరాముడు, నిజం పలకడమే నియమంగా పెట్టుకునే వాడు, భరతుడు, జనమేజయుడు, హరిశ్చంద్రుడు
సత్యసూక్తి n నిజమైన మంచిమాట
సత్యాగ్రహ ప్రతిజ్జాపత్రం n సత్యాగ్రహానికి సంబంధించిన ప్రతిజ్జా పత్రం
సత్రం n ధర్మశాల, ఇల్లు, 1ధర్మం కోసం బిచ్చం పెట్టేవాడు వంటి సత్ర యాగం, 218 మొదలు 100 రోజుల వరకు చేసేయజ్ఞం; సత్తరువు, లంగరుఖానా, అన్నదానగృహం, ప్రతిశ్రయం, మండపం;, ధర్మం కోసం అన్నం పెట్టే ఇల్లు, ఎడతెగని ఈవి, యజ్ఞవిశేషం, మంచివారిని కాపాడేది, వస్త్రం, చల్టి, సాధనం, కపటం, అడవి
సత్వరం n త్వరగలది, వేగంతో కూడినది
సత్వరముగ సంఅవ్యవెంటనే, వేగంగా
సత్సంకల్పం n మంచి అనుకోవడం,మంచి ఎన్నిక
సత్సంపద n మంచి సంపద
సదనం n ఇల్లు, భవనం;++క్షయం, అలయిక, జలం, యజ్ఞ శాల, యమ నివాసం, కూర్చుండటం, పీఠం సదం
సదయుడు n దయతో కూడినవాడు
సదసద్వివేకం n 1 ఉన్నదేదో లేనిదేదో తెలుసుకొనగలిగే తెలివి, 2 మంచి చెడ్డలు వేరు చేసే తెలివి
సదస్సు n సభ, నివాసం సదా
సదాగతి n వాయువు ,సర్వకాలాల్లో గమనం కలవాడు, సముద్రుడు, కెరటం, సూర్యుడు,మోక్షం, సర్వేశ్వరుడు సదాచారమూర్తి
సదాశివుడు n శివుడు ,ఎల్లప్పుడూ బ్రహ్మానంద స్వరూపుడూ, నిర్వికారుడూ కాబట్టి శమించి ఉండేవాడు
సదుద్దేశం n మంచి ఉద్దేశం, మంచి అభిప్రాయం
సదుపాయం n మంచి ఉపాయం, సౌకర్యం
సదృశం n సమానమైనది,పోలినది, యుక్తమైనది, అర్హమైనది
సదోవ్స్ n సజ్జనులతో చర్చ, మంచి సభ, సల్లాపం, చర్చ
సద్గుణాలు n మంచిగుణాలు, మంచిలక్షణాలు
సద్దతి n మంచిస్థితి, ఉత్తమలోకం నద్గుణం
సద్ధర్మం n ఉత్తమ ధర్మం సద్భావం
సద్మం n ఇల్లు, చోటు, గుడి, దేవుని పీఠం, ఆసనం, యుద్ధం, జలం
సద్యఃకాలం n అప్పుడు జరుగుతున్న కాలం
సద్యస్పూర్తి n వెంటనే తోచడం,తక్షణమే స్పురించడం
సద్వినియోగం n మంచిగా వాడడం
సద్విమర్శ n మంచి విమర్శ
సనాతన ధర్మపరులు n ప్రాచీన ధర్మపరులు
సనాతన సంప్రదాయాలు n ప్రాచీన సంప్రదాయాలు, పాతకట్టుబాట్లు
సనాతనుడు n ప్రాచీనుడైనవాడు,భగవంతుడు, పురాణ పురుషుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పురాణ పురుషుడు, స్థిరమైనవాడు, పితృదేవతల అతిధి, బ్రహ్మపుత్రులలో ఒకడు
సన్న n సంజ్ఞ, గుర్తు, జాడ, చిన్నది, సూక్ష్మం సన్నకంకర
సన్నకారు n చిన్న, కంసాలి,కమ్మరి వంటివారీ పనిముట్టు
సన్నగిల్లు v సన్నమవు, తక్కువవు,క్షీణించు
సన్నజాజులు n ఒకవిధమైన జాజిపూలు
సన్నద్ధం n సిద్ధంగా ఉన్నది, కట్టబడినది, కవచం ధరించి నది, ఆతతాయి, మంత్ర తంత్రాలతో కూడినది, వ్యాపించినది, సన్నిహిత సంబంధం కలది, వికసించడానికి సిద్దంగా ఉన్నది, వ్యూహాలు పన్ని యుద్దానికి సిద్దంగా ఉన్నది సన్నం
సన్నాయి n ఊదేబూర, వాద్యం,నాదస్వరం, షహనాయి
సన్నాహాలు n ఏర్పాట్లు
సన్నికల్లు n నూరేరాయి;రూసనికల్లు, సనెకల్లు సన్నిధానం
సన్నిధి n సామీప్యం, చేరువ,సాక్షాత్కారం సన్నిపాతజ్వరం
సన్నిభం n సదృశం, తుల్యం,సమానం సన్నిభులు
సన్నివేశం n దృశ్యం (సంఘటన),ఘటనానుకూల వాతావరణం, వట్టణ ప్రాంత ప్రదేశం, కలయిక, తావు, గుంపు, చేరువ, ఇల్లు, ఉనికి, ఒక గ్రహయోగం
సన్నిహితం n దగ్గరగా ఉన్నది,సమీపమైనది
సన్నిహితుడు n దగ్గరివాడు
సన్నుతి n స్తుతి, పొగడ్త
సన్మానం n సత్కారం, గౌరవం, గౌరవించడం
సన్మారులు n మంచిదారిలో నడిచే వారు
సన్యసించు v వదలివేయు, మాని వేయు; వ్యు
సన్యాసి n ఐహిక విషయాలను విడిచిన యతి(వాడు), కామ్యకర్మలను విడిచినవాడు
సపతి n సవతి సపత్నీకుడు
సపత్సుడు n శత్రువు, సపత్ని (సవతి) లాగా దుః ఖ హేతువైనవాడు,సమాన పతీత్వం కలవాడు సపది
సపర్య n సేవ, పూజ, గౌరవం
సప్తతి n డెబ్బై సప్తపది
సప్తఫణి n ఏడు పడగలు కలది
సప్తమస్కంధం n ఏడో భాగం, ఏడో స్కంధం
సప్తమాతృకలు n ఏడుగురు తల్లులు;బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే
సప్తమి n పక్షంలో ఏడో తిధి, సప్తమీ విభక్తి సప్తవ్యసనాలు
సప్తాహం n ఏడు రోజులు చేసే ఉత్సవం, ఏడు దినాల కాలం
సప్తాహాలు n ఏడు రోజులు జరిగే పండుగలు, ఏడు దినాల కాలం
సప్రమాణం n ప్రమాణాలతో కూడినది
సప్లయి ఇంక్రిసరఫరాచేయు, ఇచ్చు
సఫలం n ఫలవంతం, ఫలంతో కూడినది, ఫలంతో కూడినది,విజయవంతం, సార్థకం సఫే దుఃవి,n తెల్లనిది
సబబు n కారణం
సబ్ కమిటీ n ఉప కార్యనిర్వాహక)సంఘం
సబ్జక్టు n విషయం
సబ్బు n మలధావన ద్రవ్యం
సభ n పరిషత్తు, సమాజం ; గోష్టి సమితి, సంసతి, ఆస్థాని, ఆస్థానం, ఓలగం, కొలువు, సదం, ప్రతిశ్రయం, ఇల్లు, చావడి, జూదం, కొలువు కూటం, జన సమూహం, న్యాయస్థానం, ధర్మశాల, భోజన గృహం
సభాపతి n అధ్యక్షుడు, సభకు ప్రభువైనవాడు, రాజు, ద్యూతగృహయజమానుడు సభాసదులు
సభికుడు n సభాసదుడు, సభ్యుడు ,1 సభలోని ధర్మజ్ఞుడు, 2 జూదం ఆడడానికి యోగ్యమైన సభకలవాడు, 3 మద్యాన్ని తాగేవాడు, జూదరి, న్యాయవాది, మద్యపాయి, సభలోని ధర్మవేత్త,
సభ్యత్వం n సంఘంలో ఒకడు కావడం
సభ్యుడు n సభలో ఉండేవాడు, నాగరకుడు, సుశీలుడు, విశ్వస నీయుడు, ద్యూతకారుడు సమంజసం
సమం n సమానం, తుల్యంశపథం, ఆజ్ఞ, అగత్యం, ఉచితకాలం, సూచన, ఒడంబడిక, మేర
సమ వయస్కులు n సమానమైన వయస్సు గలవారు
సమకట్టు v యత్నించు, సన్నద్ధమగు, సమ కూరు, సరిపడు, ఏర్పరచు, నిర్ణయించు, సిద్ధంచేయు, సంపాదించు, ధరించు, కూర్చు
సమకాలం సంఅవ్యఅప్పుడే, ఆ సమయమందే సమకాలికుడు
సమకాలీన n అదే కాలంలోని
సమకూరు v శక్యమగు, సాధ్యమగు, లభించు, సిద్దించు, కూడుకొను
సమకూర్చు v సిద్ధంచేయు, వుటిల్లచేయు, నెరవేర్చు, ప్రాప్తింపచేయు
సమక్షం నంఅవ్య ఎట్ట ఎదుట ,కన్నుల ఎదుట, ప్రత్యక్షమైనది, సన్నిధి
సమగ్రం n నిండుదనం, పూర్ణం
సమగ్రత n ఏకత్వం, సంపూర్ణత, నిండుతనం
సమత n సమానత్వం, సమత్వం, కావ్యగుణాలలో ఒకటి, పోలిక
సమతలప్రదేశం n చదునైన ప్రదేశం
సమతూకం n సమానమైన తూకం
సమతౌల్యం n సమానమైన సామ్యం
సమదర్శి n సమానంగా చూసేవాడు; అన్ని వస్తువులను బ్రహ్మభావంతో చూసేవాడు, సమస్త భూతాలను సమంగా చూసేవాడు, వండితుడు,యముడు
సమదృష్టి n అన్ని విషయాల్లో సమానమైన భావం, సమస్త భూతాలను భేదబుద్ధి / సమానంగా చూసే చూపు
సమన్వయం n సంయోగం, క్రమం, పరస్పర సంబంధం
సమన్వయ పరుచు v కలుపు,క్రమబద్ధం చేయు
సమన్వితం n కూడినది,సంబంధం కలది, కూడినది,క్రమంతో కూడినది, నిండి ఉన్నది
సమపాళ్ళు మివిసమానమైన భాగాలు
సమబుద్ధి n పక్షపాతం / పోవడం,భేదభావం / పోవడం
సమయజ్ఞత నంవిపరిస్థితిని బట్టి ఉపయోగించే
సమయస్పూర్తి n సమయానికి తగిన ఆలోచన చేయగల శక్తి, సమయానికి తోచడం
సమయించు v చంపు సమరం
సమరయోధులు n యుద్దవీరులు
సమరసం n అభేదం, సమానమైన అనురాగం సమర్త
సమరుడు నంవిశక్తిమంతుడు,నిపుణుడు, గట్టివాడు, నేర్పరి, యోగ్యుడు
సమర్థవంతం n శక్తిమంతం
సమర్థించుకొను v బలపరచుకొను, విశ్వసించు, ఆలోచించుకొను, సిద్దం చేసుకొను, ధ్రువపరచుకొను, నిరూపించుకొను
సమర్దన n ఇదే యుక్తం అని నిశ్చయించడం,సమర్ధనం, స్థాపించడం, చర్చించడం, సామర్థ్యం, వ్యతిరేకించడం, పొందు కూర్చడం
సమర్పించు v ఇచ్చు, ఒసగు
సమవర్తి n యముడు, అందరి యెడ పక్షపాతం / సమంగాప్రవర్తించేవాడు
సమష్టి సంపద n సామూహిక సంపద
సమసమాజం n సమానమైన సంఘం, సమానమైన గుంపు
సమసిపోవు v తొలగిపోవు
సమస్కంధులు n అన్నింట సమానమైనవారు
సమస్తం n అంతా సర్వం; విశ్వం, అశేషం, నిశ్శేషం, కృత్నం, నిఖిలం, అఖిలం, సమగ్రం, సకలం, అఖం డం, పూర్ణం, సంపూర్ణం, అనూనం, అవి కలం, అభిన్నం, పుష్కలం
సమస్య n కఠిన విషయం ; కవుల (అవధానుల) సామర్థ్యాలను పరీక్షించడం కోసం పూరించడానికి ఇచ్చే పాదాదికం, ప్రశ్న, రుజువు చేయవలసిన విషయం, కఠినవిషయం, సంశయాంశం, అవధానంలోని ఒక అంశం
సమహితత్వం n సరియైన చెలిమి
సమాంతరం n సమానమైన ఎడం కలది
సమాగమం n కలయిక, సహవాసం, రాక, గ్రహాల సంయోగం
సమాచరించు v చక్కగా చేయు
సమాచారం n వృత్తాంతం, వార్త++ నడవడం, సమానమైన నడవడి, తగిన అభ్యాసం
సమాదరం n చక్కటి గౌరవం సమాధానం
సమాధి n ముగింపు, నిరంతర ధ్యానం, గోరీ, మనోలయం, నియమం, ధ్యానం, మౌనం, వ్యసనం, బంధనం, ఒక అలంకారం, తపస్సు, ఓర్పు, సిద్ధాంతీకరణం, పట్టుదల, ఒక కావ్యగుణం, ఇంద్రియ నిగ్రహం
సమానం n తుల్యం; సమం,సద్భక్షం, సదృశం, అన్యం, సాధారణం, ఈడు, దినుసు, సాటి, ఎన, దొర, సరి, జోడు, సవతు, మాద్రి, మాదిరి, ఉద్ది, జత, తరం, పురుడు, తుల్యం, నాభిలోని వాయువు, ఒకటి, న్యాయ మైనది, సామాన్యం సమానత్వం
సమానప్రతిపత్తి n సమానమైన గౌరవం
సమాపనం n ముగింపు, చంపడం సమావం
సమారంభం n ఉపక్రమం, యత్నం, కార్యం, గాయాలకు పూసే తైలం
సమారాధనం n సేవించడం, పూజించడం, తృప్తి కలిగించడం,సంతోషపెట్టడం
సమారోహం n అధిరోహించడం, స్వారిచేయడం, అంగీకరించడం సమార్జితం
సమాళించుకొను v సరి పెట్టుకొను, నిగ్రహించుకొను
సమావిష్టం n బాగా కూర్చున్న / అమరిన, చక్కగా ప్రవేశించినది, ఆక్రమింపబడినది, ఆవేశింపబడినది, అమరినది, సంపన్నం, అభినివేశం గలది, స్థిరపడినది
సమావేశం n ఒకచో కలిసి ఉండడం,సహస్థితి;, టికలుసు కోవడం, కలపడం, మనోభావం, గ్రహావేశం, పట్టుదల
సమాశ్రయం n శరథొందడం, రక్షణం, రక్షణస్థానం, ఇల్లు
సమాసం n అనేక పదాలను ఏక పదంగా కలపడం, సమర్థాలైన పదాల ఏకీ భావం, పదాల ఏకభావం, మితం, చేరిక, సంక్షేపం, సమర్థించడం, సమూహం, వెరసి
సమాసోక్తి n ఒక అర్థాలంకారం; విశేషణాది సామ్యంచేత ప్రస్తుత వర్ణనం చేత అప్రస్తుతం గమ్యమానం కావడం సమాసోక్తి
సమాహారం సమూహం, స్పష్టపడని అవయవ భేదంగల పదార్థ సముదాయం
సమాహితం n నిశ్చలమైనది,స్వస్థం, చక్కగా ఉంచబడినది, ప్రతిజ్ఞ చేయబడినది, నెరవేరినది,వరిశుద్దమైనది, చేర్పబడినది,ఏకాగ్రమైనది
సమాహ్వయం n పేరు, పిలవడం; నానిజంతు జూదం (కోడిపందాలు వంటి), ద్వంద్వయుద్ధం, సంజ్ఞ
సమితి n సమూహం, యుద్దం,సంగమం, సభ, సామ్యం, సమానత్వం
సమిధ ఇంధనం, చిదుగు, వంట చేరకు
సమీకం n యుద్దం, దీనిలోపరస్పరం దగ్గరవుతారు
సమీకరించు v ఒక చోటికి చేర్చు, సమం చేయు, లోగోను, భిన్నాంశాలను ఒకే హారం కలవిగా మార్చు
సమీక్ష n పరిశీలన, పరిశోధన, విమర్శ, అవగాహన, సత్యం సారం, సారభూతమైన సిద్దాంతం, మీమాంసా దర్శనం, ప్రయత్నం, సాంఖ్య దర్శనం
సమీచీనం n సత్యం, ఔచిత్యం, పరిశుద్ధం, తగినది
సమీపం నంవిదగ్గర, చేరిక; నికటం, ఆసన్నం, సన్నికృష్టం, సనీడం, సదేశం, అభ్యాశం, అభ్యాసం, వసధం, సమర్యాదం, సవేశం, ఉప కంఠం, అంతకం, అభ్యర్థం, అభ్యగ్రం, అభిశం, దండ, చేరువ, దాపు, చెంత, సరస, చెంగట, బద్ద, కురంగట, కురంట, అండ, పజ
సమీపత్వం,సాన్నిధ్యం సాము n వ్యాయామం, సగం
సమీపించు v దగ్గరగు, చేరువవు
సమీరం n గాలి, వాయువు;వ్యు
సముఖం n ఎదురు, ఎదుట, మాటల మారి; ముందట, ముందల,ఎదుట, ప్రైల, ముంగల, సమక్షం
సముఖం n సన్నిధి, ఎదురుగా ఉండేది, ఎదుర్కొనేది, అనుకూలమైనది, తగినది, దర్శనం
సముచితం n మిక్కిలి తగినది
సముచ్చయం n సముదాయం ,చెదరిన వాటిని ఒకటిగా కూర్చేది, వ్యాకరణ పరిభాషలో ఒక భాషా భాగం మరొకదాన్ని తెల్పే శబ్దంఇది కొన్ని చోట్ల యడాగమంతోను,మరికొన్ని చోట్ల నకారంతోనూ ఉంటుంది, ఒక్కచోట చేర్చడం, సముదాయం , వదాలను గాని, వాక్యాలనుగాని కలిపేది, ఒక అర్థాలం కారం పెక్కు గుణాలకుగాని, క్రియ లకుగాని ఒక్క దానిలో సమావేశం కలిగించడం)
సముజ్జ్వలం n మిక్కిలి ప్రకాశించేది
సముత్పన్నం n పుట్టింపబడినది, సిద్ధింపబడినది, ఏర్పడినది
సముదంచితం n ఒప్పయినది, మిక్కిలి ప్రకాశించేది
సముదయం నంవిసమూహం, చక్కటి ఉదయం, యుద్దం,ఆదాయం, ప్రయత్నం, దినం లగ్నం
సముదాయం n సమూహం సముదాయించు
సముద్గీప్తి n మిక్కిలి ప్రకాశం
సముద్ధరణం n పైకి తీయడం,లేవనెత్తడం, రక్షించడం, తొలగించడం, బయటకు తీయడం
సముద్భవం n పుట్టుక, మూలం, జన్మస్థానం నముద్భ వించు
సముద్యత్ n పెల్లుబికిన
సముద్రం n సాగరం ,చంద్రోదయం వల్ల వృద్ధి పొందేది, అంతటా నంతోషం ఇచ్చేది, ఈశ్వరాజ్ఞతో కూడుకొని ఉండేది; అబ్ది, అకూపారం, పారావారం, సరితతి, ఉదన్వంతుడు, ఉదధి, సింధువు, సరస్వంతుడు, సాగరుడు, అర్ణవం, రత్నాకరం, జలనిధి, యాదఃపతి, అపాంపతి, అప్పతి, పాద
సముద్రుడు n సముద్రదేవుడు,శివుడు సమున్నతం
సముపార్జన n సంపాదన,సము పార్జనం
సముపార్జించు v సంపాదించు,గడించు
సములు n తనతో సమానమైన వారు
సమూలం n మొత్తం ,వేళ్ళతో కూడినది
సమూహం n గుంపు, మొత్తం;నివహం, వ్యూహం, సందోహం, విసరం, ప్రజం, స్తోమం, నికరం, వ్రాతం, వారం, సంఘాతం, సముదాయం, సమవాయం, సంహతి, బృందం, నికురంబం, కదంబకం, వితానం, ప్రకరం, మండలం, చక్రవాళకం, పటలం, చక్రం, జాలం, జాలకం, బారు, దండు, దళం, తుటం, గుమి, కూటు, కూటువ, పదువు
సమృద్ధి n పెంపు, వృద్ది
సమేతం n కూడుకొన్నది, కూడు కొన్నది, పోగుపడినది, కలువ బడి నది, చేరవచ్చినది, అనుసరింప బడినది, ఎదురైనది,
సమ్మతం n ఇష్టం, అంగీకారం, అభిప్రాయం, నమ్మతి అయినది ప్రియమైనది, మిక్కిలిగౌరవింపబడినది, సహితమైనది
సమ్మతి n అంగీకారం, అభిలాష, ఆత్మజ్ఞానం,గౌరవం, ప్రేమ సమ్మతించు
సమ్మదం n సంతోషం, సౌఖ్యం
సమ్మర్ధం n ఒరిపిడి, రాపిడి ,రూసమ్మర్దనం, రాయిడి , యుద్ధం, తొక్కడం సమ్మానం
సమ్మార్జనం n తుడవడం, ఊడ్వడం, తుడుపు, ఊడుపు, శోధనం, కడగడం సమ్మీలనం
సమ్మె వి,కట్టుపాటు, కోర్కెల పరిష్కారం కోసం జరిపే పోరాటం, ఉద్యోగులు కానీ, కార్మికులుకానీ ముందుగా హెచ్చరించి పని ఆపడం; సమ్మెట
సమ్మేళనం n కలయిక, కూడిక
సమ్మోదపూర్ణం n అధికమైన సంతోషంతో కూడినది
సమ్మోహనశక్తి n ఆకర్షణ శక్తి
సమ్రాట్టు n చక్రవర్తి, దిగ్విజయం చేసి రాజసూయం చేసినవాడు
సయితం వైఅవ్యకూడా, సైతం
సయ్యాట n పరిహాసం,సయాట,
సయ్యొద్ద n చేరిక,సయ్యోద్దె, సయోధ్య
సరం n దండ, హారం, నీరు,స్వరం, మాంసం, గమనం, చెరువు, సెలయేరు, బాణం, ఉప్పు, మీగడ,ముక్కుగాలి
సరంగు n నావికుడు సరకు
సరకు సేయు v లెక్కచేయు,లక్ష్య పెట్టు, గణించు, ప్రేమించు
సరగు n వేగం సరఫ
సరటం n బల్లి, తొండ, వాయువు
సరణి n మార్గం, విధం, రుజురేఖ, తిన్ననిగీత, ఒక విధమైన కంద రోగం
సరత్ n ప్రవహిస్తూ ఉన్న
సరదా n వినోదం, విలాసం
సరదారు n నాయ కుడు,ప్రధానోద్యోగి, సర్దారు
సరఫరా n కావలసిన వాటిని సంపాదించడం
సరభసం n వేగంతో కూడినది, ఉగ్రమైనది, ఉద్రిక్తమైనది, హర్షం గలది
సరళం n వక్రంకానిది, తిన్నని, ఋజువైన, సహజమైన, అగ్ని, దేవదారు వృక్షం, గకారాది వర్గ తృతీయాక్షరం, పూరికాష్ఠం
సరళాలు n గ, జ, డ, ద, బ అనే అక్షరాలు, మృదూచ్చారణ ఉండే అక్షరాలు
సరళి n విధానం, విధం, కలయికలు ఉన్న సప్తస్వరాల (సరిగమపదని) గ్రామం
సరసం n పరిహాసం, సయ్యాట, రసంతో కూడినది, రుచిగలది, తడి గలది, చెమటచే తడియైనది, భావపూర్ణమైనది, ప్రేమగలది,
సరస రచయిత్రి n భావపూర్ణమైన రచయిత్రి, సరసమైన రచయిత్రి
సరసన n పక్కన, ఆసనార్థంలో వరసన
సరసర n శీఘ్రం , చరచర, గమనాదుల ధ్వనికి అనుకరణం, మిక్కిలి వేగంగా
సరసి n క్రమం, వరుస, తీరు,అందం నరసజ్ఞుడు
సరసి n సరస్సు, కొలను నరసిజనాభుడు
సరసీవనం n సరస్సు(లోని) నీరు, సరస్సు కలిగిన అడవి
సరసుడు n రసికుడు, రసజ్ఞుడు, భావ పూర్ణుడు
సరస్వతి n వాగ్గేవత, పలుకు చెలి , అంతటా వ్యాపించి ఉండేది, బ్రహ్మలోకంలో బ్రహ్మ సరస్సును ఆశ్రయించి నదీరూపంగా
సరాగం n ఆనుకూల్యం, ఒద్దిక, ఒప్పిదం, రాగంతో కూడినది, రంగుకలది, రక్తవర్ణం కలది సరాసరి
సరి n సాటి, తగినది, హారం, యుక్తు, సమం, సమాప్తం, అంగీకారార్థం, పూర్ణంగా, మిట్టపల్లాలు లేనిది, సమాన సంఖ్య, రుజువు, సాటి, నీటిబుగ్గ,పోలిక, సమర్థతగలవాడు
సరిత్తు n నది, ఏరు, సూత్రం; తటిని, ధుని
సరిహద్దు n పొలిమేర
సరీసృపం n పాము, వక్రంగా పోయేది
సర్కసు n జెట్టీలు గుర్రాలు వంటిజంతువుల మీద మొగ్గలు వంటి విద్యలు చేసే స్థలం
సర్కారు n ప్రభుత్వం,సరకారు
సర్గం n సృష్టి, పరిచ్చేదం, నిజం, ప్రయత్నం, యుక్తి, స్వభావం,వదలడం, నిశ్చయం, అంగీకారం, అధ్యాయం, మూర్చ, అశ్వం
సర్గ n పోటీ, పంతం, అసూయ, సాదృశ్యం, క్రమ ఔన్నత్యం, ఇతరుని అవమానించాలనే కోరిక
సర్డు n సరుదు, సవరించు సర్దుకుపోవడం
సర్దారుడు n నాయకుడు
సర్దుబాటు v సరిపుచ్చుకొను,పరిష్కరించు, దిద్దుబాటు
సర్పం n పాము, వక్రగమనం కలది;ప్పదాకువు, భుజంగం, భుజగం, భుజంగమం, ఆశీవిషం విషధరం, చక్రి, వ్యాళం, సరీసృపం, కుండలి, గూఢపం, చక్షుశ్రవం, కాకోదరం, ఫణి, దర్వీకరం, దీరప్పష్టం, దందశూకం, బిలేశయం, ఉరగం, పన్నగం, భోగి, జిహ్వగం, పవనాశనం, లేలిహానం, ద్విరసనం, కుంభీనసం, సారంగం, హరి, పాము, నిడుపడు, పడగదారి, గాలిమేతరి, విషదారి, కానిరానికాళ్ళది, చిల్వ, వీనులకంటి, పుట్టదిట్ట, పుట్ట కాపరి, కను వినికి, గుడ్డుకానుపు, చట్టుపురుగు, తొట్టు, త్రోచు, నిడుదవెన్ను, బుసకొట్టు, పురుగు, ముక్కంటి సొమ్ము, వెల్చ, సౌదరం
సర్పి n నేయి, పాకేది, జారేది,వంకరగా నడిచేది, కదలేది, ఒక విధమైన చర్మవ్యాధి
సర్వం సంసర్వఅన్ని, ఎల్ల; ++ పూర్ణమైనది, నిశ్శేషమైనది,జలం
సర్వంకషం n సర్వశక్తిమంతం,సర్వాన్ని నాశనం చేసేది సర్వకాలీనం
సర్వంసహ n భూమి, అంతా (అన్నిటిని) సహించేది
సర్వజనీనం n ప్రసిద్ధం, ప్రఖ్యాతం ,ఎల్లరకూతెలిసినది, ఎల్లరకూ హితమైనది, ఎల్లరకూ తెలిసినది
సర్వజ్ఞుడు n శివుడు, సర్వమూ తెలిసినవాడు, బుద్ధుడు, స్త్రీ, దుర్గ, పరమాత్ముడు, అన్నీ తెలిసిన వాడు
సర్వతోముఖం n అన్ని విధాలైనది;వ్యు
సర్వత్రా సంఅవ్యఅతటా, అన్నిచోట్లా,అన్నివేళల్లో,
సర్వధా సంఅవ్యఅన్నివిధాల, ఎల్లవేళలా, పూర్తిగా, నిశ్శేషంగా, అతిశయంగా సర్వదమనుడు
సర్వనామం n నామానికి మారుగా ఉపయోగింపదగిన పదం; 'సర్వ' మొదలైన పదాలు సర్వనామాలు
సర్వనాశనం n పూర్తి నాశనం
సర్వభక్షుడు n అగ్ని, అన్నిటినీ భక్షించే (తినే)వాడు, సమస్తాన్ని తినేవాడు సర్వమంగళ n పార్వతి, సమస్తమైన
సర్వమంగళం n శూన్యం
సర్వసమానతా సిద్దాంతం n అందరూ సమానం అనే నిర్ణయం
సర్వసాక్షి n పరమాత్మ, అన్నిటికీ సాక్షి, వాయుదేవుడు,
సర్వహరం n మృత్యువు, అన్నిటినీ హరించేది
సర్వాంగీణం n అన్ని అంశాలకు సంబంధించినది, అన్ని అంశాల్లో వ్యాపించినది
సర్వాత్మనా n అంతటా, అందరిలో, అన్ని విధాలా
సర్వీసు n సేవ, నౌకరి, ఉద్యోగం
సర్వేజనాః n జనులంతా
సర్వేశుడు n పరమాత్ముడు, శివుడు, చక్రవర్తి సర్వోత్తమం
సలక్షణం n సమాన క్షణాలు ఉన్నది, లక్షణంతో కూడినది సలలితం
సలసల n కాగడంలో, తెర్లడంలో ధ్వనికి అనుకరణం
సలహా n ఆలోచన, సమ్మతి
సలహాదారు n ఆలోచన చెప్పేవాడు
సలహాసహకారాలు మివిఆలోచనా సహాయాలు
సలాం n నమస్కారం, వందనం
సలాక n బంగారం వంటివాటి కమ్మి,వెదురు వంటి వాటి బద్ద
సలిలం n నీరు, జలం, ఉత్తరాషాఢ నక్షత్రకూటం
సలీలం n విలాసం ఉన్న వ్యక్తి++ఒయ్యారమైనది, భావవ్యంజకమైనది, శృంగారమైనది
సలుపు v బాధ కలిగించు, చేయు, కడుపు, బాధ
సల్పడం v చేయడం
సల్లాపము నంవివరస్పరం సంభాషించడం,సల్లాపం
సల్లేఖకుడు n చక్కటి రాతగాడు,మంచి రాయసకాడు
సళ్ళు v వదలు, విడుచు, సడలు, వెనుకకు తగు, నశించు, జారు సవతి
సవనం n యజ్ఞం, జన్మం, మునక, కాన్సు, హోమం, సోమపానం
సవరం n స్త్రీలు కొప్పుముడవడంలో ఉపయోగించే కృత్రిమమైన జుట్టు, చమర వాలం, చమరీ మృగం తోక, వెండ్రుకల చుట్ట, వింజామరం సవరించు
సవర్ణం n తుల్యవర్ణం కలది, ఒకేరంగు కలది, పోలినది, ఒకే జాతికి చెందినది, తుల్యాస్య ప్రయత్నమైన వర్ణం సవారీలు
సవాలక్ష మివిలక్షపాతిక
సవాలు n ప్రశ్న, విచారణ
సవిత n సూర్యుడు, సుపుని (నిద్రించిన వాడిని ప్రేరేపించేవాడు, తండ్రి, పరమేశుడు, హస్త, జిల్లేడు చెట్టు
సవిత్రి n తల్లి, ఆవు
సవిధం n చేరువ, సమీపం, ఒక విధమైనది
సవినయం n వినయం కలది, విలాసంకలది
సవిభ్రమం n ఒయ్యారం ఉన్నది,విలాసం ఉన్నది
సవిమర్శం n ఆలోచనం ఉన్నది
సవిశేషం n వింతయైనది, ప్రత్యేక గుణాలు కలది, విలక్షణమైనది, శ్రేష్ఠమైనది, భిన్నమైనది
సవిస్తరం n వివరాలతో కూడింది, సమగ్రమైంది
సవిస్మయం n ఆశ్చర్యపడింది,
సవ్యసాచి n అర్జునుడు, ఎడమచేతితో బాణం సంధింప నేర్పుగల వాడు
సవ్యుడు n చక్కగా నడుచుకునేవాడు; విష్ణువు
సవ్వడి n జాడ, ధ్వని
ససేమిరా అవ్యమొండిపట్టుదలను సూచించేమాట
ససైన్యం n చతురంగ బలంతో కూడినది
సస్మితం n చిరునవ్వుకలది, మందహాసంతో కూడినది
సస్యం n పైరు;, వృక్షాదిఫలం, ఆయుధం, సుగుణం, శుభలక్షణం, పుణ్యం
సస్యరమ n ధాన్యలక్ష్మి,
సస్యశ్యామలం n పైరు పచ్చలతో నిండినది సహకరించు
సహ n జ్ఞప్తి, ఇచ్ఛ, అసూయ,సోయిలో ఉండటం
సహకారం n తోడ్పాటు;, తియ్య మామిడిచెట్టు, కలిసి పనిచేయడం, ఐకమత్యం,
సహకార పరపతి సంఘం n అప్పులిచ్చి తోడ్పడే సంస్థ
సహగమనం n కూడా పోవడం ,మరణించిన భర్తతో కూడా చితిచొచ్చి మరణించడం; దీన్ని 'సాగుమానం' అనికూడా అంటారు, భర్తతో కూడా చితిలో ప్రవేశించడం సహచరులు
సహజం n స్వభావం, కూడ బుట్టినది, స్వాభావికం,జన్మసిద్ధమైనది
సహజన్ములు నంవిసోదరులు ,తోబుట్టువులు
సహజలక్షణం n స్వభావసిద్ధంగా ఉన్న లక్షణం
సహజాతం n తోడబుట్టినది, కలిసి పుట్టినది
సహజీవనం n కలసి మెలసి జీవించడం, సంఘజీవనం, మైత్రి, సాహచర్యం
సహణీయం n కోరదగింది
సహదేవుడు n పంచపాండవులలో చివరివాడు
సహధర్మచారిణి n భార్య, భర్తతో కూడి ధర్మ కర్మలాచరించేది;సహధర్మిణి
సహనం n ఓర్పు, క్షమ
సహపాఠకుడు n తోటి విద్యార్థి, సహపాఠి
సహర్షం; విశేషసంతోషంతో కూడింది సహవాసం నంవి స్నేహం, కలిసి ఉండటం
సహవాసి n మిత్రుడు, ఒక ఇంట్లో నివసించే వాడు, కలిసి ఉండేవాడు
సహశ్రోతలు n తోడుగా వినేవారు
సహస్రం n వేయి, పదినూర్లు, పెక్కు
సహస్రకరుడు n సూర్యుడు ,వేయి (చేతులు) కిరణాలు కలవాడు; సహస్రకిరణుడు, సహస్ర దీధితి, సహస్ర రశ్మి,
సహస్రథా సంఅవ్యవేయి విధాలుగా, వేయి శకలాలుగా, వేయి రెట్లుగా
సహస్రముఖాలు n పెక్కువిధాలు
సహస్రాక్షుడు n ఇంద్రుడు ,వేయికళ్ళు ఉన్నవాడు;జాగ్రత్తగల వాడు, విరాట్ పురుషుడు, శివుడు, విష్ణువు సహా
సహాధ్యాయులు n ఒకేచోట కలిసి చదువుకున్నవారు
సహానుభూతి n కూడా అనుభవం
సహాయం n తోడ్పాటు, పోషణ, ఎర్రబాతు, ఒక విధమైన పరిమళం
సహాయ ఇంజనీరు n తోడ్పడే ఇంజనీరు (అసిస్టెంటు ఇంజనీరు)
సహించు v ఓర్చు, క్షమించు
సహితం n కూడి ఉన్నది, కలసి ఉన్నది, సహించినది
సహృదయుడు n రస జుడు, విద్వాంసుడు, విమర్శవంతుడు, వివేకి
సహోదరి n సోదరి, తోబుట్టువు;సానాఅక్క, చెల్లెలు
సహోదరుడు n సోదరుడు, తోడబుట్టినవాడు, అన్న, తమ్ముడు
సహోద్యోగి n తోడి నౌకరు, తోటి ఉద్యోగస్థుడు
సహ్యం n ఓర్వదగినది, ఆరోగ్యం, సుఖం, ఒక కొండ
సాంకం సంవీణ సంవరానికి సంబంధించినది
సాంకర్యం n కలయిక, మిశ్రణం, భిన్న ద్రవ్యాదుల కలయిక, కలగలుపు
సాంకేతికం n ప్ర యోగనైపుణ్యానికి సంబంధించినది, పారిభాషికం, సంకేతాల కు (చిహ్నాలకు) సంబంధించినది, సాంప్రదాయికం, సంకేతంవల్ల ఏర్పడినది
సాంకేతిక విద్య n శిల్పాది విద్యలకు సంబంధించిన విద్య
సాంఖ్యం n షడ్దర్శనాల్లో ఒకటి, సంఖ్యకు సంబంధించినది, లెక్కించేది, వివేకించేది, పరిశీలించేది, తర్కించేది
సాంగత్యం n స్నేహం, కలయిక, మైత్రి, చేరిక **** వీటి సాంగత్యం అతనికి అనుకోని ఆనందాన్ని కలిగించేది
సాంగోపాంగం n సవిస్తరమైనది, సంపూర్ణమైనది, అంగాలతోను, ఉపాంగాలతోను కూడినది
సాంఘిక దురాచారాలు n సంఘానికి సంబంధించిన చెడు ఆచారాలు
సాంఘిక సంక్షేమరంగం n సంఘానికి సంబంధించిన సంక్షేమ రంగం
సాంఘికధర్మం n సంఘానికి సంబం ధించిన ధర్మం
సాంతం n పూర్తియైనది, పూర్ణం, అంతంగలది, మొత్తం, సకారం అంతంగా గలది
సాంత్వనం నంవిఓదార్చడం;రూసాంత్వన, సాంత్వం, సాంత్వ
సాందీపని n ఒక ఋషి
సాంద్రం n చిక్కనిది, దట్టమైనది, ఎడంలేనిది, మోటైనది, క్రిక్కిరిసి నది, దృఢమైనది, సమృద్ధమైనది, గాఢమైనది, జిడ్డుగలది, నున్ననిది, మెత్తనిది, మనోహరం, రాశి (గుంపు),పొద
సాంద్ర n చిక్కనిది, దట్టమైనది;రూసాంద్రం, మోటైనది, క్రిక్కిరిసినది, బలిసినది, సమృద్ధమైనది, గాఢమైనది, స్నిగ్ధమైనది, నున్ననిది, మెత్తనిది, సుందరం, రాశి, గుబురు
సాంధ్యరాగం n ఉదయ, సాయంసంధ్యలకు సంబంధించిన ఎరుపు సాంప్రదాయికం
సాంబమూర్తి n శివుడు, అంబ (జగన్మాత)తో కూడుకొని ఉండేవాడు
సాంబశివుడు n ఈశ్వరుడు ,అంబ (జగత్తులకు తల్లి)తో కూడుకొని ఉండేవాడు
సాంబారు తవిఒక విధమైన పప్పుచారు,పులుసు
సాంబ్రాణి n ఊదు, ధూపద్రవ్య విశేషం,సాంబ్రాణి, సామ్రాణి, సంబరేను చెట్టువల్ల కలిగినది, ఒక దేశం, సాంబ్రాణి దేశపు గుర్రం, సాంబ్రాణి దేశంలో పుట్టినది
సాంవత్సరీకం n వార్షికం, ఆబ్దికం ,ఏడాదికోసారి జరిగేది, సంవత్సరంలో జరిగేది
సాంసారికం n ఐహికం, ప్రాపంచికం, సంసారానికి సంబంధించినది
సాంస్కృతిక పునరుజ్జీవనం n కుళ్ళిపోతున్న సమాజానికి, శిథిలమవుతున్న సంస్కృతికి కొత్త ప్రాణం పోయడం (1850 తర్వాత) కాలాన్ని సాంస్కృతిక వనరుజ్జీవనానికి సంబంధించిన కాలంగా చరిత్ర కారులు గుర్తిస్తారు
సాకల్యం n సకలత్వం, పూర్ణత్వం సాంస్కృతిక విశేషసంస్కృతికి సంబంధించిన
సాకారం n ఆకారం దాల్చు, రూపం ధరించు
సాకు కక్రిచాలు, వద్దు, (కన్న) చాలు, (తే) పెంచు, రక్షించు, నెపం
సాకులు n మిష వ్యాజం, నెపం సాక్షీభూతం
సాక్షాత్కరించు v ప్రత్యక్షమవు, కనిపింపచేయు
సాక్షి n సాక్ష్యం ఇచ్చేవాడు, ప్రత్యక్ష జ్ఞానం ఉన్నవాడు, చూసేది, రుజువు చేసేది, నిర్ధారించేది, పరమాత్ముడు, కనివిని తెలుసుకున్న వాడు
సాక్ష్యం n సాక్షి కని విని చెప్పిన మాట, రుజువు, ఏకాదశాహశ్రాద్ధం (షో డశం)
సాగనంపు v వెంట వెళ్ళు, అనుగమించు; ప్రయాణమై వెళ్ళే వారిని కొంత దూరం తీసుకొని పోయి విడవడం
సాగరం n సముద్రం, సగర పుత్రుల చేత యజ్ఞాశ్న అన్వేషణకోసం తవ్వబడి నది, సంద్రం, ఏనుగు చెవి మందం, నూనె నెయ్యి వంటి నింపిన సిద్దెల వోడు ఒక జాతి మృగం
సాగరతుల్యం n సముద్రంతో సమానమైనది
సాగరసంగమం n సముద్రంలో కలవడం
సాగరుడు n సముద్రుడు
సాగారింది v తరలింది, సాగిపోయింది
సాగించు v జరుపు, కానించు, నిర్వర్తించు, నెరవేర్చు,నడిపించు, ప్రవర్తించు, యత్నించు
సాగివచ్చు v జరిగివచ్చు
సాగు v ముందుకుపోవు, పైకివచ్చు++కృషి, గమనించు, ఎగిరిపోవు, కదలు, తిరుగు, ప్రవహించు, జరుగు, వెంటవచ్చు, చెల్లు, నెరవేరు, వ్యాపించు, ఒప్పు, ప్రారంభించు
సాగుబడి n చెల్లుబడి, సాగు, కృషి చెలామణి సాజం
సాగుబాటు n జరుగుబాటు
సాజాత్యం n సామ్యం , ఒకే జాతికి కులానికి చెంది ఉండడం, జాతి సామ్యం, ఐక్యం
సాటి n సమానం, పోలిక, కాసెకోక; ఎన, ఉద్ది, కల్పం, జత, జోకం, జోడు, తరం, కులం, తుల్యం, దినుసు, దీటు, దొర, ధర్మం, సాటి, పురుడు, ప్రకారం, ప్రతి, మాదిరి, మాలు, సమం, సద్భక్షం, సదృశం, సమానం, సాధారణం
సాటిమనిషి దేతోటి వ్యక్తి
సాటిరాని n (పోలని) సమానంకాని
సాటివచ్చు v సమానమవు, ఈడవు
సాతాళించు n ఉడికించి పోపున పెట్టు;నానిన గింజలు వంటి వాటిని చమురు కొంచెం వేసి పక్వం చేయడం
సాత్త్యికం n ఒక భావం, సత్యగుణంవల్ల పుట్టిన భావం, యథార్థం, నిజమై నది, నిష్కపటం, సాధువు, శక్తిమంతం, సత్యగుణం కలది, మనస్సులో పుట్టినది
సాత్త్విక భావాలు n స్తంభం,ప్రళయం, రోమాంచం, కంపం, స్వేదం, వైస్వర్యం, వైవర్ణ్యం, అశ్రుపాతం అనే ఎనిమిది సాత్విక భావాలు
సాదం n అన్నం; n దిగబడటం, అస్తమించడం, దిగబడటం,విసువు, కృశించడం, నశించడం, బాధ, స్వచ్ఛత, గమనం
సాదరం n దయ ఉన్నది ,ఆదరంతో కూడినది
సాదా v,n సాధారణం, నగిషీలేనిది, మల్లవిద్యా విశేషం
సాదృశ్యం n పోలిక,సామ్యం , ప్రతిరూపం, ప్రతిమ
సాధకబాధకాలు n కష్టనష్టాలు, సాధించేవి బాధించేవి
సాధనం n సాధించడం, సౌఖ్యం, మృతసంస్కారం, స్వాధీనం, ఉపాయం , ఉపకరణం, హేతువు, ధనం, తపం, చెలిమి, ముక్తి, హింస
సాధన n సిద్ధి, సమాప్తి, పూజ్యం,సమాధానం
సాధన సంపత్తి n నెరవేర్చడానికి అవసరమైన సంపద
సాధన సామగ్రి n ఉపకరణాలు, అవసరమైన వస్తువులు
సాధనాలు నంవి పరికరాలు,ఉపకరణాలు
సాధారణం నంవి సామాన్యం, అందరికీ వర్తించే విధి, సామాన్య నియమం, జాతి లక్షణం
సాధారణీకరణం n సామాన్యం చేయడం, విశ్వజనీనం చేయడం, నిర్విశేషం చేయడం, పరిశుద్ధం చేయడం
సాధించేస్తున్నావు v చంపేస్తున్నావు
సాధికారం n అధికారంగలది,ప్రభుత్వం గలది, రాజనియోగ బలం కలది
సాధు సంఅవ్యబాగు, మేలు; బళా,చాలు, సరి
సాధుపాఠం n మంచిపాఠం
సాధుపుంగవులు n మంచివారిలో శ్రేష్ఠమైనవారు
సాధువు n మంచిది, శ్రేష్టమైనది, బుద్ద దేవుడు, మంచివాడు, తగినది, ముదుసలితనం, వడ్డికిచ్చి బతికేవాడు, మునీశ్వరుడు
సాధ్యం n సాధింప తగినది
సాధ్వి n పతివ్రత, ఒక దినుసు దుంప, ఒక వృత్తం, (భ, న, జ, న, స, న, న, భ, గురువుగల వృత్తం8, 1,2, 22 యతిస్థానం)
సాన n ఒరపురాయి, అస్త్రం వంటిపదును పెట్టే రాయి;ఒరగల్లు, కరసాన, కటీక, కషం, కషోపలం, టీకం, నికషం, శాణం, శాణి, గంధంకోసం గంధం చెక్కతో బాదే రాయి, మణుల మొక్కలు పోయేటట్లుగా రాసే రాయి, గంధం తీసుకొనే రాయి
సానబట్టు v వ దును బెట్టు, మెరుగుబెట్టు
సాని వి,సీ, వేశ్య, రాణి, భార్య,తల్లి అని అర్థం వచ్చే ప్రత్యయం, దొర సాని, మంత్రసాని
సానునయం n ఆదరం కలది;++, వినయంగలది, మర్యాదగలది,నాగరికమైనది
సానుభూతి n జాలి, దయ
సానురాగం n ప్రేమగలది, చనువు గలది, ఆసక్తమైనది
సానువు n శిఖరం, ఉపరితలం, మొలక, అడవి, బాలి), పైభాగం, పర్వత ప్రాంతం, సుడిగాలి, విద్వాంసుడు, సూర్యుడు
సాన్నిధ్యం n సామీప్యం, ప్రత్యక్షం, హాజరు
సాన్నిహిత్యం n సామీప్యం
సాపత్యం n పోలిక, సామ్యం
సాపాటు n ఆరగించడం సాపించు, తిట్టు, శపించు, శాపించు సాపు
సాపేక్షం n సంబంధించినది,ఇతరం పై ఆధారపడినది, కేవలంకానిది; X నిరపేక్షం సాఫల్యం, ఫలప్రాప్తి, ప్రయోజనం, లాభం, జయం
సాఫీ n తిన్నదనం, శుభ్రత
సాభిప్రాయం n ఉద్దేశపూర్వకం, సార్థకం, రత్యాది భావసహితం, వ్యంజకం
సామం నంవిశాంతపరచడం,ఓదార్చడం, అనునయించడం, నచ్చచెప్పడం, మృదువచనం, సౌజన్యం, స్తుతిరూప పద్యం/ పాట, సామవేద మంత్రం, ఒక వేదం, ఒక జన్నం, మంచితనం, ఒక కార్యోపాయం, మంచిమాట
సామంజస్యమి నంవి ఔచిత్యం, యోగ్యత, సరిపడి ఉండడం
సామంతుడు నంవిఒక దేశం సరిహద్దులో ఉన్న రాజు, ఒక దేశం పొలిమేర కు చేరికనున్న రాజు, పొరుగున ఉన్న వాడు, అరిగాపు, నాయకుడు
సామగ్రి n వస్తుసముదాయం, సాధనసంపద, నిలువసరుకు, ద్రవ్యసంభారం
సామజం n ఏనుగు, సామవేదం వల్ల పుట్టినది;సామోపాయంవల్ల కలిగినది
సామరస్యం n సమరసభావం,చెలిమి;, మైత్రి, ఐకమత్యం
సామర్థ్యం n శక్తి, బలం, దక్షత, ఏకలక్ష్యత, యోగ్యత, అర్థసమర్పణ లాభం, ధనం, ఉత్పాదకత్వం, కారణత్వం, సాధకత్వం
సామవేదం n నాలుగు వేదాలలో ఒకటి; వేదాలు నాలుగు అవి బుక్, యజుర్, సామ, అథర్వణాలు
సామాజిక n సమాజానికి సంబంధించినది, సభాసంబంధి, సంఘ సంబంధి
సామాను n సామగ్రి, వస్తువులు
సామాన్యం n సార్వవిషయికమైన అర్థాన్ని ప్రతిపాదించే వాక్యం, సాధారణం, తుల్యం, మధ్యమం, గ్రామ్యం, మొత్తం, సమాజం, సమూ హం, జాతి, సమానధర్మం, ఐక్యం,ప్రజా వ్యవహారం సామాన్య లక్షణం, జాతి గుణ ధర్మాలను మాత్రం వివరించే
సామాన్యశాస్త్రం n సాధారణ ఆధునిక విజ్ఞానశాస్త్రం
సామాన్యుడు n సాధారణ వ్యక్తి,సగటు మనిషి
సామి n రాజు, ప్రభువు, దేవుడు,పెనిమిటి, కుమారస్వామి (సంఅవ్య) సగం, నింద్యం; ప్రకృస్వామీ సామీప్యం, చేరిక,
సాముదాయికం n సామూహికం, మొత్తానికి సంబంధించినది
సాముద్రికం n సాముద్రికశాస్త్రం ,అదృష్టసూచక దేహ లక్షణాలకు సంబంధించినది; శరీర అవయవాలు/ హస్తరేఖలను బట్టి ఫలాన్ని
సామూహికంగా విశేష సాముదాయికంగా
సామెత n లోకోక్తి
సామ్యం n పోలిక, సాదృశ్యం, సమత్వం, సామరస్యం, పక్షపాత రాహిత్యం, ఐకమత్యం సామ్యవాదం, సమత్వవాదం,
సామ్యంగా n వెత్తదనం,మృదువైనది, చంద్రునికి సంబం ధించినది, శాంతం, మగశిర, మెత్తన, తిన్నన, చేతి నడిమిచోటు, బుధగ్రహం, మేడిచెట్టు, మార్గశిరం, ఎడమచేయి, శుభగ్రహం, ఒక వ్రతం, అందమైనది, ఎడమకన్ను
సామ్రాజ్ఞి n రాణి
సామ్రాజ్యం n సువిశాలమైన రాజ్యం, ఏకచ్ఛత్రాధిపత్యం
సాయం n తోడు, సాహాయ్యం, అసమయం, దినాంతం, బాణం
సాయంకాలం n అపరసంధ్య వేళ, పొద్దుగుంకే సమయం
సాయుజ్యం n లయం, ఐక్యం, పోలిక, చతుర్విధ ముక్తులలో ఒకటి
సాయుధపోరాటం మివి ఆయుధాల తోడి యుద్ధం
సారం n శ్రేష్ఠం, ముఖ్యం,నత్యం, దృఢం, బుజువైనది, సర్వోత్తమం, జలం, ఔచిత్యం, అడవి, ఉక్కు, నిగ, రసం, తత్వం , సంగ్రహం, బలం, శౌర్యం, సంపద, అమృతం, వాయువు, మీగడ, రోగం, విలువ, హృదయం,
సారంగం నంవిలేడి, జింక ,తొందరగా వెళ్ళేది; ఇట్టి, కురంగం, తుమ్మెద, ఏనుగు, వానకోయిల, చిరుత పులి, కోయిల, ఓదెకొంగ, నెమలి, గొడుగు, మబ్బు, వెండ్రుక, నగ, పువ్వు, బంగారు, కప్పురం, విల్లు, తామర, చిత్ర వర్ణం, రాత్రి, నేల, శంఖం, చందనం, వెలుగు, ఒక స్త్రీ రాగం
సారథి n రథాన్ని నడిపేవాడు,రథ చోదకుడు;నియంత, యంత, ప్రాజిత, సూతుడు, క్షత్ర, సవ్యేష్ఠుడు, దక్షిణస్థుడు, రథకుటుంబి, సహాయుడు, సముద్రం
సారథ్యం n రథం నడిపే పని, రథచోదకత్వం, నాయకత్వం సారథ్యసంఘం, నాయకత్వసంఘం (నడిపే సంఘం)
సారమతి n శ్రేష్టమైన బుద్ధి
సారమేయం n (మగ) కుక్క ,సరమ (ఆడకుక్క)కు పుట్టినది
సారల్యం n ఋజుత్వం;రూ సారల్యం, సారళ్యం; , ఋజుత్వం, నిష్కపటత్వం,సూటితనం
సారవంతం n బలం కలది, దృఢమైనది, రసంకలది సారసం, పద్మం, సరస్సులో పుట్టినది, తామర,
సారస్వతం n వాజ్మయం; , సరస్వతికి సంబంధించినది (వాజ్మయం), సరస్వతీనదికి సంబంధించినది, వాగ్ధాటికలది, సారస్వత దేశానికి చెందినది బిల్వదండం, వాజ్మయం
సారహీనం n శక్తిలేనిది
సారాంశం n ముఖ్య విషయం, పిండితార్థం
సారా n మద్యం , మదిర;రూ సారాయం, సారాయి సారి, తూరి, తడవ, యుద్దయాత్ర, వేట, (కుమ్మరి) చక్రం, సారం కలది, నడిచేది, పాచిక, పక్షివిశేషం
సారించు v చూచు, ప్రసరింపచేయు, తిప్పు, లాగు, చక్క చేయు, ప్రయోగించు, నెలకొల్సు, తెరచు,మెదుపు, విసరు, ప్రసరింప చేయు
సారూప్యం n సమాన రూపత్వం, దేవతరూపం లాంటి రూపంపొందడం, చతుర్విధముక్తులలో ఒకటి
సారూప్యత n సమాన రూపత్వం
సారె దేతడవ, పర్యాయం, పాచిక, వీణమెట్టు, చక్రం, భక్ష్య విశేషం, గోరువంక, కూతురును అత్తవారింటికి పంపేటప్పుడు పుట్టింటి
సారెసత్తులు n జంతికలు సార్థకం, అర్థవంతం, ప్రయోజనవంతం, ఫలవంతం
సార్ n అయ్య, పెద్దమనుష్యుడు, మర్యాదపూర్వక సంబోధన
సార్థక్యం n అర్థవంతం, ప్రయోజనవంతం, ఫలవంతం
సార్ధవాహుడు n వణిజుడు, వర్తకుడు , జంతుజాలాన్ని కొనిపోయేవాడు, వణిక్సమూహనాయకుడు,ముఖ్యుడు
సార్వకాలికం n శాశ్వతం, నిత్యం
సార్వజనీనం n సార్వజనికం , సర్వజనులకు సంబంధించినది సార్వత్రికం, సర్వప్రదేశాలకూ సంబంధించినది, అన్ని సందర్బాలకు తగినది
సార్వభౌముడు n చక్రవర్తి, సమ్రాట్టు ,సమస్త భూమండలాన్ని ఏలే రాజు
సాలం n మద్దిచెట్టు, వృక్షం,యక్షధూపం, మద్దిచెట్టు, ప్రాకారం,కోట
సాలంకారం n అలంకారాలతో కూడినది
సాలంకృతం n చక్కగా అలంకరింపబడినది, అలంకారాలతో కూడినది
సాల n ఒకచెట్టు, పెద్ద కొమ్మ, చావడి, గోడ, ప్రకృతిశాల
సాలగ్రామం n విష్ణుచిహ్నిత శిలావిశేషం; విష్ణ్యాత్మకమైన గండకీ నది లోని రాయి
సాలభంజిక n బొమ్మ ,వన్తదంత కాషాదులచేత చేయబడిన బొమ్మ
సాలావృకం n తోడేలు, కుక్క, కోతి, నక్క
సాలు n సంవత్సరం, ఏడాది సాలోక్యం నంవితుల్యలోకంలో ఉండటం, ఇష్టదేవత ఉన్న లోకాన్ని పొందడం, చతుర్విధ
సాలెపురుగు n సాలీడు, సాలెవాడు ,బొడ్డులోని నూలుతో సాలెవాని లాగా నేతనేసే ఒక జాతి పురుగు; లూత, తంతు వాయం, ఊర్ణనాభం, మర్కటం, అష్టాపదం,దట్టుపురువు
సావకాశం n విశ్రాంతి వీలు ఉన్న
సావధానం n చిత్తెకాగ్రత కలది, అప్రమత్తమైనది, శుద్దిగలది, పరిశ్రమించేది
సావయవం n అవయవాలు కలది, భాగాలతో కూడినది
సావాసం n స్నేహం, పొత్తు
సావిడి n వసారా, ఇంటి ముందరి చావిడి
సావిత్రి నంవిసూర్యుని వత్రి,సత్యవంతుని భార్య, సరస్వతి, హస్తానక్షత్రం, పార్వతి, సూర్యకిరణం, ఒక మంత్రం, ఉపనయనకర్మ, బ్రహ్మ భార్య, కశ్యపుని భార్య, సంధ్యాదేవతకు మధ్యాహ్న కాలపు పేరు
సాష్టాంగం సంఅవ్యదండాకారంగా ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్లుగా, ఎనిమిది అవయవాలు భూమికి తగిలేటట్లుగా చేసే నమస్కారం; (ఉరసా శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తథా పద్బ్యాం , కరాభ్యాం , కర్ణాభ్యాం (ప్రణమాష్టాంగ ఉచ్యతే), వక్షం, తల, దృష్టి మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, చెవులు
సాసరు n పింగాణి ప్లేటు
సాహచర్యం n సహవాసం, కలిసి ఉండటం, అవినాభావ సంబంధం
సాహసం n తెగింపు, ఔద్దత్యం,నేరం, క్రౌర్యం, తొందరపాటు, దండన, కీర్తి
సాహసగాథ n తెగింపుకథ
సాహసించు v తెగించు, చొరవ
సాహాయ్యం n తోడ్పాటు, మైత్రి
సాహితీవేత్త n సాహిత్యం తెలిసిన వాడు సంఘసంస్కర్త
సాహితీసమరాంగణ సార్వభౌములు n సాహిత్యరంగంలోను యుద్ధ రంగంలోను చక్రవర్తులు
సాహిత్యం n కవిత్వం, కావ్యవాజ్మయం, కావ్య నాటకాలంకారాదుల అర్థజ్ఞానం;, సాహచర్యం, కవిత్వం, సామగ్రీసంకలనం, భోజనావసర వస్తువుల మొత్తం
సాహిత్యవిమర్శ n కావ్యా నాటకాలం కారాదులను విమర్శించడం
సాహుకారు n వడ్డీ వ్యాపారంచేసేవాడు, వ్యాపారి
సింగం (బు) n సింహం
సింగడు n నృసింహుడు, ఎరుకపాడు, కోపించినవాడు
సింగాణి n విల్లు,సింగిణి, సింగిణీ, కొమ్మువిల్లు, సివంగి, నక్క పేరు, బాణం, ఒకరకం కుక్క
సింగారం n శృంగారం, అలంకారం, అందం, మంజులం సింగారించు, వి సింగారంచేయు, అలంకారం చేయు
సింగారం n శృంగారం, అలంకారం,అందం
సింగారించు v అలంకరించు, దిద్దు
సింగి n ఎరుకలసాని, చెంచుది
సింగిణి n ధనువు, విల్లు, సింగాణి,సింగిణీ,
సింగినాదం n చెప్పుకోదగింది కాని దానిని గూర్చి తీసివేసినట్లు మాట్లాడే టప్పుడు వాడే మాట, కొమ్మువాద్యం, యోగులు
సింజిని n వింటినారి
సిండికేట్ n ఒక సంస్థ లోని అధికారుల సభ
సిందూరం n చెందిరం, జేగురు రాయి రాగద్రవ్య విశేషం;రక్తరేణువు, సీమంత మండపం
సింధుజ n లక్ష్మీస్ ,సముద్రంలోపుట్టినది, ఇందుప్పు, కప్పురం, చంద్రుడు, భీష్ముడు
సింధువు n సముద్రం, ఒక ఏరు, ఒక దేశం ఏనుగు, వెలిగారం,వరుణుడు, ఒక రాగం, సింధునది
సింహం n మృగరాజు; వెడద మోము, మెకం, జడలమెకం, ఏనుగుల గొంగ, మెకాల కొలం సామి, తెల్లడాలు మెకం, తెరనోటి మెకం, సింగం, బొబ్బమెకం, మృగేంద్రం, పంచాస్యం, పంచాననం, హర్యక్షం, కేసరి, హరి, కంఠీరవం, గజరిపువు, పింగదృష్టి, మృగాధిపం
సింహగర్జనం n వీరావేశంతో పెట్టే బొబ్బ, ఏనుగులు మొదలైన జంతువులు భయపడేటట్లుగా వీరులు చేసే ధ్వని
సింహతలాటం n కవిపండితులకు సన్మానంగా ఇచ్చే సింహం బొమ్మలతోడ కూడిన మురుగు
సింహద్వారం n ప్రధాన ద్వారం,భవనం ముఖద్వారం
సింహనాదం n సింహం గర్జనం, ఏనుగులు మొదలైన జంతువులు భయపడేటట్లుగా వీరులు చేసే ధ్వని, సింహగర్జనం, యుద్ధవీరుని కేక, శివుని నామాల్లో ఒకటి, నమ్మకంతో నొక్కి చెప్పడం, సింహంచేసే నాదంలాంటి నాదం
సింహబలుడు n కీచకుడు; విరాటరాజు బావమరిది
సింహళం n ఒక ద్వీపం;రూ సింహళం, తగరం, ఇత్తడి,లంక, చెట్టుపట్ట
సింహస్వప్నం n భయానకం;ఏనుగుకు కలలో సింహం కనిపిస్తే అది భయంతో మరణిస్తుంది దానినే సింహ స్వప్నం అంటారు
సింహావలోకనం n పునరాలోచనం,వెనుక చూపు, సింహం తన ఆహారాన్ని తినబోతూ శత్రువులు ఎవరైనా పరిసరాల్లో ఉన్నారేమో అని స్వభావంచే ముందు వెనుకలకు చూడడం, సింహం చూపు, శబ్దాలంకారమైన యమకంలో ఒక భేదం (దీనిలో వాక్యం మొదటి మాట తిరిగి చివర కూడా వస్తుంది
సింహాసనం నంవిరాచ గద్దె ,సింహాకృతి కలిగి బంగారంతో చేయబడి, రాజులు కూర్చుండదగిన ఉన్నతమైన పీఠం
సికత n ఇసుక, ఇసుకనేల,మొరపనేల, ఒక రోగం, శర్కర
సికతాతలం n ఇసుకతిన్నె సికస్తు, వి,n శిథిలమైన
సిక్తం n తడిసినది
సిగ n శిఖ, నెమలి జుట్టు, పిల్లజుట్టు, కొప్పు, షీకాయ
సిగదండ n భూషణవిశేషం, శేఖరం, సిగపట్లు, దేదెబ్బలాట సిగం, దేవతావేశం, పూనకం;రూ సివం
సిగరెట్టు n చిన్న పొగ చుట్ట; కాగితపుతొడుగు గల పొగచుట్ట
సిగ్గరి n సిగ్గుకలవాడు, సిగ్గు కలది
సిగ్గు n బిడియం, లజ్జ, మన్గాక్షం,
సిగ్గుపడు v లజ్జ చెందు, బిడియపడు
సిగ్గూ బిడియం n లజ్జ
సిడి n సిడిమాను; గ్రామదేవత జాతరలో ఒకని వీపున గాలం గుచ్చి గాని, ఒకనిని గంపలో కూర్చుండ బెట్టిగాని తిప్పే దూలం, అంకుశం, ఏతపు మ్రాను,స్తంభంమీది అడ్డమాను, కక్ష్య, జాతర
సితం n తెల్లనిరంగు, శుక్లపక్షం,శుక్రగ్రహం, బాణం, పంచదార, వెండి, చందనం, ముల్లంగి, కట్టబడినది, చుట్టబడినది, ఎరుగబడినది, పూర్తి చేయబడినది
సితాంశువు n చంద్రుడు, హారతి కర్పూరం, తెల్లటి కిరణాలు కలవాడు
సితారు n వాద్యవిశేషం
సితికంఠం n నెమలి
సితికంఠుడు n శివుడు
సిద్దహస్తులు n చేయితిరిగినవారు,నిపుణులు
సిద్దాంతం n నిర్ణయం; వాదప్రతివాదాల తర్వాత నిశ్చయ పరుప బడిన పక్షం, స్థిరమైన పక్షం, జ్యోతిషగ్రంథం, నిర్ణయింపబడినది, పూర్వ వాదభేదం
సిద్దాంతవ్యాసం n వాద ప్రతివాదాల తర్వాత నిశ్చయంచేసిన విషయసారం; పిహెచ్డి పట్టాకోసం సమర్పించింది
సిద్దాంతి నంవి శాస్త్ర గ్రంథాల్లో నిష్ణాతుడు; పూర్వపక్షాన్ని ఖండించి సిద్దాంతాన్ని స్థాపించేవాడు, మీమాంసా దర్శనాన్ని అనుసరించే వాడు, తత్వశాస్త్రం తెలిసినవాడు
సిద్దాయం n కప్పం
సిద్దార్థి n తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం పేరు
సిద్దించు v లభించు, తటస్థించు, ఫలించు, ఒడగూడు
సిద్ది n ప్రాప్తి, జయం, అతిమానుషశక్తి, ఈడేరడం, పూర్తి వాంఛిత ప్రాప్తి, తపస్సిద్ధి, ఒక గ్రహయోగం, లాభం, జయం, స్థాపన, నిర్ణయం, సామ్రాజ్యం, తీర్పు, నిజం, చెల్లింపు, సమస్యలను పరిష్కరించడం, సంసిద్ధత, పరిశుద్ధత, అతిమానుషశక్తి (సిద్దులు ఎనిమిది అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం), శక్తి, మోక్షం, సత్పలితం, ప్రయోజనం, జ్ఞానం, దుర్గాదేవి పేరు,శివుని పేరు
సిద్దికోసం మిక్రి ప్రాప్తికోసం
సిద్దురాలు(సిద్ద+ఆలు) మివిసిద్ది పొందిన స్త్రీ
సిద్ధం n సన్నాహం, ఆయత్తమైనది, నెరవేర్చబడినది, ఆర్జింపబడినది, జయించినది, స్థాపింప బడినది, ధ్రువపరుపబడినది, ప్రమాణీకరింప బడి నది, సత్యంగా అంగీకరింప బడి నది, నిశ్చయించ బడినది, చెల్లింపబడినది, వండబడినది, చేకూరి ఉన్నది, వశపడి ఉన్నది, నిపుణమైనది,పవిత్రమైనది, విముక్తమైనది, శాశ్వతం, ప్రఖ్యాతం, అభియోగం, కండచక్కెర, నల్ల ఉమ్మెత్త, సముద్రలవణం
సిద్ధాంతకౌముది n పాణినీయ వ్యాకరణం పై భట్టోజీ దీక్షితులు రచించిన వ్యాకరణం
సిద్ధాంతీకరించు v సిద్దాంతంచేయు
సిద్ధార్థుడు n బుద్దుడు, సిద్దించిన ప్రయోజనం కలవాడు, తీరిన కోరికలుగలవాడు, శివుడు
సిద్ధుడు n యోగి, ముని, ఋషి, అణిమాది అష్టసిద్దులు కలిగిన దివ్య పురుషుడు, అతీంద్రియ దర్శనంగల ఋషి, యోగి, ఇంద్ర జాలంలో ఆరితేరిన వాడు, మంచి మేధ కలవాడు, ముక్తుడు
సినిమాహాలు n చలనచిత్రశాల;తెరమీద బొమ్మలాడేటట్లు సినిమాటో గ్రాఫ్ ద్వారా ప్రదర్శించే రంగశాల
సినీవాలి n పార్వతి, (అమావాస్య) ,చంద్రకళ కానవచ్చే అమావాస్య
సినేరియో n దృశ్యం, వివరణ
సిపాయి n కాలిబంటు, భటుడు
సిఫార్సు n యోగ్యతావచనం;యోగ్యతాపత్రిక
సిబ్బంది n సేవకులు, సైన్యం
సిబ్బి n పళ్ళిక, మూకుడు, ఇత్తడి వంటివాటితో చేయబడ్డ అంచులు లేని గుండ్రటి పళ్ళెం
సిమెంటు n గచ్చు, బందన, లప్పం
సిర n నాడీ,శిర, ఈనె, బోలునరం
సిరస్తాదారు n ఒక ఉద్యోగి;లెక్కలు చూసేవారి పై ఉద్యోగస్థుడు, సిరస్తుదారు
సిరా n కలంతో కాగితం వంటి వాటిపై రాయడానికి ఉపయోగించే ద్రవపదార్థం (ఇంకు), రాసే ద్రవం, (సం) రక్తనాళిక, ప్రవాహం , రవ్వకేసరి (తీపిపదార్థం)
సిరి n సంపద, లక్ష్మి, శోభ, వీధి
సిరివెన్నెల n శోభనిచ్చే వెన్నెల
సిరిసంపదలు దే ధనధాన్యాలు
సిలబస్ n పాఠ్యప్రణాళిక
సిలువ n క్రీస్తును బంధించి వధించిన కొర్రు
సిల్వర్ జూబిలీ n 25 సంలు నిండిన తర్వాత చేసే పండుగ, రజతోత్సవం
సిల్వర్ టంగ్ n వెండి నాలుక, మాట్లాడే నోరు
సివమెత్తు v దైవావేశమగు
సివా హింఅవ్యతప్ప, కాక,సివాయి
సివారు n పెద్ద గ్రామానికి చేరి ఉండే చిన్నపల్లె,శివారు
సివిల్ v,n మర్యాదగల, నాగరికత గల
సివిల్ ఇంజనీరింగ్ n సాధారణ వాస్తుశాస్త్రం (మేడలు, ప్రాజెక్టులు వంటి వాటికి ప్రణాళికలు వేసే శాస్త్రం)
సిసల్(లు) v,n నిర్ధారణమైన
సిస్తు n పన్ను,శిస్తు, కప్పం,రాజ సందర్శన వేళ ఇచ్చే కానుక,అందం, సొంపు సీ, ఇంక్రిచూచు, చూడు
సీకరం n తుంపరలుగా పడే వాన తుంపర, శీకరం
సీకాయ n శిఖాఫలం; నూనె మొదలయిన వాటి జిడ్డును పోగొట్టే దినుసు
సీటు n ఆసనం, స్థానం
సీత n శ్రీరాముని భార్య, జానకి , నాగేటి చాలులో పుట్టినది; కుమారి, భూమిజ, ధరణిజ, జనకజ, నాగటిచాలు, దున్నబడిన భూమి, గంగ (తూర్పుశాఖ), వ్యవసాయం, ఇంద్రుని భార్య,ఉమ, లక్ష్మి, మద్యం
సీతాకోకచిలుక n చిత్రవర్ణమయమైన పెద్ద రెక్కలుగల ఒక పురుగు
సీతాపతి n శ్రీరాముడు, సీత భర్త; సీతపతి, జానకీ వల్లభుడు, దాశరథి, రఘురాముడు
సీతాఫలం n ఫలవిశేషం, సీతాఫలపు చెట్టు
సీత్కారం n ఊపిరిని నోటితో లోనికి పీల్చేటప్పుడు చేసే ధ్వని
సీధువు n మద్యం,శ్రీధువు, పక్వమైన చెరకు రసంనుంచి చేయబడ్డ కల్లు, ఏనుగు కళ్ళలోని మదం
సీనారేకు n అల్యూమినియం రేకు, సత్తు రేకు
సీనియర్ n పెద్దవాడు, జ్యేష్ఠుడు
సీమంతం n గర్భ సంరక్షణార్థం చేసే కర్మ విశేషం, గర్భిణీ స్త్రీలకు చేసే ఒక ఉత్సవం, పాపట, సరిహద్దు రేఖ, పొలిమేర
సీమంతిని n స్త్రీ, ముత్తైదువు ,సీమంతం (పాపట) కలది సీమటపాకాయ, చిన్న టపాకాయ
సీమ n విదేశం, ఎల్ల, వరిమడి,పెడతల, గుర్తు, దిగంతం, ఒడ్డు, మేర, ఉనికి, పట్ట, దేశం, రాజ్యం, పొలం, మెడ వెనుకభాగం
సీమరేగు n పెద్ద రేగుపండు, యాపిల్
సీర n నాగలి, జిల్లేడు మొక్క;రూ సీరం
సీరధ్వజుడు n జనకుడు ,నాగలి గుర్తుగా గలవాడు
సీరపాణి n బలరాముడు,
సీల n మేకు, మొల,చీల
సీలమండ దే చరణగ్రంథి,చీలమండ
సీలు n ముద్ర, గట్టిగా మూయడం, అచ్చుపోత, తిరగడం
సీవకుడు n కుట్టేవాడు, టైలర్ (ఇం)
సీసం n సీసకం, సత్తు, వెర్రి, రోషం, ఒక పద్యం (6 ఇంద్రగణాలు, 2 సూర్య గణాలు ప్రతిపాదంలోనూ ఉంటాయి ఈ పద్యంమీద ఆటవెలది, లేదా తేటగీతి పద్యాన్ని చెబుతారు)మల్లబంధ విశేషం
సీసా n రాజుపాత్ర విశేషం; గాజు బుడ్డి, కాచపాత్రం, సుంకరి, అనుపరి, కేదరి, శుల్కహారి, సంకరీడు, సుంకీడు
సుంకం n వర్తకుల పై విధించే పన్ను, వివాహంలో కన్యకు ఇచ్చే ధనం,ప్రతిబంధం
సుంకరి n పన్ను రాబట్టేవాడు, శుల్కాధికారి,సుంకరి, సుంకరీడు,సుంకీడు
సుంకరి n పన్నులు వసూలు చేసేవాడు, శుల్కాధికారి
సుంత n కొంచెం, ఇంచుక
సుందరం n అందమైనది,ఆదరపాత్రమైనది; చక్కనిది, రుచిరం, చారు, సుషమం, సాధు, శోభనం, కాంతం, మనోహరం, రుచ్యం, మనోజ్ఞం, మంజు, మంజులం, వామం, హారి, రమణీయం, శాలి, మనోరమం, తిప్పనైనది, తియ్యనైనది, తిన్ననైనది, బాగైనది, నాణెమైనది, విన్నాణమైనది, మాగైనది, లెస్సయినది, పిన్ననైనది, చెన్నైనది, నలువైనది, చెలైనది, పొనరినది, ఒనరినది, చొక్కటమైనది, సొగసైనది, సొంపైనది, కొమరైనది, గొనబయినది, తోరమయినది, సింగారమయినది, మేలైనది, వెచైనది, మురుమ గలది,ఒప్పయినది
సుందరాంగులు n అందమైన అవయవాలు కలవారు, అందమైన స్త్రీలు
సుందరి n అందగత్తె, ఒక చెట్టు
సు ఉపసర్గ, మంచి, తగిన, పూర్ణం,సమృద్ధం, ఆశ్రమం, అందమైన
సుకం n హాయి; ప్రకృతి సుఖం
సుకరం n సులభమైనది, సులభంగా చేయదగినది, వితరణం
సుకర్మ n మంచిపని, ఒక గ్రహయోగం
సుకుమారం n మృదువైనది, అందమైనది, లేతది, శాలిధాన్యం, ఒక విధమైన చెరకుగడ, శ్యామాక ధాన్యం, ఆవాలు, అడవి సంపంగి, తమాల పత్రం
సుకుమారుడు n లేత వయస్సువాడు, యువకుడు, అందగాడు సుకృతం, నంవిపుణ్యం, ధర్మం ,లెస్సగా చేయబడినది;, ధర్మ కర్మం, మంచిపని, అదృష్టం, శుభం, లాభం, చక్కగా చేయబడినది, పూర్తిగా చేయబడినది, యోగ్యంగా నిర్మింపబడినది, సహకరింపబడినది, పవిత్రమైనది
సుకృతి n పుణ్యశాలి, అదృష్టవంతుడు, మంచివనిచే సే వాడు, మేలు చేసేది, శుభమైనది, వివేకం కలది, ఉదారమైనది, అదృష్టం
సుకృత్యం n మంచిపని, సత్కర్మ సుఖదాయకం, సుఖాన్నిచ్చేది
సుఖం n సౌకర్యం, స్వర్గం, సౌఖ్యం, సంతోషం, అభివృద్ధి, ఆరోగ్యం, క్షేమం, సులభం, మధురం,తృప్తి, సౌలభ్యం, స్వాస్థ్యం, జలం
సుఖాంతం n సంతోషంలో పర్యవసించేవి, అనుకూలం, మైత్రిపూర్ణం
సుఖావహం n సుఖం కలిగించేది
సుఖించు సంక్రిసుఖపడు, సౌఖ్యం అనుభవించు
సుఖి n యతి, సుఖం కలవాడు
సుఖినోభవంతు v సుఖం కలవారు అగుదురుగాక!
సుగంధం n చందనం, మంచివాసన, సువాసన, గంధకం, నీలోత్పలం, ఒక విధమైన సువాసనగల గడ్డి
సుగతుడు n బుద్దదేవుడు ,యోగ్యమైన గతులుగలవాడు సుగమం, సులువైనది, సుఖంగా పొందదగినది, స్పష్టమైనది
సుగుణం n మంచిగుణం
సుగుణమణిఖని n మంచి గుణాలనే మణులకు గనిలాంటిది (లాంటివాడు),
సుగృహీత నామధేయులు n పేరుపెంపుగలవారు, ప్రసిద్ధిచెందినవారు
సుగృహీతనాముడు n సార్థకనాముడు, పవిత్రమైన నామం గలవాడు
సుగ్రీవుడు n వాలి తమ్ముడు, వీరుడు, శివుడు, ఇంద్రుడు
సుచరిత n పతివ్రత, మంచి నడవడి కలది
సుజనత్వం n మంచితనం,సాధుత్వం, నుజనుల సమూహం, ధీరత్వం, ఉదారత్వం
సుజలం n తామరపూవు
సుజాత n ఉన్నత వంశంలోపుట్టినది, చక్కగా పెరిగినది, చక్కగా ఉత్పాదింపబడినది అందమైనది
సుడి n గాలుల చక్రభ్రమణం, జలావర్తం, అనిలావర్తం, రోమావర్తం, ఋకారపు గుర్తు, కష్టం, రాజులకు కోట నుంచి వచ్చే ఆదాయ భేదం, అదృష్టం
సుడిగాలి n చుట్టుముట్టి వీచే గాలి, ఒకజాతి పందెపు కోడిపుంజు
సుడిగొను v అదృష్టం ఫలించు, కలతనొందు, తిరుగు, చుట్టుకొను
సుడిబడు v బాధపడు, కలవరపడు,గిరగిర తిరుగు, సుడివడు, చిక్కుపడు, చెదరు, తొట్రుపడు,నశించు
సుడులు n బగాలుల చక్రభ్రమణం,జలావర్తం
సుత n కుమార్తె, (దేఅవ్య) మొదలుకొని చివర, పరమాత్మ, తెల్ల గరిక చెట్టు, తీటకసింద చెట్టు, ఒక వృత్తం
సుతరాం సంఅవ్యపూర్తిగా, బొత్తిగా, మిక్కిలి మేలుగా, గుణోత్తరంగా,ఫలితంగా
సుతారం n సుకుమారం, శ్రేష్టం
సుతారి n సురంగం తవ్వే సాధనం, మేస్త్రి
సుతి n కంఠస్వరాదులకు సహాయం అయ్యే తంతి వంటి వాటి ధ్వని, (సం) సోమరసం పిండడం,తండ్రి
సుతుండు n కొడుకు, రాజు,రూ సుతుడు;
సుత్తి n చిన్న సమ్మెట, వదురుబోతుతనం,సుత్తె
సుదతి n స్త్రీ, (మంచి దంతాలు కలది) చక్కటి పలువరస కలది
సుదర్శనం n విష్ణుచక్రం పేరు, చుట్టువాలు, సుడివాలు, వట్రు వాలు, బటువువాలు, వేయంచుల వాలు, పది నూరంచుల వాలు, బల్ల వాలు, చక్రం, చక్రాయుధం, కడిదులుగు, గుడుసు కైదువు, గుడుసు వాలు, చుట్టుకైదువు, బటువు కైదువు, బటువడిదం, బటువు గత్తి, వేమొనలలుగు, సుడి కత్తి, సుడి అగిదం, చుట్టులుగు, అరి, ఆయుధేంద్రం, అమరావతి, జంబూ ద్వీపం,మేరుపర్వతం పై నేరేడు
సుదినం n మంచిరోజు, మబ్బులేని రోజు
సుదీర్ఘం n మిక్కిలి పొడవైనది, ఒక విధమైన దోసకాయ
సుదుర్లభం n బొత్తిగా లభించనిది, అరుదైనది
సుదూరం n ఎక్కువ దూరం,మిక్కిలి దూరంలో ఉన్నది
సుదృఢం n ఎక్కువ గట్టిది, ఎక్కువ బలమైనది
సుద్ద n తెల్లమట్టి, (శుద్ధమృత్తిక); ఖటిని, కఠీనిక, ఖడి, ధవల మృత్తిక, పాకశుక్ల, వర్ణిక, శ్వేతధాతువు సు, ముచ్చటి, సల్లాపం, మాట, వృత్తాంతం, ప్రసంగం, జాడ,శుచియైనది
సుద్దిచేయు v శుద్ధిపరచు సుద్దులాడు (సుద్దులు+ఆడు), మాట్లాడు
సుధ n అమృతం, సుఖంగా పానం చేయబడేది, సున్నం, పాలు, ఇటుక, జెముడుమొక్క, రసం,తేనె, మెరుపుతీగ
సుధాకరుడు n (సుధాంశుడు) చంద్రుడు, అమృత మయములైన కిరణాలు కలవాడు
సుధాపూరం(బు) n అమృతంతో నిండినది
సుధారసం n అమృతం
సుధీ n విద్యావంతుడు, పండితుడు;రూసుధి, లెస్సగా విచారించే వాడు, ఎక్కువ తెలివిగలది,మేలైన మేధాశక్తి, మేధావంతుడు
సునయన n అందమైన కళ్ళుగలఆడది, స్త్రీ,
సునాయాసం n తేలిక, ఎక్కువ సులభం
సునీతి n సత్రవర్తన, యోగ్యత,సన్మార్గం, ధ్రువుని తల్లి పేరు
సున్నం n ముత్యం వంటివి కాల్చిన తెల్లటి ఒక దినుసు పదార్థం, గోడలకు వెల్ల వేసే పొడి
సున్న n అనుస్వారం, బిందువు, అంకెలలో శూన్యస్థానాన్ని తెలిపే వర్తుల రేఖ, శూన్యం, మణిదోష విశేషం
సున్నిఉండలు n బియ్యం వంటి పిండిఉండలు
సున్నితమైన n కచ్చితమైన,
సుపక్వం n చక్కగా పండినది, చక్కగా వండబడినది, ఒక రకం మామిడి పండు
సుపరిచితులు n బాగా పరిచయం ఉన్న వారు
సుపర్ణుడు n గరుత్మంతుడు ,మంచి రెక్కలు గలవాడు
సుపర్ల n పద్మాల సమూహం, తామరకొలను, గరుడుని తల్లి పేరు, తామరతీగ, పాలపిట్ట, కోడి, గద్ద,కిరణం, రేలచెట్టు , సుపర్ణి
సుపర్వులు n దేవతలు,సుపర్వాణులు, 1 శుభప్రదాలైన ఉత్సవాలు కలవారు, 2 యోగ్యాలైన అంగుళ్యాది గ్రంథులు గలవారు
సుప్తి n నిద్ర;, టికల, తిమ్మిరి, మాంద్యం
సుప్రతిష్ణ n కీర్తి, మంచి స్థితి, స్థాపన, ప్రతిష్టించడం, ఐదవఛందం
సుప్రభాతం n వేకువ, పవిత్రమైన ఉదయం
సుప్రసన్నుడు n కుబేరుడు
సుఫలం n మంచి ఫలం గలది
సుబా n రాజ్యభాగం, రాష్ట్రంలో ఒకభాగం, రాజ్యభాగం, మండలాధిపతి
సుబాహువు n మారీచుని సోదరుడు, మంచి బాహువులు కలవాడు
సుబేదారు n సేనాధికారులలో ఒకడు
సుబోధకం n సులభంగా అర్థమయ్యేది
సుభద్ర n అర్జునుని భార్య,అభిమన్యుని తల్లి
సుభాషితం n హితవచనం, సూక్తి, చక్కగా పలుకబడినది, ధారాళమైన వచనం, చమత్కార వాక్యం,మంచి అభిప్రాయం
సుభిక్షం n పాడి పంటల కలిమి, మంచి బిచ్చం, ఆహారసమృద్ధి
సుమం n పువ్వు
సుమంగ(లి)లి n ముత్తైదువ, పుణ్య
సుమంతుడు n మంచి ఆలోచన చెప్పేవాడు
సుమతి n మంచి బుద్ధిగలవాడు, మంచి బుద్ది, మైత్రి, దేవతా వరప్రసాదం, ఆశీస్సు, ప్రార్థనాగీతం, కోరిక, సగరుని భార్య పేరు
సుమధురం n బాగా తియ్యనైనది
సుమనస్కులు n దేవతలు;రూసుమనస్సులు, మంచి మనస్సు కలవారు, పూలు, విద్వాంసులు
సుమారు n కొంచెం హెచ్చు తగ్గు
సుముఖుడు n సిద్దమైనవాడు, విద్వాంసుడు, గరుత్మంతుని పేరు, గణపతి పేరు, శివుని పేరు, యతి, గరుడుని కొడుకు, ఒక నాగ పుత్రుడు
సుముహూర్తం n మంచి ఘడియ,మంచి ముహూర్తం
సుయోధనుడు n దుర్యోధనుడు
సురంగం n సొరంగం, భూగర్భ మార్గం, రంధ్రం, ప్రకాశం, మంచిరంగు, నారింజ, రక్తచందనం,సిందూరం
సుర n కల్లు, సారాయం , వేలుపు,గాలి, సుడిగాలి, నీరు, పాము, తుంగముస్తే పానపాత్రం
సురటి n విసనకర్ర, వీవన, మల్లవిద్యావిశేషం, పారావతం, గళరవం
సురతరువు n కల్పవృక్షం
సురపతి n ఇంద్రుడు, దేవతలరాజు
సురభి n కామధేనువు, అందుగు చెట్టు, బంగారు, వసంతరుతువు, ఆవు, చైత్రమాసం, జాజికాయ, సంపెంగ చెట్టు మంచి వాసనగలది, మనోహరమైనది, మద్యము, భూమి
సురలు n దేవతలు
సురలోకం n స్వర్గం, దేవతల పట్టణం (లోకం)
సురవంద్యుడు n విష్ణువు, దేవతల చేత నమస్కరింపదగినవాడు
సురసుర n కాలడంలో అనుకరణం,స్రుక్కడంలో అనుకరణం
సురాచార్యుడు n బృహస్పతి ,దేవతల గురువు
సురాధిరాజపదం n ఇంద్రపదవి
సురారిరాజు n రాక్షసరాజు (హిరణ్యకశిపుడు)
సురిగెడు n మాయమయ్యే, రూ సురుగెడు, మరలే, తప్పించు కొనే, నిష్క్రమించే, దాగే, పారిపోయే, మృతినొందే, నశించే, వాడే, వెనుదీసే, బాధ పడే
సురుమా ఉర్దూవికాటుక,సుర్మా,సురుమాయి
సురూపం n సుందరం, తెలివిగలది
సురూపుడు n చక్కటి వాడు, విద్వాంసుడు, శివుడు
సురేకారం n దేవిఒక దినుసు ఉప్పు సురేశ్వరుడు (సుర+ఈశ్వరుడు), ఇంద్రుడు, దేవతల ప్రభువు
సులక్షణం n మంచి లక్షణం, శుభ లక్షణాలు కలది, అదృష్టం కలది,పరిశీలనం, పరీక్ష, నిర్ణయం
సులతాను n తురుష్క ప్రభువు, ముస్లిం రాజు,సుల్తాను
సులభం n తేలికగా చేయదగినది, సుఖంగా లభించేది, యోగ్యమైనది, సహజం, సులువు
సులువు n సులభం, తేలికైనది
సులోచనం n జింక, కళ్ళజోడు,అందమైన కళ్ళు గలది;
సులోచన n ఇంద్రజిత్తు భార్య పేరు ,అందమైన కన్నులుగల స్త్రీ
సుళువులు n మెళకువలు
సువర్ణం n బంగారం, యోగ్య మైన వర్ణం ఉన్న, ధనం, మాడ, ఒక పువ్వు, మంచి వర్ణం కలది, ఒక యాగం, సిందూరం
సువర్ణహారం n బంగారు దండ
సువర్ణాక్షరాలు n బంగారు వర్ణాలు,బంగారు అక్షరాలు
సువర్ణావకాశం n బంగారంలాంటి అవకాశం, విలువైన అవకాశం
సువావృక్షం, స్వరసం, స్వాదు కంటకం వెలగు v ప్రకాశించు,వెలుగు; నానోజ్వలించు, ప్రకాశం, కిరణం, ఎండ
సువాసన n మంచివాసన;రూ సువాసం సువాసిని
సువిదితం n చక్కగా ఎరుగబడినది, స్పష్టంగా తెలిసినది
సువిశాలం n బాగా విశాలమైనది
సువ్వి n దంపుడు పాటలో ఉపయోగించే ఆలాపన పదం
సుశించు v తాకు, అంటు, నీటితో కడుగు
సుశిక్షితం n చక్కగా నేర్పబడినది
సుశీల n మంచిశీలం ఉన్న, యముని భార్య (కృష్ణుని అష్టమహిషులలో ఒకరు)
సుశ్యామలం n పచ్చనైనది (పంటలు వంటి వాటితో)
సుశ్రుతం n చక్కగా వినబడినది, వేద విజ్ఞానం గలది, 'సుశ్రుతా చారుడు రచించిన ఆయుర్వేద శాస్త్రగ్రంథం
సుశ్లోకంబైన n కీర్తిమంతమైన
సుషు సంఅవ్యచక్కగా, బాగుగా, ఎక్కువగా, నిజంగా సుస్వరం, చెవికి పైనది,ఉచ్చధ్వని గలది
సుషుప్తి n మంచినిద్ర, గాఢనిద్ర
సుస్తీ n అనారోగ్యం,సుస్తి, సోమరితనం
సుస్థిరం n నిలకడ
సుహృజ్జనం n మిత్రులు
సుహృద్భావం n సఖ్యత, స్నేహభావం
సుహృద్విపత్తి n మిత్రుని ఆపద
సూకరం n పంది,శూకరం, అనేకమైన పిల్లలను ఈనేది, సూ అంటూ చప్పుడు చేసేది
సూక్తి n మంచిమాట
సూక్ష్మం n కొంచెం, అల్పం, అణువు, పరమాత్మ, ఇందుగు, పోక, నైశిత్యం, కవటం, అగోచరం, సుకుమారం, సున్నితం, తీక్షం, నిపుణం, సర్వవ్యాపి అయిన చైతన్యతత్వం, ఒక యోగసిద్ధి, సన్ననివారం, ఒక అర్థాలం కారం
సూక్ష్మబుద్ధి n చురుకైనబుద్ది,తీక్షబుద్ధి
సూచన n నిర్దేశం, పొడవడం, కుట్టడం, రంధ్రం చేయడం, నిర్దేశించడం, ప్రకటించడం, నిరూపించడం, అభినయం వ్యక్తం చేయడం, వార్త, ప్రదర్శనం, లక్షించడం, రహస్యంగా పరిశీలించడం, కపటం, క్రౌర్యం
సూచించు v చూపించు, నిర్దేశించు, ప్రకటించు, వ్యక్తంచేయు, వెల్ల డించు, అభినయించు, అన్వేషించు
సూచిక n సూది, ఏనుగుతొండం; సూచి సూటి, లక్ష్యం, గురి, విధం,ప్రతి
సూటుబూటు n ఒక దుస్తు బట్టలు, కాలిజోడు
సూడిద n కానుక సూడు, ఈర్ష్య, పగ, శత్రువు, కాల్చు, నాటించు
సూతకం n ఆశౌచం;, మృతాశౌచం, జాతాశౌచం, పుట్టుక, పాదరసం సూతి, కొడుకు, బిడ్డ, పుట్టుక,సంతానం, మూలం, సోమరసం పిండే చోటు
సూతుడు n సారథి, రథచోదకుడు ,గుర్రాలను తోలేవాడు, భట్టు, వడ్రంగి, సూర్యుడు, వ్యాసుని శిష్యులలో ఒకడు సూత్రధారి, ప్రస్తావనను నిర్వహించే ప్రధాన నటుడు, వడ్రంగి, కొన్ని సూత్రాలను రచించినవాడు, ఇంద్రుడు
సూత్రం n దారం, తాడు;++,నూలు పోగు, తీగె, యజ్ఞోపవీతం, ఆటబొమ్మలకు కట్టేదారం, అల్పాక్షరం అసందిగ్ధమైన వాక్యం, సూక్తి, సూత్రగ్రంథం, నియమం ఏర్పాటు, పన్నుగడ
సూదంటు n అయస్కాంతం , లోహాన్ని ఆకర్షించే శిలావిశేషం సూది, గుడ్డలు కుట్టే సాధనం, సూచి; కుట్టేసూది, కంటాళం, గుండు సూది, ఆరె, చర్మభేదిక
సూనగంధి n పుష్పంలాగా పరిమళించే శరీరం కలది, స్త్రీ (శకుంతల)
సూనవాతీత శక్తి సరివి మానవులకు అతీతమైనశక్తి
సూనుడు n పుత్రుడు, కుమారుడు, మనుమడు, సోదరుడు, సూర్యుడు, జిల్లేడుచెట్టు
సూన్నతం n సత్యవచనం ,ప్రియమూ, సత్యమూ అయిన మాట, సాధుభాషణం, శుభం,శుభ్రమైనది, ప్రియమైనది
సూపం పంవివండిన పప్పు, సుఖపేయమైన వంటకం, వంట మనిషి,వంట పాత్ర, బాణం, బఠాణీ బ్రద్దలు
సూపరింటెండెంట్ n పైవిచారణచేసే అధికారి
సూరి n పండితుడు, విద్వాంసుడు; వాశూరుడు, కత్తి, తెలివిగలది, సూర్యుని భార్య, కుంతీదేవి, నల్లా వాలు, చిన్నకత్తి
సూరుడు n సూర్యుడు, విద్వాంసుడు, వీరుడు, రాజు
సూరెలు n రెండుపక్కలు
సూర్యకాంతం n సూర్యకాంతమణి ,సూర్యునికాంతి తగలడంవల్ల నిప్పు కలిగేరాయి;, స్ఫటికశిల
సూర్యగ్రహణం n రాహువు సూర్యబింబాన్ని మింగడం; శాస్త్ర ప్రకారంగా సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు నూర్యగ్రహణం ఏర్పడుతుంది రాహువు సూర్య బింబాన్ని మింగడం అనేది పౌరాణిక విషయం
సృగాలం n నక్క,సకాలం ,ఎక్కువ తిరుగుతూ ఉండేది, మాంసం తినేది
సృజన n సృష్టి సృజనాత్మకం, సృష్టితో కూడినది
సృజియించు v పుట్టించు, నిర్మించు;రూసృజించు
సృష్టి n ప్రపంచం, ప్రకృతి, సర్గం, ప్రపంచోత్పత్తి, ప్రపంచం, సృజింపబడినది, స్వభావం, త్రిగుణాత్మక స్థితి
సృష్టికర్త n బ్రహ్మ, ధాత,, స్పృజించు వాడు, నిర్మాత
సెంటెన్సు n వాక్యం;, శిక్షావిధి సెకండరీ, ఇంవిణరెండవ, ముఖ్యం కాని, కింది
సెగ n అగ్ని, సెక, వేడి,తాపం
సెజ్జు n శయ్య, పానుపు
సెట్టి n వర్తకుడు, వైశ్యుడు; ప్రకృశ్రేష్ఠి
సెనగలు n ధాన్యవిశేషం
సెనెట్ n శిష్టసభ, సర్వకళాశాల సభ
సెప్టెంబరు ఇంఇంగ్లీషు నెలలలో తొమ్మిదవది
సెబాసు అవ్యప్రశంసార్థకం, ఆశ్చర్యం
సెబ్బర n చెడ్డది, సెబ్ర
సెమ్మె n దీపస్తంభం
సెలగించు v మారుమోగు, ధ్వనింప చేయు
సెలయేరు n పర్వతంనుంచి పారే నది, కొండవాగు
సెలవి n పెదవిమూల
సెలవు n విరామం , ఆజ్ఞ, అనుజ్ఞ,వీలు, ఉపయోగం, విడుదల, సత్యం,చోటు, ఖండించు, పైకిచివ
సెలూన్ n అలంకరించిన విశాలమైన చావడి / కూటం, శాల, ఓడలోని పెద్ద గది, అన్ని హంగులున్న రైలు పెట్టె, దుకాణం
సెల్యూలార్ v,n విద్యుద్దటంతో పని
సెల్లా దేఅంచుకమ్ములు లేని తెల్లవస్త్రం
సేంద్రియం n ఇంద్రియాలతో కూడినది, అంగ విశిష్టమైనది
సేకరించు v రాబట్టు, సంగ్రహించు; తెప్పరిల్లు
సేకరించుకొను v కూడబెట్టుకోను; అలసట దీర్చుకొను
సేగి n కీడు, కష్టం, అపాయం , నష్టి అమంగళం, దుఃస్థితి
సేచనం n తడపడం, చల్లడం,ఓడలోకి వచ్చిన నీటిని బయటికి పారజల్లే బొక్కెన, స్రవించడం, ఊరడం
సేచిత n తడిసిన
సేతువు n వంతెన, కనుమ,సరిహద్దు, ఆటంకం, స్థిరమైన ఆచారం, ఓంకారం, తటాకం, శృంఖల, వివరణం, తీరం, ఉలిమిరిచెట్టు
సేద n శ్రమం, అలసట; వాడటం, మూర్చ
సేదతీరు v శ్రమనుంచి తెప్పరిల్లు
సేద్యకాడు n కృషీవలుడు, రైతు , సేద్యం చేసేవాడు సేద్యం, వ్యవసాయం, పేరు పెట్టడం
సేన n దండు; ధజని, వాహిని,పృతన, అనీకిని, చమువు, వరూధిని, బలం, సైన్యం, చక్రం, అనీకం, మొన, కటకం, దళం, ధాత్రి, నాకు, వీడు, కుమారస్వామి భార్య పేరు, నరసమూహం, 3 ఏనుగులు 3 రథాలు, 9 గుర్రాలు, 15 బంటులు గల చిన్న సైన్యం, ఎక్కువ పెద్ద
సేనాని నంవిదళవాయి, సేనా నాయకుడు, సైన్యాన్ని నడిపేవాడు,కుమారస్వామి
సేనాపతి n సే++యకుడు, శివుడు, కార్తికేయుడు, వదివత్తి విభాగాల నాయకుడు
సేపు n కాలం
సేమం v, శుభం, కుశలం; ప్రకృ క్షేమం
సేరు n ఎనభైతులాల ఎత్తు (కొన్నిచోట్ల 24 తులాల ఎత్తు)
సేల్పుటాక్సు n అమ్మకంపన్ను
సేవ n పరిచర్య, శుశ్రూష ఊడిగం, ఊడియం, కొట్నం, కొలువు, చాకిరి, ఉపచారం, పూజ, ఆసక్తి, తత్పరత్వం, ఉపయోగం, పొగడ, అనుసరణ, కొలువు, గౌరవించడం,వాడుక, భక్తి, స్తోత్రం, తరచు రావడం, బుజ్జగించడం, చెప్పిన పని చేయించడం
సేవకుడు n నౌకరు; ఉపాసకుడు, కింకరుడు, కుర్వంతుడు, దాసుడు, పరిచారకుడు, భటుడు, భృత్యుడు, అడియరి, పనివాడు, కొలువు కాడు, గులాం, డింగరీడు, డింగరుడు, బంటు, బంట్రోతు, బానిసీడు, లెంక/వరవు, వరవుడు, పూజించే వాడు, దర్జీవాడు
సేవనం n పరిచర్యచేయడం, కొలవడం, పూజించడం, అనుసరిం చడం, నివసించడం, బంధించడం, కుట్టడం
సేవింగ్స్ బ్యాంక్ n పొదుపుసొమ్ము దాచుకొనే కోఠీ
సేవించడం v కొలవడం, తీసుకోవడం
సేవిక n దాసి, భక్ష్య విశేషం
సేస n పాపట, దీవించేటప్పుడువేసే అక్షతలు, అక్షతల బొట్టు,పుష్పాంజలి
సేసబ్రాలు n దేతలంబ్రాలు, అక్షతలు స్టేజి, n రంగం, నాటకశాల
సైంధవం n ఒక విధమైన రాతి ఉప్పు,గుర్రం, సింధు దేశంలో పుట్టినది, ఒక దేశం పేరు, సింధునదికి సంబంధించినది, నదిలో పుట్టినది,సముద్రానికి సంబంధించినది
సైంధవుడు n జయద్రధుడు ,సింధు దేశపు రాజు అయిన వృద్ద క్షత్రుని కుమారుడు, ఒక ముని,సింధుదేశం వాడు –
సైకత వేది n ఇసుకతిన్నె
సైకిలు n తొక్కుడుబండి (చక్రాల బండి)
సైచు v ఓర్చుకొను, సహించు;రూ సయిచు సైజు, n పరిమాణం , కొలత
సైడు n పక్క
సైడువింగు n పక్కభాగం
సైతం అవ్యకూడా,సయితం;ప్రకృతి సహితం
సైతాను n పిశాచుల ఆధిపతి
సైదోడు దేతోబుట్టువు, సహోదరుడు;
సైద్ధాంతికం n సిద్దాంతానికి సంబంధించినది
సైనికుడు n యోధుడు, నగరరక్షకుడు
సైనికులు కారుణ్యం n దయ
సైన్యం నంవి సేన, సేనతో కూడినది, కృష్ణుని రథానికి కట్టే గుర్రాలలో ఒకటి
సైన్సు n శాస్త్రం, విద్య
సైరంధ్ర n ద్రౌపది, 1 స్వతంత్రు రాలై పరగృహంలో ఉండి గంధలేపనం, తిలక నిర్మాణం వంటి పనులు చేసే స్త్రీ, 2 పురుష సాంగత్యం కోరక ధైర్యంతో ఉండేది, గట్టువాలు,
సైరించు v ఊరకే ఉండు, సహించు
సైరి n ఇష్టానుసారంగా సంచరించేది
సైలెన్సర్లు n మోటారు సైకిలు ఇంజను చప్పుడు తగ్గించే పొగగొట్టం
సొంటి n పక్యం చేసి ఎండబెట్టిన అల్లం; ఇంద్రభేషజం, ఊషణం, కందరం, కటుకం, కటుభద్రం, కతూత్కటం, కఫారి, నాగరం, మహౌషధం, విశ్వభేషజం, శొంఠి, ఎండు అల్లం
సొంటికొమ్ము n ఎండిన సొంటి, నిడుపాటి గడ్డ
సొంటు n తప్పు, దోషం; తృణ విశేషం
సొంతం n స్వకీయం
సొంపారు v మనోహరమగు, ప్రకాశించు సొంపు, n. ఒప్పు, సౌందర్యం, సంతోషం, సమృద్ధి, ప్రసన్నత, సుఖం, కాంతి, అతిశయం, ప్రాశస్త్యం,విశేషం, రీతి, దృష్టివిశేషం
సొక్కం v,n స్వచ్చం, దోషంలేనిది,చొక్కం
సొక్కు n పారవశ్యం,చొక్కు
సొగసు n అందం, దీన్ని చూసే వారు పరవశత్వం పొందుతారు, ఒయ్యారం, ఆనందం, సౌఖ్యం, దృష్టి విశేషం, విధం, ఇంపు కలిగించు
సొగసుకత్తె n విటకన్నె దేవిణఅందగత్తె
సొగసుకాడు n విటుడు, అందగాడు
సొగసులాడి n సౌందర్యంగల స్త్రీ
సొజై n వేయించిన బియ్యంతో చేసిన పిండి మొదలైనది
సొజ్జిబూరె n భక్ష్య విశేషం, సొజ్జిబూరియ
సొటసొటలు n కార్శ్వం , కారడంలో అనుకరణం, నెత్తురు చిందడానికనుకరణం
సొట్ట n వంకర, ,బిందె వంటివాటికి దెబ్బ తగిలినప్పుడు పడే నొక్కు, రోగాదులవల్ల దేహంలో కలిగే నొక్కు
సొత్తు n సొమ్ము; రొక్కం, పైసా,విడిముడి, అర్థం, ద్రవిణం, ద్రవ్యం, ధనం, రిక్తం, వసువు, విత్తం, విభవం, స్వాపతేయం, హిరణ్యం
సొద n చితి, వ్యర్థప్రసంగం, పీనుగును కాల్చడానికి చేర్చిన కట్టెలు మొదలగు వాటి పోగు, దుఃఖవార్త,చిత్యగ్ని, అధిక ప్రసంగం, దుఃఖం
సొన n ఆకులు, కాయలు మొదలగు ! వాటి నుంచి వచ్చే ద్రవం, నూగు
సొబగు n చక్కదనం, ఒప్పిదం, స్వారస్యం, విధం
సొమ్మసిల్లు v మూర్చిల్లు;రూసొమ్మ సిలు
సొమ్ము n ధనం, ద్రవ్యం; ఆభరణం, అలంకారం, పరిష్కారం, విభూషణం, మండనం, భూషణం, తొడవు, రవణం, గోధనం, అధీన వస్తువు, కానుక
సొమ్ముచేయు v లాభపడు
సొరంగం n గుహలాగా తొలిచిన రంధ్రం
సొరకాయ n ఆనపకాయ; అనుగం, పిండఫల, పుష్పఫల
సొరుగు v మూర్చిల్లు, ఎండుటాకు, మూర్చ, పెట్టే అర
సొలపు n పారవశ్యం, శ్రమ,మూర్చ, దీనభావం, పంక్తి, విధం, విలాసం, మృదుత్వం, దృష్టి విశేషంవెనుదీయు
సొసైటీ n సంఘం, సభ, సమాజం
సోకు n కష్టం;, స్పర్శ, మేళనం,రాక్షసుడు, ఆవేశించు, ప్రసరించు, రగులు, ప్రవేశించు, తగులు, సశించు
సోకు v తగులు, ఆవేశించు
సోగ n పొడవైనది, దీర్ఘమైనది, పొడవు, రేఖ
సోత్కంఠుడు (స+ఉత్కంఠుడు) విశేషఉత్కంఠతో కూడినవాడు సోత్కంఠుడై
సోదరి n అక్క, చెల్లెలు, భగిని , తోడబుట్టినది
సోదరుడు n అన్న, తమ్ముడు , తోడబుట్టినవాడు
సోది n ఎరుక, వ్యర్థప్రసంగం
సోద్వేగం n ఆత్రంతో కూడినది(స+ఉద్వేగం), దుఃఖితమైనది
సోపానం n మెట్టు, నిచ్చెన
సోపు n ఒక సంబారపు దినుసు
సోఫా n మెత్తటి దిండు కలిగిన నిడుపాటి కుర్చీ
సోమపానం n యజ్ఞంలో సోమలత నుంచి రసాన్ని పిండి తాగడం
సోమయాజి n యజ్ఞం చేసినవాడు;సోమయాజి, సోమపీతి, సోమపీథి, సోమపుడు
సోమరి n పనిచేయక కాలం గడిపేవాడు; అలసుడు, ఆలస్త్యుడు, అనుషుడు, తుందపరిమజుడు, మందుడు, శీతకుడు, స్వైరుడు, పనిచేయక కాలం గడిపేవాడు
సోమరితనం n అలసత్వం
సోమరిపోతు దేఅలసుడు, సోమరి
సోమవారం నంవిఇందువారం, వారాలలో ఒకటి
సోమిదమ్మ n సోమయాజి భార్య;సోమసాని సోముడు, చంద్రుడు, యముడు, పితృదేవత, శివుడు, కుబేరుడు, వసువు, వాయువు, బుధుడు, సుగ్రీవుడు
సోయగం n చక్కదనం, సౌందర్యం, విలాసం, విధం
సోరదీపం పెద్దదీపం
సోల n తవ్వలో సగం
సోలు v , ఒరగు, పరవశమగు,వ్యాపించు, వేలాడు, నశించు
సౌండు n ధ్వని, గట్టి,ఆరోగ్యంగా ఉన్న, గాఢమైన, న్యాయమైన, లోతైన
సౌందర్యం n చక్కదనం, ఎల్లప్పుడు ఆదరింపబడేది (సుతరాం ఆద్రియతే ఇతి సౌందర్యం)
సౌకర్యం n వసతి, అనాయాసం, సూకరభావం, ఆనుకూల్యం, నేర్పు, ఆహారాన్ని/ ఔషధాన్ని శ్రమ లేకుండా సిద్ధం చేయడం
సౌకుమార్యం n మృదుత్వం, కావ్యగుణాలలో ఒకటి, యావనం
సౌఖశాయనికంబులు n నిద్రమేల్కొల్పేవి (సుఖనిద్రా! అని ప్రశ్నించేవి); సుఖనిద్ర కలిగి నదా అని ప్రశ్నించేవి
సౌఖ్యం n సుఖం, భోగానుభవం, తృప్తి, ఆనందం, భోగానుభవం
సౌగంధికం n గంధకం, రోగనాశం కోసం తగిన పరిమళంగలది, చెంగల్వ, పద్మరాగమణి, పద్మం,
సౌజన్యం n సుజనత్వం, మంచితనం, దయ, ప్రేమ, ఔదార్యం
సౌదామిని n మెరుపు;రూ సౌదామని, సౌదామ్ని, దండ లాగా దీర్ఘాకారంగలది, సుదామం అనే పర్వతంతో కూడా ఒక్క దిక్కున
సౌధం n మేడ, సున్నంతో చేయబడినది, సుధ (సున్నం)తో నిర్మింపబడినది, అమృతానికి సంబంధించినది, సున్నంతో చేయ
సౌప్తికం n భారతంలో ఒక పర్వం, నిద్రాసమయంలో హఠాత్తుగా శత్రువులమీదబడి వధించడం
సౌబలుడు n శకుని, సుబలుని కొడుకు
సౌభద్రుడు n అభిమన్యుడు; , సుభద్ర కొడుకు
సౌభాగ్యం n అదృష్టం, దాంపత్య ప్రేమ, మంగళం, అందం, విభవం, ముత్తైదువతనం, సిందూరం, వెలిగారం, దీవెన, మన్నన, ఒక గ్రహయోగం
సౌభాగ్యవతి n పుణ్యస్త్రీ, భాగ్యశాలిని, మంచి భార్య
సౌభ్రాత్రం n అన్నదమ్ములలాగా కలిసి ఉండడం, మంచి తోడబుట్టు దనం
సౌమనస్యం n చిత్తానందం కలిగించేది, మనస్తృప్తి, పువ్వు, దేవతా భావం, శ్రాద్ధకాలంలో పిండప్రదానం తర్వాత బ్రాహ్మణునికిచ్చే పుష్పదానం, అస్త్రవిశేషం
సౌమిత్రి n లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ,సుమిత్ర కొడుకు
సౌమ్యవారం n బుధవారం
సౌమ్యుడు n బుధుడు, సోమరసం తాగే బ్రాహ్మణుడు,అనుచరుడు, బ్రాహ్మణుడు
సౌరభం n సువాసన, ఆమోదం, కుంకుమపువ్వు, గంధ రసం, ఎద్దు, తాన విశేషం, మైత్రి
సౌరభ్యం n సుగంధం, సౌందర్యం,కీర్తి, సౌశీల్యం
సౌరమానం n సూర్యుడొక రాశిలో సంచరించే కాలం, సూర్యుని గమనాన్ని బట్టి నిర్మింపబడిన కాలం
సౌరు n సొగసు, చక్కదనం, మనోజ్ఞం, విధం
సౌలభ్యం n సులభత్వం, తేలికగా లభించేది కావడం
సౌశీల్యం n మంచి స్వభావం,సుశీలత్వం
సౌష్ఠవం n మంచి నిర్మాణం కలిగిన రూపం, పుష్టి కలిగిన రూపం, చక్కదనం, సుషు భాగం, నాట్యాంగ విశేషం, నేర్పు, ఆధిక్యం, సౌలభ్యం, పరిశుభ్రత
సౌహార్గం n మైత్రి, సుహృద్భావం, ప్రేమ సౌహృదం, స్నేహం, సౌహార్దం
స్కంధం n గ్రంధభాగం, రాబందు, కొమ్మ, భుజం, ఎద్దు మూపు, యుద్ధం, చెట్టుబోదె, సమూహం, ప్రకరణం, శరీరం, విషం, పాపం, నేరం, సేనా విభాగం, మార్గం, ఒడంబడిక; స్కాందపురాణం,
స్కంధుడు n కుమారస్వామి; , దేవస్త్రీ సందర్శనంవల్ల వదలిన ఈశ్వరుని వీర్యంవల్ల పుట్టినవాడు, శివుడు, రాజు, తెలివిగలవాడు
స్కాందపురాణం n అష్టాదశ పురాణాల్లో ఒకటి
స్కాలర్షిప్ n విద్యార్థికి ఇచ్చే వేతనం, పాండిత్యం
స్కూటర్ n ద్విచక్రవాహనం
స్కూలు n పాఠశాల, బడి
స్టవ్ n ఇనుపపొయ్యి, ఇనుపకుంపటి
స్టాండు n ఏదేని ఉంచే చట్రం
స్టారుచేయడం మిక్రిప నిచేయు మొదలు పెట్టేట్లు చేయడం
స్టీమరు n ఆవిరి శక్తితో నడిచే ఓడ, పొగ ఓడ
స్టేటు n రాష్ట్రం
స్టేడియం n ప్రేక్షకులు కూర్చొని చూడటానికి వీలుగా ఉన్న క్రీడాస్థలం
స్టేనో n సాంకేతిక లిపి తెలిసిన వాడు, సంక్షిప్త లేఖకుడు
స్టేషన్ n స్థానం, ఠాణా, బస, ప్రదేశం, శిబిరం, పదవి, అంతస్తు
స్ట్రీట్ n వీధి
స్ట్రీట్ చిల్డ్రన్ స్తంభం నంవికంబం, గుంజ, అణగినది, నిక్క పొడుచు కొనినది, ఆపబడినది, స్థిరమైనది, కఠినమైనది, మందమైనది
స్తనయుగం n రెండు కుచాలు
స్తన్యం n చనుబాలు
స్తబకం n పూలగుత్తి, కుచ్చు,నెమలి పింఛం, ప్రకరణం
స్తబ్దత n మానుపాటు, చేష్టారహితం, దృఢత, కాఠిన్యం
స్తవం n స్తుతి, పొగడటం
స్తిమితం n నిశ్చలం, స్థిరత్వం, తడి సినది, ఆలస్యమైనది, శాంత మై నది, మూయబడి నది,మృదువైనది, తృప్తి నొందినది
స్తుతి n స్తోత్రం, పొగడ, స్తుతి వేగం, ముఖస్తుతి, దుర్గ
స్తూపం n బౌద్ధస్మృతి చిహ్నం, దేవాలయ విమానం, మట్టిదిబ్బ, చితి, శక్తి
స్తూపీ సంనిమసీదు పైన, బురుజు పైన గల శిఖరం
స్తేయులు n దొంగలు, \నులు
స్తోకం n చిన్నది, అల్పమైనది
స్తోత్రం n పొగడ్త
స్తోత్రపాఠకుడు n వంది, స్తుతి వచనాలను పలికేవాడు, పరాక్రమాదులను పొగడేవాడు
స్తోమం n సమూహం;, ,స్తోత్రం,యజ్ఞం, ఆయుధవిశేషం, సోమాహుతి, పెద్ద మొత్తం, తల, సంపద, ధాన్యం, ఇనుపదండం, 96 అంగుళాల కొలత
స్త్యం n దొంగతనం, దొంగిలింప బడిన వసువు,రహస్యం
స్త్రీ n ఆడది; యోషిత, అబల, యోష, నారి, సీమంతిని, వధువు, ప్రతీప దర్శిని, వామ, వనిత, మహిళ, అంగన, భీరువు, కామిని, వామలోచన, ప్రమద, మానిని, కాంత, లలన, నితంబిని, సుందరి, రమణి, రామ, క్రాల్గంటి, పొలతుక, ముద్దియ, మగువ, బాల్గంటి, సుదతి, పడతి, మచ్ఛకంటి, అతివ, యుగ్మలి, ఇంతి, తొయ్యలి, నవల, కలువ కంటి, నాతి, పూబోణి, చిగురాకుబోడి, పైదలి, మెరుగు బోణి, ముద్దులగుమ్మ, పొన్ని కొమ్మ, ప్రోలు, ఉద, తీగ బోడి, చేడియ, ఇంచుబోడి , అన్నువ, వెలది, బోణి, బోటి, చాన, తెరవ, వెలదుక, లేమ, చెలువ, ఎలనాగ, చిలుకల కొలికి, తలిరుబోడి, అలరుబోడి, నెలత, పొలతి, నెలతుక, యోషిత్తు, భార్య, చెద, ప్రియంగులత, ఆడజంతువు, ఆడది ఫ్రెణం, స్త్రీత్వం, స్త్రీ సంబంధ మైనది, స్త్రీ, స్త్రీ భావం, స్త్రీల సమూహం
స్థంభం n చేష్టారహితం, స్థిరత, మ్రానుపాటు, తెలివిలేమి, నిర్బంధం, అడ్డంకి, ఆధారం, సహజశక్తులను నిలపడం, మొద్దు
స్థపతి n శిల్పి, శ్రేష్ఠుడు, సారధి,కంచుకి, బృహస్పతి, సవనం చేసినవాడు, వడ్రంగి, కుబేరుడు
స్థలం n చోటు, మెట్టభూమి,జలం / సహజంగా చదరమైన నేల, తీరం, దిబ్బ, క్షేత్రం, చర్చనీయాంశం,శిబిరం, గ్రంథభాగం స్థలాంతరం, మరోచోటు
స్థలాభావం n చోటు లేకుండటం
స్థవిరుడు n వృద్దుడు, ముదుసలి, బ్రహ్మ, బిచ్చగాడు, రాత్రిపూవు, వృద్ధి, సముద్రపాల చెట్టు, కడిమి చెట్టు, స్థిరుడు, చిరంజీవి స్థాణువు, స్థిరమైనది, కదలనిది ,1 ప్రళయకాలంలో ఉండేవాడు (శివుడు), 2 గాలిచే కొట్టబడి కూడా స్థిరంగా నిలిచి ఉండేది (మొద్దు), జీవకం అనే వాసన ద్రవ్యం, ఈటె, చెదలపుట్ట, శివుడు, చిలుక కొయ్య, శూలం, ధ్రువుడు, ఆసనవిశేషం, మేకు, మోడు స్థానభ్రష్టుడు, ఉద్యోగంనుంచి తొలగించబడినవాడు
స్థానం n చోటు, ఉనికి, మకాం,ఇల్లు, పట్టణం, దేశం, స్థిరత, పోలిక, సంగతి, సంబంధం, అవకాశం, పదవి, దైవపీఠం, పోలిక, విలుకాని ఒక నిలుకడ, ఆశ్రమం, మనుగడ, స్వరం
స్థానికుడు n ఆ ప్రదేశంలో ఉండేవాడు, స్థానాధ్యక్షుడు, గుడిపారుపత్తేం చేసేవాడు
స్థానీకం n స్థానానికి సంబంధించినది
స్థాపించు v నిలుపు, స్థాపనంచేయు
స్థాపితం n నిలుపబడినది, నిశ్చయింపబడినది, రూఢం చేయబడినది, నియమింపబడినది, నియోగింపబడినది, పరిణీతం, దృఢమైనది, నిశ్చలమైనది
స్థాయి n స్థిరమైనది, కదలనిది, నివసించేది, మారనిది, స్థిరమైన భావం (రత్యాది), స్థిరమైన స్థితి
స్థాయిభావం n సజాతీయ విజాతీయ భావాలచేత తిరస్కరింపబడక రససిద్ది పర్యంతం నిలిచి ఉండే భావం, స్థాయి భావాలు తొమ్మిది రతి,హాసం, శోకం, క్రోధం, ఉత్సాహం,భయం, జుగుప్స, విస్మయం, శమం
స్థాలీపాకం n వివాహకాలంలో దంపతులు చేసే ఒక యజ్ఞం, పెళ్ళిలో దంపతులు చేసే యజ్ఞం, పాకయజ్ఞవిశేషం
స్థాల్యం n లావు, స్థూలభావం, బుద్ధి
స్థావరం n స్థిరమైనది, ఇల్లు ,స్థిర స్వభావం కలది (గిరి వృక్షాదికం), కదలని వృక్షాదులు, కొండ, వింటినారి, స్థిరాస్తి, పెద్ద దేహం, కులధనం, జడ పదార్థం, తోలునారి
స్థిత n ఉన్నటువంటి
స్థితప్రజ్ఞుడు n సర్వకామాలను వదలి ఆత్మ సంతుష్టుడైనవాడు, సర్వ కామాలను వదలి ఆత్మ సంతుష్టుడైన వాడు, ఏ విధమైన భ్రాంతీ లేనివాడు స్థితంబులు
స్థితి నంవివరిస్థితి, స్వభావం, ఉనికి, నిలుకడ, నిలుపుదల, ఆస్తి, దశ, అర్హత, మేర, అధికారం, క్షేమం, సదాచారం, గణన, పొందిక, లోకోక్తి, జడత, మర్యాద, బతుకు, సృష్టిస్థితి లయాల్లో రెండోది, ఔచిత్యం, పదవి, నియమం, నిశ్చయం, గ్రహణం ఉండే కాలం
స్థితిమంతుడు n ఆస్తికలవాడు
స్థిరం n కదలనిది, కొండ,చెట్టు, ఎద్దు, మోక్షం, నిలుకడ, పరుషం, కదలనిది, శాశ్వతమైనది, శాంతమైనది, ప్రసన్నమైనది, కఠినమైనది,బలమైనది, మొండితనం
స్థిరపడు మిక్రినిలదొక్కుకొను, పాదుకొను
స్థిరపరచు మీక్రినిశ్చయం చేయు
స్థిరవారం n శనివారం, మందవారం స్థిరీకృతం, స్థిరంగా చేసిన
స్థూలం n లావైనది, శక్తిమంతమైనది, దట్టమైనది, మృదుకరమైనది, మూర్ఖమైనది, మొండిది, సూక్ష్మంకానిది, తెలివిలేనిది, బలిసినది, గుడారం, పర్వతశిఖరం,పులిసిన పాలు / పెరుగు
స్థూల n పెద్ద
స్థూలశరీరం n వాస్తవదేహం, నశ్వరశరీరంమాంద్యం
స్నాచ్ ఇంక్రిలాగుకొను, దడాలున తీసికొను
స్నానం n నీరు పోసుకోవడం, నీటిలో మునగడం, స్నానయోగ్యమైన జలం, నలుగుపిండి, విగ్రహాలను స్నానం చేయించడం, క్షాళనం చేయడం
స్నానఘట్టాలు n స్నానవాటికలు,స్నానం చేసే (నదీ) తీరాలు
స్నిగ్ధం n చిక్కనైనది, స్నేహం కలది, నునుపుగలది, చమురుగలది, అంటుకొనే స్వభావం కలది, ఉజ్వలమైనది, చల్లనిది, దయతో కూడినది, అందమైనది, స్థిరమైనది, కాంతి, నూనె, మైనం,చిక్కదనం
స్నేహం n నేస్తం, ప్రేమ, ప్రియం, హార్ధం, సాంగత్యం, మైత్రి, నెయ్యం, నేయం, నెయ్యమి,నెమ్మి, నెమ్మిక, పొందు, నూతిమి, అనురక్తి, చమురు, (నూనె నేయి) పదార్థం, జిడ్డు షదార్థం, వైశేషి కుల సిద్ధాంతాన్ని బట్టి 24 గుణాలలో ఒకటి
స్నేహితుడు n చెలికాడు, నెయ్యుడు
స్నేహితురాలు మివిణసఖి, చెలికత్తె
స్పందన n కదలడం, అదరడం;రూ స్పందం, స్పందనం
స్పటికం n పటికపురాయి
స్పర్శ n తాకడం, గాలి;రూ
స్పష్టం n వాస్తవమైనది, వెల్లడి అయినది, ప్రత్యక్షమైనది, స్పుటమైనది
స్పష్టీకరణం n తెలియజెప్పడం
స్పింటర్సు n నిర్దిష్ట దూరాన్ని నిండు వేగంతో పరుగెత్తేవారు
స్పీకర్ బాక్స్లు n మాట్లాడిన మాటలను పెద్దవిగా చేసి వినిపించే పెట్టెలు
స్పుటం n స్పష్టమైనది
స్పుట n వెల్లడవుతూ ఉన్న
స్పురణం n లోచడం, అదరడం,ప్రకాశించడం, ప్రత్యక్షమవడం
స్పురత్ సువిణప్రకాశిస్తున్న
స్పురద్రూపి n ప్రకాశిస్తున్న రూపంకలవాడు, అందమైనవాడు
స్పృశ్యులు n తాకదగినవారు
స్పెషల్ v,n విశేషమైన, అసాధారణ మైన, ప్రత్యేకంగా
స్పెషాలిటీ n విశేషధర్మం, ప్రత్యేకత
స్మృతిచిహ్నం n జ్ఞాపకార్థం
స్మేరం n చిరునవ్వు, వికసించినది, కొంచెంగా నవ్వినది, గర్వించినది
స్యందనం n యుద్ధరథం, రథం, కారడం, త్వరగా ప్రవహించే నీరు, తినిశ వృక్షం, వాయువు
స్యంది n పడుతున్న, కారుతున్న,స్రవించేది
స్యాలకుడు n బావమరిది;రూ శ్యాలకుడు,
స్యూరిటీ n ఒకనికి పూటగా ఉండే వాడు, జామీను ప్రగర, ఒక వృత్తం; మ, ర, భ, న,య, య, య అనే గణాలు స్రగ్ధరా వృత్తంలో ఉంటాయి యతిస్థానం 8,15 అక్షరాలు
స్రవంతి నంవివ్ర వాహం , నది ,పర్వతాదులనుంచి స్రవించేది, చీలమండ, ఎలుకచెవి చెట్టు
స్రవించు v కారు, చేపు, ఊరు
స్రష్ట n నిర్మాత, సమస్తాన్ని సృజించే వాడు; బ్రహ్మ
స్రావం నంవికారడం~ు క్కు, దేక్రివెనుదీయు, చిక్కు, భయపడు, ముడుగు, ముడుతపడు, దుః ఖించు, చింతించు, మూర్చిల్లు, సంకోచించువాడు,చుట్టుకొను, అధైర్యం, కార్శ్యం
స్రుక్కు v వెనుదీయు, చిక్కు, భయవడు, ముడుగు, ముడుతపడు, దుఃఖించు, చింతించు, మూర్చిల్లు, సంకోచించు వాడు,చుట్టుకొను, అధైర్యం, కార్శ్యం
స్లాకులు v,n వదులైనవి, స్త్రీ, పురుషులు ధరించే బ్రౌజర్లు
స్వంతం n స్వకీయం, సొంతం
స్వకపోకల్పనం n స్వయంగా కల్పించడం
స్వకీయప్రతిభ n తనదైన తెలివి
స్వగతం n తనలోతాను మాట్లాడుకోవడం, ఆత్మగతం, రహస్యం, నాటకాంగాలలో ఒకటి
స్వగుణం(బులు) n తన గుణాలు
స్వగృహాలు n సొంత ఇళ్ళు
స్వగ్రామం n సొంత ఊరు
స్వచ్చం n నిర్మలం, తెలుపు,వెండి, ముత్తెం, స్పటికం, అభ్రకం, సుద్ద, సీమసున్నం, రేగుచెట్టు, అందమైనది, ఆరోగ్యవంతం
స్వచ్చందం n తన ఇష్టం, సొంత మైనది, స్వతంత్రమైనది, కల్మషం లేనిది, సహజమైనది, స్వాతంత్ర్యం
స్వచ్ఛంద సంస్థలు n ప్రతిఫలం ఆశించకుండా తమంతతాము సమాజసేవ చేసే సంస్థలు
స్వతంత్రం n స్వేచ్చగలది, ఆత్మీయమైనది, యుక్త వయస్సు వచ్చినది
స్వతంత్రుడు n గుడ్డివాడు, స్వేచ్చగా వర్తించేవాడు; ప్రావృతుడు,స్వైరి, స్వచ్ఛనుడు, నిరవగ్రహుడు
స్వతంత్రులు n ఒకరి అనుమతి లేకుండా తాముగా ప్రవర్తించే వారు
స్వతస్సిద్ధం n సహజం
స్వత్వం n స్వేచ్ఛాజీవితం, ప్రకృతి భావం, ఆస్తిమీది హక్కు, సొమ్ము, స్వామ్యం, హక్కు,ఉన్నది ఉన్నట్లు ఉండడం
స్వదేశం n తన దేశం, మాతృభూమి
స్వదేశస్థులు n తన దేశంలోని వారు
స్వధర్మం n స్వకుల వృత్తి, తన పని, స్వభావం, తనమతం
స్వప్నం n కల, నిదుర, చూపు, ఆలస్యం, అజ్ఞత
స్వప్నావస్థ n నిద్రావస్థ
స్వప్రకాశం n తనంతటతాను ప్రకాశించేది
స్వభావం n తత్వం, నిజభావం, అభ్యాసం, స్వధర్మం
స్వభావోక్తి n సహజమైన మాట; ఉన్న వస్తువును ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం,మాట,ఒక అర్థాలంకారం
స్వయం సంసొంతం, తాను
స్వయంకృతం n స్వయంగా చేయబడినది; సహజమైనది
స్వయంకృషి n సొంతకష్టం
స్వయంపాకం n స్వయంగా చేసుకొనే వంట, తానే వండుకోవడం, ఒకనికి పూటకు సరిపడేటట్లు ఇచ్చే వంట సామగ్రి, ఒకపూట బత్తెం, హవ్యకవ్యాలలో బ్రాహ్మణుల కిచ్చే వంటసామగ్రి
స్వయంప్రతిపత్తి n సొంతగౌరవం,సొంతప్రవేశం
స్వయంభువు n శివుడు;రూస్వభువు, తనంతట తానే పుట్టినవాడు, బ్రహ్మ, విష్ణువు, మన్మథుడు, కాల పురుషుడు
స్వయంవరం n కన్య వరుని స్వయంగా వరించడం, కన్య భర్తను ఎన్నుకోవడానికి జరిగే సమావేశం
స్వరాజ్యం n సొంత రాజ్యం,స్వతంత్రం
స్వరోచిషుడు n రెండవ మనువు ,స్వరోచిస్సు కొడుకు
స్వర్గం n దేవలోకం, ముక్తి; త్రిదివం, త్రిదశాలయం, త్రివిష్టపం, దివం, దివి, నాకం, వినుప్రోలు, వేగంటి కచ్చేరి, వేల్పు టెంకి
స్వర్గస్తుడు n మరణించినవాడు ,స్వర్గంలో ఉన్నవాడు
స్వర్గీయ n మరణించిన, స్వర్గంలో
స్వర్ణం n బంగారుపతకం, బంగారం;++బంగారు నాణెం, గైరిక ధాతువు, ఎర్రటెంకాయచెట్టు, గుజ్జునారికేళం
స్వర్ణకారుడు n అగసాలె, కంసాలి, బంగారపుపని చేసేవాడు
స్వర్ణపుష్ప n తుమ్మచెట్టు, బంగారపు వర్ణంలాంటి పూలు కలిగిన చెట్టు, చంపక వృక్షం
స్వల్పం n కొంచెం, అప్రధానమైనది అతికొంచెం
స్వల్పకాలశిక్షణ n కొద్ది కాలం ఇచ్చే శిక్షణ
స్వశక్తి n తన శక్తి
స్వస్తి సంఅవ్య క్షేమం, శుభం,ఆశీర్వాదం
స్వస్తిచెప్పు మిక్రివదలి పెట్టు, విడుచు
స్వస్థం n నెమ్మదిగా ఉండేది,స్వర్గంలో ఉండేది
స్వస్థత n ఆరోగ్యంగా ఉండటం,ప్రసాదం
స్వహస్తం n తనచేయి
స్వహస్తపాకం n తన చేతి వంట
స్వాంతం n మనస్సు, అనునయించడం, గుహ, రంధ్రం, తన మరణం
స్వాంతుడు n మనస్సుకలవాడు
స్వాగతం n సుఖంగా వచ్చారా అని అడగడం, ఒక వృత్తం, న్యాయంగా ఆర్జింపబడినది, అభిమతమైనది
స్వాతంత్ర్యం n స్వతంత్రభావం
స్వాతి n సంజ్ఞాదేవి, సూర్యుని భార్య, ఒక నక్షత్రం, ఖడ్గం
స్వాదువు n ఇంపైనది, పరిశుద్ధమైనది, దృఢమైనది, మాధుర్యం, బెల్లం,అందం
స్వాధీనం n స్వవశమైనది
స్వాధీనపతిక n నాయికా విశేషం ,స్వాధీనుడగు (తనకు వశుడు) భర్త గల నాయిక
స్వాధీనపరచుకొను మిక్రితన వశం చేసుకొను
స్వాధ్యాయం n వేదాధ్యయనం , తన వేదాన్ని మాత్రమే అధ్యయనం చేయడం, వేదం, జపం
స్వానుభవం n సొంత అనుభవం
స్వాభావికం n సహజమైనది, స్వభావంచేత కలిగినది
స్వాభిమానం n ఆత్మగౌరవం
స్వామి n అధిపతి, యజమాని ,స్వ (ధనం) గలవాడు, అధికారి, కుమారస్వామి, దేవుడు, వస్తు స్వాతంత్ర్యం గలవాడు, భర్త, గొప్ప సన్యాసి,ఆచార్యుడు, రాజు
స్వామ్యం n హక్కు, ఆధిపత్యం,
స్వాయత్తం n తనకు అధీనమైనది,తన మీదనే ఆధారపడి ఉండేది
స్వారస్యం n సహజసౌందర్యం కలిగిఉండటం, లాలిత్యం, సహజత్వం
స్వారి n వాహ్యాళి, విహారం
స్వార్జితం n సొంత సంపాదన
స్వార్థం n తన ప్రయోజనం, ధాత్వాదులకు నిశ్చితమైన అర్థం
స్వార్థ వూరిత n సొంతప్రయోజనంతో నిండిన
స్వార్థపరత n సొంతప్రయోజనం
స్వాస్థ్యం n స్వస్థత, ఆరోగ్య స్థితి, ఆత్మ విశ్వాసం, స్థిరత్వం,సంపద, తృప్తి, ఆరోగ్య స్థితి
స్వాహ n అగ్నిదేవుని భార్య;నానో సర్వ దేవతా సామాన్యమైన ఆహుతి, బుద్దుని భార్య
స్వాహావల్లభుడు n అగ్నిదేవుడు
స్వినం n చెమటతో కూడినది, ఉడికినది
స్వీకరించు నంక్రిగ్రహించు, అంగీకరించు, అవధరించు
స్వీకర్త n స్వీకరించేవాడు, గ్రహించేవాడు
స్వీకారం n గ్రహణం, అంగీకారం,పాణిగ్రహణం
స్వీకృతం n గ్రహింపబడినది,అంగీకరింపబడినది
స్వీట్లు n మధుర పదార్థాలు, తీపి పదార్థాలు
స్వీయ n ఒక నాయిక, తన భర్తమీద మాత్రం అనురాగం ఉన్న నాయిక
స్వీయచరిత్ర n తన చరిత్ర, తన కథ
స్వీయుడు n తనవాడు
స్వేచ్చానువాదం n స్వతంత్రానువాదం
స్వేచ్ఛ n ఇష్టం, స్వెరిత
స్వేచ్ఛాజీవి n తన ఇష్టం వచ్చినట్లు బతికేవాడు
స్వేదం n చెమట, ఒకసాత్త్యిక భావం, ఉష్ణం, ఆవిరి ,
స్వేదజం n నల్లి, పేను; ,చెమటవల్ల పుట్టినది
స్వైరం n స్వేచ్ఛ, స్వతంత్రత, తన ఇష్టం వచ్చినట్లు సంచరించేది, స్వేచ్ఛతో కూడినది, రహస్యమైనది, ఋజువైనది, మందమైనది
స్వైరవిహారి n అడ్డులేకుండా సంచరించేది
స్వైరిణి n కులట, ఇష్టానుసారంగా సంచ రించే స్త్రీ