తెలుగు-తెలుగు నిఘంటువు/శ
స్వరూపం
| శంక | n | సందేహం, సంశయం,అనుమానం, జంకు, వెరపు, ఊహ, ఒక సంచారీభావం, ఆక్షేపం | |
| శంకరాభరణం | n | 1 ఒక (సంగీత)రాగం పేరు; 2 ఈశ్వరునికి అలంకారం సర్పం | |
| శంకరి | n | పార్వతి శంకరుని భార్య | |
| శంకరుడు | n | శివుడు సుఖం (శుభాన్ని) కలుగజేసే వాడు,, శుభ ప్రదుడు, శంకరాచార్యుడు | |
| శంకించు | సంక్రి అనుమానించు, సందేహించు, జంకు, తలచు | ||
| శంకువు | n | స్తంభం, చిన్న ఈటే;, | |
| శంకుస్థాపన | n | గృహనిర్మాణ ఆరంభ సమయంలో ఆ భూమిలో శంకువును స్థాపించడం, కొత్తకట్టడాలు ప్రారంభించడానికి ముందు లాంఛనంగా జరిపే పూజా కార్యక్రమం , శంకుస్థాపనం, | |
| శంఖం | n | సంకువు, సంకు; అబ్దం, కంబువు, కూత, కైదువు, చిందం, దరం, బూరగొమ్ము, వలమురి, శుక్తి, | |
| శంఖాలుపూరించు | v | శంఖాలు ఊదడం; | |
| శంప | n | మెరుపు శంభు(వుడు | |
| శంసనం | n | స్తుతించడం, పొగడటం, కథనం, కంఠ పాఠం చేయడం | |
| శకం | n | సుప్రసిద్ధుడైన రాజు రాజ్యారంభంతో పరిగణింపబడే కాల విశేషం,, శాలివాహనశకం, దేశభేదం, జాతిభేదం | |
| శకటం | n | బండి, రోహిణీ నక్షత్రం, శకట వ్యూహం, నెమ్మిచెట్టు | |
| శకలం | n | తునక, ముక్క, చేప, పక్షి, నారచీర, నారచెట్టు, పట్ట | |
| శకుంతల | n | విశ్వామిత్రునివల్ల మేనకకు పుట్టిన కూతురు కణ్వుని పెంపుడు కూతురు, వ్యు ; శకుంతలముల (పక్షుల)చే | |
| శకునం | n | శుభాశుభ సూచకం,, పక్షి, శకునపక్షి, గద్ద | |
| శకుని | n | దుర్యోధనుని మేనమామ, మోసగాడు, కార్యభంగం చేసేవాడు, పక్షి, రాబందు, కృష్ణునిచే చంపబడ్డ ఒక రాక్షసుడు, ఆడుపిచ్చుక, నల్లగోరు వంక శకత్తు | |
| శక్తి | n | శరీరబలం, సామర్థ్యం, బలిమి, చిల్లకోల, పార్వతి, ఇచ్చాది, సత్యాది, ఉత్సాహాది, వశిష్టుని కుమారుడు, బల్లెం, సహాయం, పరాశరుని తండ్రి | |
| శక్తిమంతుడు | n | 1 శక్తిఉన్నవాడు 2 సామర్థ్యం ఉన్నవాడు | |
| శక్యం | n | సాధ్యమైనది, జరు వదగినది, అభిరావృత్తిచే తెలుపబడినది | |
| శఠకోపం | వి, విష్ణ్యాలయంలో భక్తులతల పై ఉంచే విష్ణుపాదాలు ఉండే పాత్ర విశేషం2 శఠకోపం పెట్టు | ||
| శతం | n | 1 నూరు, 2 అధిక సంఖ్య | |
| శతకం | n | నూరు పద్యాల్లో రాసే ఒక సాహిత్య ప్రక్రియ, నూరుపద్యాల గ్రంధం | |
| శతఘ్ని | n | ఆయుధ విశేషం, ఫిరంగి నూరుగురిని ఏకకాలంలో చంపేది,ఆడతేలు, గళరోగ విశేషం, కానుగుచెట్టు | |
| శతజయంతి | n | నూరో పుట్టిన రోజు; | |
| శతథా | సం అవ్య నూరు విధాలుగా, నూరు మార్గాలా? | ||
| శతభిష | n | అశ్విని నుంచి 24వ నక్షత్రం, శతభిషం నూరు చుక్కల ప్రోవు, నీటిరేనిచుక్క ప్రాచేతం, వారుణం | |
| శతవార్షికోత్సవం | n | నూరు సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే పండుగ; | |
| శతవిధాలు | n | నూరు రకాలు, నూరు విధాలు; | |
| శతాంశం | n | నూరోవంతు; | |
| శతాబ్దం | n | నూరేళ్ళు, శతాబ్ది నూరు సంవత్సరాల పరిమితిగల కాలం | |
| శతావధానం | n | ఏకకాలంలో నూరు అంశాల్లో మనస్సును నిలిపి పృచ్చకులు అడిగే ప్రశ్నలకు సరయిన సమాధానాలుగా కవిత్వాదులను చెప్పే ప్రక్రియ | |
| శతావధాని | n | ఏకకాలంలో నూరుఅంశాల్లో మనస్సును ప్రవేశ పెట్టగలవాడు, శతావధానం చేసేవాడు | |
| శత్రువు | n | పగవాడు, శత్రుడు రిపువు, వైరి, సపత్నుడు, ద్విషత్తు, ద్వేషణుడు, దుర్ఘదుడు, ద్విటు, వివ క్షుడు, అహితుడు, అమిత్రుడు, ధన్యువు, శాత్రవుడు, శత్రవుడు, అభియాతి, పరుడు, అరాతి, ప్రత్యర్థి, పరిపంథి, భ్రాతృవ్యుడు, అసహనుడు, ద్వేషి, జిషంసువు, ప్రతిపక్షుడు, విరోధి, అసుహృత్తు, ప్రత్యవసాత, | |
| శని | n | నవగ్రహాలలో ఒక గ్రహం, సూర్యపుత్రుడైన శనైశ్చరుడు; మందుడు, పంగుడు, కాళుడు, ఛాయాపుత్రుడు, అసితుడు, అర్కజుడు, సూర్యపుత్రుడు, శనివారం, శివుడు, దురదృష్టం | |
| శనివారం | n | స్థిరవారం, వారంలో చివరిరోజు; | |
| శనైశ్చరుడు | n | శని మందంగా చరించేవాడు; | |
| శపథం | n | ప్రతిజ్ఞ, ప్రమాణం ; ప్రతిన, పణం, పరిగ్రహం, ప్రత్యయం, బాఢం, సంగరం, సంధ్య, సత్యం, సమయం , ఆన, ఒట్టు, బాస, బిరుదు, శపథం;, | |
| శపించు | v | తిట్లు, నిందించు; శబరం | |
| శబరి | n | చెంచెత, రామభక్తురాలైన కోయస్త్రీ, గోదావరిలో కలిసే చిన్ననది | |
| శబరుడు | n | కిరాతుడు వేటకోసం అడవులలో తిరిగేవాడు,, శివుడు, మీమాంసా శాస్త్ర గ్రంథకర్త, వ్యాఖ్యాత | |
| శబ్దం | n | ధ్వని, పదం, బిరుదం, కీర్తి, చతుర్విధ ప్రమాణాలలో ఒకటి, వ్యాకరణం | |
| శబ్దకోశం | n | నిఘంటువు; శబ్దబ్రహ్మం | |
| శబ్దరమ్యత | n | పదాల అందం; | |
| శబ్దశాస్త్రం | n | వ్యాకరణం, పదాలప్రకృతి, ప్రత్యయవిభాగంచేసి చూపే ఒక శాస్త్రం | |
| శబ్దాలంకారం | n | శబ్దాలవల్ల చమత్కారం కలిగించే అలంకారం ఉదా | |
| శబ్దించు | v | ధ్వనించు, మ్రోయు; | |
| శమం | n | అంతరింద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ఉపశాంతి,సంధి, ముక్తి చేయి, ఉపచారం | |
| శమించు | నంక్రి శాంతించు, అణిగిపోవు, తగ్గిపోవు | ||
| శమి | n | జమ్మిచెట్టు, చిక్కుడుచెట్టు, పెసరపొట్టు,శాంతుడు | |
| శయనించు | v | పరుండు, నిద్రించు; | |
| శయించు | v | పడుకొను, నిద్రించు, పరుండు; | |
| శయ్య | n | పాన్పు, పరుపు; మెత్త సెజ్జ, సజ్జ, పక్క, పడక, | |
| శరణం | n | రక్షణం, బ్రోవడం,కాపాడే స్థానం, దిక్కు, అండ, ఇల్లు, చేరుగడ | |
| శరణాగతుడు | n | శరణు పొందినవాడు, రక్షణకోరి వచ్చినవాడు,శరణాపన్నుడు | |
| శరణార్థి | n | శరణుకోరేవాడు; | |
| శరణుజొచ్చు | మిక్రి శరందు,రక్షకునిగా గోరు, వశమవు, ఆశ్రయం కోరు, అధీనమవు | ||
| శరణ్యం | n | రక్షణనిచ్చేది,ఆశ్రయమిచ్చేది | |
| శరత్తు | n | శరత్కాలం; (ఆశ్వయుజ,కార్తిక మాసాలతో ఏర్పడే ఆరు రుతువుల్లో నాలుగోది) , శరత్, ఒక రుతువు, సంవత్సరం | |
| శరథి | n | 1 సముద్రం;2 అమ్ములపొది 1 నీరు నిలిచి ఉండేది2 బాణాలు నిలిచి ఉండేది | |
| శరము | n | బాణం, అమ్ము; పృషత్కం, బాణం, విశిఖం, అజిహ్మగం, ఆశుగం, కలంజం, మార్గణం, పత్రి, ఇషువు, అమ్ము, కోల, ములికి, తూపు, రోపం | |
| శరావం | n | మూకుడు పడిన ఉదకాదికాన్ని రక్షించేది,, | |
| శరాసనం | n | విల్లు;, శరాసం, బాణాలను చిమ్మేది; | |
| శరాహతి | n | బాణపుదెబ్బ; | |
| శరీరం | n | మేను రోగాదులచే శిథిలమయ్యేది కళేబరం, గాత్రం , వపుస్సు, సంహననం, వర్మ, విగ్రహం, కాయం, దేహం, మూర్తి, తనువు, మే, మేయి, ఒడలు, మై, మయి,దేహం, మృతశరీరం, బలం | |
| శరుడు | n | వంచకుడు,దుష్టుడు, మూర్ఖుడు, మధ్యవర్తి,సోమరి, శృంగార నాయకులలో ఒకడు | |
| శర్కర | n | చక్కెర, కలకండ, ఉపల, కండచక్కెర, ఖండశర్కర, నవాతు, పంచదార, పులకండం, రసాల, సికత, సీత,, మధుమేహం , ఋగ్వేదం, చిల్ల పెంకు, తునుక,తులకరాయి, రాతి నేల | |
| శర్వరి | n | రాత్రి, వ్యాపారాన్ని/దినాన్ని చెరచేది, సంధ్యాకాలం, పసుపు, ఆడుది | |
| శర్వాణి | n | పార్వతీదేవి శర్వుని (శివుని) భార్య | |
| శర్వుడు | n | శివుడు, విష్ణువు | |
| శలభం | n | మిడత; చిమ్మట(ఈలపురుగు); | |
| శలాక | n | 1 చిన్నకర్ర, కొయ్యచీల2 అంజనశలాక, గొడుగు వంటి వాటికమ్మి, బాణం, వీణాది వాద్యసాధన విశేషం, ఏదుపంది, సన్నని లోహపు కడ్డి, దర్బకట్ట, ఎముక | |
| శల్యం | n | ఎముక,సలాక, బాణం, విషం, చిల్లకోల, మేకు, ఏదుపంది, ఈటె, మంగచెట్టు, ములు, శరీరంతో గుచ్చుకొని బాధిస్తున్న ఇతర పదార్థం, గసిక, విశేష దుఃఖకారణం, పాపం, నింద, ఆపద; | |
| శల్యుడు | n | మద్రదేశాధిపతి, నకుల సహదేవుల మేనమామ; | |
| శవం | n | పీనుగు, మృతకళేబరం; బడుగు, సబం, కటం, కళేబరం, క్షితివర్ధనం | |
| శశం | n | కుందేలు;, శశకం, బావినీటిలోని ప్రతిబింబమును చూసి సింహమును శశంబు సంహరించె | |
| శశవిషాణం | n | కుందేటి కొమ్ము; | |
| శశి | n | చంద్రుడు, శశధరుడు;కర్పూరం, కుందేటిని ధరించినవాడు చంద్రుడు | |
| శస్త | n | శ్రేష్ఠమైన;, శస్తం, పొగడబడినది, శుభమైనది, పలుమారు చదువబడినది, చంపబడినది, | |
| శస్తకం | ఇనుము, పనిముట్లు, ఉక్కు, స్తుతిగీతం, మంత్రప్రయోగం | ||
| శస్త్రం | n | ఆయుధం;, | |
| శస్త్రచికిత్స | n | కత్తితో కోసి చేసే వైద్యం ; సర్జరీ; | |
| శస్త్రజీవిక | n | ఆయుధాలతోటి బతుకు, యుద్ధమే జీవికగా పెట్టు కొన్నవాడు, కూలికి యుద్ధంచేసేవాడు | |
| శాంతం | n | నెమ్మదికలది, ఉపశమించినది, కుదిరినది, ఆపబడినది, మరణించినది, మచ్చిక చేయబడినది, తృప్తిగలది, మెల్లనిది, పవిత్రమైనది, వినయం కలది, శాంతి, నిర్వేదం | |
| శాంతించు | v | శమించు, తగ్గిపోవు; శాకం | |
| శాంతి | n | కామక్రోధాదులను అణగించడం, ఉపద్రవాలను తొలగించడం, కామక్రోధాదులను అణగించడం, విషయ సుఖాలపై విరక్తి, ఉపద్రవాలను తొలగించడం, మనస్తృప్తి, ఆకలిశమింప జేయడం, దుర్గ, ఉపశమనం, సౌభాగ్యం, సుఖం, జ్ఞానేంద్రియ నిగ్రహం, శాంతిపాఠం | |
| శాంతియుతం | n | శాంతితో కూడినది; దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించు కోవడానికి ఇది ప్రధానవేదిక, | |
| శాంతిహోమం | n | అనర్థాలు తొలగడం కోసం చేసే హోమం; | |
| శాకాహారం | n | కూరలు (ఆకు, కాయ) మాత్రం తినడం; వ్యతి | |
| శాకాహారి | n | కూరగాయలు మాత్రం తినేవాడు, , శాకాహారుడు వ్యతి | |
| శాఖ | n | (చెట్టు) కొమ్మ, భాగం;, | |
| శాఖాచంక్రమణం | n | 1 ఒక కొమ్మనుంచి మరొక కొమ్మ పైకి దూకడం; 2 కావలసిన విషయాన్ని వదలి ఇతర విషయాలను గూర్చి సంభాషించడం | |
| శాఖామృగం | n | కోతి; ఉడుత; | |
| శాఖోపశాఖలు | n | కొమ్మలు, రెమ్మలు, అసంఖ్యాకాలు | |
| శాఠ్యం | n | మూర్ఖత్వం, కపటం,మొండిపట్టు | |
| శాతం | n | 1 నూటికి ఇంత అని నిర్ణయింప బడే సంఖ్య 2 వాడి అయినది, సన్నగిల్లినది, దుర్బలమైనది, అందమైనది, ఖండింప బడినది, సుఖంకలది, ఉమ్మెత్త చెట, సంతోషం | |
| శానం | n | నీటురాయి, సానరాయి, శాణం | |
| శాన్నాళ్ళు | n | చాలారోజులు; | |
| శాపం | n | శపించడం, తిట్టు, ఆక్రోశం,++ | |
| శాప వృత్తాంతం | n | శాపానికి సంబంధించిన కథ; | |
| శాపవిమోచనం | నంవి శావం తొలగిపోవడం; | ||
| శాబాసు | దేవి ప్రశంసార్థకం, సేబాసుకు అపభ్రంశరూపం; | ||
| శాయశక్తులా | మివిణ శక్తి కొలదిగా,అన్ని విధాలా, అన్ని ప్రయత్నాలవల్ల; | ||
| శాయి | n | సిరా, మషీరసం; | |
| శారద | n | సరస్వతి, పార్వతి, కొత్తది, ప్రతిభ, కప్పుట, శరత్కాలం, ఏడాకుల అరటి, ఏడాది | |
| శారద రాత్రులు | n | శరత్కాలపు రాత్రులు; | |
| శార్జి | n | విష్ణువు | |
| శార్ణకులు | n | లావుక పక్షులు; | |
| శార్దూలం | n | పెద్దపులి హింసించేది, చిరుతపులి, శరభమృగం, శ్రేష్ఠం | |
| శార్దూలవిక్రీడితం | n | వృత్తభేదం, పులిఆట; ఈ వృత్తంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు క్రమంగా ప్రతిపాదం లోనూ ఉంటాయి 14వ అక్షరం యతిస్థానం, ప్రాస ఉంటుంది | |
| శార్దోదని | n | బుద్దుడు శుద్దోదనుని పుత్రుడు | |
| శార్వరి | n | రాత్రి; ప్రభవాది సంవత్సరాల్లో ఒకటి; | |
| శాల | n | సాల, చావడి, ఇల్లు, సభ, పెద్దచెట్టు, కొమ్మ, | |
| శాల్యోదనం | n | వరి అన్నం; | |
| శాశ్వతం | n | ఎప్పటికీ ఉండేది,నశ్వరంకానిది; స్వర్గం; | |
| శాసనం | n | రాత మూలమైన ఆజ్ఞ, రాజు తానుదానం చేసిన భూమికోసం రాసిచ్చిన కవులు, శిక్షించడం, ఆజ్ఞ, శాస్త్రం, అధికారం, రాళ్ళమీద చెక్కబడిన వృత్తాంతం, తీర్పు, ఇంద్రియనిగ్రహం,పన్నులేని ఊరు, పని, వాక్యం, బెస్తపల్లె, | |
| శాసనసభ | n | చట్టాలు చేయడానికీ సవరించడానికీ అధికారం ఉన్న ప్రజా ప్రతినిధుల సభ, చట్టసభ; | |
| శాసనసభ్యులు | n | చట్టసభలోని సదస్వులు; | |
| శాసించు | v | ఆజ్ఞాపించు;దండించు; | |
| శాస్త్రం | n | వేదం, నియమనగ్రంథం, ఆజ్ఞ, వేద విహిత వాక్యం; వేదం, (తర్క శాస్త్రం వంటి) జ్ఞానం, గ్రంథం | |
| శాస్త్ర వేత్తలు | n | శాస్త్రాన్ని ఎరిగినవారు | |
| శాస్త్రజ్ఞుడు | n | శాస్త్రాలు తెలిసినవాడు పండితుడు; | |
| శాస్త్రి | n | ఒక బిరుదు, ఒకపట్టా విద్వాంసుడు, శాస్త్ర పండితుడు, శాస్త్ర బోధకుడు | |
| శాస్త్రి | n | ప్రతీకారం, శిక్ష, ఆజ్ఞ, రాజదండం, శిక్షించడం, ఏలుబడి; | |
| శాస్త్రీయం | n | పేద విహితమైనది, శాస్త్రంలో చెప్పబడినది ప్రామాణికమైన; | |
| శిక్ష | n | దండనం, అభ్యాసం, బోధనం, వేదాంగాలలో ఒకటి, వినయం, శాస్త్రం, | |
| శిక్షకుడు | n | ఉపాధ్యాయుడు,గురువు, విద్వాంసుడు, శాసించేవాడు | |
| శిక్షణ (0) n | బోధించడం, తర్పీదు,ఒక వృత్తిలో నిర్దిష్ట ప్రమాణస్థాయికి చేరుకోవడానికి ఇచ్చే తర్పీదు, చదువుకోవడం | ||
| శిక్షణాకేంద్రం | n | బోధన చేసేచోటు,తర్పీదునిచ్చే స్థలం; శిక్షించు | |
| శిఖండి | n | ధృష్ట ద్యుమ్నుని అన్న, ద్రుపదుని కొడుకు, నెమలి; స్త్రీగా పుట్టి కొంత కాలానికి మంస్యం పొందినవాడు, పింఛం కలది, అడవి, మొల్ల చెట్టు, అన్న,నెమలిపురి, బాణం, కోడి, విష్ణువు | |
| శిఖ | n | జ్వాల, మంట; సోనా | |
| శిఖరం | n | కొన, అగ్రం, చంక, పిరుదు, కొండకోన, మండపం, చెట్టు కొన, కత్తిమైన, గగుర్పాటు, కెంపు; | |
| శిఖరావళి | నంవి శిఖరాల వరస, కొండకోనలపంక్తి; | ||
| శిఖామణి | n | శిరోరత్నం; చూడామణి, సిగపై ధరించేమణి | |
| శిఖి | n | నెమలి, అగ్ని సిగలు కలది, కోడి, కేతువు, నెమలి, వృక్షం, బాణం, సిగగలవాడు, ఎద్దు, దీపం, గుర్రం, | |
| శిఫారసు | n | వాకాహాయ్యం | |
| శిబిరం | n | దండు వీడిసిన చోటు,వేలం తాత్కాలికంగా ఆ పన్నులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన నివాసం | |
| శిరం | n | తల, శిరస్సు మిక్రి తలవంచు; | |
| శిరసావహించు | v | అంగీకరించు,తలమీద పెట్టుకొను వినతుడవు, ఆమోదించు; | |
| శిరస్తా | n | న్యాయస్థానాదుల్లో లెక్కలు, వంటివాటికి జవాబుదారుడుగా ఉండే ముఖ్యోద్యోగి | |
| శిరస్త్రాణం | n | శిరస్సును కాపాడేది, బొమిడికం,, శిరస్సును కాపాడేది, యుద్ధంలో వీరులు తలపై ధరించే ఇనుపకవచం | |
| శిరస్నానం | n | తలమీదు నుంచి చేసే స్నానం, అభ్యంగనం; | |
| శిరస్సు | n | శిరం, తల;, శిరసు | |
| శిరోజాలు | n | వెంట్రుకలు తల పై మొలచేవి; | |
| శిరోమణి | n | తలమానికం;శ్రేష్టమైనది; | |
| శిల | n | రాయి; పాషాణం, ప్రస్తరం, గ్రావం, ఉపలం, అశ్మం, దృషత్తు, రా, కలు, | |
| శిలాశాసనం | n | రాతి పై రాసిన రాతపూర్వకమైన ఆజ్ఞ; | |
| శిల్పం | n | రాతితో నిర్మించిన మూర్తి, చేతిపని, నేర్పు, ఆకృతి, సృష్టి వనితనం, ఒక యాగసాధనం, ఆచారవిధి, శిలామూర్తి, | |
| శివపురాణం | n | 18 మహాపురాణాల్లో ఒకటి | |
| శివరాత్రి | n | మాఘకృష్ణ పక్ష చతుర్దశి,నిద్రాహారాలుమాని జాగరం ఉండే రాత్రి; | |
| శివలింగం | n | రాయి వంటి వాటితో నిర్మింపబడ్డ లింగరూపమైన శివుని విగ్రహం | |
| శివాంశ | n | శివుని అంశ; | |
| శివాని | n | పార్వతి, శర్వాణి శివుని భార్య; | |
| శివాలయం | n | శివునిగుడి (శివుని నివాసం), శివుడు నెలకొని ఉండేచోటు,శ్మశానం, ఎర్రతులసి శివుడు | |
| శిశిరం | n | చల్లటి రుతువు, నీహారం,ఉండు; మాఘ, ఫాల్గుణ మాసాలు, శిశిర ఋతువు శిశువు | |
| శిశుహత్యలు | n | బిడ్డలను చంపడం, చంటి పిల్లలను చంపడం; **** సతీసహగమనం, శిశుహత్యలు మొదలైన సాంఘిక దురాచారాల పై | |
| శిష్టాచారం | n | మంచి పద్ధతి సదాచార సంపన్నుల నడవడి; | |
| శిష్టానం | n | మంచి తిండి; | |
| శిష్యుడు | n | విద్యార్థి చట్టు, బంటు, అంతేవాసి, ఛాత్రుడు, శ్రేక్షుడు | |
| శిస్తులు | n | పన్నులు; | |
| శీకరం | n | తుంపర, నీటిబిందువు శీతాన్ని కలుగచేసేది, గాలిచే ఇటుఅటు విసరబడ్డ వర్షబిందువులు, ఏనుగుతొండం, చివరిమడం, నీటి బిందువు; | |
| శీకర | n | తుప్పరలచేత; | |
| శీఘ్రం | n | వేగం కలది, వడిగలది,ఆలస్యంలేనిది; | |
| శీఘ్రగతి | n | వేగంగా; | |
| శీతం | n | చల్లనిది, శీతలం,చల్లన, ప్రబ్బచెట్టు, నక్కిరచెట్టు, బెత్తం చెట్టు, వేముట్టు, జనుము, కప్పురం, చందనం, దాల్చినచెక్క | |
| శీతకరుడు | n | చంద్రుడు చల్లటి కిరణాలు కలవాడు | |
| శీతశైలం | n | హిమాలయ పర్వతం చల్లటికొండ, మంచుకొండ | |
| శీతాకాలం | n | చలికాలం;వేసవి, వానాకాలం, శీతాకాలం | |
| శీరిక | n | విషయనామం, వ్యాసానికి ఉండే పేరు , | |
| శీలం | n | నడవడి, స్వభావం, కొండచిలువ, నత్రవర్తనం, మంచిగుణం, రాగద్వేషాలను వదలడం, సౌందర్యం, | |
| శీలాద్రి | n | మంచుకొండ, చలిమల, హిమాలయపర్వతం; | |
| శుంఠ | n | మూఢుడు; శుండాలం | |
| శుకం | n | చిలుక, దిరిసెనచెట్టు, గ్రథిపల్లిచెట్టు, మాచిచెట్టు, బలురక్కిన చెట్టు, తాళిసపత్రి చెట్టు, లొద్దుగచెట్టు, ఇనుపటోపి, తలపాగ, బట్ట, బట్ట | |
| శుక్తి | n | ముత్యపు చిప్ప++ | |
| శుక్రవారం | n | భృగువారం,ఏడువారాలలో ఒకటి; | |
| శుక్రుడు | n | ఇంద్రుడు; శివుడు దుష్టులను శిక్షించడంలో శక్తి గలవాడు | |
| శుక్రుడు | n | ఒకగ్రహం, రాక్షసుల గురువు; దైత్యగురువు, కావ్యుడు, ఉశనసుడు, భార్గవుడు, కవి, భృగువు, | |
| శుక్లపక్షం | n | నెలలో వెన్నెల క్రమంగా పెరిగే పక్షం, నెలలో వెన్నెల క్రమంగా పెరిగే పక్షం, కొంగనెలకు రెండు పక్షాలు శుక్లపక్షం, కృష్ణపక్షం | |
| శుక్లాలు | n | కంటితెల్ల గుడ్డులోని జబ్బు, వెండి, వెన్న పులిగంజి | |
| శుచి | n | పరిశుద్దమైనది, అగ్ని, శుక్రుడు, చంద్రుడు, శివుడు, సూర్యుడు, బ్రాహ్మణుడు, వేదాంతం తెలిసిన వాడు, బ్రహ్మచర్యం, శృంగారరసం, ఉపదశుద్దుడైన మంత్రి, గ్రీష్మఋతువు, జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం, పరిశుద్దమైనది, తెల్లనిది | |
| శుద్దం | n | శుభ్రమైనది,స్వచ్చమైనది, పవిత్రమైనది, తెల్లనిది, కళంకంలేనిది, నిష్కపట మైనది, సత్యమైనది, యోగ్యమైనది, సరియైనది, తన్మాత్రం, సాటిలేనిది, సైంధవలవణం, మిరియం | |
| శునకం | n | కుక్క | |
| శుభం | n | శుభం కలిగించేది, ప్రకాశించేది, చక్కనిది శ్వశ్రేయసం, శం, శివం, అరిష్టం, రిష్టం, భద్రం, కల్యాణం, మంగళం, భావుకం, భవికం, భవ్యం, కుశలం, క్షేమం, శస్తం, బాగు, మేలు, లెస్స, లగు, | |
| శుభదాయకం | n | శుభాన్నిచ్చేది | |
| శుభదినం | n | మంచిరోజు; | |
| శుభలగ్నం | n | మంచి ముహూర్తం; | |
| శుభవార్త | n | మంచి వర్తమానం; | |
| శుభాకాంక్షలు | n | అభినందనలు; | |
| శుభాశీస్సులు | n | శుభకరమైన ఆశీర్వచనాలు; | |
| శుభ్రం | పంవిణ తెల్లనిది, శుద్ధం • షర్యా | ||
| శుల్కం | n | సుంకం,కన్యాశుల్కం, లాభం, పెళ్ళి కుమారుడు కుమార్తె కిచ్చే బహుమానం, కన్యాశుల్కం, బేరంచేసి ఇచ్చే సంచకరువు, పందెపుసొమ్ము | |
| శుశ్రూష | n | సేవ++ | |
| శుష్కప్రతిపాదన | n | ప్రయోజనం లేని ఆలోచన | |
| శుష్కించు | v | చిక్కు, ఎండు, ఇంకు; | |
| శూన్యం | n | వట్టిది, రక్తం, ఏమీలేనిది; ఆకాశం, అవకాశం, రోదసి, మేఘపథం, మొయిలుదారి, గగనం, అంతరిక్షం, మరుత్పథం, వరధ్యానంగా ఉన్నది, ఉనికి లేనిది, నిర్జనం, రహితం, వివాదగ్రస్తమైనది, అమాయకం, నిరర్థకం, అసంపూర్ణం, సున్న, ఆకాశం, అభావం | |
| శూరత | n | శౌర్యం, పరాక్రమం; | |
| శూరుడు | n | పరాక్రమం కలవాడు,ధైర్యం కలవాడు, బలంకలవాడు, సూర్యుడు, రణసాహసుడు,ప్రౌఢుడు శూర్పకర్ణుడు | |
| శూర్పణఖ | n | రావణుని చెల్లెలైన ఒక రాక్షసి, చేటల లాంటి గోళ్ళు కలది | |
| శూలం | n | పెద్దబల్లెమన, ఈటె, ముమ్మెనవాలు, కొర్రు, మేకు, శూలరోగం, వాతరోగం, ఒకయోగం, డొక్కపోటు, చావు, జెండా, | |
| శూలి | n | శివుడు 1 శూలం ఆయుధంగా కలవాడు 2 త్రిశూలం చేతిలో కలవాడు, | |
| శృంఖల | n | ఇనుపగొలుసు, గొలుసు, ఏనుగుకాలిగొలుసు, మొలనూలు, వరుస, కొలత గొలుసు | |
| శృంగం | n | కొమ్ము, శిరస్సు, సొంటి, కొండకోన, చిహ్నం , | |
| శృంగారం | n | కావ్యాల్లోని నవరసాల్లో మొదటిది, | |
| శృతిమించిన | మివిణ ఎక్కువైన; | ||
| శేఖరుడు | n | శ్రేష్ఠుడు; | |
| శేముషి | n | బుద్ధి, ప్రజ్ఞ, శేషం | |
| శేషశయనుడు | n | విష్ణువు ఆదిశేషుడు శయ్యగా కలవాడు | |
| శేషాహి | n | ఆదిశేషుడు; | |
| శేషుడు | n | వేయి పడగలు ఉన్న సర్పరాజు, బలరాముడు, లక్ష్మణుడు | |
| శైత్యం | n | చల్లదనం, చలి; | |
| శైలం | n | పర్వతం శిలామయం, కొండ, రసాంజనం, నక్కెరకాయలు, సాంబ్రాణి, వెలిగారం, పెద్దబండ, | |
| శైలజ | n | పార్వతి, హైమవతి పర్వత రాజైన హిమవంతుని కొమార్తె | |
| శైలి | n | రచనారీతి, నడవడి, అర్థంచేప్పే పద్ధతి, వ్యాకరణ సూత్రాల సంక్షిప్త రచనా కౌశలం గల భాషా సౌష్ఠవం, లేఖన పద్దతి, భాషాసరణి, విధం | |
| శైలీకరణం | n | భాషాప్రయోజనభేదాన్ని బట్టి సందర్భాన్ని బట్టి శైలిని అనుసరించడం | |
| శైలూషి | n | నర్తకి, నటి; | |
| శైలూషుడు | n | నర్తకుడు, నటుడు, గాయకుడు,ధారకుడు; | |
| శైవమతం | n | శివుడే పరమాత్మ అనే మతం, శైవం, ఉమ్మెత్తచెట్టు, 18 పురాణాల్లో ఒకటి | |
| శైవలం | n | నీటిపాచి, నాచు,, శైవాలం ; | |
| శైవలిని | n | నది, ఏరు; రూ | |
| శైవుడు | n | శివభక్తుడు, శైవమతస్థుడు; | |
| శైశవం | n | బాల్యం, పసితనం | |
| శైశవదశ | n | బాల్యదశ; | |
| శైశిరకాలం | n | శిశిర రుతువుకు సంబంధించిన కాలం; | |
| శొంఠి | n | సొంటి, మహౌషధం, ఎండిన అల్లం,, శుంఠి శోకం | |
| శోక సంతాపిత | n | దుఃఖంతో బాధపడినది | |
| శోకాన్ని | n | దుః ఖమనే నిప్పు;శోచనీయం | |
| శోణం | n | ఎర్రనిది, రక్తవర్ణంగలది, ఎరుపు, నిప్పు, ఎర్రనిగుణం,దుండిగపు మొక్క; | |
| శోధనం | n | పరిశీలనం, వెదకడం, శుభ్రంచేసేది, తప్పుదిద్దడం, ప్రాయశ్చిత్తం, శిక్ష | |
| శోభ | n | ప్రకాశం, వెలుగు, వెలుతురు, కాంతి, రంగు, కోరిక, పసుపు, గోరోజనం, అందం; | |
| శోషణం | n | ఎండించేది,వాడించేది, ఇంకడం, చిక్కిపోవడం, వాపు, క్షయ, సంతాపం,ధాతుక్షయం, ఎండడం | |
| శౌక్తికం | n | శక్తిసంబంధమైనది;ముత్తేం సంబంధమైనది; పుల్లనిది; | |
| శౌచం | n | పారిశుద్ధ్యం, పవిత్రత, యోగ్యత | |
| శౌనకుడు | n | ఒక మహర్షి; ఋగ్వేదప్రాతిశాఖ్య రచించిన ఋషి, నైమిశారణ్యంలో 12 సంలు సత్రయాగం చేసి నూతునివల్ల | |
| శౌరి | n | విష్ణువు; కృష్ణుడు శూరికి మనుమడు శౌర్యం | |
| శ్మశానం | n | వల్లకాడు శవాలకు శయనం శవాలను కాల్చే పూడ్చేతావు,మసనం | |
| శ్మశాన వైరాగ్యం | n | శ్మశానం చూడడంవల్ల తాత్కాలికంగా కలిగిన విరక్తి, స్థిరంకాని వైరాగ్యం; | |
| శ్యామల | n | దుర్గ; | |
| శ్రద్ద | n | ఆసక్తి, విశ్వాసం, నమ్మకం, ఆదరం, మర్యాద, మంచికోరిక, ఆస్తిక్యం, సక్తి, వేవిళ్ళు; | |
| శ్రమ | n | కష్టం, ఆయాసం;, శ్రమం అలయిక, బడలిక, అలపు, సేద, వడ, అలసట, అలసట, దేహదార్ద్యంకోసం చేసే సాము వంటి అలవాటు, ప్రయాసం, తపస్సు, దుః ఖం, కష్టించి చదవడం | |
| శ్రమజీవులు | నంవి కష్టంచేసి బతికేవారు; | ||
| శ్రమశక్తి | n | కష్ట బలం; | |
| శ్రవణం | n | చెవి, వినడం, ఒక నక్షత్రం; కరివేల్పురిక్క, తూరుపురిక్క, మురజిత్తు, వైష్ణవం, శ్రీకాంతం, శ్రీశం, హరి, చెవి, వినికిడి, వాసి, వేదవాక్కు, తూపురిక్క, | |
| శ్రవ్యకళ | n | వినేకళ; సంగీతం శ్రవ్యకళ | |
| శ్రాంతి | n | శ్రమ, ఆయాసం,అలసట | |
| శ్రాద్ధం | n | ఆబ్దికం, విశ్వాసం కలది శ్రద్ద చే ఇవ్వబడినది, శాస్త్రయుక్తమైన దేశకాల పాత్రాది నియమాలచే పితృదేవతలను గూర్చి చేయబడే బ్రాహ్మణ భోజనాదికం | |
| శ్రామికులు | n | శ్రమజీవులు,కష్టజీవులు, కార్మికులు; | |
| శ్రావణం | n | శ్రావణమాసం, వినిపించడం, శ్రుత పాండిత్యం, చెవికి సంబంధించినది, శ్రవణనక్షత్రంలో పుట్టినది | |
| శ్రావ్యం | n | వినడానికి ఇం పైనది, వినదగినది, వినబడేది | |
| శ్రీ | n | సాలెపురుగు, సంపద, లక్ష్మి,వ్యు | |
| శ్రీ కంఠుడు | n | శివుడు క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని మింగడం వల్ల శోభకంఠంలోగలవాడు శ్రీకరుడు | |
| శ్రీ చుక్కలు | మివి బడికి మొదటవచ్చిన వాడు శ్రీ, రెండోవాడు చుక్క; పాఠశాలకు అందరికంటే ముందు వెళ్ళినవాడికి శ్రీ (సిరి) అనీ,వాడి తరవాత వాడికి చుక్క అనీ రాసేవాళ్ళు తరవాత వాళ్ళకు ఒకటి, రెండు అంటూ దెబ్బలు కొట్టేవారు | ||
| శ్రీకాళహస్తి | n | శివలింగ క్షేత్రం కృతయుగంలో శ్రీ (సాలెపురుగు), త్రేతాయుగంలో కాళం (సర్పం), ద్వాపరంలో హస్తి (ఏనుగు) ముక్తి పొందిన స్థలం | |
| శ్రీకాళహస్తీశ్వరుడు | నంవిశ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరుడు; 2 సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవుడు | ||
| శ్రీగంధం | n | మంచిగంధం, చందనం; | |
| శ్రీధువు | నంవి 1 మద్యం ,2) ద్రాక్షసారాయి శీర్ణం | ||
| శ్రీమంతుడు | n | ధనవంతుడు సిరి ఉన్నవాడు, కుబేరుడు, విష్ణువు, శివుడు, ధనవంతుడు | |
| శ్రీమంతులయిరి శ్రీమతి | n | భార్య, వివాహితులకు (స్త్రీలకు) ముందు గౌరవార్థం వాడే మాట | |
| శ్రీముఖం | n | లేఖ, పత్రం సన్యాసులు, గురువులు మొదలైన పెద్దలు రాసి పంపే పత్రిక,పత్రిక, ఒక సంవత్సరం | |
| శ్రీరం | n | తల, శిరస్సు, కృష్ణాగరువు, పైభాగం, కొన | |
| శ్రీవదం | n | బోదకాలు; ఏనుగుకాలు; | |
| శ్రీశైలం | n | శ్రీ పర్వతం | |
| శ్రుతపరచు | మిక్రి వినిపించు, చెప్పు; | ||
| శ్రుతి | n | వేదం, చెవి, నుతి, వినికి, పేరు, జ్ఞానం, ధ్వని, కొలిమితిత్తి, సుద్ది, మాట, సామెత, లాభం, చరిత్ర | |
| శ్రేణి | n | వరస, పంక్తి, సమూహం, వర్తకుల సమాజం, శిల్పి సమాజం, నీరు తోడే తొట్టి | |
| శ్రేయస్కరం | n | మంచిది, శ్రేయస్సును కలిగించేది | |
| శ్రేయస్సు | n | క్షేమం, శుభం;, శ్రేయం, సుకృతం, ధర్మం, మేలు, ముక్తి, శుభం, ప్రధానం | |
| శ్రేయోభిలాషి | n | మంచిని కోరేవాడు; | |
| శ్రోత | n | వినేవాడు; శిష్యుడు | |
| శ్రోత్రం | n | చెవి, వేద ప్రావీణ్యం,శబ్దాన్ని వినే ఇంద్రియం; | |
| శ్రోత్ర పేయం | n | చెవికి ఇంపుగా, ఆసక్తితో వినదగినది | |
| శ్రోత్రియుడు | నంవి వేదం చదివినవాడు, వినయవంతుడు, శ్రుతిని (వేదాన్ని) చదివిన బ్రాహ్మణుడు | ||
| శ్లాఘనీయం | n | శ్లాఘ్యం, కొనియాడదగినది; | |
| శ్లేషార్థాలు | n | రెండర్థాలు | |
| శ్లేష్మం | n | కఫం; | |
| శ్లోకం | n | నాలుగు పాదాలు కలిగిన ఛందోబద్దమైన వాక్యవిశేషం, అనుష్టుప్చందస్సు, సూక్తి, వృత్తం, సమాఖ్య, కీర్తి, పొగడ, లోకోక్తి | |
| శ్వానం | n | కుక్క ఇటు అటు తిరిగేది | |
| శ్వాస | n | ఊపిరి;, శ్వాసం, నిట్టూర్పు, గాలి, ఉబ్బసం, వర్లోచ్చారణ కోసం చేసే బాహ్య ప్రయత్నాలలో ఒకటి | |
| శ్వేతం | n | తెలనిది, వెండి | |
| శ్వేత వాహనుడు | n | అర్జునుడు తెల్లటి గుర్రాలు వాహనంగా కలవాడు, అర్జునుడు, చంద్రుడు, ఇంద్రుడు | |
| శ్వేతద్వీపం | n | 1 18 ద్వీపాల్లో ఒకటి; 2 విష్ణు దేవుని నివాసమైన వైకుంఠం; | |
| శ్వేతముఖులు | n | తెల్లదొరలు; |